
జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1,42,859లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. మంగళవారం దేవాదాయ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. దేవస్థాన చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు వెంకన్న, శ్రీశైలం, శ్రీధర్‌రెడ్డి, జనగామ ఉప్పలమ్మ గుడి ఈఓ రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, శంకర్ తదితరులు ఉన్నారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: వడగండ్లతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో యాసంగిలో రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు వేయగా భూగర్భ జలాలు తగ్గి జిల్లాలో 40శాతం పంటలు ఎండిపోగా మిగతా పంట రైతుల చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులకు తీవ్రంగా నష్టపరిచిందన్నారు. నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు, గంగాపురం మహేందర్, తోటి దేవదానం, గురజాల లక్ష్మీనరసింహారెడ్డి, కల్యాణం లింగం, పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య పాల్గొన్నారు
జిల్లా జడ్జిగా ప్రతిమ
జనగామ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జిగా విధులు ని ర్వహిస్తున్న బి.ప్రతిమ జిల్లా జడ్జిగా రానున్నా రు.ఈనెల 23న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఖైదీల హక్కులపై అవగాహన
జనగామ రూరల్: ఖైదీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల కల్పించిందని, వాటిని ఉపయోగించు కోవాలన్నారు. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పు..తప్పేనని, వ్యక్తిగత నియంత్రణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఖైదీలకు న్యాయవాది ఉన్నాడా లేడా అని అడిగి తెలుసుకున్నారు. బెయిలు వచ్చి షూరిటీ పెట్టుకోలేనివారు, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనుల పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని అక్కపెల్లిగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను సెస్ (సెంట్రల్ ఎకనామిక్ స్టాటిస్టికల్ స్టడీస్) రాష్ట్ర డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి మంగళవారం పరిశీలించారు. గ్రా మ పంచాయతీ కార్యదర్శి అవినాష్‌తో కలిసి సా గుకు యోగ్యంకాని పదిహేను ఎకరాల భూమిని ఉపాధి పనులతో సాగులోకి తీసుకువచ్చిన పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈజీఎస్ పనులను వినియోగించుకుంటున్నారని, సాగులో లేని భూమిని సాగులోకి తీసుకురావడం, వ్యవసాయ భూముల వద్దకు రోడ్లు వేయడం, పొలంగట్లపై కొబ్బరి, టేకు, నిమ్మ చెట్లు పెంచడం బాగుందన్నారు.

జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు

జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు

జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు

జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు