Deccan
-
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు విజయంతో ముగించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలివీరా (4వ ని.లో), గేబ్రియల్ రోసెన్‌బర్గ్ (16వ ని.లో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. షిల్లాంగ్ జట్టుకు ఫ్రాంగీ బువామ్ (46వ, 87వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 13 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు నిరీ్ణత 24 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 14 మ్యాచ్‌ల్లో నెగ్గిన శ్రీనిధి జట్టు ఆరు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 48 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్లోనూ శ్రీనిధి జట్టు రెండో స్థానంలోనే నిలిచింది. 52 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్‌గా నిలిచిన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ ఇండియన్ సూపర్ లీగ్‌కు అర్హత సాధించింది. -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్‌ను హెడర్ షాట్‌తో లాల్రొమావియా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోకులం కేరళ ఎఫ్‌సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
న్యూఢిల్లీ : అమర్ దేవులపల్లి పుస్తకం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన "ది డెక్కన్ పవర్ ప్లే The Deccan Power Play" పుస్తకాన్ని ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణ, ఆలిండియా కెమెరామన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిన్హా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లహరి తదితరులు హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అతిథులు పలు కీలక అంశాలను పంచుకున్నారు. సంజయ్ బారు, ప్రధాని మీడియా మాజీ సలహాదారు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాధాన్యం తగ్గుతోంది విభజన వల్ల రాజకీయంగా కేంద్రంలో తెలుగు బలం తగ్గింది రాజకీయాలు భాష కాకుండా, కులం ఆధారంగా మారిపోతున్నాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాతా... రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగడం శుభపరిణామం పాలసీల కొనసాగింపు వల్ల మంచి అభివృద్ధి జరిగింది డెక్కన్ ప్రాంతం ఈ దేశానికి గ్రోత్ ఇంజన్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌లా పని చేస్తున్నాయి 50 శాతం జనాభా హిందీ రాష్ట్రాలలో ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు 50% జిడిపి దేశానికి అందిస్తున్నాయి అమర్, రచయిత తెలుగు రాజకీయాలపై ఢిల్లీలో అపోహలు, పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి ఢిల్లీ మీడియా దక్షిణ రాజకీయాలను సరైన రీతిలో పట్టించుకోలేదు ఢిల్లీ మీడియా తప్పుడు అభిప్రాయాలను సరిచేసేందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాం అందుకే దక్షిణాది రాజకీయాల అంశాన్ని ఎంచుకుని పుస్తకం రాశాను 47 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాను వెంకట్ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ దక్కన్ రాజకీయాలపై వచ్చిన మంచి పుస్తకం ఇది దక్షిణ భారతం నుంచి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నాను పుస్తకంలో దేవులపల్లి అమర్ ఏ అంశాలు చర్చించారంటే.. తెలుగు రాజకీయాల్లో ముగ్గురు నాయకులు బహుశా ఎప్పటికీ గుర్తుండిపోతారేమో. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజాసేవలో భిన్నమైన దారులు ఎంచుకుని, తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నేతలు వీరు. ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఎంచుకున్న దారుల గురించి, అనుసరించిన పద్ధతుల గురించీ విశ్లేషిస్తుందీ పుస్తకం. 40 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఈ నాయకులను అతి దగ్గరగా చూసిన దేవులపల్లి అమర్, తన అనుభవాన్నంతా మేళవించి రాసిన ‘మూడు దారులు’, నాయకుల రాజకీయ క్రీడలను, అధికారం కోసం వెన్నుపోట్లకు సైతం వెనుకాడని వారి తెగింపును కళ్ళకు కడుతుంది. పుస్తకం అద్యంతం ఆసక్తికరం ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని రెండవ సారి చీల్చి కాంగ్రెస్ (ఐ) అనే కొత్త రాజకీయ పార్టీని 1978 లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం మొదలుకుని 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకూ అనేక పరిణామాలను, అందుకు కారణమైన నేతల వైఖరిని విపులంగా చర్చించింది ఈ పుస్తకం. గడచిన నలభయ్యేళ్లలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ను పాలించిన మర్రి చెన్నారెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ 11 మంది ముఖ్యమంత్రులతోపాటు ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చోటు చేసుకున్న సంఘటనలపై రచన విశ్లేషణాత్మకంగా సాగింది. పుస్తకం చదువుతున్నంతసేపూ రాజకీయ వేదికపై ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. -
2024 ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో పసిడి ఉత్పత్తి
న్యూఢిల్లీ: జొన్నగిరి బంగారు గనుల్లో వచ్చే ఏడాది అక్టోబర్–డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని డెక్కన్ గోల్డ్ మైన్స్ (డీజీఎంఎల్) ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 750 కిలోల బంగారం వెలికి తీయొచ్చని ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు దీనిపై రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయగా పైలట్ ప్రాతిపదికన ప్రస్తుతం నెలకు ఒక కేజీ మేర బంగారాన్ని మైనింగ్ చేస్తున్నారు. 2013లో తమకు గనిని కేటాయించగా, ప్రాజెక్టు మదింపును పూర్తి చేసేందుకు 8–10 ఏళ్లు పట్టినట్లు ప్రసాద్ చెప్పారు. అటు కిర్గిజ్స్తాన్లో తమకు 60 శాతం వాటాలున్న మరో బంగారు గనిలో కూడా 2024 అక్టోబర్–నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు నుంచి ఏటా 400 కేజీల బంగారం వెలికితీయొచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గని ఉంది. బీఎస్ఈలో లిస్టయిన ఏకైక గోల్డ్ మైనింగ్ కంపెనీ డీజీఎంఎల్. జొన్నగిరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసూర్ సరీ్వసెస్ ఇండియాలో డీజీఎంఎల్కు మెజారిటీ (40 శాతం) వాటాలు ఉన్నాయి. -
ఎట్టకేలకు డక్కన్మాల్ నేలమట్టం
సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్మాల్ను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ భవనం ఆదివారం పూర్తిగా నేలమట్టం అయ్యింది. గత తొమ్మిది రోజులుగా కూల్చివేత పనులు జరుగుతుండగా.. ఎట్టకేలకు ఆదివారానికి దక్కన్ మాల్ కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం నేలమట్టం కావడంతో శిథిలాలను తొలగించే పనులను వేగవంతం చేశారు. ఈ భవనం కూల్చివేతలో ఎలాంటి ఆస్టి, ప్రాణ నష్టం జరగకపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం మాల్ని కూల్చివేస్తుండగా ఒక్కసారిగా సగం భవనం కూలిన సంగతి తెలిసిందే. ఆ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు లోనయ్యారు. సరిగ్గా ఆ సమయానికి ఆ ప్రదేశంలో చుట్టుపక్కల వారు ఎవ్వరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అదీగాక ఈ భవనం కూల్చివేత పనులు కారణంగా అధికారులు చుట్టపక్కల ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయిందచారు. దీంతో చాలా వరకు ప్రాణపాయం తప్పిందనే చెప్పాలి. అంతేగాక ఆ మాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ కూల్చివేత పనులన కాంట్రాక్టర్‌ను తొలుత ఎస్కే మల్లు కంపెనీ దక్కించుకున్న మధ్యలో జీహెచ్ఎంసీ ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మాలిక్ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. పనులు వేగవంతంగా చేసిన ఆ సంస్థ..ఎట్టకేలకు దక్కన్ మాల్ భవనాన్ని ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేలమట్టం చేసింది. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..) -
‘డెక్కన్ మాల్ కూల్చివేత’ టెండర్ మార్పు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదానికి గురైన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత టెండర్లో మార్పు చోటు చేసుకుంది. ఆ టెండర్‌ను ఎస్కే మల్లు కంపెనీ నుంచి కృష్ణ ప్రసాద్ ఏజెన్సీ దక్కించుకుంది. ఎస్కే మల్లు కంపెనీ వద్ద సరైన యంత్రాలు లేకపోవడంతో దాన్ని రద్దు చేశారు. ఆ స్థానంలో కృష్ణ ప్రసాద్ ఏజెన్సీకి కూల్చివేత టెండర్ దక్కింది. సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత పనులకు జీహెచ్ఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే జీహెచ్ఎంసీ మంగళవారం ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆహ్వానించి సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు దక్కించుకుంది. అయితే భారీ భవనాన్ని కూల్చివేసే క్రమంలో పూర్తిస్థాయి యంత్రాలు అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో ఎస్కే మల్లు కంపెనీ ఫెయిల్ కావడంతో టెండర్లో మార్పు చోటు చేసుకుంది. ఎస్కే మల్లు కంపెనీ టెండర్‌ను రద్దు చేసి కృష్ణ ప్రసాద్ ఏజెన్సీకి ఆ టెండర్‌ను అప్పగించారు. -
డెక్కన్‌మాల్ కూల్చివేతకు రంగం సిద్ధం..హైదరాబాద్ కంపెనీకే టెండర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత పనులకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మంగళవారం ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆహ్వానించి సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐతే ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు దక్కించుకుంది. కాగా, ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఆ బాధితుల గురించి స్పష్టత వచ్చాక కూల్చాలని భావించినా..ఈ లోపే కూలిపోతే నష్టం వాటిల్లుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయా బాధిత కుటుంబీకులను ఒప్పించి గురువారమే కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయ్యింది. (చదవండి: ఇక నేలమట్టమే.. అంచనా వ్యయం రూ. 41 లక్షలు) -
Deccan Mall Accident: కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది. మంటలు ఆర్పివేసినప్పటికీ బిల్డింగ్ లోపలకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ బిల్డింగ్ కూల్చివేయాలా? వద్దా అన్న అంశంపై డైలామాలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు చివరికీ కూల్చవేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కూల్చివేతకు ముందస్తుగా జీహెచ్ఎంసీ ప్రముఖ నిట్ నిపుణులతో చర్చలు జరిపి ప్రమాదం ఉండదని తేలిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఈ భవనం కూల్చివేతకు టెండర్లను కూడా ఆహ్వానించింది జీహెచ్ఎంసీ. అలాగే స్థానిక నివాసాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కూల్చివేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, భవనం కూలి ఇన్ని రోజులైన ఇంకా ఇద్దరి మృతదేహాల ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఆ రెండు మృతదేహాలు లభించిన తర్వాత కూల్చివేయాలని అధికారులను జీహెచ్ఎంసీ ఆదేశించింది. (చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం) -
డెక్కన్ మాల్ ఘటన.. ఇక మిగిలింది బూడిదేనా?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో.. గల్లంతైన ముగ్గురు వర్కర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా కనీసం మృతదేహాల జాడ గుర్తించకపోవడం, మృతదేహాలు లభ్యమైనట్లు గందరగోళ ప్రకటనల నడుమ బాధితుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. మరోవైపు బిల్డింగ్ నుంచి ఇంకా పొగలు వస్తుండడంతో ఆదివారం మరోసారి ఫోమ్ జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక భవనంలో మొదటి మూడు ఫ్లోర్లలోని లోపలి భాగం స్లాబ్‌లు కుప్పకూలిపోయాయి. ఈ స్లాబ్‌ల కిందే మృతదేహాల అవశేషాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఆదివారం అన్ని ఫ్లోర్లను క్షుణ్ణంగా పరిశీలించిన డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బూడిద ద్వారా ఆనవాలు గుర్తించేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల బూడిద శాంపిల్స్‌ను క్లూస్ టీం ద్వారా సేకరించారు. ఆ శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కి తరలించారు. బాధితులను గుజరాత్‌కు చెందిన జునైద్, వసీం, అక్తర్‌గా గుర్తించారు. సెల్ఫోన్ల ఆధారంగా వాళ్లు ప్రమాద సమయంలో భవనంలోనే చిక్కుకుని ఉంటారని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక మృత దేహాల ఆచూకీ లభ్యం అయిన తర్వాతే.. భవనాన్ని అత్యాధునిక పద్ధతుల్లో చుట్టుపక్కల భవనాలకు డ్యామేజ్ వాటిల్లకుండా కూల్చేసే అవకాశం ఉంది. -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ అగ్నిప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ శుక్రవారం కూడా లభించలేదు. భవనంలోకి అడుగుపెట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో విక్టిమ్ లోకేషన్ కెమెరాతో (వీఎల్సీ) కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రాధా ఆర్కేడ్‌లో గల్లంతైన డెక్కన్ కార్పొరేట్ ఉద్యోగులు జునైద్, వసీం, జహీర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఉపక్రమించారు. వీరి సెల్ఫోన్ల లాస్ట్ లోకేషన్స్ గురువారం ఉదయం భవనం వద్దే ఉండగా...ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయ్యాయి. మరోపక్క ప్రమాదానికి కారణాలు విశ్లేషించడానికి క్లూస్‌టీమ్‌ను లోపలకు పంపాలని భావించారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగ, భరించలేని వేడి ప్రతికూలంగా మారాయి. వీటి కారణంగా నేరుగా, లేడర్ ద్వారా ప్రయత్నించినా బృందాలు భవనంలోకి అడుగుపెట్టే పరిస్థితి కనిపించలేదు. స్పష్టత లేదు... ఈ నేపథ్యంలోనే రెండో అంతస్తులో భవనం వెనుక వైపు రెండు చోట్ల మృతదేహాలు ఉన్నట్లు ఆనవాళ్లను శుక్రవారం సాయంత్రం గుర్తించారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించకపోవడంతో ఔనా? కాదా? అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో డ్రోన్ కెమెరా చిత్రీకరించిన వీడియోను ఇంప్రొవైజేషన్ విధానంలో విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. మొదటి అంతస్తులో కొంత వరకు లోపలికి వెళ్లిన డ్రోన్ అక్కడ మెట్ల మార్గం, శ్లాబ్ కూలి ఉన్నట్లు గుర్తించింది. భవనం మొత్తం శిథిలాలు, కాలిపోయిన వస్తువులు ఉండటంతో పాటు బూడిద సుమారు రెండు అడుగుల మేర పేరుకుపోయినట్లు గుర్తించారు. పది గంటలకు పైగా మంటల్లో ఉన్న ఈ ఆరంతస్తుల భవనం స్ట్రక్చరల్ స్టెబిలిటీని నిర్థారించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీంతో వరంగల్ నిట్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. నిట్ డైరెక్టర్ రమణ రావు, జీహెచ్ఎంసీ అధికారులు క్రేన్ సహాయంతో భవనం పై అంతస్తుల వరకు వెళ్లి పరిశీలించి మంటల్లో కాలిపోయిన కొన్ని శిథిలాలను సేకరించారు. భవనం పూర్తిగా బలహీనంగా మారిందని దీన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు చెప్పగలుగుతామని రమణరావు అన్నారు. బయటే బస్తీల జనం.. ఈ భవనాన్ని ఆనుకుని ఉన్న కాచిబోలిలో సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బస్తీలో చాలా ఇళ్లకు శుక్రవారం కూడా తాళాలు కనిపించాయి. భవనం వెనుక ఉన్న ఉత్తమ్ టవర్స్‌లో కిమ్స్ ఆస్పత్రి నర్సింగ్ హాస్టల్ ఉంది. ఇక్కడ నుంచి నర్సులను ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని కూల్చిన తర్వాతే చట్టుపక్కల వారికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోపక్క ఈ భవనం కూల్చివేత పనులు ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం దీన్ని పరిశీలించిన ఆ సంస్థ బృందం కూల్చివేత పూర్తి చేయడానికి మూడు–నాలుగు రోజులు పడుతుందని అభిప్రాయపడింది. గల్లంతైన వారు గుజరాత్ నుంచి వలసవచ్చిన వాళ్లు కావడంతో శుక్రవారం ఉదయానికి వారి కుటుంబీకులు నగరానికి చేరుకున్నారు. తమ వారి కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వీరికి రెండు మృతదేహాలు కనిపించాయనే వార్త శరాఘాతమైంది. అవి ఎవరివో, కనిపించని మూడో వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసీం సోదరుడు ఇమ్రాన్, జునైద్ సోదరుడు ఆసిఫ్ రోజంతా భవనం ముందే గడిపారు. చీకటి పడటంతో శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆపేసిన అధికారులు శనివారం మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అగ్నిప్రమాదం తీరు తెన్నులు, భవనం లోపలి పరిస్థితులను గమనించిన ఓ పోలీసు అధికారి ‘ఆ ముగ్గురూ బతికే అవకాశాలు లేవు. ఇన్ని గంటల మంటలు, ఇంత వేడి, ఫైర్ ఇంజన్లు చల్లిన నీళ్లు..ఇవన్నీ పరిశీలిస్తుంటే వారి ఎముకలు దొరికే అవకాశమూ తక్కువే’ అని వ్యాఖ్యానించారు. డ్రోన్ల సాయంతో... లోపలికి వెళ్లలేక వెనక్కు వచ్చిన టీమ్స్ డ్రోన్ కెమెరాల సాయం తీసుకోవాలని స్పష్టం చేశాయి. దీంతో అధికారులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించి వీఎల్‌సీతో కూడిన డ్రోన్లను రప్పించారు. వేడి కారణంగా ఈ డ్రోన్లు సైతం లోపలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. భవనం ముందు భాగంతో పాటు నాలుగు వైపుల నుంచి డ్రోన్ ఎగురవేసి అనువైన, ఖాళీగా ఉన్న భాగాల నుంచి లోపలి ప్రాంతాన్ని పరిశీలించారు. -
డెక్కన్ మాల్‌కు పగుళ్లు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనపై నిట్ అధికారులు రూపొందించిన నివేదిక పోలీసులకు చేరింది. డ్రోన్ కెమెరాతో శుక్రవారం ఉదయం నుంచి భవనం పరిస్థితిని అంచనా వేశారు అధికారులు. అయితే భవనం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను సెంట్రల్‌జోన్ డీసీపీ మీడియాకు వెల్లడించారు. ‘‘బిల్డింగ్ ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉందని అధికారులు మాతో చెప్పారు. భవనం మొత్తం ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. పైఅంతస్తు సీలింగ్ పూర్తిస్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్ మొత్తం బూడిద, శిథిలాలతో నిండిపోయిందని వివరించారు. భవనం ముందు భాగంలో రాకపోకలను నిషేధించాం. బిల్డింగ్‌లోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదు. ఇప్పటికే బిల్డింగ్‌లో రెండంతస్తుల స్లాబ్‌లు కూలిపోయాయి. భవనంలో కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీ తెలియదు. ముగ్గురికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. భవనం పరిస్థితిపై యజమానికి పూర్తి సమాచారం ఇచ్చాం అని డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. డ్రోన్ ద్వారా రెండు మృతదేహాలను గుర్తించినట్లు వార్తలు బయటకు వచ్చినప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కాకపోవడం గమనార్హం. -
హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి ఒక్క పైసా తెచ్చింది లేదు: తలసాని
-
డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్
-
డెక్కన్ మాల్ ఫైల్ ఎక్కడ?.. కూల్చివేతపై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి.. రెండు మృతదేహాలను గుర్తించారు. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో.. డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత బిల్డింగ్ వెనక రెండు మృత దేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఘోర ప్రమాదానికి కారణమైన బిల్డింగ్ కూల్చివేతపై అనుభవం కలిగిన ఏజెన్సీని జీహెచ్ఎంసీ సంప్రదించినట్లు సమాచారం. అయితే కూల్చివేత విషయంలో ఇంకా క్లారిటీ రాకపోగా.. బిల్డింగ్ ఫైల్ విషయంలో ఇవాళ పెద్ద హైడ్రామానే నడిచింది. డెక్కన్ మాల్ బిల్డింగ్‌కు సంబంధించిన ఫైల్ విషయంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘ ఫైల్ మా దగ్గర లేదంటే మా దగ్గర లేద’ని అధికారులు వాదులాడుకున్నారు. అయితే.. ఈ అక్రమ భవనంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఓ వర్గం చెప్పడం గమనార్హం. మరోవైపు ఆ ఫైల్ దొరికితేనే.. కూల్చివేతకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు ఫైల్‌తో సంబంధం లేకుండా.. భవన కూల్చివేతకు సంబంధించి ఒక స్కెచ్ జీహెచ్ఎంసీ అధికారులు తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. కూల్చివేతపై ఇవాళే ఓ స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. ఇక.. బిల్డింగ్ కూల్చివేతపై నగరానికే చెందిన మాలిక్ ట్రేడింగ్ అండ్ డీమాలిషన్ సంస్థ ప్రతినిధులతో జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. బిల్డింగ్ కూల్చడం, వ్యర్థాల తొలగింపు అంశాలను పరిశీలించారు ఇంజినీర్లు. బిల్డింగ్ హైట్, ఆకారం, లోపల గదుల ఆధారంగా డిమాలిషన్ చేయడానికి ప్లానింగ్ రూపొందిస్తున్నారు. పరిస్థితులను బట్టి మూడు, నాలుగు రోజుల్లో కూల్చడం పూర్తవుతుందని ఏజెన్సీ నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే.. కూల్చివేతతో చుట్టుపక్కల భవనాల పరిస్థితిపై ఈ ఉదయం ఆందోళన వ్యక్తం కాగా.. జీహెచ్ఎంసీ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. -
‘అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్: రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కన్ మాల్ భవనంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాగా, డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. డెక్కన్ మాల్ భవనంలో కెమికల్స్ వల్ల మంటలు ఆరలేదు. హైదరాబాద్‌లో డెక్కన్ మాల్ వంటి భవనాలు 25వేల వరకు ఉండొచ్చు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు. ఇలాంటి కట్టడాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాము. ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారు. భవనాల క్రమబద్దీకరణపై స్టే ఉందని కిషన్ రెడ్డికి తెలియదా?. గుజరాత్లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు. కిషన్ రెడ్డి లాగా మేము రాజకీయాలు చేశామా?. హైదరాబాద్ అభివృద్ధికి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాము. ఇంత అభివృద్ధి గతంలో ఎపుడైనా జరిగిందా?. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు. బాధితులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వ అధికారులా?. కిషన్ రెడ్డి భాద్యత లేకుండా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. మా ప్రభుత్వంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. అగ్ని ప్రమాదం కారణంగా పక్కన ఉన్న బస్తీ వాసులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాము. బాధితులను కాపాడే క్రమంలో అగ్ని మాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యతపై నిట్ ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికని త్వరలోనే సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు. -
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. మొదటగా సెల్లార్లో ప్రమాదం జరిగింది. పొగలు వస్తున్న సమయంలో ఏడుగురు సెల్లార్లోనే ఉన్నారు. ఆ పొగను చూసి కార్మికులంతా బయటకు వచ్చారు. అయితే.. ఫస్ట్ ఫ్లోర్లో స్పోర్ట్స్ మెటీరియల్ గోదాం ఉంది. ఆ మెటీరియల్ దించేందుకు ముగ్గురు కార్మికుల్ని యజమాని పైకి పంపించారు. ఆ ప్రయత్నంలో వాళ్లు ఉండగానే.. పొగలు, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అలా ఆ ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్‌లోనే చిక్కుకున్నారు. ఆ ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి. భవనంలోని మెట్ల మార్గం పూర్తిగా కూలిపోయింది. క్రేన్ల సాయంతో భవనం పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని డీసీపీ రాజేష్ మీడియాకు తెలిపారు. ఇక.. డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చే వరకు చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరిని అనుమతించమన్న ఆయన.. లోపల డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బ తింది. బిల్డింగ్ లోపలకి వెళ్ళే పరిస్థితి లేదు. చుట్టూ పక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా డిమాలిషన్ ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ యజమాని పై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన మీడియాకు తెలిపారు. -
నిజాం రాజ్యంలో నిశ్శబ్దం!
సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. కానీ.. ఆ రోజు హైదరాబాద్‌లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు. శుక్రవారమూ ఓ కారణమే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్‌కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు. దక్కన్ రేడియో మూగనోము... అప్పటికి హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు. ‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్‌ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం ) -
ప్రకృతి ఒడిలో ‘దక్కన్ ట్రేల్స్’
సాక్షి, హైదరాబాద్ : కాలుష్య కాంక్రీట్ కీకారణ్యంలో బతుకుతున్న వారికి అప్పుడప్పుడు అహ్లాదం కోసం అడవుల్లోకో, కనీసం ఊరవతలుండే కొండా కోనల్లోకో పోయి రావాలనిపిస్తోంది. అహ్లాదం కోసం కాకపోయినా ఆక్సీజన్ కోసమైనా అప్పుడప్పుడు అడవుల అంచుల దాకైన వెళ్లి రావాలి. అలాంటి వారి కోసమే కాకుండా వారి పిల్లా పాపల కోసం కూడా అందుబాటులో ఉన్నదే ‘దక్కన్ ట్రేల్స్’ విహార కేంద్రం. అక్కడి ‘సాహస క్రీడల్లో’ పిల్లలు ఊగిపోతుంటే పెద్దలు పిల్లల నాటి ఊసులతో తేలిపోవాల్సిందే. పచ్చటి పచ్చికల మీదుగా వీచే పైరగాలి విసురుకు యవ్వనం నాటి మధురానుభూతుల్లోకి మరొక్కసారి వెళ్లి రావాల్సిందే. ఇక వయస్సులో ఉన్న జంటలు ఊసులాడుకునేందుకు అనువైన చోటు. కాలుష్యం జాడలు కనిపించని ప్రశాంతమైన వాతావరణం. పక్కనే ఉన్న కొండగట్టుకెళితే అక్కడో ‘ఫ్యూ’ పాయింట్. అక్కడి నుంచి చూస్తే కళ్లముందు దట్టమైన అడవుల కనువిందు. అక్కడ అడవుల్లోకి ‘ట్రెక్కింగ్’ చేయడం అదనపు ఆనందం. ఉదయం, సాయంత్రం మాత్రమే ఇది అందుబాటులో ఉండే సదుపాయం. మనం ట్రెక్కింగ్ చేస్తుంటే జింకలు, నెమళ్లు, అడవి పందులు మన ముందునుంచే పరగులు తీస్తాయి. ఇక సీజన్లో పక్షుల కిలకిలారావాలు మన వీనులకు విందు చేస్తుంటే, ఇతర అడవి ప్రాణుల సందడి మన మదిలో ఒక విధమైన అలజడి రేపుతాయి. ఇంతటి అనుభూతిని కలిగించే ప్రాంతం మరెక్కడో కాదు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ ప్రాంతం. వాటి పక్కనే వికారాబాద్ రూట్లో, చేవెళ్లకు చేరువలో మన్నెగూడ పక్కన ‘దక్కన్ ట్రేల్స్’ పర్యాటక కేంద్రం ఉంది. అనంతగిరి హిల్స్‌ను కూడా దక్కన్ హిల్స్ అంటారుగనుక, వాటి పక్కనే ఉన్నందున దీనికి కూడా ‘దక్కన్ ట్రేల్స్’ అని పేరు పెట్టి ఉంటారు. పేరు ఎలా పెట్టినా అది మన దక్కన్ పీఠభూమిలో భాగమేకదా! ఉద్దేశపూర్వకంగానే అనంతగిరి అడవుల అందాలను ఆస్వాదించడం కోసమే పర్యాటక కేంద్రాన్ని అక్కడ అభివద్ధి చేశారు. పిల్లలు, యువతీయువకుల కోసం అందులో రాక్ క్లైంబింగ్, బర్మా తాళ్ల వంతెన, టార్జాన్ స్వింగ్, స్పైడర్ వెబ్ సాహస క్రీడలు ఉన్నాయి. ఇంకా జంపింగ్ స్ప్రింగ్ నెట్, బాక్సింగ్ కిట్లు సరేసరి. సైక్లింగ్, వాలీబాల్ మామూలే! అడవివైపు అందమైన ‘వ్యూపాయింట్’ ఉండగా, ఇవతలి వైపు నలుగురు కూర్చునే చిట్టి గుడిశె మరో ఆకర్షణ. అక్కడ కూర్చుంటే కొండ వాలుగా వీచే పైర గాలులకు కొదవ లేదు. అక్కడి నుంచి సాయంత్రం సూర్యాస్తమి చంద్రోదయాన్ని ఏకకాలంలో చూడడం అద్భుతమైన అనుభూతి. ఎంత ప్రకతిలో ఐక్యమైనా సమయానికి అన్న పానీయాలు అందకపోతే అదో వెలితే. ఆ వెలితి ఉండకుండా ఎప్పటికప్పుడు మనకు అన్న పానీయాలు అంద చేయడానికి పర్యాటక కేంద్రం సిబ్బంది సిద్ధంగా ఉంటారు. సైనికుల్లాగ దుస్తులు ధరించే వారు సైనికుల వల్లే యుద్ధ ప్రాతిపదికపై పరుగులు తీస్తూ పనిచేయడం మనల్ని ఆకట్టుకుంటుంది. ఎలాంటి పర్యాటక ప్రాంతమైనా, ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతం వసంత, హేమంత, శీతాకాలాల్లో ఎక్కువ బాగుంటుంది. మిగతా సీజన్లో అంతటి పచ్చతనం తప్ప ఆహ్లాదకరంగానే ఉంటుంది. చలికాచుకునేందుకు ‘నెగళ్ల’ ఏర్పాటు కూడా ఉంది. అక్కడికి మామాలు రోజుల్లో 50 మంది వరకు వస్తుంటే, వీకెండ్లో, సెలవు రోజుల్లో 120కి పైగా పర్యాటకులు వస్తున్నారట. అంతమందికే అక్కడ శాశ్వత ప్రాతిపదికపై వసతులు ఉన్నాయి. వారి కోసం మంచి గుడారాలు (టెంట్లు) అందుబాటులో ఉన్నాయి. గుడారాల భద్రతను దృష్టిలో పెట్టుకొని కామన్ డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కోసం వసతి సదుపాయాలను పెంచుకుంటూపోతే ప్రశాంత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే నూతన సంవత్సరం లాంటి వేడుకల్లో భాగంగా ఎక్కువ మందికి ఆతిథ్యం ఇవ్వడం కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేస్తారట. ఇంతగా చెబుతుంటే ఏ ఊటి, కొడైకెనాల్, కూర్గ్నో ఊహించుకోవద్దు! అవి మనకు చాలా దూరంలో ఉన్న ఖరీదైన పర్యాటకు కేంద్రాలు. ఒక్క హైదరాబాద్‌కే కాకుండా తెలాంగణ ప్రాంతం మొత్తానికి అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతం ఇది. పైపెచ్చు దేని అందం దానిదే. పర్యాటక కేంద్రం నుంచి మరికొన్ని కిలోమీటర్లు వాహనంలో ప్రయాణిస్తే నాగసముద్రం కాలువ, నాలుగు వందల ఏళ్ల నాటి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ పర్యాటక కేంద్రంలో ఓ టెంట్‌ను బుక్ చేసుకోవాలంటే హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్డు నెంబర్ వన్‌లోని ఏబీకే ఓల్బీ ప్లాజాకు వెళ్లాలి. లేదంటే 9440638450 ఫోన్ ద్వారా సురేందర్ అనే కేర్ టేకర్‌ను సంప్రతించవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ‘డెక్కన్ ట్రేల్స్ డాట్ కామ్’ను సందర్శించాలి. -
యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్రావు ఎన్నికయ్యారు. వైట్‌హౌస్‌లోని రూస్వెల్ట్ రూమ్‌లో ఆమె యూఎస్ సర్క్యూట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ క్లారెన్స్ థామస్ నేతృత్వంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. భర్త అలెన్ లెఫ్కోవిజ్తో కలసి బైబిల్‌పై ప్రమాణం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నవంబర్‌లో నియోమీని జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె నియామకానికి 53–46 ఓట్ల తేడాతో సెనేట్ ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా, నియోమీ గతంలో ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్ఏ)లో అడ్మినిస్ట్రేటర్‌గా కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని ప్రముఖ కోర్టుల్లో సుప్రీంకోర్టు తర్వాత డీసీ కోర్టు కీలకం. డీసీ కోర్టు జడ్జిగా నియమితులైన భారతీయుల్లో నియోమీ రెండో వ్యక్తి. గతంలో శ్రీ శ్రీనివాసన్ అనే వ్యక్తి డీసీ కోర్టు జడ్జిగా వ్యవహరించారు. -
ఆ ‘కలం’.. చిరకాలం!
సాక్షి, సిటీబ్యూరో: ‘దక్కన్ పెన్’.. దశాబ్దాలుగా ఆదరణ పొందుతూనే ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన ఈ పెన్నుల దుకాణం ఇప్పటికీ విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ రోజుల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏడో నిజాం ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నత విద్యా బోధన జరిగేది. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు వారు రాసేందుకు పెన్నుల డిమాండ్ కూడా చాలా పెరిగింది. అప్పటి వరకు సాధారణంగా స్థానికంగా వినియోగించే సిరా పెన్నులే వాడేవారు. అప్పట్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు ఇంగ్లండ్, జర్మన్‌తో పాటు ఫ్రాన్స్ దేశాల్లో తయారు చేసే పెన్నులపై ఎక్కువగా మొగ్గు చూపేవారు. వీరి అభిరుచికి అనుగుణంగానే ‘దక్కన్ పెన్ స్టోర్స్’ నిర్వాహకులు అరుదైన కలాలను అందుబాటులో ఉంచేవారు. ఇప్పటికీ ఈ దుకాణం మనుగడలోనే ఉండటం గమనార్హం. నిజాం కాలంలోనే.. ‘నిజాం కాలంలోనే నగరంలో పెన్నుల దుకాణం మొదలైంది. బాల్‌పాయింట్ పెన్ లేని సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ‘దక్కన్ పెన్ స్టోర్’ మొదలైంది. ఆ సమయంలో ధనవంతులు పౌంటెన్ పెన్ కొనాలంటే కోల్‌కతా, ముంబై వెళ్లాల్సిందే. నగరంలో ఆ పెన్నులను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎస్.ఎ.సిద్ధిఖీ నగరంలో ఈ పెన్నుల దుకాణం ప్రారంభించారు’ అని సిద్ధిఖీ వారసుడు ప్రస్తుత దక్కన్ స్టోర్ యజమాని హలీం చెప్పారు. అత్యాధునిక కలాలు.. దేశంలోనే అత్యాధునిక రకాల కలాలను దక్కన్ పెన్ స్టోర్‌లో చూడవచ్చు. ప్రాచీన కాలం నాటి పెన్నుల నుంచి అరుదైన రకాలూ కొలువయ్యాయి ఇక్కడ. బాల్‌పెన్, రోలర్, ఫౌంటెన్, జెల్, డిస్పోజబుల్ పెన్ అంటూ చాలా రకాల వైవిధ్యతలతో కూడినవి ఇక్కడ ఉన్నాయి. వాటర్ మ్యాన్ పెన్, పార్కర్, షెఫర్, క్రాస్, పెలికన్ తదితర రకాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వైవిధ్యమైనవెన్నో... వాడి పారేసే మూడు రూపాయల పెన్నుల నుంచి రూ.లక్ష.. ఆ పైచిలుకు ధర ఉన్న పెన్నులు ఇక్కడ ఉన్నాయి. రూపాయలు, వందలు, వేల రూపాయల ఖరీదైన వాటిని ఇక్కడ సందర్శనకు పెట్టారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాలను గమనించవచ్చు. ఐరోపా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందినవి చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా నటీనటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. దుకాణాన్ని సందర్శించి పెన్నులను కొనుగోలు చేస్తారు. నిజాం వారసుడు మఫకంజా.. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ పెన్స్టోర్ను దర్శిస్తారని దీని నిర్వాహకుడు హలీం చెప్పారు. దేశంలోనే ఖరీదైనవి.. ఇక్కడ ఉన్న కొన్ని పెన్నులు రూ.లక్షపైనే ధరల్లో ఉన్నాయి. వాటి వాటి ప్రత్యేకతల ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కాన్వే స్టెవార్ట్ పెన్ దక్కన్ పెన్‌స్టోర్‌లో అత్యధికంగా రూ.1,39,750 ధర పలుకుతోంది. పూర్తిగా వెండితో తయారు చేయడమే ఇందుకు కారణం. పెన్ను ముందు భాగంలో బంగారంతో తయారు చేసిన టిప్ ప్రత్యేక ఆకర్షణ. సాధారణ పెన్నులతో పోలిస్తే దీని బరువు ఎక్కువ. దేశంలో ఎక్కడా లభించని పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు దేశంలో అత్యధిక ధర ఉన్న పెన్నులు కూడా హైదరాబాద్‌లోని ఈ షాప్‌లోనే ఉన్నాయి. దేశ విదేశాల పెన్నులకు రిపేరింగ్ కొనుగోలు చేసిన వేల రూపాయల విలువైన పెన్నులు పాడైతే వాటిని వృథాగా పడేయకుండా ఈ దుకాణంలో బాగు చేస్తారు. కొనుగోలుదారులకు పెన్నుల గురించి సందేహాలను నివృత్తి చేస్తారు. దేశ విదేశాల్లో తయారైన హ్యాండ్‌మేడ్ పెన్నులను దక్కన్ పెన్ షాప్‌లో రిపేరింగ్ కూడా చేస్తారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి కూడా పెన్నులు రిపేరింగ్‌కు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. తొలినాళ్ల నుంచే విదేశీ బ్రాండ్లు.. విశ్వవిద్యాయలం ఏర్పాటైన మూడేళ్లకే అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగర్)లో నివసించే సబీ అక్తర్ సిద్ధీఖీ ఇంగ్లండ్‌లో తయారయ్యే కన్‌వెస్టివర్డ్ పెన్, ఫ్రాన్స్‌లో తయారు అయ్యే డ్యూరో పెన్ కంపెనీల ఏజెన్సీలను తీసుకొని 1922లో నగరానికి వచ్చారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు విద్యార్థులను కలిసి పెన్నుల విశిష్టతను తెలిపి విక్రయించే వారు. ఇలా ఆరేళ్ల పాటు పెన్నులు విక్రయించి 1928లో అబిడ్స్‌లో ‘ది దక్కన్ పెన్ స్టోర్’ను ప్రారంభించారు. 90 ఏళ్లుగా దేశ విదేశాల్లో తయారయ్యే పెన్నులు ఇప్పటికీ విక్రయిస్తూనే ఉన్నారు. మూడు తరాలుగా కొనసాగిస్తున్నాం.. ఏడో నిజాం కాలంలో మా నాన్న ఎస్.ఎ.సిద్ధిఖీ ఫ్రెంచ్ పెన్నును నగరానికి పరిచయం చేశారు. డ్యూరో పెన్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇంటింటికీ వెళ్లి పెన్నుల గురించి ప్రచారం చేస్తూ అమ్మకాలు సాగించేవారు. అరుదైన రకాల పెన్నులేవైనా పాడైతే.. మా దగ్గరకు తెస్తే అబిడ్స్ శాఖలో రిపేరింగ్ చేస్తాం. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ వాటర్‌మ్యాన్ పెన్నును తీసుకొచ్చి రిపేరింగ్ చేయాల్సిందిగా కోరారు. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఆ పెన్ను బహుమతిగా పొందినట్లు చెప్పారు. మా దగ్గరున్న యంత్రం సహాయంతో విడిభాగాలు తయారు చేసి, ఆ తర్వాత రిపేరింగ్ చేసి ఇచ్చాం. – హలీం అక్తర్ సిద్ధిఖీ, దక్కన్ పెన్‌స్టోర్ యజమాని -
దక్కన్ చరిత్రలో నగరానిది ప్రత్యేకస్థానం
హైదరాబాద్: దక్కన్ చరిత్ర ఎంతో ఘనమైందని, దక్షిణ భారత్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో జరిగిన 39వ సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్‌ను నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా 5,700 నగరాల్లో సర్వే చేయించగా మన రాజధాని నగరానికి 3వ స్థానం లభించడం గర్వకారణమన్నారు. మధ్యయుగాల నుంచి నేటి వరకు నగరంలో కొనసాగుతున్న రక్షణ చర్యలను సీపీ వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ ఆది నుంచి అగ్రభాగాన నిలిచిందనేందుకు 1847లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడమే నిదర్శనమన్నారు. ఓయూలో 32 సంవత్సరాల తర్వాత జరుగుతున్న హిస్టరీ కాంగ్రెస్‌లో చరిత్ర విభాగం హెడ్, ఎస్‌ఐహెచ్‌సీ లోకల్ కార్యదర్శి ప్రొఫెసర్ అర్జున్‌రావు స్వాగతోపన్యాసం చేశారు. ఓయూ చరిత్ర విభాగానికి వందేళ్లు పురస్కరించుకుని సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, గోవా, పాండిచ్చేరి తదితర దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే హిస్టరీ కాంగ్రెస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్రతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలన సంస్కరణలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం తదితర అంశాలపై సమగ్ర చర్చలు, పరిశోధనాపత్రాలను ప్రతినిధులు సమర్పించనున్నట్లు చెప్పారు. అతిథులు ఎస్‌ఐహెచ్‌సీ–2018 ప్రొసీడింగ్స్‌ను ఆవిష్కరించారు. దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 600 మంది పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొ.సోమసుందర్రావు మాట్లాడుతూ దక్షిణభారత దేశ చరిత్రలో భావితరాలకు ఉపయోగపడేలా యూనివర్సిటీల నుంచి మరిన్ని పరిశోధనలు రావాలన్నారు. వైస్ చాన్స్‌లర్ ప్రొ.రామచంద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొ.ఇందిర, డాక్టర్ అంజయ్య, డాక్టర్ లావణ్య, డాక్టర్ అరుణ, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.రవీందర్, ప్రొ.నాయుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకులకు లగ్జరీ రైలు సేవలు
సాక్షి, ముంబై: వివిధ ప్యాకేజీలతో కూడుకొని ఉన్న డెక్కన్ ఒడిస్సీ లగ్జరీ ట్రైన్ రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలను సంచరించనుంది. ముంబై, నాసిక్, సిందుదుర్గ్, తర్కర్లి, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోర, కొల్హాపూర్‌తోపాటు సమీప రాష్ట్రమైన గోవాలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. మరో ప్యాకేజీలో దేశంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేయనుంది. ఇందులో న్యూఢిల్లీ, ఆగ్రా, రాజస్తాన్, ఉదయ్‌పూర్, జైయ్‌పూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వడోదర, సాసన్ గిర్, భావ్‌నగర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, కర్నాటక రాష్ట్రంలోని బాదామి, బిజాపూర్, ఐహోలే, పట్టాడ్‌కల్ తదితర ప్రాంతలను తిరుగుతుంది. ఈ డెక్కన్ ఒడిస్సీ.. ప్యాలెస్ ఆన్ వీల్స్ వల్ల ప్రేరణ పొందింది. దీనిని టూరిజం ప్రచారం నిమిత్తం రాజస్తాన్ వారు ఏర్పాటు చేశారు. దీనిని 2004లో మొట్టమొదట ఐఆర్సీటీసీ వారు ప్రారంభించారు. దీనికి అనుకుంతమేర స్పందన లభించలేదు. తర్వాత ఎంటీడీసీ దీనిని ఏర్పాటు చేసింది. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రస్తుతం దీన్ని తీర్చిదిద్దారు. బుకింగ్ చేసుకోవాలంటే.. ఈ మొత్తం టూర్‌ను నిర్వహించేందుకు ఎంటీడీసీ ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైలు కోసం బుకింగ్ చేసుకోవాలంటే ఆన్లైన్ లేదా ఏజెంట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలు రూ.64,700 నుంచి ప్రారంభమవుతాయని సంబంధిత అధికారి వెల్లడించారు. అక్టోబర్‌లో ప్రారంభం ఒడిస్సీ లగ్జరీ రైలు అక్టోబర్‌లో ప్రారంభంకానుందని మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) అధికారి తెలిపారు. ఈ రైలులోని ఇంటీరియర్‌లో మార్పులు చేర్పులు చేశామన్నారు. మెనూని నవీకరించామని, దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలను పరిచయం చేస్తున్నామన్నారు. వీటికి తగ్గట్టుగా చార్జీలను ఉంటాయని పేర్కొన్నారు. పూర్తిగా ఏసీ విస్తరించిన ఈ రైలులో 10 బోగీల్లో 40 సూట్స్ ఉన్నాయనీ మరో రెండు బోగీల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు రెస్టారెంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బార్ కార్, ఓ బోగీలో సమావేశ హాలు, ఇంటర్నెట్ వెసులుబాటు, ఐఎస్డీ, ఎస్టీడీ లైన్లు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇంకా వ్యాయామ శాల ఉన్న బోగీ, స్టీమ్ బ్యూటీ పార్లర్, ఎల్సీడీ ప్లాస్మా టీవీలు అమర్చినట్లు చెప్పారు. ఈ రైలులో దిన పత్రికను రోజూ చదవవచ్చు. వికలాంగులకు ప్రత్యేక సేవకులను అందజేయనున్నట్లు చెప్పారు.