Luxury Train
-
ఉక్రెయిన్‌లో మోదీ ప్రయాణించే లగ్జరీ రైలు విశేషాలివే..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెలలో యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోదీ భేటీ కానున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా.. ప్రధాని మోదీ రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధానికి చేరుకోనున్నారు. అదే అత్యంత సురక్షితమైన రైలే కాకుండా విలాసవంతమైన రైలుగా పేరొందిన ‘ట్రైన్ ఫోర్స్ వన్ ’లో మోదీ ప్రయాణించనున్నారు.రైలు ప్రత్యేకతలుఇది సౌకర్యవంతమైన, అత్యున్నత స్థాయి ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది సాధారణ రైలు కాదు. అత్యంత భద్రతతో కూడుకొని ఉంది. విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది కూడా ఉంటుంది. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఈ లగ్జరీ రైలును నిర్వహించడం అంత సులువు కాదు. అందుకే వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.యుద్దంలో దెబ్బతిన్న మార్గాల గుండా 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకోనున్నారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణించనున్నారు. దీంతో మొత్తం 20 గంటలపాటు ఈ రైలులో గడపనున్నారు. ఈ లగ్జరీ రైలులో గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి ప్రపంచ నాయకులు సైతం ప్రయాణంచారు.కాగా గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపై మోదీ, జెలెస్కీ నేతలు చర్చించనున్నారు. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ కంటే ముందు ప్రధాని ఆగష్టు 21న పోలండ్‌లో పర్యటించనున్నారు. -
‘ప్యాలెస్ ఆన్ వీల్స్’.. రాజ భోగాల ప్రయాణం.. రెండేళ్ల తర్వాత కూత..!
ఇది రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. రాయల్ ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి! జైపూర్: కరోనా కారణంగా నిలిచిపోయిన విలాసవంతమైన పర్యాటక రైలు (రాయల్ ట్రైన్) తిరిగి రెండేళ్ల తర్వాత పట్టాలెక్కింది. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’గా పేరుగాంచిన ఈ ట్రైన్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శనివారం గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. గత 40 ఏళ్లగా రాయల్ ట్రైన్ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, ఇది ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ముందు.. అందులోని వసతులపై ఆరా తీశారు సీఎం గెహ్లోత్. ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రైలు సర్వీసును తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైలులో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, 2022-23 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 40 ఏళ్ల ఘన చరిత్ర..: దేశంలో గత 40 ఏళ్లుగా రాయల్(ప్యాలెస్ ఆన్ వీల్స్) ట్రైన్ సేవలందిస్తోంది. తొలిసారి ఈ రాయల్ ట్రైన్ 1982లో పట్టాలెక్కింది. రైల్ గేజ్‌లను సమయానుసారంగా మారుస్తూ వస్తున్న క్రమంలో రెండో రాయల్ ట్రైన్‌ను 1991లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోది 1995లో పట్టాలెక్కినట్లు అధికారులు తెలిపారు. తర్వాత రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి 2009లో అధునాత సౌకర్యాలతో పునరుద్ధరించింది రైల్వే శాఖ. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే భావన కోచ్‌ల్లో రాచరిక నేపథ్యం నుంచి వచ్చింది. వాస్తవానికి రాజ్‌పుత్‌లు, బరోడా, హైదరాబాద్ నిజాం సహా బ్రిటిష్ వైస్రాయ్‌ల వ్యక్తిగత రైల్వే కోచ్‌లుగా వీటిని ఉద్దేశించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంటీరియర్ డిజైన్..: ప్రతి బోగిలో ఫర్నిచర్, హస్తకళలు, పెయింటింగ్ వంటి వాటి వాడకం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక నైతికతను హైలైట్ చేస్తుంది. జైపూర్‌కు చెందిన నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్ రైలు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది. సౌకర్యాలు..: ఈ రాయల్ ట్రైన్లో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. 104 మంది టూరిస్టులు ఇందులో ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌కు రాజ్‌పుత్‌ల పేర్లు పెట్టారు. ఒక్కో బోగీలో లగ్జరీ సౌకర్యాలు, వైఫై ఇంటర్నెట్ వంటివాటితో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఈ రైలులో ద మహారాజ, ద మహారాణి అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఒక బార్ కమ్ లాంజ్, 14 సెలూన్లు, ఒక స్పా ఉన్నాయి. ఏ రూట్లలో వెళ్తుంది..: ఈ రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్(రెండో రోజు), సవాయ్ మాధోపుర్, ఛిత్తౌర్గఢ్(మూడో రోజు), ఉదయ్ పూర్(నాలుగో రోజు), జైసల్మేర్(ఐదోరోజు), జోధ్‌పుర్ (ఆరో రోజు), భరత్‌పుర్, ఆగ్రా(ఏడో రోజు), తిరిగి ఎనిమిదో రోజు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇదీ చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని.. -
ఆ రైలు టిక్కెట్ ధర అక్షరాల రూ.2లక్షలు..
న్యూఢిల్లీ : రైలులో దూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. రోజుల తరబడి చేసే ట్రైన్ జర్నీలు ఇప్పుడు సాఫీగా సాగిపోతాయి. ఇరుకిరుకు బోగీలలో అష్టకష్టాలు పడాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలు చేసేవారి కోసం ‘‘ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్’’ (ఐఆర్సీటీసీ) కొత్తగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో విలాసవంతమైన ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోగీలలో మీ ప్రయాణం ఎలా ఉంటుందంటే.. విశాలమైన ఏసీ గదులు, రూమ్ విత్ పర్నిచర్, అటాచ్డ్ బాత్రూం, పిలవగానే వచ్చే సేవకులు. మొత్తానికి ఓ లగ్జరీ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసుకున్నట్లు ఉంటుంది. సామాన్య పౌరునికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఐఆర్సీటీసీ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ బోగీలను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని జమ్మూ మేయిల్‌తో పాటు జతచేసి నడుపుతున్నారు. మొత్తం 336 సెలూన్ కోచ్‌లు ఉండగా వాటిలో 66ఏసీవి. ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లలో ప్రయాణించడానికి ‘‘ఐఆర్సీటీసీ’’ వెబ్సైట్లో వెళ్లి ఓ టిక్కెట్ బుక్ చేసుకుంటే సరి. ధర విషయానికొస్తే లగ్జరీ అంటున్నాం కాబట్టి.. డబ్బులు కూడా లగ్జరీకి తగ్గట్టుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్ ధర అక్షరాల రూ. 2లక్షలు.. 18 ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లతో సమానం. అంటే ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లో ఒక్క టిక్కెట్ కొంటే ఫస్ట్‌క్లాస్ బోగీలలో 18సార్లు ప్రయాణించవచ్చు. -
ఇది రైలు అంటే నమ్ముతారా...?
లగ్జరీ రూం.. బార్.. జిమ్ సెంటర్.. స్పా.. లగ్జరీ రెస్టారెంట్లు.. ఇలా ఒక్కటేమిటి? అన్ని రకాల హైఫై వసతులు మీ ప్రయాణంలో లభిస్తాయి. అదేంటి బస్సుకో, రైలుకో, ఫ్లైట్కో వెళ్తే ఇవ్వేమీ సాధ్యపడవు కదా? మహా అంటే పడుక్కోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ సౌకర్యాలన్నింటితో లగ్జరీ జర్నీ ఎలా అనుకుంటున్నారా? దేశీయ రైల్వే లాంచ్ చేసిన గోల్డెన్ ఛారియట్ అనే రైలులో ఈ సదుపాయాలన్నింటిన్నీ అందిస్తోంది. భారత్‌లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ కలుపుతూ ఈ లగ్జరీ టూరిస్ట్ రైలును అందుబాటులోకి వచ్చింది. కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, పుదేచ్చేరి వంటి ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ ఈ రైలులో చుట్టేయొచ్చు. మొత్తం 19 కోచ్‌లున్న ఈ రైలు, పర్పుల్, గోల్డ్ రంగుల్లో రూపొందింది. -
టూరిస్ట్ ట్రైన్లో లగ్జరీ జర్నీ
-
పర్యాటకులకు లగ్జరీ రైలు సేవలు
సాక్షి, ముంబై: వివిధ ప్యాకేజీలతో కూడుకొని ఉన్న డెక్కన్ ఒడిస్సీ లగ్జరీ ట్రైన్ రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలను సంచరించనుంది. ముంబై, నాసిక్, సిందుదుర్గ్, తర్కర్లి, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోర, కొల్హాపూర్‌తోపాటు సమీప రాష్ట్రమైన గోవాలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. మరో ప్యాకేజీలో దేశంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేయనుంది. ఇందులో న్యూఢిల్లీ, ఆగ్రా, రాజస్తాన్, ఉదయ్‌పూర్, జైయ్‌పూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వడోదర, సాసన్ గిర్, భావ్‌నగర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, కర్నాటక రాష్ట్రంలోని బాదామి, బిజాపూర్, ఐహోలే, పట్టాడ్‌కల్ తదితర ప్రాంతలను తిరుగుతుంది. ఈ డెక్కన్ ఒడిస్సీ.. ప్యాలెస్ ఆన్ వీల్స్ వల్ల ప్రేరణ పొందింది. దీనిని టూరిజం ప్రచారం నిమిత్తం రాజస్తాన్ వారు ఏర్పాటు చేశారు. దీనిని 2004లో మొట్టమొదట ఐఆర్సీటీసీ వారు ప్రారంభించారు. దీనికి అనుకుంతమేర స్పందన లభించలేదు. తర్వాత ఎంటీడీసీ దీనిని ఏర్పాటు చేసింది. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రస్తుతం దీన్ని తీర్చిదిద్దారు. బుకింగ్ చేసుకోవాలంటే.. ఈ మొత్తం టూర్‌ను నిర్వహించేందుకు ఎంటీడీసీ ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైలు కోసం బుకింగ్ చేసుకోవాలంటే ఆన్లైన్ లేదా ఏజెంట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలు రూ.64,700 నుంచి ప్రారంభమవుతాయని సంబంధిత అధికారి వెల్లడించారు. అక్టోబర్‌లో ప్రారంభం ఒడిస్సీ లగ్జరీ రైలు అక్టోబర్‌లో ప్రారంభంకానుందని మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) అధికారి తెలిపారు. ఈ రైలులోని ఇంటీరియర్‌లో మార్పులు చేర్పులు చేశామన్నారు. మెనూని నవీకరించామని, దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలను పరిచయం చేస్తున్నామన్నారు. వీటికి తగ్గట్టుగా చార్జీలను ఉంటాయని పేర్కొన్నారు. పూర్తిగా ఏసీ విస్తరించిన ఈ రైలులో 10 బోగీల్లో 40 సూట్స్ ఉన్నాయనీ మరో రెండు బోగీల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు రెస్టారెంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బార్ కార్, ఓ బోగీలో సమావేశ హాలు, ఇంటర్నెట్ వెసులుబాటు, ఐఎస్డీ, ఎస్టీడీ లైన్లు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇంకా వ్యాయామ శాల ఉన్న బోగీ, స్టీమ్ బ్యూటీ పార్లర్, ఎల్సీడీ ప్లాస్మా టీవీలు అమర్చినట్లు చెప్పారు. ఈ రైలులో దిన పత్రికను రోజూ చదవవచ్చు. వికలాంగులకు ప్రత్యేక సేవకులను అందజేయనున్నట్లు చెప్పారు.