
లగ్జరీ రూం.. బార్.. జిమ్ సెంటర్.. స్పా.. లగ్జరీ రెస్టారెంట్లు.. ఇలా ఒక్కటేమిటి? అన్ని రకాల హైఫై వసతులు మీ ప్రయాణంలో లభిస్తాయి. అదేంటి బస్సుకో, రైలుకో, ఫ్లైట్‌కో వెళ్తే ఇవ్వేమీ సాధ్యపడవు కదా? మహా అంటే పడుక్కోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ సౌకర్యాలన్నింటితో లగ్జరీ జర్నీ ఎలా అనుకుంటున్నారా? దేశీయ రైల్వే లాంచ్ చేసిన గోల్డెన్ ఛారియట్ అనే రైలులో ఈ సదుపాయాలన్నింటిన్నీ అందిస్తోంది. భారత్‌లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ కలుపుతూ ఈ లగ్జరీ టూరిస్ట్ రైలును అందుబాటులోకి వచ్చింది. కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, పుదేచ్చేరి వంటి ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ ఈ రైలులో చుట్టేయొచ్చు. మొత్తం 19 కోచ్‌లున్న ఈ రైలు, పర్‌పుల్, గోల్డ్ రంగుల్లో రూపొందింది.
Comments
Please login to add a commentAdd a comment