
బీజేపీ పాలనలో రాజ్యాంగంపై దాడి
స్టేషన్‌ఘన్‌పూర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది.. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంపై శనివారం స్థానికంగా ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, అమిత్‌షా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించేలా పార్లమెంట్‌లో మాట్లాడారని అన్నారు. ప్రజలను చైతన్యం చేస్తూ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడు తూ.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుతుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో కలిసి జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీజీ ఫొటోలతో గ్రామాల్లో ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి, ఏఎంసీ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, మారుడోజు రాంబాబు, శిరీష్‌రెడ్డి, లింగాజీ, జగదీష్‌చందర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీధర్‌రావు, కట్టా మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య