
సిటీ పోలీస్ యాక్టు
● కమిషనరేట్ పరిధిలో నేటినుంచి
నెల రోజులపాటు అమలు
● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి
వరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి(ఆదివారం) మే 5 వరకు సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుంద ని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధి లో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపుల ను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండులను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాన్నారు. మైకులు విని యోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్టు ఉత్తర్వుల ను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.