secunderabad division
-
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్ డివిజన్లోని మాకుడి–సీర్పూర్ టౌన్ సెక్షన్ మధ్యలో నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయంతో పాటు, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ధనాపూర్–సికింద్రాబాద్ (03225), 22న హైదరాబాద్–గోరఖ్‌పూర్ (02575), 23న హైదరాబాద్–రక్షౌ ల్ (07051), 24న సికింద్రాబాద్–ధనాపూర్ (03226), గోరఖ్‌పూర్–హైదరాబాద్ (02576), 26న రక్షౌ ల్–హైదరాబాద్ (07052) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును పెద్దపల్లి, నిజామాబాద్, పూర్ణా, అకోలా మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా ఈ నెల 22 నుంచి 25 వరకు యశ్వంత్‌పూర్– హజరత్ నిజాముద్దిన్ (12649) రైలును, అలాగే ఈ నెల 18, 19, 21, 23, 24, 25 తేదీల్లో హజరత్ నిజాముద్దిన్–యశ్వంత్‌పూర్ (12650) రైలును బళ్లారి, గుంతకల్లు, వాడి, మన్మడ్, ఖాండ్వా, ఇటార్సీ స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. -
Deccan Mall Accident: కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది. మంటలు ఆర్పివేసినప్పటికీ బిల్డింగ్ లోపలకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ బిల్డింగ్ కూల్చివేయాలా? వద్దా అన్న అంశంపై డైలామాలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు చివరికీ కూల్చవేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కూల్చివేతకు ముందస్తుగా జీహెచ్ఎంసీ ప్రముఖ నిట్ నిపుణులతో చర్చలు జరిపి ప్రమాదం ఉండదని తేలిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఈ భవనం కూల్చివేతకు టెండర్లను కూడా ఆహ్వానించింది జీహెచ్ఎంసీ. అలాగే స్థానిక నివాసాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కూల్చివేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, భవనం కూలి ఇన్ని రోజులైన ఇంకా ఇద్దరి మృతదేహాల ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఆ రెండు మృతదేహాలు లభించిన తర్వాత కూల్చివేయాలని అధికారులను జీహెచ్ఎంసీ ఆదేశించింది. (చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం) -
డెక్కన్ మాల్ ఘటన.. ఇక మిగిలింది బూడిదేనా?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో.. గల్లంతైన ముగ్గురు వర్కర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా కనీసం మృతదేహాల జాడ గుర్తించకపోవడం, మృతదేహాలు లభ్యమైనట్లు గందరగోళ ప్రకటనల నడుమ బాధితుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. మరోవైపు బిల్డింగ్ నుంచి ఇంకా పొగలు వస్తుండడంతో ఆదివారం మరోసారి ఫోమ్ జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక భవనంలో మొదటి మూడు ఫ్లోర్లలోని లోపలి భాగం స్లాబ్‌లు కుప్పకూలిపోయాయి. ఈ స్లాబ్‌ల కిందే మృతదేహాల అవశేషాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఆదివారం అన్ని ఫ్లోర్లను క్షుణ్ణంగా పరిశీలించిన డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బూడిద ద్వారా ఆనవాలు గుర్తించేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల బూడిద శాంపిల్స్‌ను క్లూస్ టీం ద్వారా సేకరించారు. ఆ శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కి తరలించారు. బాధితులను గుజరాత్‌కు చెందిన జునైద్, వసీం, అక్తర్‌గా గుర్తించారు. సెల్ఫోన్ల ఆధారంగా వాళ్లు ప్రమాద సమయంలో భవనంలోనే చిక్కుకుని ఉంటారని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక మృత దేహాల ఆచూకీ లభ్యం అయిన తర్వాతే.. భవనాన్ని అత్యాధునిక పద్ధతుల్లో చుట్టుపక్కల భవనాలకు డ్యామేజ్ వాటిల్లకుండా కూల్చేసే అవకాశం ఉంది. -
డెక్కన్ మాల్‌కు పగుళ్లు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనపై నిట్ అధికారులు రూపొందించిన నివేదిక పోలీసులకు చేరింది. డ్రోన్ కెమెరాతో శుక్రవారం ఉదయం నుంచి భవనం పరిస్థితిని అంచనా వేశారు అధికారులు. అయితే భవనం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను సెంట్రల్‌జోన్ డీసీపీ మీడియాకు వెల్లడించారు. ‘‘బిల్డింగ్ ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉందని అధికారులు మాతో చెప్పారు. భవనం మొత్తం ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. పైఅంతస్తు సీలింగ్ పూర్తిస్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్ మొత్తం బూడిద, శిథిలాలతో నిండిపోయిందని వివరించారు. భవనం ముందు భాగంలో రాకపోకలను నిషేధించాం. బిల్డింగ్‌లోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదు. ఇప్పటికే బిల్డింగ్‌లో రెండంతస్తుల స్లాబ్‌లు కూలిపోయాయి. భవనంలో కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీ తెలియదు. ముగ్గురికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. భవనం పరిస్థితిపై యజమానికి పూర్తి సమాచారం ఇచ్చాం అని డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. డ్రోన్ ద్వారా రెండు మృతదేహాలను గుర్తించినట్లు వార్తలు బయటకు వచ్చినప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కాకపోవడం గమనార్హం. -
డెక్కన్ మాల్ ఫైల్ ఎక్కడ?.. కూల్చివేతపై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి.. రెండు మృతదేహాలను గుర్తించారు. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో.. డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత బిల్డింగ్ వెనక రెండు మృత దేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఘోర ప్రమాదానికి కారణమైన బిల్డింగ్ కూల్చివేతపై అనుభవం కలిగిన ఏజెన్సీని జీహెచ్ఎంసీ సంప్రదించినట్లు సమాచారం. అయితే కూల్చివేత విషయంలో ఇంకా క్లారిటీ రాకపోగా.. బిల్డింగ్ ఫైల్ విషయంలో ఇవాళ పెద్ద హైడ్రామానే నడిచింది. డెక్కన్ మాల్ బిల్డింగ్‌కు సంబంధించిన ఫైల్ విషయంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘ ఫైల్ మా దగ్గర లేదంటే మా దగ్గర లేద’ని అధికారులు వాదులాడుకున్నారు. అయితే.. ఈ అక్రమ భవనంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఓ వర్గం చెప్పడం గమనార్హం. మరోవైపు ఆ ఫైల్ దొరికితేనే.. కూల్చివేతకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు ఫైల్‌తో సంబంధం లేకుండా.. భవన కూల్చివేతకు సంబంధించి ఒక స్కెచ్ జీహెచ్ఎంసీ అధికారులు తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. కూల్చివేతపై ఇవాళే ఓ స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. ఇక.. బిల్డింగ్ కూల్చివేతపై నగరానికే చెందిన మాలిక్ ట్రేడింగ్ అండ్ డీమాలిషన్ సంస్థ ప్రతినిధులతో జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. బిల్డింగ్ కూల్చడం, వ్యర్థాల తొలగింపు అంశాలను పరిశీలించారు ఇంజినీర్లు. బిల్డింగ్ హైట్, ఆకారం, లోపల గదుల ఆధారంగా డిమాలిషన్ చేయడానికి ప్లానింగ్ రూపొందిస్తున్నారు. పరిస్థితులను బట్టి మూడు, నాలుగు రోజుల్లో కూల్చడం పూర్తవుతుందని ఏజెన్సీ నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే.. కూల్చివేతతో చుట్టుపక్కల భవనాల పరిస్థితిపై ఈ ఉదయం ఆందోళన వ్యక్తం కాగా.. జీహెచ్ఎంసీ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. -
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. మొదటగా సెల్లార్లో ప్రమాదం జరిగింది. పొగలు వస్తున్న సమయంలో ఏడుగురు సెల్లార్లోనే ఉన్నారు. ఆ పొగను చూసి కార్మికులంతా బయటకు వచ్చారు. అయితే.. ఫస్ట్ ఫ్లోర్లో స్పోర్ట్స్ మెటీరియల్ గోదాం ఉంది. ఆ మెటీరియల్ దించేందుకు ముగ్గురు కార్మికుల్ని యజమాని పైకి పంపించారు. ఆ ప్రయత్నంలో వాళ్లు ఉండగానే.. పొగలు, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అలా ఆ ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్‌లోనే చిక్కుకున్నారు. ఆ ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి. భవనంలోని మెట్ల మార్గం పూర్తిగా కూలిపోయింది. క్రేన్ల సాయంతో భవనం పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని డీసీపీ రాజేష్ మీడియాకు తెలిపారు. ఇక.. డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చే వరకు చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరిని అనుమతించమన్న ఆయన.. లోపల డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బ తింది. బిల్డింగ్ లోపలకి వెళ్ళే పరిస్థితి లేదు. చుట్టూ పక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా డిమాలిషన్ ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ యజమాని పై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన మీడియాకు తెలిపారు. -
ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే పరుగులు
దక్షిణ మధ్య రైల్వే ఆదాయ మార్గంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణికుల రవాణా పైన రూ.844.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ లోకో షెడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం 63.67 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.4,348 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా... ఈ ఏడాది నవంబర్ నాటికే 43.6 టన్నుల సరుకు రవాణా చేసినట్లు తెలియజేశారు. నవంబర్ నాటికి నిర్ధేశించిన 41.6 టన్నుల కంటే ఇది ఎక్కువేనని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని, 5 అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే 14 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. -
'రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి'
వరంగల్: రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా ఆర్పీఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లోని సంఘ్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైళ్ల మార్గాలను, రైళ్లను పెంచుతోంది కానీ ఆర్పీఎఫ్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. అంతేకాకుండా ఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా అదనపు పనికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.