
దొడ్డువడ్లకూ బోనస్ ఇవ్వాలి
నర్మెట/బచ్చన్నపేట/తరిగొప్పుల/జనగామ రూరల్: దొడ్డు ధాన్యానికి సైతం తెలంగాణ ప్రభుత్వం బోనస్ అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నర్మెట మండలంలోని హన్మంతా పురం, బొమ్మకూర్, మల్కపేట, మచ్చుపహాడ్, అ మ్మాపురం, వెల్దండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాగా మల్కపేట, మచ్చుపహాడ్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి, కొడవటూర్, తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారం, అక్కరాజుపల్లి, పోతారం, జనగామ మండలం పెంబర్తి, పెద్దపహడ్, అడవికేశావాపూర్, ఎర్రగోల్లపహడ్ వెంకిర్యాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. దేవాదుల మూ డో ఫేజ్‌లో రూ.1,600 కోట్లతో 1,800 క్యూసెక్కుల నీటి పంపిణీకి కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే పనులు ప్రారంభించిందన్నారు. ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో హన్మంతాపూర్, బొమ్మకూర్‌లో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వేత, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డితో కలసి కేంద్రాలను ప్రారంభించడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ అబ్బయ్య, ఎస్సై నగేశ్ ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో కార్యక్రమాలు సజావుగా సాగాయి. ఆయా కార్యక్రమాల్లో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్వేత, నర్మెట తహసీల్దార్ రామానుజాచార్యులు, ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఏఓ మనోహిత్ విక్రమ్‌రావు, ఏపీఎం రవి, సీసీలు యాదగిరి, కవిత, కు మార్, నాయకులు నర్సింగారావు, రాజిరెడ్డి, తేజావత్ గోవర్ధన్, శ్రీనివాస్, గౌస్, లక్ష్మీనారాయణ, లక్ష్మి, అంజయ్య, బచ్చన్నపేటలో పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సీఈఓ బాలస్వామి, రూపాచైతన్య, అనిల్‌రాజ్, తరిగొప్పు ల తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఏపీఎం విజయ, పింగిళి జగన్మోహన్‌రెడ్డి, అర్జుల సంపత్‌రెడ్డి, చిలువే రు లింగం, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, సంజీవ, సుదర్శన్‌గౌడ్, రామరాజు, మహేందర్, సంపత్, బీమయ్య, రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బను క శివరాజ్, నిమ్మతి మహేందర్‌రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, మేకల కళింగరాజు, ప్రమోద్‌రెడ్డి, ప్రేమలతరెడ్డి, శ్రీనివాస్, నర్సిరెడ్డి, లక్ష్మీనారాయణనాయక్, రాజమౌళి, రాంమ్మోహన్, భాస్కర్‌రెడ్డి, నాయకు లు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

దొడ్డువడ్లకూ బోనస్ ఇవ్వాలి