సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది.
శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్‌చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment