
తడిసిన ధాన్యం పరిశీలన
జనగామ రూరల్: వ్యవసాయ మార్కెట్ పత్తియార్డులో చిటకోడూర్ ఐకేపీ సెంటర్‌లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, సీఐ దామోదర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యానికి తగిన పరిష్కార మార్గం చూపేలా కృషి చేస్తామని రైతులకు తెలిపారు. అదనపు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలిపారు. రైతులకు అండగా ఉంటామన్నారు.
దరఖాస్తుల గడువుపెంచాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాఽధి కల్పనకు నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కులం ధృవీకరణ పత్రం కోసం నిరుద్యోగ యువత రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వారం పదిరోజులు గడిచినా సర్టిఫికెట్లు రావడం లేదని, ఈ విషయమై అధికారులను అడిగితే సర్వర్ సమస్య ఉందని చెబుతున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు పొడిగించాలని, అభ్యర్థులకు త్వరగా కులం, ఆదాయం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సరస్వతి పుష్కరాల
పనుల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.
ప్రశాంతంగా ఎన్‌డీఏ పరీక్ష
కేయూ క్యాంపస్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఆదివారం ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను నిర్వహించారు. ఈపరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలని సంబంఽధిత అధికారులకు సూచింంచారు. పరీక్షల నిర్వహణపై ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్‌చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత తదితరులు పాల్గొన్నారు.

తడిసిన ధాన్యం పరిశీలన