'రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి' | rpf vacancies need to be replaced, demands rpf employees union | Sakshi
Sakshi News home page

'రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి'

Published Mon, Mar 2 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

'రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి'

'రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి'

వరంగల్: రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా ఆర్పీఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లోని సంఘ్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైళ్ల మార్గాలను, రైళ్లను పెంచుతోంది కానీ ఆర్పీఎఫ్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. అంతేకాకుండా ఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా అదనపు పనికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement