సాక్షి, ముంబై: వివిధ ప్యాకేజీలతో కూడుకొని ఉన్న డెక్కన్ ఒడిస్సీ లగ్జరీ ట్రైన్ రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలను సంచరించనుంది. ముంబై, నాసిక్, సిందుదుర్గ్, తర్కర్లి, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోర, కొల్హాపూర్‌తోపాటు సమీప రాష్ట్రమైన గోవాలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. మరో ప్యాకేజీలో దేశంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేయనుంది. ఇందులో న్యూఢిల్లీ, ఆగ్రా, రాజస్తాన్, ఉదయ్‌పూర్, జైయ్‌పూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి.
వడోదర, సాసన్ గిర్, భావ్‌నగర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, కర్నాటక రాష్ట్రంలోని బాదామి, బిజాపూర్, ఐహోలే, పట్టాడ్‌కల్ తదితర ప్రాంతలను తిరుగుతుంది. ఈ డెక్కన్ ఒడిస్సీ.. ప్యాలెస్ ఆన్ వీల్స్ వల్ల ప్రేరణ పొందింది. దీనిని టూరిజం ప్రచారం నిమిత్తం రాజస్తాన్ వారు ఏర్పాటు చేశారు. దీనిని 2004లో మొట్టమొదట ఐఆర్‌సీటీసీ వారు ప్రారంభించారు. దీనికి అనుకుంతమేర స్పందన లభించలేదు. తర్వాత ఎంటీడీసీ దీనిని ఏర్పాటు చేసింది. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రస్తుతం దీన్ని తీర్చిదిద్దారు.
బుకింగ్ చేసుకోవాలంటే..
ఈ మొత్తం టూర్‌ను నిర్వహించేందుకు ఎంటీడీసీ ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైలు కోసం బుకింగ్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ లేదా ఏజెంట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలు రూ.64,700 నుంచి ప్రారంభమవుతాయని సంబంధిత అధికారి వెల్లడించారు.
అక్టోబర్‌లో ప్రారంభం
ఒడిస్సీ లగ్జరీ రైలు అక్టోబర్‌లో ప్రారంభంకానుందని మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) అధికారి తెలిపారు. ఈ రైలులోని ఇంటీరియర్‌లో మార్పులు చేర్పులు చేశామన్నారు. మెనూని నవీకరించామని, దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలను పరిచయం చేస్తున్నామన్నారు. వీటికి తగ్గట్టుగా చార్జీలను ఉంటాయని పేర్కొన్నారు.
పూర్తిగా ఏసీ విస్తరించిన ఈ రైలులో 10 బోగీల్లో 40 సూట్స్ ఉన్నాయనీ మరో రెండు బోగీల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు రెస్టారెంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బార్ కార్, ఓ బోగీలో సమావేశ హాలు, ఇంటర్నెట్ వెసులుబాటు, ఐఎస్‌డీ, ఎస్‌టీడీ లైన్లు సౌకర్యం కల్పించామని చెప్పారు.
ఇంకా వ్యాయామ శాల ఉన్న బోగీ, స్టీమ్ బ్యూటీ పార్లర్, ఎల్‌సీడీ ప్లాస్మా టీవీలు అమర్చినట్లు చెప్పారు. ఈ రైలులో దిన పత్రికను రోజూ చదవవచ్చు. వికలాంగులకు ప్రత్యేక సేవకులను అందజేయనున్నట్లు చెప్పారు.
పర్యాటకులకు లగ్జరీ రైలు సేవలు
Published Tue, Aug 26 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement