ప్రయాణికుల భద్రతకు ఆర్‌పీఎఫ్ భరోసా | Ensuring RPF to passenger safety | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రతకు ఆర్‌పీఎఫ్ భరోసా

Published Sat, Jul 16 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

ప్రయాణికుల భద్రతకు ఆర్‌పీఎఫ్ భరోసా

ప్రయాణికుల భద్రతకు ఆర్‌పీఎఫ్ భరోసా

ద.మ.రైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సంజయ్ సాంకృత్యాయన్

 సాక్షి, హైదరాబాద్ : ‘ప్రయాణికులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) ప్రతిక్షణం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యం’ అని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య భద్రతాధికారి సంజయ్ సాంకృత్యాయన్ అన్నారు. ప్రయాణికుల భద్రతపై 182 టోల్ ఫ్రీ నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయవచ్చని చెప్పారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం జీఆర్‌పీ పోలీసులతో కలసి రైల్వే భద్రతాదళం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకొనేవిధంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక తనిఖీలు, నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఇక్కడ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌పీఎఫ్ డీఐజీ ఈశ్వర్‌రావు, ఎంఎస్ సునిల్, సుమతి శాండిల్య తదితర ఉన్నతాధికారులతో కలసి మాట్లాడారు.

సెక్యూరిటీ హెల్ప్‌లైన్(టోల్‌ఫ్రీ) నంబర్ 182కు ఈ ఏడాది 530 ఫిర్యాదులు అందగా ఆర్‌పీఎఫ్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుందన్నారు. ఇంట్లోంచి పారిపోయిన, తప్పిపోయిన 293 మంది చిన్నపిల్లలను ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆర్‌పీఎఫ్ రక్షించిందని చెప్పారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘రిస్తా’ మొబైల్ యాప్ ద్వారా 800 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. నిర్భయనిధి నుంచి మంజూరైన రూ.50 కోట్లతో 78 రైల్వేస్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement