Cyclone Asani: Golden Chariot Temple Flown To Reach Sunnapalli Sea Area In Srikakulam - Sakshi
Sakshi News home page

Cyclone Asani Effect: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం

May 11 2022 11:14 AM | Updated on May 12 2022 11:42 AM

Golden Chariot Temple Flown To Sunnapalli Sea Area In Srikakulam  - Sakshi

శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. తుపాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది.

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. తుపాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది.
చదవండి: అసని తుపాను ఎఫెక్ట్‌.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. 

ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు అన్నారు.

ఆ రథం మయన్మార్‌ దేశానిది..
సముద్ర తీరానికి చేరిన స్వర్ణరథం మయన్మార్‌ దేశానికి చెందినదిగా గుర్తించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బుధవారం తహసీల్దార్‌ చలమయ్య, భావనపాడు మెరైన్‌ సీఐ దేవుళ్లు, నౌపడ ఎస్‌ఐ ఐ.సాయికుమార్‌ తీరానికి చేరిన రథాన్ని పరిశీలించారు. రథంపై ఉన్న భాషను గూగుల్‌లో శోధించగా మయన్మార్‌ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్‌దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదని మెరైన్‌ సీఐ చెప్పారు. 


 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement