ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే పరుగులు
దక్షిణ మధ్య రైల్వే ఆదాయ మార్గంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణికుల రవాణా పైన రూ.844.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత సంవత్సరం 63.67 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.4,348 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా... ఈ ఏడాది నవంబర్ నాటికే 43.6 టన్నుల సరుకు రవాణా చేసినట్లు తెలియజేశారు. నవంబర్ నాటికి నిర్ధేశించిన 41.6 టన్నుల కంటే ఇది ఎక్కువేనని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని, 5 అదనపు బుకింగ్ కౌంటర్‌లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే 14 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.