
అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలి
జనగామ రూరల్: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్‌లో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మేలు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాణాపురం దీక్ష శిబిరం నుంచి పాదయాత్ర కలెక్టరేట్ వరకు పాదయాత్ర, కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాఽ దర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 69వ రోజులుగా రిలే నిరాహార దీక్షలు చే స్తున్నా.. అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాగా ఆదివారం దీక్షలను ఐద్వా పట్టణ నాయకురాలు బూడిద వా ణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చీర రజిత, తాళ్లపల్లి అనిత, ఆకుల మంజుల, తదితరులు పాల్గొన్నారు
రణదివే స్ఫూర్తితో
ఉద్యమించాలి
జనగామ రూరల్: కామ్రెడ్ బీటీఆర్ రణదివే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో రణదివే 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద ప్రశాంత్, గంగారబోయిన మల్లేష్ రాజ్, ఉపేందర్ శివరాత్రి రాజు, చీర శ్రీను, కనక చారి, శంకర్, మల్లేష్, మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
లీకేజీలను గుర్తించిన
ఇంజనీర్లు
టన్నెల్‌లోకి దిగిన మెగా సిబ్బంది
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నిటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్‌లోకి దిగిన మెగా ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు.

అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలి

అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలి