న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో అత్యంత విలాసవంతమైనదిగా పేరున్న గోల్డెన్ చారియట్ రైలు పునఃప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి గోవా వరకు వెళ్ళే ఈ రైలు దేశవిదేశీ టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ రైలులో 18 బోగీలుంటాయి. 84 మందికి సరిపోయే 44 గెస్ట్ రూములున్నాయి. అయితే ఈ రైల్లో ప్రయాణించే వారి సంఖ్య అతి తక్కువగా ఉండడంతో గత మార్చిలో దీన్ని రద్దు చేశారు. కొత్తగా నిర్ణయించిన రైలు వేళలు, టికెట్ ధరలు మరో వారంలో వెల్లడిస్తామని ఐఆర్‌సీటీసీ చెప్పింది. మొదట నెలకి రెండుసార్లు రాకపోకలు ప్రారంభించనున్నట్టు కెఎస్‌టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ పుష్కర్ తెలిపారు. గతంలో ఈ రైలు చార్జీ రూ. 43 వేలు (600 అమెరికన్ డాలర్లు)గా ఉండేది. బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ రైలు బందిపూర్, మైసూర్, హలేబిద్, చిక్‌మంగుళూరు, హంపీ, బీజాపూర్‌ల మీదుగా గోవాకి చేరేది. ఇప్పుడు కూడా ఇదే మార్గంలో దీన్ని నడపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment