sri nidhi
-
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
మూడేళ్లకే సంగీతంలో రికార్డు సాధించా
తల్లిదండ్రుల నుంచే సంగీత ఓనమాలు దిద్దారు. మూడేళ్ల వయస్సులోనే సంగీత స్వరాలు గుర్తించడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధిం చారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినీ గాయనిగా బిజీగా ఉన్నారు. ఆమే మన తెలుగు గాయని శ్రీనిధి. భీమవరంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు.ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా.. సాక్షి : ఏమి చదవుకున్నారు,మీ స్వస్థలం ఎక్కడ? శ్రీనిధి :మాది అనంతపురం. నేను ఇంజినీరింగ్ హైదరాబాద్జేఎన్టీయూలో చేశాను. సంగీతంలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాను. పీహెచ్డీ కూడా చేస్తున్నాను. మా తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యచార్యులు, తల్లి శారద సంగీత కళాకారులు. వారి నుంచి సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాను. నా గురువు నేదులూరి కృష్ణమూర్తి వద్ద శిక్షణ తీసుకున్నాను. సాక్షి : సింగర్‌గా మీ ప్రయాణం? శ్రీనిధి : నేను 3 ఏళ్ల వయస్సు నుంచే సంగీతంపై ఆకర్షించడబడ్డాను. ఆ తర్వాత ఈటీవీ పాడుతా తీయగా, మా టీవిలో పాడాలని ఉంది పాటల పోటీల కార్యక్రమాల్లో పాల్గొని విజేతగా నిలిచాను. సాక్షి : మీకు మొదటి అవకాశం ఎవరు ఇచ్చారు? శ్రీనిధి : వందేమాతరం శ్రీనివాస్ గ్రీటింగ్ సినిమాకు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. సాక్షి : ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు.. గుర్తింపు వచ్చిన పాట? శ్రీనిధి :నేను ఇప్పటి వరకు సుమారు 100 పాటల వరకు పాడాను. తెలుగు అమ్మాయి, ఎన్టీఆర్ కథానాయకుడు, బాహుబలి తదితర సినిమాల్లో పాడే అవకాశం దక్కింది. బాహుబలి సినిమాలో నిదరించరా కన్నా పాట గుర్తింపు తెచ్చింది. తెలుగు, తమిళం, కన్నడలో కూడా పాటలు పాడాను. సాక్షి : ఇప్పుడు ఏ సినిమాలకు పాడుతున్నారు? శ్రీనిధి :ప్రస్తుతం మూడు కొత్త సినిమాలకు పాటలు పాడుతున్నాను. అందులో ఎన్టీఆర్ మహానాయకుడులో మూడు పాటలు పాడుతున్నాను. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నాను. అలాగే అన్నమయ్యకు పట్టాభిషేకం పాటలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాను. సాక్షి : తోటి గాయకులతో పోటీ ఉంటుందా? శ్రీనిధి :అదృష్టం ఏమిటి అంటే మన తెలుగు సినిమాల పాటల విషయానికి వస్తే తోటి గాయకులతో ఎటువంటి పోటి ఉండదు. అందరం చాలా స్నేహంగా ఉంటాం. నేను ఎవరితోను పోటి పడను. నాకు ఇష్టం అయితే పాడతాను. సాక్షి : భీమవరం రావడం, త్యాగరాజఉత్సవాల్లో సంగీత కచేరి చేయడంఎలా అనిపించింది? శ్రీనిధి : భీమవరం చాలా బాగుంది.ఇక్కడ అందరూ చాలా ఆప్యాయంగా ఉంటారు. ఇక్కడ వాతవారణం నాకు బాగా నచ్చింది. త్యాగరాజ స్వామి ఉత్సవాల్లో పాల్గొని సంగీత కచేరి చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేసి వందేళ్ల పాటు త్యాగరాజ స్వామిని ఆరాధించడం చాలా గొప్ప విషయం. త్యాగరాజు శత వార్షికోత్సవాల్లో పాల్గొంటున్నాను అని తోటి సింగర్స్‌కు చెప్పగా చాలా గొప్ప అవకాశం వచ్చిందని అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. -
మహిళా.. భవిత నీదే!
ఇది దివంగత నేత వైఎస్ ఆశయం.. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి దాకా మైక్రో రుణాల పేరుతో స్త్రీలు పడుతున్న అగచాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారు. వారి స్వయం సమృద్ధికోసం పావల వడ్డీకే రుణాలు అనే సరికొత్త పథకానికి 2004 సెప్టెంబర్‌లో రూపక ల్పన చేశారు. ఆయన హయాంలో ఎంతో మంది అభ్యున్నతి సాధించారు. కానీ వైఎస్ అకాల మరణం తర్వాత పొదుపు గ్రూపుల సభ్యులపై బ్యాంకర్ల వేధింపులెక్కువయ్యాయి. పాలకుల చిన్నచూపు మహిళలను అప్పుల్లోకి నెట్టింది. ‘అక్కల్లారా.. చెల్లెళ్లారా.. ఇక మీ కష్టాలు ఎంతో కాలం ఉండవు.. రుణాలు తీసుకున్న నేరానికి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న రుణాలన్నీ నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తా.. మీ కన్నీటిని తుడుస్తా’.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంగా తన నాలుగో సంతకాన్ని ఇదే ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు. 55,541 జిల్లాలోని పొదుపు గ్రూపులు జిల్లాలో ఐకేపీ, మెప్నా ఆధ్వర్యంలో స్వయం సహాయ గ్రూపులు పని చేస్తున్నాయి. ఐకేపీ గ్రామీణ ప్రాంతాల్లో 47150 గ్రూపులతో పనిచేస్తుండగా.. మెప్నా పట్టణ ప్రాంతాల్లో 8391గ్రూపులు కలిగి ఉంది. ఒక్క ఐకేపీలోనే గ్రూపునకు 9 నుంచి 11 మంది చొప్పున 4,80,000 మంది స్వయం సభ్యులు లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే మెప్నాలో కూడా సుమారు 20 వేల మంది సభ్యులుంటారు. ఒక్కో గ్రూపునకు రూ50 వేల నుంచి రూ5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు లభిస్తాయి. రూ.622 కోట్లు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లోని 47,150 గ్రూపులు ప్రస్తుతం రూ622 కోట్ల మేర బ్యాంకు లింకే జీ రుణాలు పొంది ఉన్నాయి. రూ.92.96 కోట్లు స్త్రీనిధి అనే పథకం మరోటి ఉంది.. దీని ద్వారా గ్రూపు సభ్యుల వ్యక్తిగత అవసరాలకు రుణాలు అందిస్తారు. అంటే వారి కుటుంబ సభ్యుల చదువు, వివాహం, ఆరోగ్యం మొదలైన వాటి కోసం. అయితే వీటిని 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ, మెప్నా సభ్యులు ఇప్పటికి రూ 92.96 కోట్లు తీసుకున్నారు. రూ.70 కోట్లు మెప్నా ఆధ్వర్యంలో పట్టణాలల్లోని మురికి వాడల్లో పని చేస్తున్న దాదాపు 8391 గ్రూపులు ప్రస్తుతానికి బ్యాంకుల నుంచి రూ70 కోట్ల రుణాలు తీసుకున్నాయి. రూ.785.46 కోట్లు సుమారు 5 లక్షల గ్రూపులకు జగన్ మాఫీ చేయనున్న రుణం గ్రూపు వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఆయా సంఘాలు రూ785.46 కోట్లు బ్యాంకర్లకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రద్దు చేయనున్నారు. దీనివల్ల సుమారు 5 లక్షల మంది మహిళలు తమ రుణాల నుంచి విముక్తి పొందనున్నారు. రూ.15.50 కోట్లు పాలప్రగతి కేంద్రాలు, జీవప్రగతి కేంద్రాలు, నిరుపేదల వ్యూహం పథకాల కింది ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ గ్రూపులకు రూ15.50 కోట్లు చెల్లించారు.