సీఎం సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా
జనగామ: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై సీఎ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి
స్టేషన్‌ఘన్‌పూర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని, రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేడ్కర్ జయంతి, ‘జై బాపు, జైభీమ్, జైసంవిధాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్థానిక కొత్త గాంధీ చౌరస్తా నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుళులర్పించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తుందని, దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ జెడ్పీచైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, జగదీష్ చందర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీధర్‌రావు, సింగపురం వెంకటయ్య, బూర్ల శంకర్, పోశాల కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయడి వినూత్న ప్రచారం
పాలకుర్తి టౌన్: మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జెడ్పీఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండలకేంద్రంలోని వారాంతపు సంతలో మైకులో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు–అనర్థాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించేందుకు తన వంతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దూమపానం, మద్యపానంతో పోలిస్తే డ్రగ్స్ వందల రెట్లు ప్రమాదకరమైనవన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని మానిపించడం కష్టమన్నారు. బానిసలుగా మారిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతారన్నారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు.
హిందువులు
ఐక్యతతో ఉండాలి
జనగామ: హిందువు ఐక్యత, చైతన్యంతోనే మ రెన్నో కార్యక్రమాలు చేపడుతూ మన శక్తిని చా టి చెప్పాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మోహన కృష్ణ భార్గవ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం శ్రీరాంనగర్ కాలనీ సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో వీహెచ్‌పీ నగర కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్రకు వందలాది మంది హిందువులు తరలి వచ్చి విజయవంతం చేశారని, ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, హిందూ సంస్థలు, యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు, భజన మండళ్లు, దేవాలయాల నిర్వాహకులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాశం శ్రీశైలం, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, ఉల్లెంగుల రాజు, నగర ప్రముఖ్ అంబటి బాలరాజు, సభ్యులు కుందారపు బైరునాథ్, మాసరాజు, కుర్రెముల రాంప్రసాద్, ఉమాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా
సీఎం సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా
సీఎం సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా


