సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో.. గల్లంతైన ముగ్గురు వర్కర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా కనీసం మృతదేహాల జాడ గుర్తించకపోవడం, మృతదేహాలు లభ్యమైనట్లు గందరగోళ ప్రకటనల నడుమ బాధితుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. మరోవైపు బిల్డింగ్ నుంచి ఇంకా పొగలు వస్తుండడంతో ఆదివారం మరోసారి ఫోమ్ జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది.
ఇక భవనంలో మొదటి మూడు ఫ్లోర్లలోని లోపలి భాగం స్లాబ్‌లు కుప్పకూలిపోయాయి. ఈ స్లాబ్‌ల కిందే మృతదేహాల అవశేషాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఆదివారం అన్ని ఫ్లోర్లను క్షుణ్ణంగా పరిశీలించిన డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బూడిద ద్వారా ఆనవాలు గుర్తించేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల బూడిద శాంపిల్స్‌ను క్లూస్ టీం ద్వారా సేకరించారు. ఆ శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కి తరలించారు.
బాధితులను గుజరాత్‌కు చెందిన జునైద్, వసీం, అక్తర్‌గా గుర్తించారు. సెల్‌ఫోన్‌ల ఆధారంగా వాళ్లు ప్రమాద సమయంలో భవనంలోనే చిక్కుకుని ఉంటారని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక మృత దేహాల ఆచూకీ లభ్యం అయిన తర్వాతే.. భవనాన్ని అత్యాధునిక పద్ధతుల్లో చుట్టుపక్కల భవనాలకు డ్యామేజ్ వాటిల్లకుండా కూల్చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment