
అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదు..
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి
జనగామ రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా జనగామ మండలం శామీర్‌పేట, పసరమడ్ల గ్రామాల్లో సన్నాహక సమావేశం, పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై చేస్తున్న కుట్రలను తిప్పు కొట్టాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇందుకు ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, గంగం నర్సింహరెడ్డి, సర్వల నర్సింగరావు, గణిపాక మహేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
దేవరుప్పుల: హనుమకొండ డివిజన్ పరిధి పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని భారతీ య పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజన్ నా యకుడు ఓడపల్లి అశోక్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూపరింటెండెంట్ హన్మంతుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖపరంగా విధులకు మించి అదనపు పనిభారం, నిర్దేశిత లక్ష్యాలను చేయాలనే డిమాండ్‌తో మానసికంగా ఉద్యోగులు ఇబ్బందులకు గురౌతున్నారన్నా రు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ కార్యాలయాల్లో ఆధునిక పరికరాలు లేకపోవడంతో నిర్వహణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌నాయక్, సత్యనారాయణ, మురళికృష్ణ, శ్రీనివాస్, మనోజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదు..