
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ సారి మండలాలు, గ్రామాల పరిధిలో కాకుండా, నియోజకవర్గ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో 73 మంది బదిలీ కాగా ఈసారి ఒకే గ్రామంలో రెండేళ్ల పాటు పని చేసిన సెక్రటరీలను బదిలీ చేయనున్నారు. దీంతో 170 నుంచి 180 మంది వరకు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేసుకుంటున్న బిల్లులను ఇచ్చిన తర్వాత బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటచారి, కార్యదర్శి బొట్ల శంకర్, అసోసియేట్ అధ్యక్షుడు దేవి ప్రసాద్, కోశాధికారి యుగేందర్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు మహేందర్, గాదెపాక క్రాంతి, శ్రీనివాస్, భాగ్యలక్ష్మితో కలిసి టీఎన్‌జీఓ కార్యదర్శి పెండెల శ్రీనివాస్‌తో కలిసి పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ రిజ్వాన్ బాషాను కలిసి వినతి చేశారు. ఆకస్మిక బదిలీలను వెంటనే నిలిపేయాలని విన్నవించారు.
గ్రామాల్లో అన్నీ తామై పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు
● ఇప్పటికే ఒక్కో గ్రామంలో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు
● సుమారు రూ.5 కోట్ల బకాయి
● ట్రాన్స్‌ఫర్ చేస్తే డబ్బులెలా అంటూ ఆందోళన
● టీఎన్‌జీఓతో కలిసి కలెక్టర్‌కు
వినతి
● జిల్లాలో 281మంది సెక్రటరీలు
జనగామ: ప్రభుత్వ ఆదేశాలు లేవు.. బదిలీ కాలం కాదు.. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు పిడుగులాంటి వార్త. ఊరు కాదు.. మండలం అసలే కాదు... నియోజకవర్గం మార్పుతో ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది. మళ్లీ బదిలీలు చేస్తే బకాయిలు ఎలా వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా రాకున్నా.. పైపులైన్ లీకేజీ నుంచి వీధిదీపాల నిర్వహణ వరకు కార్యదర్శులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జీపీలో ఖర్చు చేస్తున్న ప్రతీ పైసా కార్యదర్శుల జేబులో నుంచి ఖర్చు చేస్తున్నదే. ఒక్కో సెక్రటరీ రూ.1లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయగా.. సుమారు రూ.5 కోట్ల మేర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేవని కార్యదర్శులు చేతులెత్తేస్తే... జీపీ పాలన ఒక్కసారిగా కుప్పకూలిపోడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జిల్లాలో 281 మంది కార్యదర్శులు
జిల్లాలో జీపీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. చాగల్, శివునిపల్లి స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోకి వెళ్లడంతో 280 జీపీలకు కుదించబడింది. 12 మండలాల పరిధిలో 281 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి పోవడంతో 2024 ఫిబ్రవరి 1 నుంచి బాధ్యత అంతా కార్యదర్శులపై పడింది. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో జీపీల్లో పని చేస్తున్న కార్యదర్శులపై భారం పడింది. ట్రాక్టర్ మెయింటెనెన్స్, శానిటేషన్ నిర్వహణ, వీధి దీపాలు, మోటార్ల రిపేరు, ఊర్లలో కనీస మౌలిక వసతి సౌకర్యాలకు సంబంధించి ప్రతీ పైసా సెక్రటరీలు అప్పులు తెచ్చి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కో కార్యదర్శి రూ.లక్ష నుంచి రూ.5లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలో గతేడాది 73 మంది సెక్రటరీలను బదిలీ చేయగా... జీపీల కోసం ఖర్చు చేసిన నిధులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ బదిలీ సాధారణం కావడంతో కొత్తగా వచ్చిన కార్యదర్శులకు పాత బిల్లుల బాధ్యత అప్పగించి మరో ఊరికి వెళ్లారు. కొత్త సెక్రటరీల పరిస్థితి షరా మామూలుగానే మారడంతో పాత డబ్బులు ఇచ్చుడేమో కానీ... కొత్తగా ఖర్చు చేసే వాటికి అప్పులు చేస్తున్నారు.
న్యూస్‌రీల్
మరోసారి బదిలీ పిడుగు
బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు
పంచాయతీ కార్యదర్శుల ఆకస్మిక బదిలీలు నిలిపేయాలి. గతేడాది ఫిబ్రవరి నుంచి పాలకవర్గం లేకున్నా.. కార్యదర్శులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పరిపాలన నడిపిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతి సౌకర్యాల కోసం సెక్రటరీలో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ బిల్లులు రాక ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిస్థితిపై అయోమయానికి గురవుతున్నారు. బదిలీ చేస్తే పాత బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు.
– పెండెల శ్రీనివాస్, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025