
మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ బందు ఉంటుందని, రైతులు గమనించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి తీసుకురావొద్దని సూచించారు. మంగళవారం మార్కెట్ తిరిగి పునఃప్రారంభం అవుతుందన్నారు.
షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ నూతన కమిటీని శనివారం స్థానికంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యాన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇనుగా ల యుగేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్.సాంబన్న, దేవ్‌సింగ్, రాజిరెడ్డి, చుక్కమ్మ, ప్రధాన కార్యదర్శిగా అన్నెపు కుమార్, సహాయ కార్యదర్శులుగా రాజు, సాంబరాజు, చందర్, అశోక్, ఉదయ్‌కిరణ్, కోశాధికారిగా చింతకింది సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా నరేష్, అరవింద్, దిలీప్, రమేష్, మధుసూదన్, చందర్, రాజు, మధు, రమేష్, మహేష్ ఎన్నికయ్యారు.
రాజరాజేశ్వరీదేవికి తామర పూలతో అర్చన
హన్మకొండ కల్చ రల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీలలితా యాగంలో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష తామరపూలతో అర్చన చేశారు. ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఉదయం తామరపూలతో అర్చన నిర్వహించారు. సాయంత్రం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష బిల్వార్చన చేపట్టారు. అధిక సంఖ్య లో మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. దశవిధహారతుల అనంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
‘మిస్ వరల్డ్ పోటీలు
రద్దు చేయాలి’
హన్మకొండ: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ కాత్యాయని అన్నారు. హనుమకొండలో మిస్ వరల్డ్ పోటీలపై అందాల పోటీల వ్యతిరేక కమిటీ ఆధ్యర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కాత్యాయని మాట్లాడుతూ.. అందాన్ని ఆనంది స్తాం.. కానీ అందం పెట్టుబడి కావడమే సమస్యగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కార్పొరేట్ సంస్థలు ఇలాంటివి నిర్వహించేవని, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే నిర్వహించడంలో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నా యో అర్థమవుతుందని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలను ప్రజాసమస్యలను పట్టించుకో కుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడే కార్య క్రమాన్ని రూ.200 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తే రూ.1,500 కోట్ల లాభాలు వస్తాయని మాట్లాడ డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళా ప్రతినిధి కళ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు దోచుకొని ఓటమికి గురయ్యారన్నారు. ఆయన అన్యాయాలు భరించలేకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు గారెంటీలతో గద్దెనెక్కిస్తే.. గ్యారెంటీలను గాలికి వదిలి లాభాలే లక్ష్యంగా పాలన చేస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో రత్నమాల, రమాదేవి, వెంగల్‌రెడ్డి, అంజనీ, విలాసిని, జ్యోతికరమణి పాల్గొన్నారు.
నకిలీ వైద్యుడిపై కేసు
ఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసిన ట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజ క్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో మందులు నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు.