మహిళా.. భవిత నీదే! | Women....your future! | Sakshi
Sakshi News home page

మహిళా.. భవిత నీదే!

May 3 2014 2:31 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఇది దివంగత నేత వైఎస్ ఆశయం.. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి దాకా మైక్రో రుణాల పేరుతో స్త్రీలు పడుతున్న అగచాట్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నారు.

 ఇది దివంగత నేత వైఎస్ ఆశయం.. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి దాకా మైక్రో రుణాల పేరుతో స్త్రీలు పడుతున్న అగచాట్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నారు. వారి స్వయం సమృద్ధికోసం పావల వడ్డీకే రుణాలు అనే సరికొత్త పథకానికి 2004 సెప్టెంబర్‌లో రూపక ల్పన చేశారు. ఆయన హయాంలో ఎంతో మంది అభ్యున్నతి సాధించారు. కానీ వైఎస్ అకాల మరణం తర్వాత పొదుపు గ్రూపుల సభ్యులపై బ్యాంకర్ల వేధింపులెక్కువయ్యాయి. పాలకుల చిన్నచూపు మహిళలను అప్పుల్లోకి నెట్టింది.

 ‘అక్కల్లారా.. చెల్లెళ్లారా.. ఇక మీ కష్టాలు ఎంతో కాలం ఉండవు.. రుణాలు తీసుకున్న
 నేరానికి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న రుణాలన్నీ నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తా.. మీ కన్నీటిని తుడుస్తా’.. అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంగా తన నాలుగో సంతకాన్ని ఇదే ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు.
 
 55,541  జిల్లాలోని పొదుపు గ్రూపులు
జిల్లాలో ఐకేపీ, మెప్నా ఆధ్వర్యంలో స్వయం సహాయ గ్రూపులు పని చేస్తున్నాయి. ఐకేపీ గ్రామీణ ప్రాంతాల్లో 47150 గ్రూపులతో పనిచేస్తుండగా.. మెప్నా పట్టణ ప్రాంతాల్లో 8391గ్రూపులు కలిగి ఉంది.

ఒక్క ఐకేపీలోనే గ్రూపునకు 9 నుంచి 11 మంది చొప్పున 4,80,000 మంది స్వయం సభ్యులు లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే మెప్నాలో కూడా సుమారు 20 వేల మంది సభ్యులుంటారు.

ఒక్కో గ్రూపునకు రూ50 వేల నుంచి రూ5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు లభిస్తాయి.
 
 రూ.622  కోట్లు  
 ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లోని 47,150 గ్రూపులు ప్రస్తుతం రూ622 కోట్ల మేర బ్యాంకు లింకే జీ రుణాలు పొంది ఉన్నాయి.  
 
 రూ.92.96  కోట్లు  
 స్త్రీనిధి అనే పథకం మరోటి ఉంది.. దీని ద్వారా గ్రూపు సభ్యుల వ్యక్తిగత అవసరాలకు రుణాలు అందిస్తారు. అంటే వారి కుటుంబ సభ్యుల చదువు, వివాహం, ఆరోగ్యం మొదలైన వాటి కోసం. అయితే వీటిని 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ, మెప్నా సభ్యులు ఇప్పటికి రూ 92.96 కోట్లు తీసుకున్నారు.
 
 రూ.70  కోట్లు  
 మెప్నా ఆధ్వర్యంలో పట్టణాలల్లోని మురికి వాడల్లో పని చేస్తున్న దాదాపు 8391 గ్రూపులు ప్రస్తుతానికి బ్యాంకుల నుంచి రూ70 కోట్ల రుణాలు తీసుకున్నాయి.
 
 రూ.785.46 కోట్లు  సుమారు 5 లక్షల గ్రూపులకు జగన్ మాఫీ చేయనున్న రుణం
 గ్రూపు వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి  ఇప్పటి వరకు జిల్లాలో ఆయా సంఘాలు రూ785.46 కోట్లు బ్యాంకర్లకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రద్దు చేయనున్నారు. దీనివల్ల సుమారు 5 లక్షల మంది మహిళలు తమ రుణాల నుంచి విముక్తి పొందనున్నారు.

 రూ.15.50 కోట్లు  
 పాలప్రగతి కేంద్రాలు, జీవప్రగతి కేంద్రాలు, నిరుపేదల వ్యూహం పథకాల కింది ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ గ్రూపులకు రూ15.50 కోట్లు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement