Savings groups
-
మనం.. ‘పొదుపు’లో ఘనం
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు,, క్రెడిట్ లింకేజి విషయంలోనూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వాటి పనితీరుపై 2023–24 వార్షిక నివేదికను శనివారం నాబార్డు విడుదల చేసింది. దేశంలోని ఈ సంఘాల పొదుపు ఆంధ్ర ప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగేళ్లు కూడా ఏపీనే అగ్రగామిగా నిలిచింది. స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, సున్నా వడ్డీ వంటి ప్రోత్సాహకాలతోనే ఇలా ఉత్తమ పనితీరు కనబరిచినట్లు నివేదిక స్పష్టంచేసింది. – సాక్షి, అమరావతి నిజానికి.. గతంలో చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలను వైఎస్ జగన్ సర్కారు గత ఐదేళ్లుగా గాడిన పెట్టడమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచే స్థాయికి తీసుకెళ్లింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2023–24 మార్చి నాటికి) రూ.65,089.15 కోట్లు అయితే.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల పొదుపు రూ.29,409.06 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని సంఘాల పొదుపు దేశంలోనే అత్యధికంగా రూ.17,292.16 కోట్లుగా ఉందని నివేదక వెల్లడించింది. అంటే దేశంలో మన రాష్ట్ర వాటా 26.56 శాతంగా ఉంది. సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం.. 2023–24లో దేశంలోని మహిళా సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నాబార్డు నివేదిక స్పష్టంచేసింది. ఇక్కడ ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.1,57,321లుగా ఉంది. బ్యాంకులు కూడా ఏపీ పొదుపు సంఘాలకే అత్యధికంగా రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2023–24లో బ్యాంకుల రుణాల పంపిణీలో రూ.59,777 కోట్లతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక రూ.25,253 కోట్లతో రెండో స్థానంలో, తెలంగాణ రూ.20,932 కోట్లతో మూడో స్థానంలో.. పశ్చిమ బెంగాల్ రూ.20,671 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఒక్కో పొదుపు సంఘం సగటు రుణ పంపిణీలోకూడా ఏపీ రూ.8.8 లక్షలతో అగ్రస్థానంలో ఉందని, ఆ తరువాత కేరళ రూ.7.7 లక్షలు, తమిళనాడు రూ.6.7 లక్షలతో ఉన్నాయి. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం ఇదిలా ఉంటే.. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నావడ్డీ (వడ్డీలేని రుణాలు) రుణాలను అమలుచేసిందని కూడా నివేదిక పేర్కొంది. ఫలితంగా.. పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాక గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని తెలిపింది. అంతేకాక.. 2014లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసంచేయడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా సంఘాల నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇవి గణనీయంగా తగ్గాయి. 2014–19 మ«ద్య బాబు హయాంలో 5.86 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు 2023–24 నాటికి అవి 0.31 శాతమేనని నివేదిక తెలిపింది.మన ‘పరపతి’ కూడా పెరిగింది.. ఇక 2014–2019 మధ్య చంద్రబాబు చేసిన దగాకు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల పరపతి పూర్తిగా దిగజారిపోయింది. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన రుణమాఫీ మాటలు నమ్మి వీరు నిలువునా మోసపోయారు. ఆయన అధికారం చేపట్టగానే ప్లేటు ఫిరాయించి రుణమాఫీ చేయబోనని అడ్డం తిరగడంతో పొదుపు సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనుకాడాయి. దీంతో.. సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. మరోవైపు.. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల తేదీ నాటికి ఉన్న అప్పులు రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో సంఘాలకు చెల్లించారు. అంతేకాక.. బాబు ఎగ్గొట్టిన సున్నావడ్డీని జగన్ సర్కారు పునరుద్ధరించి దీనికింద రూ.4,969.04 కోట్లను పొదుపు అక్క చెల్లెమ్మలకు చెల్లించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి అమాంతం పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరగడంతో ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా మనవి నిలిచాయి. బాబు హయాంలో (2014–19) పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉంటే ఇప్పుడు 89 శాతంగా ఉంది. దీంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉన్నాయి. -
‘ఆసరా’తో అగ్రపథం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పొదుపు సంఘాలు ఆదాయపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలోని సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం అత్యధికంగా ఉందని, 2019 నుంచి 2024 నాటికి వారి రోజువారీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. పొదుపు సంఘాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక సగటు ఆదాయం కలిగిన 20 జిల్లాల్లో 15 గ్రామీణ జిల్లాలే కాగా ఇందులో తొమ్మిది జిల్లాలు ఏపీలోనే ఉండటం గమనార్హం. డిజిటల్ లావాదేవీల్లోనూ ఆంధ్రప్రదేశ్ మహిళా పొదుపు సంఘాలు ముందు వరుసలో నిలిచాయి. పొదుపు సంఘాల సభ్యులు సాధికారతతో లక్షాధికారులుగా అవతరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. ఇటీవల వారి ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యుల క్రెడిట్ ఆదాయాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పొదుపు మహిళలను ప్రోత్సహిస్తూ అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలు, బ్యాంకు రుణాలతో తోడ్పాటు, మల్టీ నేషనల్ కంపెనీలతో అనుసంధానం లాంటివి సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టమవుతోంది. తద్వారా ఎన్పీఏల రేటు గణనీయంగా తగ్గిపోయి రికవరీ బాగుండటంతో పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సకాలంలో చెల్లింపులు కారణంగా వారి రుణ పరపతి సైతం పెరిగింది. గత సర్కారు హయాంలో ఏపీలో పొదుపు సంఘాల ఎన్పీఏలు ఏకంగా 18.36 శాతం ఉండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా ఆదుకుని జీవం పోయడంతో ఇప్పుడు ఎన్పీఏలు గణనీయంగా 0.17 శాతానికి తగ్గిపోయాయి. ♦ ఆంధ్రప్రదేశ్ తరువాత అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యుల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. మరో ఏడాదిలోగా హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేం‘ద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులై గేమ్ ఛేంజర్‌గా నిలుస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులుగా అవతరించడమే కాకుండా వారి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సంపదను సృష్టించి పునఃపంపిణీ చేస్తున్నారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని 72.7 శాతం మహిళా పొదుపు సంఘాల లావాదేవీలు ఇప్పుడు మెట్రో ప్రాంతాలకు, బయట జిల్లాలకు విస్తరించాయి. 20 కి.మీ. నుంచి 2,000 కి.మీ. పరిధిలో రాష్ట్రం లోపల, బయట కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా 65 శాతం మంది ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 30.5 శాతం గ్రామీణ ఏటీఎం లావాదేవీలు పట్టణాలు, మెట్రో ప్రాంతాలు, ఆయా జిల్లాల వెలుపల జరుగుతున్నాయి. ♦ పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులు వారి సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి వ్యయం చేయడం పెరిగిన వారి కొనుగోలు శక్తిని సూచిస్తోంది. ♦ విజయనగరం జిల్లాకు చెందిన పొదుపు సంఘాల సభ్యులు 68 కి.మీ. ప్రయాణించి విశాఖలో వ్యయం చేయగా శ్రీకాకుళం జిల్లా సంఘాల సభ్యులు 1,115 కి.మీ. ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో వ్యయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 1,647 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో వ్యయం చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 2,074 కి.మీ.ప్రయాణించి ఢిల్లీలో వ్యయం చేశారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వ్యాపారాల నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించి ఉంటారని పేర్కొంది. -
పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పునరుజ్జీవ, మహిళా సాధికారత ద్వారా పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుజరాత్ ఉన్నతాధికారుల బృందం ప్రశంసించింది. పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ కార్యక్రమాలను పరిశీలించి గుజరాత్లో అమలు చేసేందుకు వచ్చిన అధికారుల బృందం రెండు రోజులు ఏపీలో పర్యటించింది. ఐఏఎస్ అధికారి పుష్పలత ఆధ్వర్యంలో గుజరాత్ జీవనోపాదుల ప్రమోషన్ కంపెనీ (జీఎల్పీసీ) ప్రతినిధుల బృందం విజయవాడలో సెర్ప్, ఎస్బీఐ, కెనరా బ్యాంకు అధికారులతో సమావేశమై పొదుపు సంఘాలకు రుణాలు మంజూరు, సభ్యులు వినియోగించుకుంటున్న తీరు, రుణాలు సకాలంలో చెల్లింపులు తదితర అంశాలపై వివరాలను తెలుసుకుంది. పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని బ్యాంకర్ల సమావేశంలో ప్రస్తావించడం, ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు, జగనన్న మహిళా మార్టుల ఏర్పాటుతో వ్యాపారాల్లో మహిళలు రాణించేలా ప్రోత్సహించడం తదితర అంశాలను అధికారులు బృందానికి వివరించారు. గుజరాత్ అధికారుల బృందం బుధవారం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో పర్యటించి స్థానిక పొదుపు సంఘాల మహిళలను కలుసుకుంది. పొదుపు సంఘాల ద్వారా మహిళలు తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్న తీరును అడిగి తెలుసుకుంది. శాశ్వత ఆదాయాలను పొందేలా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలిచి శాశ్వత స్థిర ఆదాయాలను సమకూర్చుకునేలా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పథకాల ద్వారా మహిళలకు అందజేసే మొత్తాలను జీవనోపాధులలో పెట్టుబడులుగా పెట్టుకొనేలా అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు హిందూస్తాన్ లీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, ఐటీసీ, రిలయెన్స్ అజియో తదితర సంస్థలతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలతో అదనంగా తోడ్పాటు అందించే ప్రక్రియ కూడా చేపట్టింది. వ్యాపారాల్లో విజయ పతాకం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గత మూడేళ్లలో ఏకంగా 16 లక్షల మంది పేద మహిళలు వివిధ రకాల వ్యాపారాలు, ఇతర శాశ్వత జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని ఇప్పటికే ప్రతి నెలా స్ధిరమైన ఆదాయం పొందుతున్నారు. మహిళా మార్టులు లాంటివి నెలకొల్పి విజయవంతంగా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడ ప్రభుత్వం చేపట్టింది. గత ఆర్నెళ్లలో కొత్తగా 13 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలుగా సత్తా చాటారు. మన పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న అప్పుల్లో 99.67 శాతం సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్్ఫ) ద్వారా ఏపీ అమలు చేస్తున్న ఈ తరహా జీవనోపాదులు, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను గుజరాత్ అధికారుల బృందం ప్రత్యేకంగా పరిశీలించింది. నాలుగున్నరేళ్లలో కీలక మార్పులు.. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం మహిళలను మోసగించడంతో పొదుపు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయి ఎన్పీఏలుగా మారిపోయాయి. నాలుగో వంతుకు పైగా సంఘాలు బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులుగా మిగిలాయి. దీంతో అంతకు ముందు ఏ గ్రేడ్‌లో ఉన్న పొదుపు సంఘాలు అత్యధికం సీ, డీ గ్రేడ్‌లోకి వెళ్లాయి. గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదన్న విషయాన్ని నాటి మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాట ప్రకారం 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా ఆయా మహిళలకు చెల్లించేలా వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేయడంతోపాటు చంద్రబాబు సర్కారు మంగళం పాడిన సున్నా వడ్డీని పునరుద్ధరించడంతో పొదుపు సంఘాలు కోలుకున్నాయి. గత నాలుగున్నరేళ్లుగా పొదుపు సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడం, సకాలంలో సున్నా వడ్డీ చెల్లింపులతో రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థ బలం పుంజుకుంది. మహిళా మార్టు సందర్శన మద్దిపాడు/సింగరాయకొండ: ఏపీలో పొదుపు సంఘాల పనితీరు బాగుందని గుజరాత్ అధికారుల బృందం అభినందించింది. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, ఇనమనమెళ్లూరు, సింగరాయకొండలో బృందం బుధవారం పర్యటించింది. మద్దిపాడులోని జగనన్న చేయూత మహిళా మార్ట్, ఇనమనమెళ్లూరులో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన తేనె పరిశ్రమ, సింగరాయకొండ మండలం కనుమళ్ల పంచాయతీలో బాతు హేచరీలను పరిశీలించిన బృందం సభ్యులు పొదుపు సంఘాల మహిళలను ప్రశంసించారు. ఇనమనమెళ్లూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. గ్రామ సచివాలయంలో జాబ్‌చార్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొదుపు సంఘాల పనితీరు అద్భుతంగా ఉందని, ఇలాంటి విధానాలు గుజరాత్లో అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పుష్పలత తెలిపారు. -
పొదుపు మహిళే బ్యాంకర్! సంఘాలే బ్యాంకులు
పేదింటి మహిళలు పది మంది చొప్పున కలిసి స్వయం సహాయక పొదుపు సంఘాలుగా ఏర్పడటం మననందరికీ తెలుసు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వ్యాపార, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడమూ తెలిసిందే. అయితే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంఘాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. ప్రతి నెలా పోగేసుకున్న సొమ్ముతో స్వయంగా రుణాలిచ్చే దశకు ఎదిగాయి. తద్వారా అంతర్గత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తోంది. ఇంత వేగంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో 18–19 ఏళ్ల క్రితం తొమ్మిది మంది మహిళలతో రాజరాజేశ్వరి స్వయం సహాయక పొదుపు సంఘం ఏర్పాటైంది. మొదట్లో ఒక్కొక్కరు నెలకు రూ.50 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి నెలా రూ.500 చొప్పున దాచుకుంటున్నారు. ఇలా జమ చేసుకున్న సొమ్ము రూ.ఆరున్నర లక్షలకు చేరుకుంది. ఈ డబ్బులను అవసరమైన వారికి నామమాత్రపు వడ్డీకి అప్పుగా ఇవ్వాలని ఈ సంఘం సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సంఘంలో సభ్యులైన నలుగురు మహిళలు ఆరు నెలల క్రితం రూపాయిలోపు వడ్డీతో రూ.ఆరు లక్షలు రుణంగా తీసుకున్నారు. అప్పటి వరకు ఈ సొమ్ము పావలా వడ్డీ కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాకే పరిమితమై ఉండింది. ఈ సంఘం నిర్ణయం వల్ల ఇప్పుడు రూపాయి లోపు వడ్డీ వస్తోంది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం తిరిగి సంఘ నిధికే జమ అవుతుంది. సంఘం ఉమ్మడి నిధిలో జమ అయ్యే ఈ సొమ్ములో సభ్యులందరికీ వాటా ఉండటం వల్ల అప్పు తీసుకున్న సభ్యులకు మరింత ఉపశమనం కలుగుతోంది. ఈ విధానం వల్ల అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంఘం లీడర్ సీహెచ్ లక్ష్మీకాంతం తెలిపారు. పి.అరుణ అనే సంఘ సభ్యురాలికి ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి సైతం ఆర్థిక సహాయం మంజూరు చేయగా, అనుకున్న విధంగా ఇల్లు అందంగా కట్టుకునేందుకు అదనంగా రూ.1.65 లక్షలు సంఘమే ఆమెకు అప్పుగా ఇచ్చిందని చెప్పారు. ఇంకొక సభ్యురాలికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.65 లక్షలు, మరొకరికి కొత్త వ్యాపార దుకాణం ఏర్పాటుకు రూ.రెండు లక్షలు, ఇంకొకరికి కుటుంబ అవసరాల కోసం రూ.70 వేల రుణం అందజేశామని ఆమె వివరించారు. సంఘ సభ్యులలో ఎవ్వరికీ డబ్బులు అవసరం లేని పక్షంలో తమ చుట్టపక్కల ఉండే తెలిసిన వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇదే గ్రామంలోని కల్యాణ స్వయం సహాయక సంఘం సైతం ఇదే రీతిలో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఈ సంఘం వద్ద రూ.ఏడు లక్షల పొదుపు నిధి ఉండగా.. ఐదు నెలల క్రితం ఇద్దరికి, ఈ నెలలో మరో ఇద్దరు తమ సంఘ సభ్యులకే మొత్తం రూ.నాలుగు లక్షలు రుణంగా ఇచ్చామని సంఘం లీడర్ పద్మావతి తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పొదుపు సంఘాలు మినీ బ్యాంకుల తరహాలో లావాదేవీలు సాగిస్తుండటం విశేషం. అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పేదింటి మహిళల్లో ఆర్థిక భద్రత తొణికిసలాడుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న పొదుపు సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.రెండు మూడు లక్షల చొప్పున అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఒకపక్క ఈ సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరోపక్క వేరుగా పెద్ద మొత్తంలో అంతర్గత రుణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహంతో ఏడాదిన్నరగా అంతర్గతంగా మినీ బ్యాంకుల తరహా రుణ లావాదేవీలు సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామమని ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8,45,374 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉండగా.. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 4.39 లక్షల సంఘాలు తమ సంఘ పొదుపు నిధి నుంచి రూ.866 కోట్లు అంతర్గతంగా రుణాలు ఇచ్చాయి. ఆగస్టులో 1,55,778 పొదుపు సంఘాలు రూ.297 కోట్లు, సెప్టెంబర్‌లో 1,21,672 సంఘాలు రూ.204 కోట్లు, అక్టోబర్‌లో 1,62,259 సంఘాలు రూ.365 కోట్లు రుణంగా ఇచ్చాయి. 3 నెలల్లో రూ.1,241 కోట్లు వసూలు మరోవైపు.. స్వయం సహాయక పొదుపు సంఘాలు అంతర్గత రుణాల రూపంలో ఇచ్చే రుణాలను నెల వారీ కిస్తీ రూపంలో లేదా ఒకే విడత చెల్లింపునకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు గతంలో అంతర్గత రుణాల రూపంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి గత మూడు నెలల్లో ఏకంగా రూ.1,241 కోట్లు (అసలు, వడ్డీ కలిపి) జమ కావడం గమనార్హం. గతంలో సంఘం నుంచి అంతర్గత రుణాలు పొందిన మహిళలు ఆగస్టులో రూ.493 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.386 కోట్లు, అక్టోబర్‌లో రూ.362 కోట్లు చెల్లించారు. మొత్తంగా గత మూడు నెలల్లో బ్యాంకులకు ఏ మాత్రం సంబంధం లేకుండా పేద మహిళలు ఏర్పాటు చేసుకున్న ఆయా పొదుపు సంఘాలలో ఏకంగా రూ.2,107 కోట్ల మేర అంతర్గత రుణ లావాదేవీలు కొనసాగడం ఈ వ్యవస్థలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామం. ఇది మరిన్ని సంస్కరణలకు నాంది అని అధికారులు పేర్కొంటున్నారు. రూ.11,291 కోట్లకు పైగా పొదుపు నిధి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.45 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల పేరిట పొదుపు నిధి రూపంలో ఏకంగా రూ. 11,291 కోట్ల మేర డబ్బులు ఉన్నాయి. ఇప్పటిదాకా పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణ మొత్తంలో నాలుగో వంతుకు పైబడి ఆయా సంఘాల పొదుపు డబ్బులు కేవలం ఆయా సంఘాల సేవింగ్ ఖాతాలలో నిరుపయోగంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు సగటున ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.200 చొప్పున దాచుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఈ మొత్తం ప్రతి నెలా రూ. 110 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఉంటోంది. అక్టోబర్‌లో రూ.126 కోట్లు ఇలా పొదుపు చేశారు. ఇలా దాచుకున్న డబ్బులు కేవలం పావలా వడ్డీ చొప్పున కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఇలా ఉండిపోయిన రూ. 11,291 కోట్ల మొత్తాన్ని రూపాయి దాకా వడ్డీ వచ్చేలా అంతర్గత రుణాలు రూపంలో వినియోగించుకునేలా ప్రభుత్వం మహిళలను ప్రొత్సహిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల్లో కీలక అంశమైన దీనిపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మహిళలు ప్రతి నెలా పొదుపు రూపంలో దాచుకునే డబ్బులతో అంతర్గత రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇవ్వడం వల్ల మొత్తం సంఘాల పొదుపు నిధి భారీగా పెరుగుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయా సంఘాల్లోని మహిళలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆదుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంఘాల్లోని సభ్యులు అవసరమైన మేర రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. పొదుపు నిధిలో 80–90 శాతం వినియోగం పొదుపు సంఘాల మహిళలు నెలనెలా దాచుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో ఉంచుకొని కూడా అవసరాలకు అదే బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ల అవసరాలకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని ఎస్ఎల్బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు సూచించారు. ఉదాహరణకు ఒక పొదుపు సంఘం పేరిట రూ.రెండు లక్షల దాకా పొదుపు నిధి ఉండీ కూడా.. ఆ సంఘ సభ్యులు రూ.పది లక్షలు అవసరం ఉంటే రూ.పది లక్షలు అప్పుగా తీసుకునే బదులు, తమ పొదుపు డబ్బుల్లో రూ.లక్షన్నర వినియోగించుకొని, మిగిలిన రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకోవచ్చు. తద్వారా ఆ మహిళలందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పొదుపు సంఘాల మహిళలు తాము పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులతో మొదట అంతర్గతంగా రుణాలు తీసుకుంటే, మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేలా సెర్ప్ ద్వారా మహిళలను ప్రొత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం. పొదుపు సంఘాల పేరిట ఉండే మొత్తం పొదుపు నిధి రూ.11,291 కోట్లలో 80–90 శాతం నిధులను సంఘాల అంతర్గత రుణ వ్యవస్థలో వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంపై నిరంతరం జిల్లాలతో సమీక్షిస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
మన మహిళ పొదుపులో అగ్రగామి
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా నాలుగేళ్లుగా అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. మన స్వయం సహాయక సంఘాలు పొదుపు విషయంలో, క్రెడిట్ లింకేజీలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, పొదుపు సంఘాల పనితీరుపై నాబార్డు 2022 – 23 వార్షిక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు నమోదైందని, ఈ విషయంలో రాష్ట్ర పొదుపు సంఘాలు అగ్రగామిగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు కూడా ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గాడిన పడ్డ సంఘాలు చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో గత నాలుగేళ్లుగా ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2022 – 23 మార్చి నాటికి) రూ.58,892.68 కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా పొదుపు సంఘాల పొదుపు రూ.28,968.44 కోట్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు రూ.18,606.18 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో అన్ని రాష్ట్రాల సంఘాల పొదుపులో ఏపీ స్వయం సహాయక సంఘాల పొదుపే 31 శాతం కావడం విశేషం. 2021–22తో పోలిస్తే 2022–23లో ఏపీ పొదుపు సంఘాల పొదుపు రూ.6,938 కోట్లు పెరగడం గమనార్హం. 2021–22 నాటికి రాష్ట్ర పొదుపు సంఘాల పొదుపు రూ.11,668 కోట్లు కాగా ఇప్పుడు రూ.18,606 కోట్లకు పెరిగింది. పరపతి పెరిగింది చంద్రబాబు పాలనలో రుణమాఫీ దగాతో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి క్షీణించింది. స్వయం సహాయక సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనకాడాయి. దీంతో సంఘాలు సి, డి గ్రేడ్లకు పడిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాలకు ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు చెల్లించారు. అంతేకాకుండా చంద్రబాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని కూడా పునరుద్ధరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగి ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా నిలిచాయి. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉండగా ఇప్పుడు 89 శాతం సాధించడం గమనార్హం. వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉంది. 2022–23లో వాణిజ్య, రీజనల్ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కలిపి ఏపీ పొదుపు సంఘాలకు దేశంలోనే అత్యధికంగా రూ.40,230.63 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం 2022–23లో దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో సంఘం సగటు పొదుపు అత్యధికంగా రూ.1,72,124 కాగా తెలంగాణలో రూ.85 వేలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022–23లో ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.43,940 నుంచి రూ.30 వేలకు పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. భారీగా తగ్గిన నిరర్థక ఆస్తులు నాడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసగించడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా వాటి నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయి. ఇప్పుడు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. పొదుపు సంఘాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో 5.86 శాతం నిరర్థక ఆస్తులుండగా 2022 – 23 నాటికి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.41 శాతానికి, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో 0.25 శాతానికే పరిమితమైనట్లు నివేదిక తెలిపింది. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం సకాలంలో రుణాలను చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీని రీయింబర్స్మెంట్ చేయడంతో పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని పేర్కొంది. పొదుపు మహిళల జీవనోపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రస్తావించింది. ఆసరా ద్వారా అందిస్తున్న డబ్బులతో వ్యాపారాలు నిర్వహిస్తూ పొదుపు సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలను చేసుకుని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. -
పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు.. ఈ రుణాలపై రెండున్నర శాతం మేర వడ్డీ తగ్గింపుతో పాటు ఆయా రుణాలపై ఎలాంటి అదనపు (ఇన్స్పెక్షన్, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ పేర్లతో వసూలు) చార్జీలను పూర్తిగా మినహాయించేలా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా.. బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘పొదుపు’ రుణాలపై రూ.మూడు లక్షల వరకు కేవలం ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య రుణాలపై ఆయా బ్యాంకులు నిర్దేశించుకునే నిర్ణీత ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు – రుణాలు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు నిర్దేశించుకున్న కనీస వడ్డీ రేటు) ప్రకారం మాత్రమే రుణాలు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఎంసీఎల్ఆర్ అన్నది ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా.. ఒకే బ్యాంకులో ఒక్కో సమయంలో ఒక్కొక్క వడ్డీరేటు కూడా ఉంటుంది. అయితే, రూ.5 లక్షల పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై ఆయా బ్యాంకులు తమ విచక్షణ మేరకు వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చుకోవచ్చు. ఇలా.. ఐదు లక్షలకు పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై కొన్ని బ్యాంకులు గరిష్టంగా 13 శాతం వడ్డీ రేటుకు కూడా రుణాలిస్తున్నాయి. ఇప్పుడు.. ఎస్బీఐ పొదుపు రుణాలపై రూ.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తాలపై 12.15 శాతం వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించుకుని 9.90 శాతానికే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపింది. అదే రూ.10 లక్షలకు పైబడి రూ.20 లక్షలలోపు రుణాలపై కూడా 12.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2.45 శాతం తగ్గించుకుని 9.70 శాతానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. పొదుపు రుణాలను సకాలంలో చెల్లించే విషయంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉండడంతో ఎస్బీఐ వడ్డీ రేటు తగ్గింపునకు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. 2024 మార్చి నెలాఖరు వరకు.. ఇక మహిళలు తీసుకునే ‘పొదుపు’ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఈ ఏడాది మార్చి 10న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. పొదుపు రుణాలపై ప్రొసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ తదితర పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చెయ్యొద్దని ఆ సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఎండీ ఇంతియాజ్ పలు దఫాలుగా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ అప్పట్లోనే తాత్కాలికంగా నాలుగు నెలల కాలానికి, అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జులై 31 వరకు తీసుకునే రూ.5 లక్షల పైబడిన పొదుపు రుణాలపై దాదాపు రెండు శాతం తగ్గించడానికి అనుమతి తెలిపింది. ఆ గడువు ముగియడంతో సెర్ప్ అధికారులు మళ్లీ రెండేళ్లపాటు వడ్డీ తగ్గించాలంటూ ఎస్బీఐకి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంకు ప్రాంతీయ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్పందిస్తూ.. 2024 మార్చి నెలాఖరు వరకు రూ.ఐదు లక్షలకు పైబడిన పొదుపు రుణాలపై 2.15 శాతం నుంచి 2.45 శాతం తక్కువ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపారు. అలాగే, రూ.20 లక్షల వరకు ఎలాంటి ప్రొసెసింగ్ చార్జీలు, ఇన్స్పెక్షన్ చార్జీలు, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ ఛార్జీలు వంటివి అదనంగా వసూలు చేయబోమని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. నాలుగో వంతు రుణాలు ఎస్బీఐ నుంచే.. రాష్ట్రంలోని పొదుపు రుణాల్లో దాదాపు నాలుగో వంతు ఎస్బీఐ నుంచే తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు ఒక్క ఎస్బీఐ నుంచే రూ.9,378.24 కోట్ల రుణాలు తీసుకోగా.. పట్టణ ప్రాంతాల్లో రూ.2,565 కోట్ల రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, గ్రామీణ మహిళలు తీసుకున్న రూ.9,378.24 కోట్లలో ఐదు లక్షలకు పైబడి కేటగిరిలో రూ.2,765 కోట్ల దాకా ఉన్నాయని.. వీటిపై ఇప్పుడు ఆ బ్యాంకు తీసుకున్న వడ్డీరేటు తగ్గింపు నిర్ణయంతో ఏటా రూ.వంద కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా.. పట్టణ ప్రాంతంలో తీసుకున్న రుణం రూ.2,565 కోట్లలో రూ.5 లక్షల పైబడిన రుణాల్లో దాదాపు రూ.600 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు సైతం భవిష్యత్‌లో వడ్డీ రేటు తగ్గించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన బ్యాంకులతోనూ సంప్రదింపులు.. ఇక పొదుపు రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతోనూ వడ్డీ రేటు తగ్గింపు గురించి ప్రభుత్వంతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరలోనే ఆయా బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం. – ఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
మీరు దేశానికే ఆదర్శం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ‘మన అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన పల్లెల నుంచే సాధికారతతో ఆవిర్భవించాలి. అందుకే మహిళా పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనటువంటి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత.. తదితర పథకాల ద్వారా ప్రతి అడుగు అక్క చెల్లెమ్మల కోసమే వేస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి ఐదు లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రూ.1,353.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4,969 కోట్లు లబ్ధి కలిగించామన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా మోసమే. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు 2014 – 2019 మధ్య రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద పడేశాడు. దీనికి తోడు సున్నా వడ్డీ పథకాన్ని సైతం 2016 అక్టోబర్ నుంచి రద్దు చేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏ, బి గ్రేడ్లలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారిపోయాయి. రూ.3,036 కోట్లు ఎదురు వడ్డీ కట్టాల్సి వచ్చింది. మొత్తంగా అప్పులన్నీ తడిసి మోపెడై 2019 ఏప్రిల్ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. బాబు చేసిన మోసానికి 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలలో 18.36 శాతం మొండి బకాయిలుగా తేలాయి. అదీ నారా వారి నారీ వ్యతిరేక చరిత్ర. ఇప్పుడు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడింది. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఫలితంగా ఈ రోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిలు కేవలం 0.3 శాతం మాత్రమే. 99.67 శాతం రికవరీ రేటుతో మన అక్కచెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. తేడా మీరే చూడండి. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చాం మనందరి ప్రభుత్వానికి ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షలు ఉన్నారు. మనపై నమ్మకం పెరగడం వల్ల ఈ రోజు ఆ సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. అంటే 25 లక్షలకుపైగా పెరిగారు. సున్నా వడ్డీతో పాటు రూ.3 లక్షల వరకు రుణం అతి తక్కువ వడ్డీకే ఇప్పిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో 12–14 శాతం వడ్డీ వసూలు చేశారు. మనం దానిని 9.5 నుంచి 8.5 శాతం వరకు తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న రుణాలు రూ.25,571 కోట్లు. ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 పర్యాయాలు రూ.19,178 కోట్లు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వారి చేతుల్లో పెట్టి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాం. పలు విధాలా భరోసా ♦ జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45–65 వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,219 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1257 కోట్లు సాయం అందించాం. ♦ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు సాయం చేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,636 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ♦ పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఈ పథకం కింద డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. సొంత గూడు కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ♦ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాం. ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. అంతటితో ఆగక 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో దాని విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారా రెండు మూడు లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లయింది. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలు.. ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తున్నాం. వీరి కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఇంతవరకు రూ.6,141 కోట్లు వెచ్చించాం. సూర్యోదయానికి ముందే.. ♦ దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి, అవ్వా గుడ్‌మార్నింగ్ అని చెబుతూ పింఛన్ ఇచ్చేలా మనవడు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను. ♦ గతంలో వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తే గొప్ప అనే పరిస్థితి నుంచి మీ బిడ్డ హయాంలో రూ.2,750కి పెంచాం. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం నాలుగేళ్లలో మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.75 వేల కోట్లు. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా రూ.49,845 కోట్లు వెచ్చించాం. ♦ రూపాయి లంచం, వివక్షకు తావు లేకుండా ఈ నాలుగేళ్లలో నేరుగా రూ.2,31,123 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర. ♦ నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభాగం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. వారి భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. దిశ యాప్‌ను 1 కోటి 24 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆపద వేళ పది నిమిషాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా రాష్ట్రంలో 30,369 మందిని కాపాడగలిగాం. అక్కచెల్లెమ్మలతో మాటామంతి సీఎం జగన్ వేదిక వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. అక్కచెల్లెమ్మలతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆ సమయంలో దూరంగా ఉన్న మంత్రి విశ్వరూప్‌ను దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, అందరితో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఎంపీలు పిల్లి సుబాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీ‹Ùకుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ.20 లక్షల రుణం.. రూ.80 వేల వడ్డీ రాయితి అన్నా.. గతంలో మాలాంటి పేదోళ్లకు అప్పు పుట్టేది కాదు. పుట్టినా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలు కట్టేవాళ్లం. మీరు సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ ప«థకం ద్వారా నాలాంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అప్పు వస్తోంది. నేను ఆర్థి కంగా నిలదొక్కుకుని సొంతంగా వ్యాపారం చేసుకునే ధైర్యాన్ని కలిగించావు. నేను రూ.20 లక్షల వరకు రుణం, రూ.80 వేల వరకు వడ్డీ రాయితీ పొందాను. ఈ రోజు నేను జిరాక్స్ సెంటర్, టిఫిన్ సెంటర్‌తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మీ పథకాలతో నాలుగేళ్లలో మా కుటుంబం రూ.3 లక్షలకు పైగా లబ్ధి పొందింది. మీ మేలు ఎప్పటికీ మరువం. – దుర్గా భవాని, ఉప్పలగుప్తం, భీమనపల్లి మండలం మేనమామగా నిరూపించుకున్నారు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నన్నెంతగానో ఆదుకుంది. గతంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్పులతో భయమేసేది. మీ వల్ల నేను ఈ రోజు పాల వ్యాపారం చేస్తూ నెలకు రూ.7వేలు సంపాదిస్తున్నాను. ఇంటికి కొడుకులా, మా బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పిన మీ మాట అక్షరాలా నిజమని నిరూపించారు. విద్యా ప«థకాల ద్వారా నా కుటుంబం రూ.2.40 లక్షల వరకూ లబ్ధి పొందింది. మీరు తెచ్చిన వలంటీర్ల వ్యవస్థ సేవలు మరువలేనివి. – పి.ధనక్ష్మి, బండార్లంక, అమలాపురం రూరల్ మండలం -
పొదుపు మహిళల రుణాల వడ్డీ రేపు జమ
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ప్రభుత్వమే భరించి, ఆ వడ్డీ డబ్బులను శుక్రవారం నేరుగా మహిళల ఖాతాలలో జమ చేయనుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది మహిళలకు సంభంధించిన 10 లక్షల రుణ ఖాతాల వడ్డీ మొత్తం రూ.1,353.76 కోట్లను ప్రభుత్వం ఆ మహిళలకు అందజేయనుంది. ఈ లబ్ధిదారులు 9,48,122 సంఘాలకు చెందిన వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలో లబ్దిదారులైన వేలాది మంది మహిళల సమక్షంలో బటన్ నొక్కి వడ్డీ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడ్డారు. వైఎస్ జగన్తన సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల ఇబ్బందులు గుర్తించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2019 ఎన్నికలు జరిగిన నాటికి పొదుపు సంఘాలకు సంబంధించి మహిళలకు ఉండే బ్యాంకు అప్పులను నాలుగు విడతల్లో చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చారు. రుణాలు సకాలంలో చెల్లించే మహిళలకు వడ్డీ డబ్బును ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికీ జీవం పోశారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అమలాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి వెళ్తారు. జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబి్ధదారులకు నిధులు విడుదల చేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. గత మూడు విడతలతో కలిపి రూ.4,969 కోట్లు 2019 నుంచి ఇప్పటికే వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలకు పొదుపు సంఘాల మహిళల రుణాల వడ్డీ మొత్తాలను ప్రభుత్వమే భరించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ. 3615.29 కోట్లను లబ్ధిదారులకు అందజేసింది. నాలుగో విడత కూడా కలిపితే మొత్తం రూ. 4969.05 కోట్లు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారానే అందజేసినట్టు అవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. మరోవైపు తొలి ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా అందజేసిన లబ్ధిదారుల సంఖ్య కంటే నాలుగో ఏడాది లబ్ధి పొందే వారి సంఖ్య 20 లక్షల వరకు పెరిగినట్టు అధికారులు తెలిపారు. 2019–20లో 7.81 లక్షల సంఘాలకు చెందిన దాదాపు 81.52 లక్షల మంది మహిళలకు సంబంధించిన రుణాలపై రూ. 1,257.99 కోట్లు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరించింది. ప్రస్తుత నాలుగో ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 1.05 కోట్లకు, సంఘాల సంఖ్య 9,48,122 పెరిగింది. వడ్డీ మొత్తం కూడా రూ. 1,353.76 కోట్లకు పెరిగింది. నాలుగో విడతలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 83.86 లక్షల మంది రూ.1002.31 కోట్ల మేర లబ్ధి పొందనుండగా.. పట్టణ ప్రాంతాలకు చెందిన 21.26 లక్షల మంది మహిళలు రూ. 351.45 కోట్లు లబ్ధి పొందనున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 5.92 లక్షల మంది మహిళలు రూ. 69.50 కోట్లు లబ్ధి పొందనున్నారని అధికారులు వెల్లడించారు. -
మహిళా.. భవిత నీదే!
ఇది దివంగత నేత వైఎస్ ఆశయం.. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి దాకా మైక్రో రుణాల పేరుతో స్త్రీలు పడుతున్న అగచాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారు. వారి స్వయం సమృద్ధికోసం పావల వడ్డీకే రుణాలు అనే సరికొత్త పథకానికి 2004 సెప్టెంబర్‌లో రూపక ల్పన చేశారు. ఆయన హయాంలో ఎంతో మంది అభ్యున్నతి సాధించారు. కానీ వైఎస్ అకాల మరణం తర్వాత పొదుపు గ్రూపుల సభ్యులపై బ్యాంకర్ల వేధింపులెక్కువయ్యాయి. పాలకుల చిన్నచూపు మహిళలను అప్పుల్లోకి నెట్టింది. ‘అక్కల్లారా.. చెల్లెళ్లారా.. ఇక మీ కష్టాలు ఎంతో కాలం ఉండవు.. రుణాలు తీసుకున్న నేరానికి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న రుణాలన్నీ నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తా.. మీ కన్నీటిని తుడుస్తా’.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంగా తన నాలుగో సంతకాన్ని ఇదే ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు. 55,541 జిల్లాలోని పొదుపు గ్రూపులు జిల్లాలో ఐకేపీ, మెప్నా ఆధ్వర్యంలో స్వయం సహాయ గ్రూపులు పని చేస్తున్నాయి. ఐకేపీ గ్రామీణ ప్రాంతాల్లో 47150 గ్రూపులతో పనిచేస్తుండగా.. మెప్నా పట్టణ ప్రాంతాల్లో 8391గ్రూపులు కలిగి ఉంది. ఒక్క ఐకేపీలోనే గ్రూపునకు 9 నుంచి 11 మంది చొప్పున 4,80,000 మంది స్వయం సభ్యులు లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే మెప్నాలో కూడా సుమారు 20 వేల మంది సభ్యులుంటారు. ఒక్కో గ్రూపునకు రూ50 వేల నుంచి రూ5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు లభిస్తాయి. రూ.622 కోట్లు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లోని 47,150 గ్రూపులు ప్రస్తుతం రూ622 కోట్ల మేర బ్యాంకు లింకే జీ రుణాలు పొంది ఉన్నాయి. రూ.92.96 కోట్లు స్త్రీనిధి అనే పథకం మరోటి ఉంది.. దీని ద్వారా గ్రూపు సభ్యుల వ్యక్తిగత అవసరాలకు రుణాలు అందిస్తారు. అంటే వారి కుటుంబ సభ్యుల చదువు, వివాహం, ఆరోగ్యం మొదలైన వాటి కోసం. అయితే వీటిని 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ, మెప్నా సభ్యులు ఇప్పటికి రూ 92.96 కోట్లు తీసుకున్నారు. రూ.70 కోట్లు మెప్నా ఆధ్వర్యంలో పట్టణాలల్లోని మురికి వాడల్లో పని చేస్తున్న దాదాపు 8391 గ్రూపులు ప్రస్తుతానికి బ్యాంకుల నుంచి రూ70 కోట్ల రుణాలు తీసుకున్నాయి. రూ.785.46 కోట్లు సుమారు 5 లక్షల గ్రూపులకు జగన్ మాఫీ చేయనున్న రుణం గ్రూపు వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఆయా సంఘాలు రూ785.46 కోట్లు బ్యాంకర్లకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రద్దు చేయనున్నారు. దీనివల్ల సుమారు 5 లక్షల మంది మహిళలు తమ రుణాల నుంచి విముక్తి పొందనున్నారు. రూ.15.50 కోట్లు పాలప్రగతి కేంద్రాలు, జీవప్రగతి కేంద్రాలు, నిరుపేదల వ్యూహం పథకాల కింది ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ గ్రూపులకు రూ15.50 కోట్లు చెల్లించారు.