మనం.. ‘పొదుపు’లో ఘనం | Average saving is highest in AP | Sakshi
Sakshi News home page

మనం.. ‘పొదుపు’లో ఘనం

Published Sun, Aug 11 2024 5:47 AM | Last Updated on Sun, Aug 11 2024 5:47 AM

Average saving is highest in AP

రూ.17,292 కోట్లతో దేశంలోనే అత్యధికం

అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన ఏపీ వాటా 26.56%

బ్యాంకు రుణాల మంజూరులోనూ మనవే టాప్‌

ఒక్కో సంఘానికి సగటున రూ.8.8 లక్షల రుణం మంజూరు

2023–24లో రాష్ట్రంలోని అన్ని సంఘాలకు రూ.59,777.14 కోట్ల రుణాలు మంజూరు

జగన్‌ సర్కారు పథకాలతో పెరిగిన ఆర్థిక క్రమశిక్షణ.. దీంతో నిరర్ధక ఆస్తులు 0.31 శాతానికే పరిమితం

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు,, క్రెడిట్‌ లింకేజి విషయంలోనూ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వాటి పనితీరుపై 2023–24 వార్షిక నివేదికను శనివారం నాబార్డు విడుదల చేసింది.  

దేశంలోని ఈ సంఘాల పొదుపు ఆంధ్ర ప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగేళ్లు కూడా ఏపీనే  అగ్రగామిగా నిలిచింది. స్వయం సహా­యక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, సున్నా వడ్డీ వంటి ప్రోత్సాహకాలతోనే ఇలా ఉత్తమ పనితీరు కనబరిచినట్లు  నివేదిక స్పష్టంచేసింది.  – సాక్షి, అమరావతి 

నిజానికి.. గతంలో చంద్రబాబు హయాంలో నిర్వీ­ర్యమైన పొదుపు సంఘాలను వైఎస్‌ జగన్‌ స­ర్కా­రు గత ఐదేళ్లుగా గాడిన పెట్టడమే కాకుండా దే­శంలోనే ఉత్తమ పనితీరు కనబరిచే స్థాయికి తీసుకెళ్లింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొ­మ్ము (­2­023–24 మార్చి నాటికి) రూ.6­5,0­89.15 కో­ట్లు అ­యి­తే..  ఇందులో దక్షిణాది రాష్ట్రాల పొదు­పు రూ.2­9,409.06 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో­ని సంఘాల పొదుపు దేశంలోనే అత్యధికంగా రూ.17,292.16 కోట్లుగా ఉందని నివేదక వెల్లడించింది. అంటే దేశంలో మన రాష్ట్ర వాటా 26.56 శా­త­ంగా ఉంది. 

సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం.. 
2023–24లో దేశంలోని మహిళా సంఘాల సగటు పొ­­దుపులో కూడా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంద­­ని నాబార్డు నివేదిక స్పష్టంచేసింది. ఇక్కడ ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.1,57,321లుగా ఉంది. బ్యాంకులు కూడా ఏపీ పొదుపు సంఘాలకే అ­త్య­ధి­కంగా రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆంధ్ర­ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని నివేదిక తె­లిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2023–24లో బ్యాంకుల రుణాల పంపిణీలో రూ.59,777 కో­ట్ల­తో ఏపీ మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక రూ.25,253 కోట్లతో రెండో స్థానంలో, తెలంగాణ రూ­.20,932 కో­ట్లతో మూడో స్థానంలో.. పశ్చిమ బెంగాల్‌ రూ.­20,671 కోట్లతో నాలుగో స్థానంలో ఉ­­న్నాయని ని­వేదిక వెల్లడించింది. ఒక్కో పొదుపు సంఘం స­గటు రుణ పంపిణీలోకూడా ఏపీ రూ­.­8.­8 లక్షలతో అగ్రస్థానంలో ఉందని, ఆ తరువాత కే­ర­ళ రూ.7.7 లక్షలు, తమిళనాడు రూ.6.7 లక్షలతో ఉన్నాయి. 

సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం 
ఇదిలా ఉంటే.. సకాలంలో రుణాలు చెల్లించే పొ­దు­పు సంఘాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సున్నావ­డ్డీ (వడ్డీలేని రుణాలు) రుణాలను అమలుచేసింద­ని కూడా నివేదిక పేర్కొంది. ఫలితంగా.. పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాక గ్రామీణ కు­టీ­­ర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని తెలిపింది. 

అంతేకాక.. 2014లో చంద్రబాబు రుణమాఫీ చే­స్తానని చెప్పి మోసంచేయడంతో స్వయం సహాయ­క సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కా­కుండా సంఘాల నిరర్థక ఆస్తులు పెరిగిపోయా­యి. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం చేపట్టిన చర్య­లతో ఇవి గణనీయంగా తగ్గాయి. 2014–19 మ«­ద్య బా­బు హయాంలో 5.86 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తు­లు 2023–24 నాటికి అవి 0.31 శాతమేనని నివేదిక తెలిపింది.

మన ‘పరపతి’ కూడా పెరిగింది.. 
ఇక 2014–2019 మధ్య చంద్రబాబు చేసిన దగాకు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల పరపతి పూర్తిగా దిగజారిపోయింది. అప్ప­ట్లో చంద్రబాబు ఎన్నికల ముందు చె­ప్పిన రుణమాఫీ మాటలు నమ్మి వీరు ని­లు­వునా మోసపోయారు. ఆయన అధికారం చేప­ట్ట­గానే ప్లేటు ఫిరాయించి రుణమాఫీ చేయబో­నని అడ్డం తిరగడంతో పొదుపు సంఘాల అ­ప్పు­లు పెరిగిపోవడంతో రుణాల మంజూరు­కు బ్యాంకులు వెనుకాడాయి. దీంతో.. సంఘా­లు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. మరోవైపు.. 2019 ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చి­న హామీ మేరకు ఎన్నికల తేదీ నాటికి ఉన్న అప్పులు రూ.25,570.79 కోట్లను నాలు­గు విడతల్లో సంఘాలకు చెల్లించారు. 

అంతేకాక.. బాబు ఎగ్గొట్టిన సున్నావడ్డీని జగన్‌ సర్కా­రు పునరుద్ధరించి దీనికింద రూ.4,969.04 కోట్లను పొదుపు అక్క చెల్లెమ్మలకు చెల్లించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి అమాంతం పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరగడంతో ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్‌ లింకేజీ గల పొదుపు సంఘాలుగా మనవి నిలిచాయి. బాబు హయాంలో (2014–19) పొదుపు సంఘాల క్రెడిట్‌ లింకేజీ 43.6 శాతం ఉంటే ఇప్పుడు 89 శాతంగా ఉంది. దీంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement