సాక్షి, తిరుమల: తిరుమలేశుని కైంకర్యసేవకు కొత్త స్వర్ణరథం సిద్ధమైంది. సోమవారం ఉదయం 9.05 గంటలకు దాన్ని ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించనున్నారు. దీనిఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇలాంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అంగుళాల గేజ్ కలిగిన రాగిపై 9 సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం చేశారు.