
యాసంగి ధాన్యం సేకరణ షురూ
జనగామ రూరల్: యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్–ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాకు రూ.2,300గా కనీస మద్దతు ధర ప్రకటించాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయగా మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి అకాల వర్షాల నుంచి ఽతడవకుండా టార్ఫలిన్లు అందుబాటులో ఉంచారు.
సన్నాలకు రూ.500 బోనస్
సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగిలో 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా అందులో సన్నరకం 1,05,891, దొడ్డు రకం 2,69,562 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరుగా ధాన్యం సేకరించనున్నారు.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యల పరిష్కారానికి, ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్ 9963407064 ఏర్పాటు చేసింది.
మిల్లర్లు నిబంధనలు పాటించాలి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ మండలం శామీర్‌పేట, వడ్లకొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మా ర్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు 17 శాతం తేమతో ధా న్యాన్ని తీసుకువస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు, ప్రేమలత రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాలో 300
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 9963407064
కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలి. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో ఐకేపీ 164, పీఏసీఎస్ 134, డీసీఎంఎస్ 2 ఉన్నాయి. రైతుల సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– రోహిత్ సింగ్, అదనపు కలెక్టర్

యాసంగి ధాన్యం సేకరణ షురూ