Travelers
-
NH 65 యమ డేంజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత కీలక రహదారుల్లో ఒకటైన జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నం. 65 డేంజర్ మార్గ్‌గా మారిపోయింది. హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న దీనిపై అనునిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ప్రయాణంలో అలసిపోయిన కొందరు రహదారి పక్కన, సర్వీస్ రోడ్లలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ఇలాంటి వారితోపాటు లారీ డ్రైవర్లకు ఎర వేసి దోచుకునే ముఠాలతో ఈ రహదారి యమడేంజర్‌గా మారిపోయింది. గడిచిన నెల రోజుల్లో ఈ తరహాకు చెందిన నాలుగు ఉదంతాలు చోటుచేసుకోగా... నిందితులు ఇప్పటివరకు చిక్కలేదు. వీరి కోసం నల్లగొండ జిల్లా, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ 65పై ఆగే ప్రయాణికులకు పోలీసులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.గత నెలలో కట్టంగూర్ పరిధిలో⇒ హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని కట్టంగూర్ సమీపంలో సరీ్వస్ రోడ్డులో వాహనం ఆపి విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి దోచుకున్నారు. ⇒హైవేపై ఉన్న మరో ప్రాంతంలో సెల్‌ఫోన్ తస్కరణకు గురైంది. నిద్రిస్తున్న వ్యక్తికి ఏమాత్రం తెలియకుండా కారు డోర్ తెరిచి ఫోన్ దొంగిలించారు.ఈ నెలలో నార్కట్‌పల్లి, చిట్యాలలో⇒ ఏపీ లింగోటం దగ్గర టార్చ్లైట్లు వేసి నిల్చున్న ఇద్దరు మహిళల్ని చూసి ఆకర్షితుడైన లారీ డ్రైవర్ ఎల్లేష్ వాహనం ఆపి వారితో మాటలు కలిపాడు. అప్పటివరకు చీకటిలో మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు అదును చూసుకుని అతడిపై విరుచుకుపడ్డారు. కాళ్లు, చేతులు కట్టేసి లారీలోని టూల్ బాక్సులో ఉన్న రూ.22 వేల నగదు తీసుకుని నలుగురూ ఉడాయించారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఓ కుటుంబం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద విశ్రాంతి కోసం ఆగింది. ముసుగులు ధరించి వచి్చన ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు. ఆ శబ్ధానికి నిద్రలేచిన బాధితులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు.ఎక్కువగా వ్యక్తిగత వాహనాలే...⇒ ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాల్లో అత్యధికం వ్యక్తిగత వాహనాలైన కార్లు, జీపులు వంటి తేలికపాటివే ఉంటాయి. అటు విజయవాడ, ఇటు హైదరాబాద్‌తోపాటు మధ్యలో ఉన్న కోదాడ, సూర్యాపేట, నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పగటిపూట కంటే రాత్రి వేళల్లోనే ఈ బస్సులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే సమయాభావం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడంతోపాటు అనివార్య కారణాల నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు.ఈ రెండు నగరాల మధ్య దూరం 277 కిలోమీటర్లే కావడంతో వాహనం నడిపే వాళ్లు అలసిపోవడం అనేది చాలా తక్కువ. హైదరాబాద్, విజయవాడల కంటే దూరమైన ప్రాంతాల నుంచి వీటి మీదుగా ప్రయాణించే వాళ్లు రాత్రి వేళల్లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా రహదారి పక్కన, ట్రక్ లే బైలో, సరీ్వస్ రోడ్లపై నిద్రిస్తున్న వారే దొంగలకు టార్గెట్‌గా మారుతున్నారు. లైట్ వేశారంటే స్కెచ్ వేసినట్లే..వాణిజ్య వాహనాలైన లారీలు, ట్రక్కులు తదితరాలు నడిపే వారూ బాధితులుగా మారిన సందర్భాలున్నాయి. అనునిత్యం హైవేలపై సంచరించే వీరికి ఏయే రూట్లలో, ఏయే ప్రాంతాలు సురక్షితం? ఎక్కడ వాహనాలు ఆపుకోవాలి? ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అయితే ఈ కమర్షియల్ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు వారి బలహీనతల కారణంగా దొంగల బారినపడుతున్నారు. కమర్షియల్ వాహనాల డ్రైవర్లు ఉద్యోగనిమిత్తం దీర్ఘకాలం ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటారు.ఇలాంటి వారిని ఆకర్షించడానికే అనేక ప్రాంతాల్లో హైవే వ్యభిచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ తరహా బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకునే ముఠాలు ఎన్‌హెచ్ 65లో రంగంలోకి దిగాయి. రాత్రివేళల్లో రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రాంతాల్లో నక్కి ఉండే దొంగలు... తమ భాగస్వాములైన మహిళలు టార్చిలైట్లు లేదా సెల్‌ఫోన్ లైట్లు వెలిగించేలా పథకం వేస్తారు. వీటిని చూసి ఆకర్షితులై వచ్చే వాణిజ్య వాహనాల డ్రైవర్లపై దాడి చేసి దోచుకుంటున్నారు. ఈ లోపాలే ప్రధాన కారణం..హైవేపై జరుగుతున్న ఉదంతాల్లో అనేకం పోలీసుల వరకు రావట్లేదు. భారీ సొత్తు పోగొట్టుకోవడమో, గాయపడటమో జరిగితేనే ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్తున్నారు. చిన్న చిన్న ఉదంతాలు, బలహీనతల కారణంగా చోటు చేసుకున్నవి బయటకు రావట్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ హైవేపై గస్తీ కోసం ప్రత్యేకంగా వాహనాలు ఉండేవి. ఆపై తేలికపాటి వాహనాల స్థానంలో ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక బృందం చొప్పున విధులు నిర్వర్తించేది.కొన్నాళ్లు ఈ గస్తీ బృందాలు కనుమరుగయ్యాయి. జాతీయ రహదారి వెంట ఉన్న శాంతిభద్రతల విభాగం ఠాణాలకు చెందిన అధికారులు, సిబ్బందే గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్లలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత నేపథ్యంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ సాధ్యం కావట్లేదు. ఈ హైవేపై వెలిమినేడు వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ, గస్తీ బాధ్యతల్ని వీరికే అప్పగించాలనే ప్రతిపాదన ఏళ్లుగా ఫైళ్లకే పరిమితమైంది. బస్ బేలు, ట్రక్ లే బైలో ఎక్కడా సరైన వెలుతురు, నిఘా లేకపోవడమూ దుండగులకు కలిసొస్తోంది.ఈ చర్యలు తీసుకోవాలి...⇒ వాహనచోదకులు కేవలం టోల్‌ప్లాజాల వద్ద, దాబాలు, హోటళ్ల సమీపంలో మాత్రమే తమ వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.⇒ నిర్మానుష్య ప్రాంతాలు, ట్రక్ లే బైల్లో నిలపాల్సి వస్తే నిరీ్ణత సంఖ్యలో వాహనాలున్న చోటనే ఆపుకోవాలి.⇒ ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను రాత్రి వేళల్లో హైవేలపై మోహరించాలి. ఒక్కో వాహనానికి నిరీ్ణత ప్రాంతం కేటాయించి పెట్రోలింగ్ చేయించాలి. ⇒మఫ్టీ పోలీసులను కార్లలో ఉంచడం ద్వారా ఆపరేషన్లు చేపట్టాలి. ఇలా వీళ్లు ప్రయాణికుల్లా వ్యవహరిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది.⇒జాతీయ రహదారుల వెంట ఉన్న బస్ బేలు, ట్రక్ లే బైల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంచాలి.⇒ఎన్‌హెచ్ 65లో అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే వీటిలో అత్యధికం మరమ్మతులకు గురయ్యాయి. వీటిని తక్షణం వినియోగంలోకి తేవాలి.నిఘా ఉన్న చోటే పార్క్ చేసుకోండి ఎన్‌హెచ్ 65పై చోరీలతోపాటు స్నాచింగ్స్ కూడా నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీ విస్తృతం చేయడంతోపాటు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ప్రయాణికులు సైతం తమ వాహనాలను సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లోనే పార్క్ చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆథరైజ్డ్ హోటళ్లలోనే బస చేయాలి. కొత్త వారు ఎవరైనా సమీపంలోకి వస్తున్నా, మాట్లాడాలని ప్రయతి్నస్తున్నా అప్రమత్తం కావాలి.ఏదైనా నేరం బారినపడితే వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితులు భయాందోళనలకు లోనై గందరగోళానికి గురికాకూడదు. నేరం చేసిన వ్యక్తి ధరించిన దుస్తులు, అతడి వేషభాషలతోపాటు అతడు ఏదైనా వాహనంపై వస్తే దాని నంబర్ తదితరాలు గమనించి నోట్ చేసుకోవాలి. ఎంత త్వరగా పోలీసులకు సమాచారమిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. –ఎం.రాజేశ్ చంద్ర, డీసీపీ, యాదాద్రి -
విశాఖలో విమాన ప్రయాణికుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు కడపకు విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్ నుంచి జూలై వరకు విమాన ప్రయాణికుల గణాంకాలను గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్యలో 33.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి 7,74,925 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది అదే సమయానికి 10,37,656 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయం 36.1 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య 20,289 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య ఈ ఏడాది 27,612కు పెరిగింది. ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు 19.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 3.09 లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు కూడా గణనీయంగా ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సంఖ్యలో 22.6 శాతం వృద్ధి నమోదైంది. తిరుపతి, కర్నూలు ఎయిర్‌పోర్టుల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప క్షీణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 18,84,926 మంది ప్రయాణించారు. దేశం మొత్తం మీద చూస్తే ఆ నాలుగు నెలల కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 10.04 కోట్ల నుంచి 12.30 కోట్లకు చేరుకుంది. పెరిగిన విదేశీ ప్రయాణికులు రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి మాత్రమే విదేశీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. విశాఖ నుంచి విదేశీ ప్రయాణికుల సంఖ్య 20.9 శాతం వృద్ధితో 20,097 నుంచి 24,143కు చేరితే, విజయవాడలో 14.4 శాతం వృద్ధితో 14,978 నుంచి 17,135కు చేరుకుంది. -
‘స్మార్ట్’ గైడ్.. ఒక్క క్లిక్‌తో ఎక్కడెక్కడికో.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ‘స్మార్ట్ ట్రావెలింగ్’ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రయాణికులు స్మార్ట్ ఫోన్‌ను ట్రావెల్ టూల్‌గా ఉపయోగిస్తూ దేశ, విదేశాలను చుట్టేస్తున్నారు. మధ్యవర్తులు, టూర్ ఆపరేటర్లు లేకుండానే ఒక్క క్లిక్‌తో అరచేతిలో సమాచారాన్ని వీక్షిస్తూ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా 18 నుంచి 64 ఏళ్ల వయసు గల ప్రయాణికుల్లో 71% మంది తమ పర్యటనల కోసం స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా 87% మంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ప్రయాణాలు చేస్తున్నట్లు గూగుల్, ఫోకస్ రైట్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. ఫోన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోని వాయిస్ మోడ్‌లో సూచనలు, టికెట్ బుకింగ్‌లో డిజిటల్ అసిస్టెంట్ సేవలు సులభంగా లభిస్తున్నాయి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న ప్రదేశాలకు నావిగేషన్ సాయంతో తేలికగా చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ కంపెనీలు కూడా కస్టమర్ జర్నీకి అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను ప్రవేశపెడుతున్నాయి. పర్యాటక రంగానికి ఊతం... భారతదేశం నుంచి 2024 నాటికి సుమారు 8 కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా పసిఫిక్ డెస్టినేషన్ ఫోర్కాస్ట్–2022–24 రిపోర్టు ప్రకారం రానున్న రెండేళ్లలో 1.34 కోట్ల మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తారని అంచనా. దీనివల్ల కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రచారంలో డిజిటల్ పోటీ... కేరళ, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆన్లైన్ వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం వర్చువల్ ట్రావెల్ గైడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా టూరిజం లొకేషన్లను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో వాటిని విరివిగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కూడా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా పర్యాటకులు కచ్చితత్వంతో తమ ప్రయాణాలను ఎంపిక చేసుకునేలా సేవలు అందించనుంది. స్థానిక కళలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా పర్యాటక రంగానికి అనుసంధానిస్తూ జీఐఎస్ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. -
World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ
కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ ట్రావెల్ రైటర్ అయ్యింది. భర్త విషుతో కలిసి ‘రోడ్ టు టేస్ట్’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి. ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్’ లో బిర్యానీ టేస్ట్ చూశారు. ‘షా గౌస్’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్ తాజ్’ అనే రెస్టరెంట్లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్ చూశారు. నాగార్జున రెస్టరెంట్లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్’లో ఆగి అంబూర్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్ ‘చార్మినార్ బిర్యానీ సెంటర్’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్ భవన్లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్ మటన్ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్లో దొరికే మలబార్ బిర్యానీతో ముగిసింది. ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్కు ‘రోడ్ టు టేస్ట్’ అని పెట్టింది. 2015లో పెళ్లి– ప్రయాణం సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్. 2016లో ‘రోడ్ టు టేస్ట్’ వ్లోగ్ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్ మీడియాలో ఈ జంట చాలా పాపులర్ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్ ప్లేస్‌లు చూడగలిగితే చాలు. డబ్బులూ వస్తాయి ఒక రంగంలో మనం ఫేమస్ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే పోస్టర్ ఇచ్చి హిమాలయ బేస్ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట. భ్రమణ కాంక్ష స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ? -
కోవిషీల్డ్‌కు యూకే ఓకే!
లండన్: కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్(లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు. అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్‌ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
భారత ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన యూకే
లండన్: భారత ప్రయాణికులపై ఉన్న ఆంక్షల్ని యూకే సడలించింది. ఇన్నాళ్లూ రెడ్ జాబితాలో ఉన్న మన దేశాన్ని అంబర్ లిస్టులోకి ఆదివారం నుంచి మార్చింది. అంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న భారతీయ ప్రయాణికులు బ్రిటన్ హోటల్స్‌లో 10 రోజుల క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. పది రోజుల హోంక్వారంటైన్ ఉంటే సరిపోతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ (డీహెచ్ఎస్సీ) వెల్లడించింది. ఇన్నాళ్లూ బ్రిటన్ వెళితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో 1,750 పౌండ్లు (దాదాపు రూ. 1.80 లక్షలు) ఖర్చు చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నిబంధనని తొలగించి హోంక్వారంటైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏమిటీ అంబర్ లిస్ట్..? ఇతర దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా యూకే ప్రభుత్వం సిగ్నల్ లైట్స్‌లో ఉండే రంగులతో రెడ్, అంబర్, గ్రీన్ అనే మూడు జాబితాలుగా దేశాలను విభజించింది. నిరంతరం ఆయా దేశాల్లో కరోనా తీరుతెన్నుల్ని పర్యవేక్షిస్తూ మూడు వారాలకు ఒకసారి జాబితాల్లో మార్పులు చేస్తుంది. అంబర్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. బ్రిటన్‌కు వెళ్లడానికి మూడు రోజుల ముందు ఒకసారి, ఆ దేశానికి చేరిన రోజు లేదంటే రెండు రోజుల్లో మరోసారి, మళ్లీ ఎనిమిది రోజుల తర్వాత మూడో పరీక్ష చేయించుకోవాలి. భారత్‌లో ఉన్న బ్రిటన్ పౌరులు పూర్తిగా వ్యాక్సినేట్ అయితే క్వారంటైన్లో ఉండాల్సిన పని లేదు. అయితే స్వదేశానికి వెళ్లిన రెండు రోజుల్లోగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఇన్నాళ్లూ భారత్‌లో కరోనా రెండో వేవ్ తీవ్రంగా ఉండడంతో రెడ్ లిస్ట్‌లో ఉంది. దీంతో ఇక్కడ నుంచి యూకేకి ఎవరూ ప్రయాణించలేకపోయారు. ఇప్పుడు కేసులు కాస్త తగ్గుముఖం పట్టి వ్యాక్సినేషన్ పెరగడంతో అంబర్ లిస్టులోకి మార్చాలని గత బుధవారమే నిర్ణయించింది. ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. -
ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం!
విహారయాత్ర అంటే పిల్లలకు పెద్ద సరదా. మూడేళ్లు నిండిన పిల్లలను టూర్లకు ధైర్యంగా తీసుకెళ్లవచ్చు. అయితే పిల్లలతో ఒక రోజు ప్రయాణానికే ఓ పెద్ద సూట్ కేసు తయారవుతుంది. అలాంటిది టూర్‌కి వెళ్లేటప్పుడు మరికొంత జాగ్రత్తగా చెక్ లిస్ట్ పెట్టుకుని మరీ ప్యాకింగ్ మొదలు పెట్టాలి. టూర్లో జలుబు, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే వేయడానికి డాక్టర్ సూచించిన మందులు దగ్గర ఉండాలి. రెగ్యులర్‌గా చూపించుకునే డాక్టర్ని కలిసి టూర్ కోసం ప్రిస్కిప్షన్ రాయించుకుని మందులు తీసుకోవాలి. టూర్ ఎన్ని రోజులనే దానిని బట్టి ఆహారం సిద్ధం చేసుకోవాలి. పాలపొడి లేదా మిల్క్ టెట్రా ప్యాక్‌లు తీసుకెళ్లాలి. టెట్రా ప్యాక్ అయితే పాలను మరిగించాల్సిన అవసరం కూడా ఉండదు. నూడుల్స్, ఫూడుల్స్ ఇన్స్టంట్ ప్యాకెట్లు దగ్గర ఉంటే... ప్యాకింగ్ టిన్‌లోనే మరిగే నీటిని పోస్తే నూడుల్స్, ఫూడుల్స్ రెడీ పిల్లలతోపాటు వాళ్లకు ఇష్టమైన ఒక్క బొమ్మనయినా టూర్‌కు తీసుకెళ్లాల్సిందే. టూరిస్ట్ ప్రదేశం నచ్చకపోతే విసిగించేస్తారు. అప్పుడే వాళ్లకు ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు, అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు గుర్తుకు వస్తారు. వాళ్ల దగ్గరకు ‘వెళ్లిపోదాం’ అంటూ మారాం చేస్తారు. బొమ్మ ఉంటే ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు. చదవండి: జోడెన్‌ఘాట్ వీరభూమి -
ఏపీ: యూకే నుంచి వచ్చిన 11 మందికి కరోనా
సాక్షి, అమరావతి: యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్‌లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటివరకు 1,346 మందిని అధికారులు ట్రేస్ చేయగా, మరో 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 11 మందికి కరోనా నిర్థారణ అయ్యింది.(చదవండి: మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ : సీరం) అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారి కాంటాక్ట్స్‌లో 5,784 మందికి పరీక్షలు నిర్వహించారు. యూకే రిటర్న్స్‌తో కాంటాక్ట్ అయిన 12 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్ కాగా, తూ.గో.జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. (చదవండి: ఎంత కాలంలో కరోనా ఖతం...?) -
నగదు చెల్లింపునకు ఇక ఒక్క లేనే
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లించే వాహనాలకు ఒక్కోవైపు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించే విషయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టమైన హామీ ఇవ్వనందున బుధవారం నుంచి దాన్ని తొలగిస్తున్నట్టు ఎన్ హెచ్ఏఐ రాష్ట్ర ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. హైబ్రిడ్ విధానంలో 25% లేన్లు నగదు చెల్లించే వాహనాలకు కేటాయించగా, ఫాస్టాగ్ వాహనాలకు మిగతావి అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా సంక్రాంతి రద్దీ ఉన్నా, ఎక్కువగా ఇబ్బంది లేకుండా వాహనాలు ముం దుకు సాగాయి. పంతంగి లాంటి రద్దీ ఎక్కువగా ఉండే టోల్‌ప్లాజాల వద్ద అర కిలోమీటరు మేర వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. ప్రస్తుత హైబ్రిడ్ విధానం గడువు మంగళవారంతో తీరిపోయింది. బుధవారం నుంచి కేంద్రం ముందు చెప్పినట్టుగా టోల్ గేట్ల వద్ద ఒక్కోవైపు ఒక్కోవైపు మాత్రమే నగదు చెల్లింపు వాహనాల కోసం కేటాయించనున్నారు. తిరుగు ప్రయాణంలో ఇబ్బందే సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు నగరం నుంచి భారీ సంఖ్యలో జనం ఊరిబాట పట్టారు. దాదాపు 35 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. పండుగ తర్వాత వీరు మళ్లీ తిరుగు ప్రయాణం కానున్నారు. వెళ్లేప్పుడు హైబ్రీడ్ విధానం వల్ల టోల్గేట్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఒక్కలే¯Œ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయిస్తున్నందున, తిరుగు ప్రయాణంలో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో టోల్గేట్ల వద్ద నమోదైన లెక్కల ప్రకారం.. 55% వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. 45% వాహనాలకు టోల్‌ను నగదు రూపంలో చెల్లించారు. ఇప్పుడు ఈ 45% వాహనాల తిరుగు ప్రయాణంలో ఆ ‘ఒక్కోవైపు ’నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతో కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం క్యూలు ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది పండుగకు రెండ్రోజుల ముందు వెళ్లగా, వచ్చేటప్పుడు నాలుగైదు రోజుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. అంటే వెళ్లేప్పుడు ఉన్న రద్దీ ఉండదు. అయినా, ఒక్క లేన్ నుంచి అన్ని వేల వాహనాలు వెళ్లాల్సి రావటం కొంత ఇబ్బందేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు తీవ్రంగా ఉంటే, అప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి పొంది లేన్ల సంఖ్యను పెంచే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఒకవేళ హైబ్రిడ్ విధానం గడువు పెంచితే, బుధ వారం ఉదయం తమకు సమాచా రం వస్తుందని, అప్పుడు ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. -
కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో
బ్రిటిష్ పర్యాటక సంస్థ థామస్‌కుక్ కుప్పకూలింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడంతో వేలాదిమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌కుక్ దివాలా తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. థామస్కుక్కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్ వారున్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక చరిత్ర ఉన్నసంస్థ దివాలా ప్రకటించడం సంస్థలకు, లక్షలాది కస్టమర్లకు, ఉద్యోగులకు చాలా బాధ కలిగిస్తుందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి లిక్విడేషన్లోకి ప్రవేశించిందంటూ కస్టమర్లు, వేలాదిమంది ఉద్యోగులకు అయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇది చాలా విచారకరమైన వార్త అని బ్రిటన్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు. అలాగే పర్యాటకులను, కస్టమర్లను వారివారి గమ్యస్థానాలకుచేర్చేందుకు ఉచితంగా 40కి పైగా చార్టర్ విమానాలను సీఏఏ అద్దెకు తీసుకుందని తెలిపారు. కాగా ప్రపంచంలోని ప్రసిద్ధ హాలిడే బ్రాండ్లలో ఒకటైన థామస్ కుక్‌ను 1841లో లీసెస్టర్స్ షైర్లో క్యాబినెట్-మేకర్ థామస్ కుక్ స్థాపించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో సంక్షోభం మరింత ముదిరింది. థామస్ కుక్ సీఈవో పీటర్ ఫాంక్‌హౌజర్ అయితే థామస్ కుక్ ఇండియా మాత్రం ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్న ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. Lots of red cancelled markers for Thomas Cook flights due out from Manchester Airport today. Live on @bbc5live throughout the morning. pic.twitter.com/UuiTk9sjRU — Justin Bones (@justinbones) September 23, 2019 అయితే థామస్ కుక్ ఇండియా ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. -
నట్టనడుమ.. చిమ్మచీకట్లో...
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాధవాయిపాలెం రేవు వద్ద గోదావరి నదిలో గురువారం రాత్రి పంటు నిలిచిపోయింది. పంటులో ఆయిల్ అయిపోవడంతో చిమ్మచీకటిలో గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. ఆ సమయంలో పంటుపై 93 మంది ప్రయాణికులు, రెండు కార్లు ఉన్నాయి. సముద్రపుపోటు కారణంగా పంటు అదుపు తప్పి లాకురేవు వైపు వెళ్లిపోయింది. చివరకు అక్కడ మత్స్యకారులు కట్టిన వలకట్ల వద్ద నిలిచింది. రాత్రి 8 గంటలకు మాధవాయిపాలెం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు బయల్దేరింది. అయితే, ఆయిల్‌లేక గోదావరి మధ్యలోకి వెళ్లగానే పంటు నిలిచిపోయింది. సముద్రపోటు తో పంటు వేరేమార్గంలోకి వెళ్లి పోతుండటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. రెండున్నర గంటలు గోదావరిలోనే.. పంటులో ఉన్న మహిళలు రక్షించండంటూ పెద్దగా అరిచారు. బంధువులకు సెల్ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో రేవు వద్దకు చేరుకున్నారు. నరసాపురం ఆర్డీవో ఏఎన్ సలీంఖాన్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులతో ఫోన్లో మాట్లాడారు. రాత్రి 10.15 గంటలకు ఆయిల్‌ను వేరే పడవలో తీసుకెళ్లి పంటును అవతల గట్టుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవు నిర్వహణపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. తరచూ ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలు ఆయిల్ సమస్య కాదని, ఫిట్‌గా లేని పంటును ఉపయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని దాస్తున్నట్టుగా చెబుతున్నారు. పంటులో లైఫ్ జాకెట్లు ఏమీలేవు. పంటులో 50 మందికి మించి ఎక్కించడానికి అనుమతిలేదు. కానీ, పరిమితికి మించి 90 మందికి పైగా జనాన్ని, 2 కార్లను అదీ రాత్రివేళ అనుమతించారు. -
ఎంచక్కా.. ఎగిరిపోదాం..!
అందుబాటులో ఉండే విమాన చార్జీలు మరోవైపు.. వెరసి హైదరాబాదీలను జాతీయ, అంతర్జాతీయ నగరాల్లో పర్యటించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలసి ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. కొద్దిరోజులుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ సుమారు55 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు 10 వేల నుంచి 15 వేల మంది అదనంగా బయలుదేరి వెళ్తున్నట్లు అంచనా. అన్ని విమానాల్లో చాలా వరకు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వేసవి రద్దీయే ఇందుకు కారణమని విమానాశ్రయ అధికారవర్గాలు తెలిపాయి. విస్తరించిన సేవలు హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరించుకుంది. ప్రస్తుతం దేశంలోని 66 నగరాలకు, విదేశాల్లో 18 నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాలు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏటా 20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకొనే ప్యాకేజీలు సైతం విమాన ప్రయాణాలను బాగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో గత రెండేళ్లుగా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 16 లక్షల నుంచి 20 లక్షల వరకు పెరిగింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకలు, వరుస సెలవులు, వేసవి లాంటి సమయాల్లో ప్రయాణికులు ఎక్కువ శాతం విమాన ప్రయాణాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నగరాలంటే మక్కువ ఎక్కువ నగరవాసులు ఎక్కువగా సింగపూర్, మలేసియా, మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్, లండన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు తరలివెళ్తున్నారు.అందుబాటులో ఉండే చార్జీలు ఒక కారణమైతే ఈజీ కనెక్టివిటీ మరో ప్రధాన కారణం. నేరుగా ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువమంది ఈ దేశాలకు వెళ్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణమే. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున పర్యాటకులు ఎక్కువ శాతం సింగపూర్, మలేషియాలను ఎంపిక చేసుకుంటున్నారు. రైలు చార్జీలతో సమానం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు శంషాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో చాలామంది రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. చార్జీల్లోనూ ఈ మార్పు కన్పిస్తోంది.సెకండ్ క్లాస్ ఏసీ ట్రైన్ చార్జీలతో సమానమైన విమాన చార్జీలు, క్షణాల్లో గమ్యస్థానానికి చేరే అవకాశముండటంతో విమాన సర్వీసుల వైపు ఆసక్తిని పెంచుతున్నాయి. ఎక్కువ మంది బెంగళూర్, ఢిల్లీ, గోవా, ముంబై, చెన్నైతో పాటుగా ఇటు బ్యాంకాక్, నేపాల్, బ్రిటన్, అమెరికాలాంటి ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. మరికొందరు వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు సోలోగా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి సుమారు 25 శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్‌కుక్, కాక్స్ అండ్ కింగ్స్, ఐఆర్సీటీసీ.. తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. సోలోగా అయితేనే సో బెటర్ హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. సుమారు 28 శాతం ఇలా ఒంటరిగా విదేశీటూర్లకు వెళ్తున్నట్లు ఓ అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరబందీల్లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడం వల్ల చాలా మంది సోలో జర్నీయే సో బెటర్ అనుకుంటున్నారు. ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. ఇటు దేశంలో బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చి, గౌహతి, విశాఖ నగరాలకు సోలో పర్యాటకుల ఎక్కువగా ఉంది. అత్యాధునిక సేవలు.. భద్రతా తనిఖీలను క్షణాల్లో పూర్తిచేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులకు అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన ‘ప్యాసింజర్ ప్రైమ్’ సర్వీసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే ఎక్కడా ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పారదర్శకమైన భద్రతా తనిఖీలను కొనసాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికుల కోసం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నేషన్, హ్యాండ్ బ్యాగేజ్ స్కానింగ్లతో క్షణాల్లో తనిఖీలను పూర్తి చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
చివరకు మిగిలింది
ఉత్తరీయం సర్దుకుంటూ రైలుదిగాడు నందగోపాల్. ఆయనకు యాభై సంవత్సరాలు పైనే ఉంటాయి. రైలు దిగిన ప్రయాణికులు ఆటోలు ఎక్కుతున్నారు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ ఒక ఆటో అతను అడిగాడు.‘‘పాలెం’’ చెప్పాడు నందగోపాల్.‘‘రామమందిరం సెంటర్ వరకూ వెళుతుందండీ! ఊళ్లోకి ఆటోలు రావు’’ అన్నాడు.‘‘సరే’’ అని బ్యాగ్ లోపల పెట్టి కూర్చున్నాడు నందగోపాల్.స్టేషన్ బయట ఉన్న చిన్న చిన్న కాకా హోటళ్ళు, వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఉన్నాడు నందగోపాల్. తను ఊరు వదలి వెళ్ళి పాతికేళ్ళు అయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పుట్టిపెరిగిన ఊరిని చూస్తున్నాడు. ఊరు చాలా మారిపోయింది.‘‘రామమందిరం సెంటర్ వచ్చిందండీ’’ ఆటో అతను చెప్పాడు. అతనికి డబ్బిచ్చి కిందికి దిగాడు నందగోపాల్.ఆలోచిస్తూ చిన్నగా నడుస్తున్నాడు. అదే కరణంగారి ఇల్లు! తన చిన్నప్పుడు కరణంగారి ఇల్లే పోస్టాఫీసు, తనకి ఆరేడు ఏళ్ళ వయసు ఉంటుంది. ‘‘మా నాన్న ఇంగ్లాండు కవర్ తెమ్మన్నారండీ!’’ అని అడిగేవాడు.కరణంగారి భార్య లలితాసహస్రనామం చదువుకుంటూ పూజగదిలో నుంచి వచ్చి చదవటం ఆపకుండానే కిటికీ వైపు రమ్మని సైగ చేసేది. పోస్టాఫీసుగా వాడుకుంటున్న గది కిటికీలో నుంచి కవర్ అందించేది.వరండాలో ఉయ్యాల బల్ల మీద కూర్చొని సన్నజాజిపూల దండ గుచ్చుతున్న కరణంగారి అమ్మాయి–‘‘ఇంగ్లాండు కవర్ కావాలా! అమెరికా కవర్ వద్దా!’’ అని ఫక్కున నవ్వేది.నందగోపాల్ ముఖం మీద చిరునవ్వు కదిలింది. ఆ ఇల్లు దాటి వచ్చాడు. అదిగో! ఆ ఖాళీ స్థలంలోనే అట్లతద్దికి ఉయ్యాల కట్టేవారు. అమ్మాయిలందరూ ఉయ్యాల చుట్టూ చేరి ఊగేవారు. నందగోపాల్కి కూడా ఉయ్యాల ఊగాలని కోరికగా ఉండేది. అమ్మతో చెబితే ‘‘ఆడపిల్లలు ఆడే ఆటలు మగపిల్లలు ఆడకూడదు. అందరూ నవ్వుతారు’’ అనేది.‘‘అంటే మగపిల్లాడిగా పుట్టినందుకు ఈ జన్మలో ఉయ్యాల ఎక్కకూడదా! ఆ అనుభూతి తెలుసుకోవాలంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందేనా! అప్పుడు కూడా మగవాడిగానే పుడితే ఎలా?’’ ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేవి నందగోపాల్కి.ఒకసారి తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ అన్న రాజగోపాల్‌కి చెప్పాడు. రాజగోపాల్ తనకన్నా మూడేళ్ళు పెద్ద. తమ్ముడు చెప్పింది విని ‘‘ఓస్! అంతేనా! నేను రోజూ స్కూల్‌కి వెళ్లే దారిలో పిల్లలపార్కు ఉంది. అందులో ఆడాళ్ళు, మగాళ్ళు అందరూ ఊగుతారు. రేపు సాయంత్రం నిన్ను కూడా తీసుకువెళతాను. ఆడుకోవచ్చు’’ అన్నాడు రాజగోపాల్. నందగోపాల్ మనసు ఆనందతరంగిణి అయింది.ఆదివారం సాయంత్రం చీకటి పడే వరకు పార్కులో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. నందగోపాల్ అలిసిపోయి నిద్రలో తూలిపోతుంటే తమ్ముడి భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుని, ‘‘అదిగో! ఆ కనిపించే తాటిచెట్లు దాటి నాలుగు అడుగులు వేస్తే మన ఊరు వచ్చేస్తుంది. నిద్రపోకు, మేలుకో’’ అంటూ బుజ్జగిస్తూ నడిపించేవాడు రాజగోపాల్.తనను అంత ప్రేమగా చూసిన అన్నయ్యను పాతికేళ్ళ తర్వాత ఇప్పుడు నిర్జీవంగా చూడబోతున్నాడు. అన్న కొడుకు కళ్యాణ్ నిన్న ఫోన్ చేసి చెప్పాడు. ఉన్న పళాన బయలుదేరాడు తను. కొద్దిదూరంలో టెంట్ వేసి కనబడుతుంది. దగ్గరకు వస్తున్నకొద్దీ నందగోపాల్ గుండె వేగంగా కొట్టుకోసాగింది.దూరం నుంచి నడచి వస్తున్న ఈ కొత్తమనిషి వంక అందరూ తలతిప్పి చూడసాగారు. నందగోపాల్ టెంట్ దగ్గరకు వచ్చాడు. ఎవరూ మాట్లాడలేదు. ఏం అడగాలో తోచలేదు. ఇంతలో ఏదో పని మీద అటుగా వచ్చిన కళ్యాణ్, నందగోపాల్‌ని చూసి ‘‘రా బాబాయ్! ఇల్లు తెలిసిందా!’’ అంటూ చేతిలో బ్యాగు అందుకున్నాడు.రాజగోపాల్‌ని మార్చురీబాక్సులో పడుకోబెట్టారు.నందగోపాల్ అన్న మొహం వంక తదేకంగా చూశాడు. ఈయనని చూసి, మాట్లాడి ఇరవై అయిదేళ్ళు అయింది. అక్కడక్కడ నాలుగైదు నల్లవెంట్రుకలు తప్ప తలంతా నెరిసిపోయింది. పెదవులు నల్లగా ఉన్నాయి. మొహంలో జీవకళ లేదు. నందగోపాల్ గుండెలో నుంచి సన్నటి బాధ మెలితిరిగి కన్నీళ్ల రూపంలో బయటికివచ్చింది.కళ్యాణ్ గభాలున ఆయన్ని పట్టుకుంటూ ‘‘ఇలా రా బాబాయ్!’’ అని లోపల ఒక గదిలో కూర్చోబెట్టి ‘‘లక్ష్మీ! తాతయ్య దగ్గర కూర్చో! పెద్దతాతయ్య మనవరాలు బాబాయ్!’’ అని చెప్పి అవతలకి వెళ్లాడు.నందగోపాల్ పడక్కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘ఈ అమ్మాయి పెద్దక్క మనవరాలా! తననెప్పుడూ ఇంతక్రితం చూడలేదు’’ అనుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా ఈ తాతయ్య ఎవరో తెలియదు. ముళ్ళమీద కూర్చునట్లు కూర్చుంది. అది గమనించి ‘‘నాకేమీ ఫర్వాలేదు. నువ్వెళ్ళమ్మా!’’ అన్నాడు. అన్నదే తడవుగా ‘‘బతుకు జీవుడా’’ అన్నట్లు ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోయింది.నందగోపాల్కి అన్న గుర్తుకు వచ్చాడు.రాజగోపాల్‌కి పెళ్ళయి చిన్నవదిన కొత్త కుటుంబసభ్యురాలిగా వచ్చినప్పుడు నందగోపాల్ ఎంతో సంతోషించాడు. వదినతో పాటు వదిన తల్లి కూడా ‘ఒక్కగానొక్క కూతురిని వదలి ఉండలేను’ అని ఇక్కడే తిష్ట వేసింది. ఆమె దుర్బోధల వల్ల కుటుంబంలో కలతలు మొదలైనాయి. రాజగోపాల్, నందగోపాల్ మధ్య ఎడం పెరిగింది. రాజగోపాల్‌కి ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్లని వదిన ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటూ మిగిలిన కుటుంబసభ్యులకు చేరువకానీయలేదు.ఆరోజు నందగోపాల్కి బాగా గుర్తు. అప్పటికి కళ్యాణ్‌కి ఏడేళ్లు, వాడి తమ్ముడికి మూడేళ్లు. నందగోపాల్ వసుంధరని ప్రేమించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. తండ్రి పోయాడని తెలిసి నందగోపాల్ వచ్చాడు. అన్నలిద్దరూ ఆస్తి చెరిసగం పంచుకుంటున్నారు. ‘‘నందూ తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇంట్లో నుంచి వెళ్లిపోయి నాన్నగారిని ఎంతో బాధ పెట్టాడు. అలాంటి వాడికి వాటా ఎలా ఇస్తాం?’’ అన్నాడు రాజగోపాల్. ‘‘అవునవును’’ అన్నాడు పెద్దన్నయ్య.‘‘మీ ఇద్దరివీ పెద్ద చదువులు, గవర్నమెంట్ ఉద్యోగాలు. నాది చిన్న చదువు, ప్రైవేట్ ఉద్యోగం. ఏ ఆధారం లేకుండా ఎలా బతకను?’’ అన్నాడు నందగోపాల్.‘‘నీ గురించిన మనోవ్యథతోనే నాన్నగారు పోయారు. తండ్రిని చంపిన వెధవ్వి. ఆస్తి అడగడానికి సిగ్గు లేదూ’’ అన్నాడు చిన్నన్నయ్య.‘‘మీరిద్దరూ ఎంత స్వార్థపరులో నాకు తెలియదా! నేను కాదు, మీ మూలంగానే నాన్న పోయి ఉంటారు’’ అన్నాడు నందగోపాల్.అంతే! అన్నలిద్దరూ అతని మీద పడి కొట్టారు. తల్లి ఏడుస్తూ అడ్డు వచ్చింది. ‘‘నందూ! నీకు దణ్ణం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్లిపోరా! మీరందరూ కొట్టుకుంటుంటే నేను చూడలేను. వెళ్లిపోరా’’ రెండు చేతులు జోడించి బావురుమంది.నందగోపాల్ వెర్రివాడిలా ఒక్కక్షణం తల్లి వంక చూశాడు. మరుక్షణం విసురుగా వెళ్లిపోయాడు. దెబ్బలు శరీరానికి తగిలాయిగానీ గాయం గుండెలో అయింది నందగోపాల్కి. ఎన్నిరోజులైనా ఆ గాయం మానలేదు. మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లలేదు.సంవత్సరాలు గడిచిపోయాయి. నందగోపాల్కి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. అతనికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఎలాగైనా నాది అనే ఒక స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని. అన్నలు తన వాటా ఇచ్చినట్లయితే ఎప్పుడో ఏర్పాటు చేసుకునేవాడు. ఆ విషయం గుర్తుకు రాగానే నందగోపాల్ మనసు వికలమయ్యేది.కొడుకు, కూతురు పెద్దయ్యారు. కొడుకు ఉద్యోగం రాగానే లోన్ తీసుకొని ఇల్లు కట్టాడు. కొంతకాలం తరువాత...కళ్యాణ్ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది రాజగోపాల్ చనిపోయాడని. తన అడ్రస్ కోసం ఎంతో ప్రయత్నించాడట. ఇరవై అయిదేళ్ల క్రితం ఉన్న పంతం, పట్టుదల ఇప్పుడు లేదు నందగోపాల్‌లో. అన్న చేసిన అవమానం గుర్తొచ్చినా ఆవేశం రావడం లేదు. చిన్నప్పుడు తనని పార్క్‌కి తీసుకువెళ్లి నిద్రలో తూలుతుంటే బుజ్జగిస్తూ నడిపించిన అన్న గుర్తొస్తున్నాడు. తనకు అర్థం కాని లెక్కలు వివరించి, పరీక్ష పాసయ్యేటట్లు చేసిన అన్న గుర్తొస్తున్నాడు. అందుకే చివరిసారిగా చూడడం కోసం అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు.‘‘మిమ్మల్ని రమ్మంటున్నారు’’ ఒక కుర్రాడు వచ్చి చెప్పాడు. పడక్కుర్చీలో పడుకుని ఆలోచనలో మునిపోయిన నందగోపాల్ ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. లేచి, ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు. రాజగోపాల్‌ని సాగనంపడానికి సిద్ధం చేశారు.నడుము వంగిపోయి, శరీరం ముడతలు పడిపోయి ఉన్న తల్లి భోరున ఏడుస్తోంది. ఆడవాళ్లు ఆమెను గట్టిగా పట్టుకున్నారు.అన్నను చూస్తున్న కొద్దీ నందగోపాల్ మనసు పరిపరివిధాల పోతుంది. ఒంట్లో ఓపికున్నంత వరకు మన కన్నా గొప్పవాడు లేడన్నట్లు విర్రవీగుతాము. రాజగోపాల్ కూడా అదే చేశాడు. తనను కట్టుబట్టలతో వెళ్లగొట్టాడు. చిల్లిగవ్వ కూడా దక్కకుండా చేశాడు. నిలువ నీడ లేకుండా చేశాడు.ఈ పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి రమ్మని అనలేదు.ఎన్ని పండగలు, ఎన్ని సంబరాలు చేసుకున్నారు? ఒక్కదానికైనా పిలవలేదు. ఆఖరికి పెద్దన్నయ్య, పెద్ద వదిన పోయినప్పుడు కూడా తనకు తెలియజేయనీయలేదు. తర్వాతెప్పుడో తెలిసింది.అంత కఠినంగా ఉండాల్సిన తప్పు తనేం చేశాడు?చివరకు ఏంమిగిలింది? తగాదాలకు కారణమైన నేల అలాగే ఉంది, మనుషులే లేకుండా పోయారు. అనుబంధాలు పోయాయి. ఆనందాలు పోయాయి.రాజగోపాల్ మీద మట్టి కప్పుతూ ఉంటే చూడలేకపోయాడు నందగోపాల్. ఇవతలకు వచ్చాడు. అతని మనసు దీనంగా, విషాదంగా అయింది. కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ స్నానాలు చేసి ఇంటికి వచ్చారు. అన్న జ్ఞాపకచిహ్నంగా ఉంచిన దీపానికి నమస్కరించాడు.లోపల గదిలో తల్లి మంచం మీద కూర్చొని ఉన్నది. నందగోపాల్ తల్లి పక్కనే కూర్చొని ‘‘నేనమ్మా, నందూని’’ అన్నాడు.ముడతలు పడిన చేతులతో కొడుకుని తడిమి, తడిమి చూసుకుంది ఆ తల్లి. కన్నీళ్ళు పెట్టుకుంది. గతాన్ని గుర్తు తెచ్చుకొని నందగోపాల్ చిన్నప్పటి విషయాలన్నీ చెప్పింది. తల్లి చెప్పేవన్నీ వింటూ మౌనంగా కూర్చున్నాడు నందగోపాల్.ఆ మర్నాడు నందగోపాల్ భార్య,కొడుకు, కూతురు కారులో వచ్చారు. అతనికి ముందురోజు సెలవు దొరకలేదు. నందగోపాల్ రైలులో వాళ్లకన్నా ముందే వచ్చేశాడు.‘‘మీ అన్నయ్యరా బుజ్జీ’’ కొడుకుకి కళ్యాణ్‌ని పరిచయం చేశాడు. కళ్యాణ్ తమ్ముడి భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు. పిన్నిని, చెల్లెల్ని కూడా ఎంతో ఆదరంగా చూశాడు. మూడు రోజులు గడిచిపోయాయి. వచ్చిన బంధువులందరూ దాదాపుగా వెళ్లిపోయారు.‘‘బాబాయ్! నాన్న, పెదనాన్న నీకు చేసిన అన్యాయం తెలిసింది. వాళ్లు చేసిన అన్యాయం సరిదిద్ది నీ వాటా స్థలం, పొలం నీకు అప్పగించాలని ఇన్నాళ్ళూ ఎదురుచూశాను. ఇవిగో కాగితాలు’’ అందించబోయాడు కళ్యాణ్.నందగోపాల్ అందుకోలేదు.‘‘ఇప్పుడీ ఆస్తితో నాకు పనిలేదురా కళ్యాణ్! కష్టాలు పడాల్సిన రోజులన్నీ అయిపోయాయి. భగవంతుడి దయవల్ల నా బిడ్డలిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. నన్ను కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈ స్థలం, నా వంతు పొలం నువ్వు, అన్నయ్య పిల్లలు సమానంగా తీసుకోండి’’ అన్నాడు.కళ్యాణ్ మనసు మూగబోయినట్లయింది‘‘నా మాటగా ఒక్క విషయం గుర్తుంచుకో కళ్యాణ్! అన్నయ్య పిల్లలు, నా పిల్లలు, మీరిద్దరు అందరూ కలసిమెలసి ఉండండి. అకారణ వైరాలతో ద్వేషం పెంచుకోకండి. ఆస్తి తగాదాలు, చెప్పుడు మాటలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. మనుషుల మధ్య ఆగాధాలు పెంచుతాయి. మీ తరంలోనైనా తోడబుట్టిన వాళ్లందరూ కలసి మెలసి ఉంటూ ఆనందంగా జీవించండి. ఇన్నాళ్లు అమ్మకి నేను చేసింది ఏమీలేదు. అమ్మని నాతో పాటు తీసుకువెళతాను. కొద్దిరోజులైనా ఆమెకు సేవ చేసి కొడుకుగా నా రుణం తీర్చుకుంటాను’’ అన్నాడు నందగోపాల్.‘‘అలాగే బాబాయ్! మేమెప్పుడూ తగాదాలు పడము. నువ్వు చెప్పినట్లే చేస్తాం’’ అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్, కొడుకు పక్కపక్కన కూర్చొని తన మాటలు శ్రద్ధగా వినటం చూసి చాలా ఆనందంగా అనిపించింది నందగోపాల్కి.భోజనాలు అయిన తరువాత నందగోపాల్ వాళ్లు బయలుదేరారు. డ్రైవింగ్ సీట్లో కొడుకు, పక్కనే కూతురు కూర్చున్నారు. వెనకసీట్లో మధ్యలో తల్లిని కూర్చోబెట్టుకొని చెరొక పక్కన నందగోపాల్, వసుంధర కూర్చున్నారు. కారు బయలుదేరింది.కళ్యాణ్, అతని భార్య, తమ్ముడు వాకిలి దాకా వచ్చారు. కారు కనుమరుగు అయ్యేదాకా అలాగే చూస్తూ నిలబడిపోయారు. గోనుగుంట మురళీకృష్ణ -
పర్యటకుల కోసం సదరన్ ట్రావెల్స్ ప్రత్యక ఆఫర్లు
-
ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఇకపై రూ. 50 లక్షల దాకా ప్రమాద బీమా సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. దేశ, విదేశీ ఫ్లయిట్స్‌లో ఏ తరగతికి చెందిన టికెట్లు బుక్ చేసుకున్న వారైనా దీన్ని పొందవచ్చని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం, మరణం సంభవించిన పక్షంలో ఈ బీమా కవరేజీ వర్తిస్తుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ సేవల కోసం భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. పాలసీ ప్రీమియంను ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కాకినాడ: సికింద్రాబాద్–కాకినాడ సువిధ (నం. 82709) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం ఉదయం 6.25కు కాకినాడకు చేరుతుంది. కాజీపేట, ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోటలో హాల్టి్టంగ్ కల్పించారు. ∙కాచిగూడ–కాకినాడ: కాచిగూడ–కాకినాడ సువిధ (నం. 82724) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బయల్దేరి మరునాడు ఉ.7.45 గంటలకు కాకినాడకు చేరతాయి. మల్కాజిగిరి, కాజీపేట ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకాపూడి, సామర్లకోటలో హాల్టింగ్ కల్పించారు.మచిలీపట్నం–సికింద్రాబాద్ రైలు రద్దు: జనవరి 10న మచిలీపట్నం నుంచి బయల్దేరాల్సిన మచిలీపట్నం–సికింద్రాబాద్ (నం.07251) ప్రత్యేక రైలును రద్దు చేశారు. -
3.8 లక్షల క్రెడిట్‌కార్డులు హ్యాక్
లండన్: బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంస్థ మొబైల్ యాప్ ద్వారా, ఎయిర్వేస్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసిన 3.8లక్షల ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు చోరీఅయ్యాయని బ్రిటీష్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్ ఎయిర్వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. ‘ప్రయాణికుడి పేరు, చిరునామా, ఈ–మెయిల్ అడ్రస్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని (కార్డు నెంబరు, ఎక్సై్పరీ డేట్, సీవీసీ కోడ్) హ్యాకర్లు సంపాదించారు. ప్రయాణికుల పాస్‌పోర్టు వివరాలు హ్యాక్ కాలేదు’ అని క్రూజ్ చెప్పారు. ఆగస్టు 21 – సెప్టెంబర్ 5 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కార్డులను బ్లాక్ చేసుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి సమాచారం అందించామని చెప్పారు. కాగా, పలువురు ప్రయాణికులు తమ క్రెడిట్ కార్డును ఎవరో వాడుకున్నట్లు ఫోన్‌కు సందేశాలు వచ్చాయని బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. పెద్ద కంపెనీల్లో భద్రత డొల్లే! డిజిటల్ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో కనీస భద్రత కల్పించకపోవడంపై బ్రిటీష్ ఎయిర్వేస్పై ప్రయాణికులు సహా ఐటీ నిపుణులు మండిపడుతున్నారు. బ్రిటీష్ ఎయిర్వేస్లో ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది మేలో కంప్యూటర్ వ్యవస్థలో లోపాల కారణంగా 700కు పైగా విమానాలు హఠాత్తుగా రద్దవడం.. 75వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా మాల్వేర్ కారణంగా తమ ప్రయాణికుల చెల్లింపుల వివరాలు బహిర్గతమయ్యేందుకు ఆస్కారముందని ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. -
ప్రయాణికుడే ‘ప్రథమం’
సాక్షి, హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు పడిగాపులు తప్పనున్నాయి. భద్రతా పరమైన తనిఖీల కోసం ఇక ఏమాత్రం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన కొద్ది సేపట్లోనే భద్రతా తనిఖీలను ముగించుకొని లోనికి వెళ్లిపోవచ్చు. ప్రయాణికుల సదుపాయాలకు అగ్రతాంబూలం ఇస్తూ ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక రకాల సదుపాయాలను కల్పించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో త్వరలో ముఖ కవళికల నమోదు (ఫేస్ రికగ్నైజేషన్) యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. భద్రతా తనిఖీలు సులభతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోప్రయాణికుల భద్రతా తనిఖీలు అతి ముఖ్యమైన ఘట్టం. భద్రతా అధికారులు ఒక్కొక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించేందుకు ఎంతో సమయం పడుతుంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 3 గంటలు ముందుగా చేరుకోవలసి ఉంటుంది. అలాగే జాతీయ ప్రయాణికులు 2 గంటలు ముందుగా విమానాశ్రయానికి రావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా పరమైన తనిఖీలను మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. పైగా అదే సమయంలో ప్రయాణికుల మొత్తం వివరాలను నిక్షిప్తం చేయడం వల్ల వారు ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు. ఏ సమయం నుంచి ఏ సమయంలో విమానాశ్రయంలో ఉన్నారు వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ప్రయాణికులకు మరింత పటిష్టమైన భద్రతను కల్పించేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ‘ఫేస్ రికగ్నైజేషన్’ యంత్రాలనుప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రయాణికుల ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డుల్లోని వివరాలతో సరిపోయే విధంగా రెటీనా స్కాన్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కితే చాలు.. ‘సుగమ్య భారత్ అభియాన్’సేవల్లో భాగంగా వృద్ధులు, వికలాంగులు, స్వతహాగా నడవలేని వారి కోసం ప్రస్తుతం వీల్చైర్లను అందుబాటులో ఉంచారు. అంధులైన వారి సమాచారం కోసం బ్రెయిలీ లిపిలో సైన్బోర్డులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత టర్మినల్స్‌కు చేరుకొనేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల్లోకి ప్రవేశించేందుకు, ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లేందుకు సహాయకులు, వీల్చైర్ల ద్వారా ప్రయాణికులకు సముచితమైన సేవలను అందజేస్తున్నారు. త్వరలో ఈ ఆటోమేటిక్ వీల్ చైర్ సదుపాయాన్ని పార్కింగ్ ప్రదేశం నుంచే కల్పించనున్నారు. ప్రయాణికులు తమ కారు పార్కు చేసిన చోట నుంచి కాలింగ్ బెల్ నొక్కితే చాలు. ప్రయాణికుల సహాయకులు నేరుగా కారు వద్దకే వచ్చి వీల్‌చైర్ సదుపాయాన్ని కల్పిస్తారు. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఎక్స్‌ప్రెస్ సేవలు కేవలం ఒక హ్యాండ్ బ్యాగ్‌తో బయలుదేరే 40 శాతం డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ ఇన్ సదుపాయాన్ని త్వరలో అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నారు. టర్మినల్ ఎంట్రీ వద్ద ఉండే సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల ద్వారా హ్యాండ్ బ్యాగ్ ప్రయాణికులు వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం సుమారు 18,000 మంది డొమెస్టిక్ హ్యాండ్ బ్యాగ్ ప్రయాణికులకు ఈ సదుపాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. హ్యాండ్‌బ్యాగ్ ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కూడా దీనిని వర్తింపజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ‘క్యూ’కట్టాల్సిన పనిలేదు కొంతకాలంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎయిర్‌పోర్టు సిబ్బందికి మాత్రం ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా సత్ఫలితాలు లభించడంతో ప్రయాణికుల భద్రతకు కూడా వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు సెక్యూరిటీ గేట్ వద్ద ఎక్కువ సమయం క్యూలో నించోవలసిన అవసరముండదు. పైగా రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వారి ట్రావెల్ హిస్టరీ సమోదై ఉంటుంది. దీంతో వారు అడుగడుగునా సెక్యూరిటీ తనిఖీల కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. నేరుగా వెళ్లిపోవచ్చు. బేబీ రూమ్స్ భేష్ ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ కార్యక్రమాల్లో భాగంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బేబీ రూమ్స్ ప్రయాణికులకు ఎంతో సంతృప్తికరమైన సేవలందజేస్తున్నాయి. పిల్లలకు పాలు పట్టేందుకు, డైపర్లు మార్చేందుకు ఉపయోగపడుతున్నాయి. మహిళా ప్రయాణికుల కోసం ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శానిటరీ న్యాప్కిన్స్ వెండింగ్ మిషన్లను వాష్‌రూమ్‌లలో 26 చోట్ల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో విమానాశ్రయంలో పర్యావరణ హితమైన బయో టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. -
పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్..!
-
సాగర్ అందాలు పర్యాటకులు సందడి
-
సినిమా చూపిస్త మావ..
⇒ బస్టాండ్లలో మినీ థియేటర్లు ⇒ ప్రతి పట్టణంలో ఒకటి ఉండేలా ఆర్టీసీ ప్రణాళిక ⇒ 354 థియేటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన బడా సంస్థ సాక్షి, హైదరాబాద్: ఎక్కాల్సిన బస్సు మిస్సవుతుంది. తరువాత బస్సుకు రెండుమూడు గంటల సమయం పడుతుంటుంది. అప్పటి వరకు ఏం చేయాలి! బస్టాండుల్లో పడిగాపులు కాసేకంటే హాయిగా, ఏసీ హాలులో కూర్చుని ‘కూల్’గా ఓ సినిమా చూసొచ్చి తర్వాతి బస్సు అందుకోవచ్చని పిస్తుంది. అందకు ఎక్కడో ఉన్న థియేటర్‌కు వెళ్లి రావాలంటే వ్యయ ప్రయాసలు... పైగా సమయానికి బస్సు అందుకోగలమో లేదో టెన్షన్! అదే బస్టాండులోనే ఓ సినిమా హాలుంటే! ఈ ఆలోచనకే కార్యరూపం ఇస్తోంది ఆర్టీసీ. ప్రయాణికులకు వినోదాన్ని కల్పించడమే కాకుండా... తద్వారా ఆదాయం పొందే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండుల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి ప్రతిపాదన... దేశీయంగా మినీ థియేటర్ల నిర్వహణలో మంచి పేరున్న ఓ బడా కంపెనీ తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో 354 మినీ థియేర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వాటి నిర్మాణానికి అనుమతితోపాటు, విధివిధానాల నోటిఫికేషన్ కోసం ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అది రాగానే టెండర్లు పిలిచి థియేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పట్టణంలోని బస్టాండులో కనీసం ఓ మినీ థియేటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిబంధనల సడలింపుతో స్పందన ప్రస్తుతం బస్సుల నిర్వహణతోనే ఆదాయాన్ని పొందుతున్న ఆర్టీసీ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరు కుపోయింది. గతంలో తీసుకున్న అప్పుల తాలూకు వడ్డీలు, పాత బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. కచ్చితంగా ప్రత్యామ్నా య రూపంలో ఆదాయాన్ని పొందాల్సిన పరిస్థితిలో బీఓటీ (నిర్మించు, నిర్వహించు, అప్పగిం చు) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా టిక్కెటేతర ఆదాయం కోసం రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి అధికారి వేణును ఈడీగా నియమించింది. కనీసం 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమైనందున అంతమేర విశాలమైన భవనాలున్న చోట పైభాగంలో థియేటర్లు నిర్మిస్తారు. భవనాలు లేని చోట బస్టాండులోని ఖాళీ స్థలంలో నిర్మిస్తారు. నిర్మాణ సంస్థలను ఆకట్టుకునేందుకు అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ వాల్యూ, అప్పెరంట్ వ్యాల్యూను తగ్గించారు. ప్రాజెక్టు అప్పగించిన తొలి నెల నుంచే ఆర్టీసీకి వాటా చెల్లించాల్సి ఉండగా, దాన్ని నిర్మాణ సమయం పూర్తయ్యే వరకు వసూలు చేయాల్సిన అవసరం లేకుండా కనిష్టంగా రెండేళ్ల హాలీడే ప్రకటించారు. కనీసం రూ.100 కోట్ల విలువైన ప్రాజెక్టు అయితే రెండేళ్లు, అంతకంటే విలువ ఎక్కువున్న ప్రాజెక్టులకు మూడేళ్ల హాలీడే ప్రకటించారు. వార్షిక లీజ్ రెంటల్‌ను కూడా తగ్గించారు. లీజు ఒప్పందం పూర్తయ్యాక, ఆసక్తి ఉంటే మరో 25 ఏళ్లపాటు నిర్వహించుకునేందుకు కేటాయించే విషయంలో ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముందుకొచ్చిన 14 సంస్థలు... తాజాగా మినీ థియేటర్లకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేయటంతో 14 సంస్థలు ముందు కొచ్చాయి. మినీ థియేటర్లతో పాటు ఇతర బీఓటీ ప్రాజెక్టుల వల్ల ఆదాయం ఎలా ఉంటుందనే విషయంలో అధ్యయనం కోసం ఈడీ వేణు ఆధ్వర్యంలో అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల్లో పర్యటించను న్నారు. -
పల్లెటూర్
పల్లెబాట పట్టిన నగరం రైళ్లు, బస్సులు కిటకిట ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపర్వం ఏయూలో అలరించిన పండుగ సంబరాలు పండుగ సెలవులిచ్చేశారు. తెల్లారితే భోగి పండుగ..దాంతో నగరం సొంతూరికి పయనమైంది... బస్టాండు, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడి టికెట్లు కొనుక్కొని రైళ్లు, బస్సులపైకి జనం ఎగబడ్డారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా.. రద్దీని అవి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడుతున్నారు. అదిరిపోయే రేట్లతో బెదరగొడుతున్నారు. అయినా సరే ప్రయాణికులు వాటిని ఆశ్రయించక తప్పడంలేదు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో పల్లె వాతావరణం సృష్టించాయి. ధింసా నృత్యాలు.. తప్పెటగుళ్లు.. సంప్రదాయ పిండివంటల ఘుమఘుమలు.. బొమ్మలకొలువులు.. భోగిమంటలు.. ముగ్గుల పోటీలతో ఏయూ మైదానం అచ్చమైన తెలుగు పల్లెను తలపించింది. ఆటపాటలు, పోటీలతో హోరెత్తింది.. విశాఖపట్నం : సంక్రాంతి పండగను సొంత ఊళ్లల్లో జరుపుకోవడానికి నగరం నుంచి భారీ ఎత్తున ప్రజలు ప్రయాణæమవుతున్నారు. సిటీలో పుట్టిపెరిగిన వారు సైతం బంధువులు, స్నేహితుల ఊళ్లకు పయణమవుతున్నారు. దీంతో గురువారం నగరమంతా సందడి సందడిగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆర్టీసీ 600 రెగ్యులర్, 95 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రైళ్లకు ఆ శాఖ అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో సుమారు 6 లక్షల మంది, రైళ్లల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు నగరం నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీకి గురువారం ఒక్కరోజే రూ.95 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో కంటే ఇది సుమారు రూ.20 లక్షలు అదనం. రద్దీతో తప్పని తిప్పలు తాటిచెట్లపాలెం : రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సంతోషంగా గడపాల్సిన పండగకు వ్యయ ప్రయాసలతో వెళుతున్నారు. దీనికి తోడు ఎప్పటిలాగే రైల్వే శాఖ వేసిన అరకొర రైళ్లతో ప్రయాణంలో సీట్లు రిజర్వుగాక, జనరల్‌లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. చార్జీల భారాన్ని భరించలేక సాధారణ జనం విసుగు చెందుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు జేబుదొంగలు రద్దీని ఆసరా చేసుకొని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఆర్పీఎఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటునట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సొంతూరులో సంతోషాలు తెలుగు వారి పండగల్లో అత్యంత విశిష్టత కలిగిన సంక్రాంతి పండగను ఎవరికి వారు తమ స్వగ్రామాల్లో జరుపుకోవాలనుకుంటుంటారు. బంధు మిత్రులతో, పిండి వంటలతో అత్యంత శోభాయమానంగా ఉండే పల్లె లోగిళ్లలో సంబరాలు చేసుకోవాలనుకుంటారు. అందుకే సొంత ఊరికి వెళ్లేది ఏడాదికి ఒక్క సారే అయినా సంక్రాంతికే వెళ్లాలనుకుంటారు. విశాఖ నగరానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ఇతర ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వారంతా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉపాధి కోసం కూడా విశాఖ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంతూరులో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. -
కరెన్సీ..ఎమర్జెన్సీ
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే కాచిగూడ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఇలా బోసిపోరుు కనిపించింది. పెద్ద నోట్ల రద్దుతో చాలా మంది ప్రయాణాలను వారుుదా వేసుకుంటున్నారు. కాచిగూడ నుంచి బెంగళూర్, తిరుపతి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు ప్రతి రోజు సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగిస్తారుు. వందకు పైగా ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తారుు. 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాంటి రద్దీ స్టేషన్లో కొద్ది రోజులుగా ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా సోమవారం బుకింగ్ కౌంటర్ల వద్ద, స్టేషన్ బయట ఇలా ప్రయాణికులు లేకుండా వెలవెల పోతూ కనిపించింది. - సాక్షి, సిటీబ్యూరో -
మెట్రోరూట్లలో రహదారులకు మరమ్మతులు షురూ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో కారిడార్లలో దారుణంగా దెబ్బతిన్న రహదారులకు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ మరమ్మతులు చేపట్టింది. ప్రధానంగా ఎల్భీనగర్–దిల్సుఖనగర్–ఛాదర్‌ఘాట్, రంగ్‌మహల్ జంక్షన్ –నాంపల్లి–ఖైరతాబాద్, పంజాగుట్ట–ఎస్.ఆర్.నగర్– కూకట్పల్లి మార్గాల్లో రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మరమ్మతు పనులను హెచ్ఎంఆర్ ఎండీ పరిశీలించారు. ఈ ప్రాంతంలో భారీగా వరదనీరు నిలుస్తుండడంతో ప్రధాన రహదారిపై భారీగా గోతులు ఏర్పడ్డాయి. వీటిని సిమెంట్ ఇటుకలు(పేవర్‌బ్లాక్స్)ఏర్పాటుతో పూడ్చివేశారు. సికింద్రాబాద్–బేగంపేట్, జూబ్లీహిల్స్ రోడ్‌నెం.5,36, సికింద్రాబాద్–ముషీరాబాద్–ఆర్టీసీ క్రాస్‌రోడ్–బడీచౌడి,పుత్లీబౌలీ ప్రాంతాల్లోనే రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినట్లు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్ ప్రాంతాల్లో సిమెంటు ఇటుకలతో(పేవర్‌బ్లాక్స్)ఏర్పాటుతో రహదారులపై భారీ గోతులు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం దిశగా మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పలు యురోపియన్ దేశాలు, ముంబయి మహానగరంలోనూ లోతట్టు ప్రాంతాలు (వాటర్‌లాగింగ్ ఏరియా)లలో పేవర్‌బ్లాక్స్ ఏర్పాటుతో రహదారులు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నెలరోజుల్లోగా మెట్రో కారిడార్లలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పూర్తిచేస్తామని ఎండీ తెలిపారు. మియాపూర్–కూకట్పల్లి, ఒలిఫెంటా బ్రిడ్జి, గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు ఎల్అండ్టీ సంస్థ మరమ్మతులు చేపడుతుందని ఎండీ పేర్కొన్నారు. -
ఆ ప్రయాణికులపై పోలీసుల ప్రత్యేక దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: విమాన ప్రయాణికుల భద్రతపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మహిళా ప్రయాణికుల భద్రత కోసం షీ క్యాబ్్సను అందుబాటులోకి తెచ్చిన ట్రాఫిక్ పోలీసులు...ఇప్పుడు అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్న క్యాబ్‌లకు అడ్డుకట్ట వేసే దిశగా ముందుకెళ్తున్నారు. పోలీసు అనుమతి తీసుకోకుండా తిరిగే క్యాబ్‌లతో ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉండటంతో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. శని, ఆది వారాల్లో డ్రైవ్ నిర్వహించి పదుల సంఖ్యలో క్యాబ్‌లను సీజ్ చేస్తున్నారు. కొన్ని వాహనాలతో ఇబ్బందులు... వాస్తవానికి విమానాశ్రయం నుంచి ప్రయాణికుల్ని నగరానికి తీసుకెళ్లేందుకు ఇతర ప్రైవేట్ వాహనాల్ని అనుమతించరు. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులో బేరసారాలు సాగించడం నిషేధం అయినా కొందరు వాహన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు తలనొప్పులకు కారణమవుతున్నారు. గతేడాది నగరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముంబై మోడల్‌ను క్యాబ్ డ్రైవర్ తన స్నేహితులతో కలిసి విమానాశ్రయం నుంచి కిడ్నాప్ చేశాడు. కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ఓ ఇంట్లో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇలాంటి దురాగతాలు చాలానే జరిగాయి. అందుకే ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌ల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆకస్మిక, స్పెషల్ డ్రైవ్‌లు చేపడతామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఐటీ కారిడార్‌లో తిరిగే క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్‌తో మర్యాద.... నిబంధనల ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల వాహనాలు ఆర్జీఐఏ పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవి ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన ప్రీపెయిడ్ బూత్ చార్జీల ప్రకారమే డబ్బులు తీసుకోవాలి. విమానం దిగిన ప్రయాణికుడు జంటనగరాల్లో వెళ్లాల్సిన ప్రాంతానికి ఎంత చార్జీ అవుతుంతో అక్కడ ప్రీ పెయిడ్ బూత్‌లోనే నిర్ణయిస్తారు. ప్రయాణికుడు అక్కడే డబ్బు చెల్లిస్తే ఓ రసీదు ఇస్తారు. తన గమస్థానానికి చేరాక ప్రయాణికుడు దానిని డ్రైవర్ ఇవ్వాలి. ఆ రసీదును సదరు డ్రైవర్ ప్రీ పెయిడ్ బూత్‌లో చూపిస్తే చార్జీలు చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల క్యాబ్ డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేయడాన్ని నిలువరించడంతో పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చేందుకు అవకాశముంది. క్యాబ్‌లు, డ్రైవర్ల పూర్తి వివరాలు ప్రీ పెయిడ్ బూత్‌ల్లో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ప్రయాణికులతో మర్యాదగా నడుచుకునేందుకు ఆస్కారముంటుంది. ప్రస్తుతం ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విమానాశ్రయంలో నడుస్తున్న ప్రీ పెయిడ్ బూత్‌లో 180 క్యాబ్‌లు రిజిస్టరై ఉన్నాయి. వీటితో పాటు పది నెలల క్రితం అందుబాటులోకి తెచ్చిన షీ క్యాబ్ కూడా మహిళా ప్రయాణికులను గమస్థానాలకు చేరవేస్తున్నాయి. -
ఐఆర్సీటీసీ భారీ విమాన ప్రయాణ ఆఫర్లు
సాక్షి, సిటీబ్యూరో: దసరా సెలవుల్లో సరదాగా విహార యాత్రలకో... పుణ్య క్షేత్రాల సందర్శనకో వెళ్లాలని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేసింది. దేశ, విదేశీ పర్యటనల కోసం ఫ్లైట్ ప్యాకేజీలను ప్రకటించింది. హాంకాంగ్, షంజన్, మకావూ, దుబాయ్‌తో పాటు మొట్టమొదటిసారి గోవా, తిరుపతికి సైతం ఫ్లైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లైట్ ప్యాకేజీలకు పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న దృష్ట్యా దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. భోజనం,రోడ్డు రవాణా, హోటళ్లలో బస వంటి అన్ని సదుపాయాలతో ప్యాకేజీలను రూపొందించడం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు ఐఆర్సీటీసీపై ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. ఒకసారి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న తరువాత అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పర్యాటకులకు బీమా సౌకర్యం ఉంటుంది. దుబాయ్ పర్యటన ... అక్టోబర్ 10వ తేదీ నుంచి 14 వరకు ఈ పర్యటన ఉంటుంది. దుబాయ్, అబుదాబి నగరాలను సందర్శిస్తారు. బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్, గోల్డ్ షాపింగ్, షేక్ జాయద్ మసీదు, తదితర ప్రాంతాల పర్యటన ఉంటుంది. భోజనం, వసతి, రోడ్డు రవాణా వంటి అన్ని సదుపాయాలతో కూడిన ఈ ప్యాకేజీ చార్జీ రూ.62,800. గోవాకు ఫ్లైట్ ప్యాకేజీ... ఇప్పటి వరకు గోవాకు రైలు ప్యాకేజీలను మాత్రమే ప్రకటించిన ఐఆర్సీటీసీ మొట్టమొదటిసారి దసరా సెలవుల సందర్భంగా ఫ్లైట్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ వరకు ఈ పర్యటన ఉంటుంది. 21న మధ్యాహ్నం 12.50 గంటలకుSహైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో బయలుదేరి 2.15కు గోవా చేరుకుంటారు. తిరిగి 24వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు గోవా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.45కు హైదరాబాద్ చేరుకుంటారు. సౌత్, నార్త్ గోవా, ఓల్డ్ గోవా చర్చి, బీచ్‌లు, ఆలయాలు, బోట్ రైడింగ్, తదితర సదుపాయాలతో కూడిన ఈ పర్యటన చార్జీ రూ.18,970. ఈ మొత్తానికే అన్ని వసతులు, రోడ్డు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు. తిరుపతికి ఫ్లైట్‌లో.... తిరుపతికి రెగ్యులర్‌గా రైళ్లలో వెళ్లే ప్రయాణికులు దసరా సెలవుల్లో సరదాగా విమాన ప్రయాణం చేయవచ్చు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 21న రెండు ఫ్లైట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 30న ఉదయం 9.25కు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 1న రాత్రి 8.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రాత్రి 9.35 కు హైదరాబాద్ చేరుకుంటారు. శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు. అన్ని వసతులతో కలిపి ఈ పర్యటన చార్జీ రూ.9775. బుకింగ్, ఇతర వివరాలకు ఫోన్ :040–27702407, 9701360647, 9701360609 చలో హాంకాంగ్.... హాంకాంగ్, షంజన్, మకావు నగరాల పర్యటన అక్టోబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. 8వ తేదీ తెల్లవారు జామున 1.50 గంటలకుSరాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ బయలుదేరుతుంది. ఉదయం 9.40కి హాంకాంగ్ చేరుకుంటుంది. తిరిగి 12వ తేదీ రాత్రి 9.15 గంటలకు హాంకాంగ్ నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12.30కు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో మొదటి రెండు రాత్రులు హాంకాంగ్‌లో గడుపుతారు. అక్కడి డిస్నీల్యాండ్, మేడం టుసార్ట్స్, వంద అంతస్థుల అతి ఎత్తయిన భవనం వంటి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం షంజన్ సిటీలో మినరల్ మ్యూజియం, లోటస్ స్క్వేర్, దివాంగ్ మాన్షన్, లోకల్ షాపింగ్, విండోస్ ఆఫ్ ది వరల్డ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక పర్యాటకుల స్వర్గధామంగా పరిగణించే మకావు సిటీలో ఎ–మా టెంపుల్, సెయింట్ పౌల్స్ చర్చి, సెనాడో స్క్వేర్, కుమ్ లమ్ స్టాచ్యూ, లోటస్ స్క్వేర్ ఉంటాయి. ఏసీ డీలక్స్ హోటల్లో వసతి, రవాణా, తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీ చార్జీ రూ.73,419 -
కూలిన దేవుని చెరువు కట్ట
బూడిదలో పోసిన పన్నీరైన ప్రజాధనం కట్టపైనుంచే తండాకు రోడ్డు గిరిజనులకు తప్పని తిప్పలు మెదక్: ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువు కట్ట పనులు నిర్మించిన వెంటనే చిరు జల్లులకే కూలిపోయింది. దీంతో ఆయకట్టు రైతులతోపాటు కట్టపై నుండి వెళ్లే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులోని దేవుని చెరువు మరమ్మతులకోసం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సుమారు రూ.20లక్షలు నిధులు మంజూరయ్యాయి. దీని నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావుతోపాటు డిప్యూటీ స్పీకర పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఆన్లైన్ టెండర్ ద్వారా పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ చెరువులోని నల్లమట్టిని పంట పొలాలకు తరలించడంతోపాటు మొరంలాంటి మట్టిని కట్టపై పోయించారు. కాని సరైన పద్ధతిలో పనులు చేపట్టక పోవడంతో ఇటీవల కురిసిన చిరుజల్లులకు కట్టపై పోసిన మట్టి కొట్టుకు పోయింది. కట్టనిర్మాణం చేపట్టే సమయంలో జేసీబీ ద్వారా సరైన స్టెప్పులు చేయక పోవడంతోనే కట్టపై మట్టి కిందకు జారిందని ఆయకట్టు రైతులతోపాటు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ కట్టపై నుంచేlగంగాపూర్ గిరిజన తండాకు రహదారి ఉంది. మట్టి కొట్టుకు పోవడంతో కనీసం కట్టపైనుంచి ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టకముందే కట్టపై నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు తిరిగేవని, నిర్మాణం చేపట్టాక కురిసిన వర్షానికి మట్టి కొట్టుకు పోయి అస్తవ్యస్తంగా మారిందంటున్నారు. తప్పిన ప్రమాదం గంగాపూర్ గిరిజన తండాకు ఈ కట్టపై నుంచే వెళ్తాం. గతంలో కట్టపై నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు తిరిగేవి. ఇటీవల మరమ్మతులు చేసిన తరువాత కురిసిన వర్షంతో మట్టి అంతా కొట్టుకు పోయి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కట్టపై నుంచి పొలాల్లోకి వెళ్తున్న ట్రాక్టర్ మట్టిలో కూరుకుపోయింది. అతికష్టం మీద ట్రాక్టర్‌ను పక్కకు తీశాం. లేనిచో పెద్ద ప్రమాదం జరిగేది. –మూడవత్ గణేష్, గిరిజన తండా కట్ట మళ్లీ నిర్మించాలి శమ్నాపూర్ దేవుని చెరువు కట్టను నాణ్యతతో నిర్మించక పోవడం వల్ల మట్టి కొట్టుకు పోయింది. కట్టను మళ్లీ నిర్మించాలి. కట్టపై నుంచే తండాకు వెళ్లాలి. –మూడవత్ శ్రీను, గిరిజన తండా మళ్లీ కట్ట నిర్మిస్తాం కట్టపై మట్టి పోసే సమయంలో స్టెప్పులు తవ్వించి నిర్మించాం. కాగా కట్ట బాగా ఎత్తులో ఉండటం వల్ల వర్షపునీటికి మట్టి కొట్టుకు పోయింది. కట్టను మళ్లీ నిర్మిస్తాం. –ఇరిగేషన్ జేఈ శ్రీధర్ -
‘మెట్రో’ వరం
మహిళలకు ప్రత్యేక బోగి అదనంగా మూడు బోగీల ఏర్పాటు బెంగళూరు: నమ్మమెట్రో మహిళలపై కరుణ చూపింది. ఈమేరకు వారి సౌకర్యార్థం ప్రత్యేక బోగి కేటాయించనుంది. అదేవిధంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మూడు బోగీలతో నడుస్తున్న నమ్మమెట్రోకు అదనంగా మరో మూడు బోగీలు చేర్చనున్నారు. నమ్మ మెట్రోలో భాగంగా 18.10 కిలోమీటర్ల పొడవున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో (పీక్ హవర్స్) ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. సగటున ఈ మార్గంలో రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారంటే మెట్రోకు డిమాండ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సంపిగేరోడ్-నాగసంద్ర మధ్య 12.4 కిలోమీటర్ల మార్గంలో కూడా సగటున రోజుకు 33 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూడు కోచ్‌లతో నడుస్తున్న అదనంగా మరో మూడు కోచ్‌లను చేర్చనున్నారు. అందులో ఒకటి మహిళలకు కేటాయించనున్నారు. దీని వల్ల ప్రయాణికులు మరింత సౌకర్యవంతగా ప్రయాణించడమే కాకుండా సంస్థకు ఆదాయం కూడా పెరుగుతుందని నమ్మమెట్రో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో ఇకపై రైలు అందుబాటు సమయం కూడా పెంచుతూ నమ్మమెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉదయం 7:15 గంటల నుంచి 8 గంటల వరకూ ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు, 8 గంటల నుంచి 10 గంటల వరకూ 6 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వస్తుంది. శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 10 నిమిషాలకు ఒక రైలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ 8 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. కాగా, ప్రస్తుతం 10 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. -
ప్రయాణికుల భద్రతకు ఆర్పీఎఫ్ భరోసా
ద.మ.రైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సంజయ్ సాంకృత్యాయన్ సాక్షి, హైదరాబాద్ : ‘ప్రయాణికులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ప్రతిక్షణం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యం’ అని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య భద్రతాధికారి సంజయ్ సాంకృత్యాయన్ అన్నారు. ప్రయాణికుల భద్రతపై 182 టోల్ ఫ్రీ నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయవచ్చని చెప్పారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం జీఆర్పీ పోలీసులతో కలసి రైల్వే భద్రతాదళం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకొనేవిధంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక తనిఖీలు, నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఇక్కడ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ డీఐజీ ఈశ్వర్రావు, ఎంఎస్ సునిల్, సుమతి శాండిల్య తదితర ఉన్నతాధికారులతో కలసి మాట్లాడారు. సెక్యూరిటీ హెల్ప్‌లైన్(టోల్‌ఫ్రీ) నంబర్ 182కు ఈ ఏడాది 530 ఫిర్యాదులు అందగా ఆర్పీఎఫ్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుందన్నారు. ఇంట్లోంచి పారిపోయిన, తప్పిపోయిన 293 మంది చిన్నపిల్లలను ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆర్పీఎఫ్ రక్షించిందని చెప్పారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘రిస్తా’ మొబైల్ యాప్ ద్వారా 800 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. నిర్భయనిధి నుంచి మంజూరైన రూ.50 కోట్లతో 78 రైల్వేస్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
రూటే.. సెపరేటు..
సిటీబస్సుల తీరు ఇష్టారాజ్యం బస్‌బేలను కాదని రోడ్డుపైనే నిలిపేస్తున్న వైనం అమలుకు నోచని క్యూ రెయిలింగ్ సిటీబ్యూరో: నగర ప్రజల ప్రయాణానికి అనువుగా వేలాది సిటీబస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఎప్పుడు కదులుతుందో తెలియదు. ఒకదాని వెనుక ఒకటి ఒకేసారి నాలుగైదు వస్తాయి.. రోడ్డు మధ్యలోనే ఆగుతాయి.. వెనుక వచ్చే వేలాది వాహనాలకు బ్రేకులు వేస్తాయి. నగరంలో ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఒక్కరికీ అనుభవమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నడుస్తున్న సిటీ బస్సుల కారణంగా నగరంలో ట్రాఫిక్ భయానకంగా మారింది. బస్టాపులను, బస్‌బేలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా నడిరోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఆర్టీసీ డ్రైవర్లకు అలవాటుగా మారింది. కొన్ని బస్సుల రాకపోకలు, అడ్డగోలు డ్రైవింగ్ కారణంగా నిత్యం లక్షలాది వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ ఘోరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ సిటీ బస్సుల విచక్షణా రహితమైన డ్రైవింగ్ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. సిటీలో 1913 బస్టాపులు, 134 బస్‌బేలు ఉన్నాయి. వీటిలో బస్సులు ఆగకపోవడంతో ఆటోలకు, ప్రైవేటు వాహనాలకు అడ్డాలుగా మారాయి. గుంత.. వదలని చింత.. నిత్యం వందలాది వాహనాలు రద్దీగా తిరిగే రోడ్డు.. గురువారం ఉదయం ఎప్పటిలాగే సాగిపోతున్నాయి. రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో ఓ కారు పడిపోయింది. పదిమంది కలిసి బయటకు లాగేందుకు ప్రయత్నించారు.. వీలుకాలేదు.. వెనుక నుంచి మరో పదిమంది నెట్టారు.. కదలిక వచ్చింది. ఇదంతా జరగడానికి అరగంట సమయం పట్టింది. ఇంతలో మరో కారు.. ఇలా వరుసగా పడిపోతున్నాయి. వెనుకా ముందూ.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. యూసుఫ్‌గూడ పరిధిలోని ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద పరిస్థితి ఇది. ఇక్కడ గతంలో కేబుల్ నిర్మాణం కోసం గతంలో రోడ్డును తవ్వి వదిలేశారు. మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడి పరిస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇది జరిగి నెలరోజులు గడిచింది. బుధవారం రాత్రి మట్టి తెచ్చి రోడ్డు మధ్యలో పోసి వదిలేశారు. గురువారం ఉదయం ఓ పక్క మట్టి కుప్పలు.. మరోపక్క గుంతలో వాహనాలు ఎటూ పోలేని పరిస్థితి. వచ్చిన ప్రతి కారూ రోడ్డు మధ్యలోని గుంతలో పడిపోవడం పరిపాటిగా మారింది. స్థానికులే ఆ కార్లను బయటకు లాగి పంపించారు. పైగా అది మూడు రోడ్ల జంక్షన్ కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో వాహనదారులు నరకం చూశారు. స్థానికంగా టైర్లకు పంక్చర్లు వేసే ప్రకాష్ మట్టితో గుంతలు కప్పడంతో వాహనదారులకు ఊరట లభించింది. - జూబ్లీహిల్స్ యమపాశాలు.. శ్రీనగర్‌కాలనీ ప్రధాన రోడ్డుకు ఓ వైపు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అదే మార్గంలో స్తంభాలకు కట్టిన కేబుళ్లను తొలగించి దారిపొడవునా పడేశారు. దీంతో ఆ దారిలో వెళుతున్న వాహనాలకు ఈ తీగలు చిక్కుకుని పడిపోతున్నారు. ఈ కేబుళ్లను దాటుకుని వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు హడలిపోతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ఔరా.. ప్రతిభ..! పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి వ్యర్థాలకు అర్థం చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు, జానకి దంపతుల కుమార్తెలు అనూష, అశ్విని దూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకరు 10, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. రాజు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. కాగా అనూష, అశ్విని చదువుల్లో రాణిస్తూ వెస్టేజీతో జుమ్కీలు, చెవి కమ్మలు తయారు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. కాగితం, అట్ట ముక్కలు, కలర్ పేపర్లు, గమ్, పూలు, గాజు పెంకులతో రంగు రంగుల చెవి కమ్మలు, చెవి హ్యాంగింగ్స్‌ను నిమిషాల్లో తయారు చేసి చూపిస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు తయారు చేసిన వస్తువులు చూపరులను ఆకట్టుకోవడమే కాదు.. వాటిని ధరించి ఆనందిస్తున్నారు కూడా. - సుభాష్‌నగర్ అటకెక్కిన ‘క్యూ రెయిలింగ్’.. ముంబయి తరహాలో సిటీ బస్సుల రాకపోకలపై నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ‘క్యూ రెయిలింగ్’ ఏర్పాటు కోసం చేసిన అధ్యయనం అటకెక్కింది. కూకట్పల్లి, ఈఎస్ఐ, కేపీహెచ్‌బీ, ఎన్ఎండీసీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, నానల్‌నగర్, బాపూనగర్, లక్డీకాపూల్, నాంపల్లి, గృహకల్ప, లోతుకుంట, బోయిన్పల్లి, తదితర చోట్ల బస్‌బేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గద్దర్‌కు పురస్కారం ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డిలకు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ‘సినారె విశిష్ట పురస్కారాన్ని’ ప్రదానం చేశారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సినారె జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో ఈ వేడుక నిర్వహించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ పి.విజయబాబు అధ్యక్షతన సభలో గద్దర్ మాట్లాడుతూ అవార్డులు బాధ్యతను పెంచుతాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, అలనాటి నటి జమున రమణారావు, వ్యాఖ్యాత మోహన్ కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో -
రైలు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధుల డుమ్మా
సమాచారం ముందుగా ఇవ్వలేదని ఆగ్రహం రైల్వే, రాష్ట్ర అధికారుల మధ్య పొరపచ్చాలు విజయవాడ : రైలు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు పలువురు డుమ్మాకొట్టారు. విజయవాడ - ధర్మవరం (17215నంబరు) రైలును మంగళవారం న్యూఢిల్లీ నుంచి రిమోట్ వీడియో లింకు ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఆ రైలుకు విజయవాడలో రైల్వే జీఎం ఆధ్వర్యంలో అధికారులు పచ్చజెండా ఊపి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు రైల్వేస్టేషన్లో ఎంతో ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఇప్పటి వరకు రైళ్లు మంజూరు చేయలేదని తప్పుబట్టిన తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు కొత్త రైలు ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మాకొట్టారని రైల్వే వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్ విజయవాడ నుంచి రాయలసీమవైపు బయలుదేరే రైళ్లు కావాలని ఈ ప్రాంత ప్రయాణికులు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. వారు కోరుకున్నట్లుగానే విజయవాడ నుంచి రాయలసీమకు వైపు వెళ్లేలా విజయవాడ - ధర్మవరం రైలును రైల్వేమంత్రి సురేష్ ప్రభు మంజూరు చేశారు. ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తరువాత రాష్ట్రానికి మంజూరు చేసిన రెండో రైలు ఇది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం గత నెలలో అమరావతి- సికింద్రాబాద్ మధ్య కొత్త రైలును మంజూరు చేసిన విషయం విదితమే. రైల్వే, రాష్ట్ర యంత్రాంగం మధ్య పొరపచ్చాలు.... పుష్కరాల పేరుతో మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే తాము ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటూ జిల్లా యంత్రాంగం, మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలను రైల్వే తోసిపుచ్చుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు చివర్లో ఉన్న స్థలాన్ని బలవంతంగా తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తే రైల్వే అధికారులు అడ్డుకున్నారు. పుష్కర ఘాట్ల నిర్వహణలో జిల్లా, రైల్వే అధికారుల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే మంత్రులు కొత్త రైలు ప్రారంభోత్సవానికి డుమ్మాకొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కరోజు ముందే పిలిచారని... కొత్త రైలు మంజూరు చేసిన విషయం రైల్వే అధికారులకే ఆలస్యంగా అందింది. దీంతో అప్పటికప్పుడు కార్యక్రమాన్ని నిర్ణయించుకుని రాష ్టమ్రంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలిబుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)తో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి పేర్లతో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఒక్క రోజు ముందుగా తమకు తెలపడమేమిటంటూ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహించి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని సమాచారం. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య రైలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరైన మంత్రులు, తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలో ఉండటంతో తమతమ పనుల్లోబిజీబిజీగా ఉండీ ఈ కార్యక్రమానికి రాలేదని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. -
డ్రైవరు లేకుండానే కదిలిన బస్సు
* విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వైనం * తృటిలో తప్పిన ప్రమాదం ఆత్మకూరురూరల్ : న్యూట్రల్లో ఉన్న బస్సు డ్రైవరు లేకుండానే ముందుకు కదిలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని డ్రైనేజీ కాలువలోకి ఒరిగిన సంఘటన ఆత్మకూరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. బస్సు నిండా ప్రయాణికులున్నా అదృష్టవశాత్తుఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు మర్రిపాడు మార్గంలోని గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. అయితే అదే సమయంలో నెల్లూరు మార్గంలో ప్రయాణికులు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది ఆ బస్సును నెల్లూరు రూట్లో తిప్పేందుకు నిర్ణయించారు. దీంతో బస్సునిండా ప్రయాణికులు ఎక్కారు. డిపో నుంచి వెలుపలికి వచ్చిన బస్సుకు నెల్లూరు బోర్డు లేకపోవడంతో న్యూట్రల్లో ఉంచి డ్రైవరు బోర్డు తెచ్చేందుకు డిపోలోకి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు ముందుకు వెళ్లి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి ఒరిగింది. స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడ్డాయి. అదే సమయంలో సమీపంలోని విద్యుత్ సిబ్బం ది ఏఈ ఆధ్వర్యంలో తీగల మరమ్మత్తులు చేపట్టి ఉండటంతో సరఫరా నిలిపివేశారు. బస్సుపై తీగలు తెగిపడిన సమయంలో సరఫరా లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. విద్యుత్ స్తంభం విరిగిపోయింది. సమీపంలోని పలువురు ఆందోళన చెందుతూ బస్సువద్దకు గుమిగూడారు. ప్రయాణికులు సైతం కొంతసేపు కేకలు వేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కట్టలు విరిగి.. రామన్నగారిపల్లి(కలువాయి): చింతలపాళెం వెళ్తున్న బస్సు కట్టలు విరిగి అదుపుత ప్పిన సంఘటన సోమవారం సాయంత్రం రామన్నగారిపల్లి సమీపంలో జరిగింది. వివరాలు..కలువాయి నుంచి చింతళపాళెం వెళ్తున్న బస్సుకు రామన్నగారిపల్లి వద్దకు వచ్చే సరికి కట్టలు విరిగిపోయాయి. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయి తాటిమానుకు ఆనుకుని నిలిచిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసి ఉంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
బాబోయ్.. టి‘కేటు’గాళ్లు!
విశాఖ రైల్వేస్టేషన్లో ఘరానా మోసగాళ్లు క్షణాల్లో టికెట్ మార్చేస్తున్న వైనం దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు టికెట్లు జారీ చేసే వారిపై నెపాన్ని నెడుతున్న వైనం తాటిచెట్లపాలెం: అది విశాఖ రైల్వే స్టేషన్. అప్పటికే ఓ వ్యక్తి చెన్నై వెళ్లేందుకు టికెట్ తీసుకుని రైలు కోసం నిరీక్షిస్తున్నాడు. ఇంతలో.. హలో బాగున్నారా.. అంటూ ఓ అపరిచితుడి పలకరింపు. సంబంధిత వ్యక్తి ఎవరో తెలియకపోయినా .. ఆ బాగున్నానండీ అంటూ మాటల్లో పెట్టి.. టికెట్ మార్చేశాడు. పైగా.. ‘మీకు.. టికెట్ కౌంటర్లో అనకాపల్లి టికెట్ ఇచ్చారు. చూసుకోలేదా..’ బిత్తరపోయాడు అమాయకుడు. కౌంటరు వద్దకు పరుగులు తీశాడు. ఇంకేముంది.. ఇదే అదనుగా.. సదరు మొదటి వ్యక్తి రెలైక్కి హ్యాపీగా వెళ్లిపోయాడు. ఇదేమీ కథ కాదు.. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జరుగుతున్న మోసాల్లో ఇదో రకం.. అంతే! వివరాళో ్లకెళితే... విశాఖ రైల్వేస్టేషన్లో కేటుగాళ్లు తయారవుతున్నారు. వాళ్లు చేరుకోవాల్సిన గమ్యానికి సరిపడా టికెట్ధర లేక ఈ తరహామోసాలకు తెగబడుతున్నారు. సమీప ప్రాంతాలకు రూ.30 లోపు టికెట్ తీసుకోవడం.. ఆపై వారు వెళ్లాల్సిన ప్రదేశానికే చేరే ప్రయాణికులపై కన్నేయడం.. వారిని బురిడీకొట్టించడం.. చాకచక్యంగా చక్కబెట్టేస్తున్నారు. మాటల్లో పెట్టి టికెట్ మార్చేస్తున్నారు. గతేడాది ఈ తరహా మోసాలు వెలుగుచూసాయి. ఆ సమయంలో బాధితులు అప్పటి ఆర్పీఎఫ్ సీఐను ఆశ్రయించగా.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. కానీ రూ.500 టికెట్‌కు ఎందుకీ ఎంక్వైరీలనుకుని వదిలేశారు. సేవాభావంతో ఆయనతోపాటు ఉద్యోగులందరూ తలోచేయి వేసి బాధితుడికి టికెట్ తీసి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా వారం క్రితం మరో సంఘటన జరిగినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సికిందరాబాద్ వెళ్దామని టికెట్ తీసుకుంటే అతని విషయంలో ఇదే జరిగింది. ఓ కేటుగాడు అతడి టికెట్‌ను మార్చేశాడు. దీంతో బాధితుడు ఎక్కాల్సిన రైలు అందుకోలేక ఇబ్బందిపడ్డారు. రైల్వే అధికారులకు తెలిపినా వారు కూడా నిట్టూర్చారు. దీంతో బాధితుడు దిక్కుతోచక వెనుదిరిగాడు. ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా వహించాలని, ఇబ్బందులెదురైతే తమను సంప్రదించాలని స్టేషన్‌లోని ఆర్పీఎఫ్ అధికారులు కోరుతున్నారు. -
ఆర్టీసీకి ‘మెట్రో’ బ్రేక్
గ్రేటర్లో రోజుకు 3000 ట్రిప్పుల రద్దు మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ రద్దీయే కారణం రోజుకు 1.5 లక్షల ప్రయాణికులపై ప్రభావం సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు సిటీ బస్సుకు నిర్ణయించిన రన్నింగ్ టైమ్ 35 నిమిషాలు. కానీ ఇప్పుడు గంట దాటినా గమ్యానికి చేరుకోవడంలేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, కొండాపూర్, బోరబండ, మాదాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, మెహదీపట్నం, చార్మినార్, తదితర మార్గాల్లో నడిచే సిటీ బస్సులు ట్రాఫిక్ రద్దీ కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. బస్సులకు కేటాయించిన రన్నింగ్ టైమ్ ట్రాఫిక్‌లోనే హరించుకు పోతోంది. దీంతో గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో ప్రతి రోజు 3000కు పైగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. 1.5 లక్షల మంది ప్రయాణ సదుపాయాన్ని కోల్పోతున్నారు. బేగంపేట్, జేబీఎస్, సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్డి, కోఠి, మలక్‌పేట్, తదితర మార్గాల్లో జరుగుతున్న మెట్రో పనులు, ట్రాఫిక్ రద్దీ ట్రిప్పుల రద్దుకు కారణమవుతున్నాయి. ఆర్టీసీకి భారీ నష్టం.. బేగంపేట్‌లో చేపట్టిన మెట్రో పనుల వల్ల సికింద్రాబాద్-అమీర్‌పేట్ మార్గంలో 500 బస్సులను రద్దు చేశారు. తిరుగుతున్నవాటిలో ఏ ఒక్కటీ నిర్ణీత వేళకు గమ్యం చేరడం లేదు. ఈ ఒక్క రూట్లోనే వేలాది మంది ప్రయాణికులు సకాలంలో బస్సులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం సైతం భారీగా ృధా అవుతోంది. ఒక లీటర్ డీజిల్ వినియోగానికి కనీసం 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన బస్సులు.. మూడు కిలోమీటర్ల కంటే ముందుకు వెళ్లడం లేదు. నగర శివారు ప్రాంతాలు మినహాయించి మిగతా అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. ట్రిప్పుల రద్దుతో ప్రయాణికుల ఆక్యుపెన్సీ సైతం పడిపోతుంది. ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 354.75 కోట్ల న ష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది పెను ముప్పుగా మారింది. ఇబ్బందులు ఇలా.. జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద చేపట్టిన మెట్రో పనులతో సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, మేడ్చెల్, సుచిత్ర, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిర్ధారించిన రన్నింగ్ టైమ్‌కు చేరుకోక పోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవ్సాలిన బస్సులు 40 నిమిషాలు దాటినా చేరుకోవడం లేదు. సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద చేపట్టిన మెట్రో పనుల వల్ల సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా కోఠి, నాంపల్లి, ఆఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు బ్రేకులు పడుతున్నాయి. మలక్‌పేట్, కోఠిలో జరుగుతున్న పనులతో దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం, పటాన్ చెరు వైపు బస్సుల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. భారీగా ఇంధన వినియోగం.. 3850 బస్సులకు ప్రతి రోజు 1.75 లక్షల ఇంధనం వినియోగమవుతోంది. గంటల తరబడి బస్సులు ట్రాఫిక్‌లో నిలిచిపోవడం వల్ల వేలకొద్దీ లీటర్ల డీజిల్ ృధా అవుతుంది. ఒక లీటర్ డీజిల్‌కు 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన బస్సులు 2 నుంచి 3 కిలోమీటర్లు దాటడం లేదు. ప్రతి రోజు 5 వేల నుంచి 10 వేల లీటర్ల డీజిల్ దుర్వినియోగవుతున్నట్టు అంచనా. -
సమాధుల చెంతనే హాయిగా పడుకోవచ్చు!
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో చైనా కమ్యూనిటికి సుందరమైన సమాధులున్నాయి. వీధి వీధంతా ఎప్పుడూ సమాధులతో కళకళలాడుతుంటుంది. తమ అప్తులను సమాధి చేసిన కుటుంబాలు తరచుగా అక్కడికెళ్లి సమాధులను సందర్శించడమే కాకుండా కొన్ని రోజుల పాటు సమాధుల చెంతనే నివసించి పిల్లా పాపలతో సేదదీరుతుంటారు. అందుకు వారికి కావాల్సిన ఏసీ బెడ్ రూమ్‌లు, విశాలమైన హాళ్లు, అటాచ్డ్ కిచెన్లు, బాతురూమ్‌లు ఉన్నాయి. పోయిన వారిని తలుచుకుంటూ ఉన్నవారు అక్కడ ఆనందంగా గడిపేయవచ్చు. అందుకనే ఆ టూంబ్స్కు ‘ది బెవర్లీ హిల్స్ ఆఫ్ ది డెడ్’ అని నిక్ నేమ్ కూడా వచ్చింది. ఈ మధ్య సందర్శకుల తాకిడీ కూడా పెరగడంతో వారి సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వేడి వేడి వంటకాలను వడ్డించే ఏసీ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ స్పానిష్ ఆక్రమణలో ఉన్నప్పుడు కేథలిక్ శ్మశానాలకు చైనీయులను రాణించేవారు కాదు. దాంతో సంపన్న వర్గానికి చెందిన చైనీయులు పోయిన తమ వారి కోసం ఇలా కళావైభవం ఉట్టిపడేలా సమాధులను నిర్మించారు. ప్రాచీన వాస్తుకు ఆధునిక హంగులను జోడించడంతో టూంబ్స్ కాస్త సందర్శనీయ స్థలాలుగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా చనిపోయిన చైనా నాయకులను కూడా ఇక్కడే సమాధి చేశారట. అందుకని గత చరిత్రపట్ల ఆసక్తిగల పర్యాటకులు కూడా వస్తున్నారు. కానీ వారు ఇందులో నివసించడానికి వీల్లేదు. సమాధులున్న కుటుంబాలకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది. బతికున్న వారికే ఉండడానికి ఇల్లులేక చస్తుంటే చచ్చిన వారికి ఇంత సుందరమైన సమాధులు ఎందుకో! అంటూ పర్యాటకులు చేసే కామెంట్లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయి. ఇదేమైనా ఈ ప్రాంతంలో సమాధులకు డిమాండ్ విపరీతంగా పెరిగిన దృష్ట్యా టూంబ్స్ ప్రాంతాన్ని విస్తరించాలని మనీలా నగర పాలిక సంస్థ ఇప్పుడు నిర్ణయించింది. -
నిలువ నీడ ఏదీ?
బస్ షెల్టర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం మండుటెండలో ప్రయాణికుల పడిగాపులు ఏటా అదేతీరు... మండిపడుతున్న నగర ప్రయాణికులు 630 చోట్ల షెల్టర్లు అవసరం సిటీబ్యూరో: నగరంలో బస్షెల్టర్ల నిర్మాణంపై ఏళ్లకేళ్లుగా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రతి ఏటా ప్రభుత్వం ప్రతిపాదనలతోనే సరిపెట్టేస్తోంది. దీంతో నిలువ నీడలేని దుస్థితిలో ప్రయాణికులు మండుటెండల్లో బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నెల మొదటి వారంతోనే ఎండ నిప్పులు చెరుగుతోంది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతను ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం గంటల తరబడి షెల్టర్లు లేని బస్టాపుల్లోనే ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తుంది. విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. నగరంలోని సుమారు 2000 చోట్ల బస్టాప్‌లు ఉన్నాయి. కోఠీ, సనత్‌నగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ రెతిఫైల్ వంటి కొన్ని ప్రాంతాల్లో బస్స్టేషన్లు, ఇందిరాపార్కు, లక్డీకాపూల్, కేపీహెచ్‌బీ, తార్నాక, ఎల్బీనగర్ వంటి ప్రధాన రహదారులపై ఉన్న బస్టాపులు, బస్‌బేల్లో మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. చాలా చోట్ల ప్రయాణికులు మండుటెండల్లోనే నించొని బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. 630 చోట్ల షెల్టర్లు అవసరం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క రెతిఫైల్ బస్‌స్టేషన్ మినహా మరెక్కడా సరైన షెల్టర్లు లేవు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాపులో కొన్ని రూట్లకు మాత్రమే షెల్టర్ సదుపాయం ఉంది. అల్వాల్, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, ఆఫ్జల్‌గంజ్, కోఠీ, చార్మినార్ వైపు వెళ్లే ప్రయాణికులు ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే బస్టాపులోనూ ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని షెల్టర్లు లేవు. రోడ్డుపైనే నిలుచుంటున్నారు. రామంతాపూర్, అంబర్పేట్, తదితర చోట్ల షెల్టర్లు లేకపోవ డంతో ప్రయాణికులు ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడ నిల్చుంటున్నారు. అమీర్‌పేట్ మైత్రీవనమ్, సారథి స్టూడియో, ఎర్రగడ్డ చౌరస్తా, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, జెక్కాలనీ, ఎర్రగడ్డ చౌరస్తా, బల్కంపేట్లలో షెల్టర్లు లేవు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2000 బస్టాపుల్లో ప్రస్తుతం 1370 చోట్ల బస్షెల్టర్లు ఉన్నాయని, మరో 630 చోట్ల లేవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు వీటి నిర్మాణం చేపట్టవలసి ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ నగరంలోని చాలా చోట్ల మెట్రో నిర్మాణ పనుల దష్ట్యా షెల్టర్లను తొలగించారు. మరోవైపు బస్టాపులు లేని చోట కేవలం వ్యాపార ప్రకటనల కోసం షెల్టర్లును ఏర్పాటు చేశారు. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ వంటి జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో బస్టాపులతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన షెల్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల చిరువ్యాపారులు, ఇతరులు ఆక్రమించుకొని వాటి ఉనికినే మార్చివేశారు. ఆర్టీసీ గుర్తించిన 630 షెల్టర్ల కోసం గత సంవత్సరమే జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా లక్షలాది మంది మండుటెండల్లో మలమల మాడుతూ బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. క్యూ రెయిలింగ్దీ అంతే సంగతులు... ముంబయి తరహాలో క్యూ రెయిలింగ్ కోసం రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పట్లో మం త్రులు, ఉన్నతాధికారులు ముంబయికి వెళ్లి క్యూ పద్ధతిని అధ్యయనం చేసి వచ్చారు. అబిడ్స్ మార్గంలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ట్రాఫిక్ రద్దీ, ఇతర కారణాల దష్ట్యా ఆచరణ సాధ్యం కాదని విరమించారు. ఆ తరువాత నగరంలోని 152 ప్రాంతాల్లో బస్‌బేలను ఏర్పాటు చేసి క్యూ రెయిలింగ్ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లక్డీకాఫూల్, నాగోల్, ఎల్బీనగర్, సుచిత్ర, కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్ వంటి పలు ప్రాంతాల్లో రెయిలింగ్‌కు అవకాశం ఉన్న చోట బస్‌బేలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. -
కష్టాల బస్టాండ్లు
బెజవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మినహా జిల్లాలోని రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణాలన్నింటినీ ఏదో ఒక సమస్య పట్టిపీడిస్తోంది. నిత్యం వివిధ ప్రదేశాలకు ప్రయాణించే నాలుగు లక్షలమంది ప్రయాణికులకు బస్టాండ్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు కరువవుతున్నాయి. ఇక గట్టిగా వాన పడితే మచిలీపట్నం బస్టాండు పెద్ద చెరువును తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం.. వెరసి బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని బస్టాండ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 14 డిపోలు, 37 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు 1419 బస్సులు ఉన్నాయి. వీటిలో 240 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 4 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. ఎక్కడైనా బస్టాండ్‌లో బస్సు ఆగితే దాహం తీర్చుకునేందుకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి. దూరప్రాంతాలకు వెళ్లే వారు బస్సు ఎక్కేందుకు బస్టాండ్‌కు వస్తే కూర్చునేందుకు బల్లలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోని బస్టాండ్ల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు, బాత్రూమ్ల వద్ద పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేయటంతో దుర్గంధం ప్రయాణికులతో సహవాసం చేస్తోంది. జిల్లాలోని వివిధ బస్టాండ్లలో పరిస్థితిపై ‘సాక్షి’ విజిట్ చేయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. -మచిలీపట్నం జగ్గయ్యపేట బస్టాండ్‌లో ఒక లైటు సక్రమంగా వెలగని పరిస్థితి. ఫ్యాన్లు తిరగవు. తాగునీరు అందుబాటులో లేదు. దాతలు ఇచ్చిన కూలర్లు బస్టాండ్ ఆవరణలో ఉన్నా అవి పనిచేయటం లేదు. రాత్రి సమయంలో బస్టాండ్ ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి సమయంలో కంట్రోలర్ అందుబాటులో ఉండకపోవటంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మందుబాబుల గొడవలు నిత్యకృత్యంగా మారాయి. మైలవరం బస్టాండ్ నుంచి పొందుగల, పోరాటనగర్, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేవు. ఎన్నాళ్లుగా సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు స్పందించటం లేదు. జి.కొండూరులో బస్టాప్ కూడా లేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు.తిరువూరు బస్టాండ్‌లో ఆరు సంవత్సరాలుగా క్యాంటీన్ సౌకర్యమే లేదు. వాణిజ్య సముదాయం సగం మాత్రమే నిర్మించి నిలిపివేశారు. మరుగుదొడ్లు మరమ్మతుల నిమిత్తం మూసివేశారు. సెప్టిక్‌ట్యాంక్ మూత పగిలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. లైట్లు, ఫ్యాన్లు లేనేలేవు. మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పామర్రు బస్టాండ్ ఆవరణలో మురుగునీరు నిత్యం నిలిచిపోయి ఉంటుంది. మరుగుదొడ్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కూచిపూడి, మొవ్వ బస్టాండ్ ఆవరణ ఆక్రమణకు గురైంది. తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పెడన బస్టాండ్ రాళ్లు లేచిపోయాయి. నెల రోజుల క్రితమే మరమ్మతులు చేసినా మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. సెప్టిక్‌ట్యాంకు నిండి వ్యర్థాలు రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. మరుగుదొడ్డికి సంబంధించిన పైప్‌ను డ్రెయిన్‌లో కలిపివేయటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆర్టీసీ బస్సుల కన్నా ఆటోవాలాలే ఈ బస్టాండ్‌ను అధికంగా వినియోగించుకుంటున్నారు. బంటుమిల్లి బస్టాండ్ ట్యాక్సీస్టాండ్గా మారింది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మోపిదేవిలో బస్టాండ్ ఉన్నా లోపలకు బస్సులు వెళ్లటం లేదు. రెండు సంవత్సరాల క్రితమే మరుగుదొడ్లు పాడైపోయాయి. అక్కడ ఉన్న చేతిపంపు విరిగిపోయింది. నాగాయలంక బస్టాండ్ గోతులమయంగా మారటంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలబడుతోంది. కోడూరు బస్టాండ్ ఊరికి శివారున ఉండటంతో అక్కడకు ఎవరు వెళ్లలేని పరిస్థితి. అవనిగడ్డ బస్టాండ్‌లో డిపో మేనేజరు కార్యాలయంపై తాగునీటి కుండీని ఏర్పాటు చేశారు. పగలు సమయంలో తాగునీరు వేడిగా వస్తోంది. రెండు కుండలు ఏర్పాటు చేసినా కొద్దిసేపటికే ఈ తాగునీరు అయిపోతోంది.బందరు బస్టాండ్ ఆవరణలోకి అడుగు పెట్టగానే దుర్వాసన ఆహ్వానం పలుకుతోంది. సెప్టిక్ ట్యాంకు సిమెంటు బల్లలు పగిలిపోవటంతో రేక్‌లు అడ్డుగా పెట్టారు. లైట్లు సక్రమంగా వెలగవు. తాగునీటి కోసం కూలర్ ఉన్నా సక్రమంగా పనిచేయదు.కలిదిండిలోని బస్టాండ్ 20 సంవత్సరాలుగా మూతపడింది. ఈ ప్రాంగణం ఆక్రమణలకు గురైంది. లోతట్టుగా ఉండటంతో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతోంది. చెత్త వేసేందుకు ఉపయోగిస్తున్నారు. ముదినేపల్లి, కైకలూరు బస్టాండ్లను నెలరోజుల కిందట రూ. 8 లక్షలతో మరమ్మతులు చేయించటంతో ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. మండవల్లిలో బస్షెల్టరే గతి. గుడివాడ బస్టాండ్ 30 సంవత్సరాలుగా ప్రయాణికులకు సౌకర్యాలు అందించలేకపోతోంది. ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు చేరుతోంది. మహిళల మరుగుదొడ్లు, బాత్రూమ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గన్నవరం బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగవు. మంచినీళ్లు లేవు. వాటర్ కూలర్లు ఉన్నా పక్కనపెట్టేశారు. హనుమాన్‌జంక్షన్ బస్టాండ్‌లో ఆరు నుంచి 11వ ఫ్లాట్‌ఫారం వరకు షెల్టర్ లేకపోవటంతో ప్రయాణికులు ఎండలోనే నిలబడాలి. జాతీయ రహదారికి నాలుగు అడుగులు లోతుగా బస్టాండ్ ఆవరణ ఉండటంతో ఒక మాదిరి వర్షం కురిసినా జలమయంగా మారుతోంది. మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.నందిగామ బస్టాండ్ ఆవరణ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బస్టాండ్‌లో అసౌకర్యాలు అధికమయ్యాయి. ఫ్యాన్లు తిరగవు, ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. రాత్రి పూట కంట్రోలర్ అందుబాటులో లేకపోవటంతో సమాచారం చెప్పేవారే ఉండరు. తాగునీటి కుళాయి ఉన్నా ఆ నీరు తాగేందుకు ప్రయాణికులు సాహసించరు. కూడళ్లు ఏర్పాటు చేసిన అవి పనిచేయటం లేదు.నూజివీడు బస్టాండ్‌లో మంచినీరు లేదు. ఫ్యాన్లు తిరగవు. టీవీలు లేవు. -
బస్.. నిబంధనలు తుస్స్...
సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో మహిళా భద్రత ఒక వెక్కిరింతగా మారింది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన మెటాలిక్ డోర్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఈ లోహపు తలుపులను ఏర్పాటు చేయడం వరకే పరిమితమైన ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ బాధ్యతను విస్మరించారు. సిబ్బంది మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఆ డోర్లను తాళ్లతో కట్టేశారు. దీంతో పురుషులు యథేచ్ఛగా మహిళల సీట్ల మధ్యలోకి వచ్చేస్తున్నారు. మహిళల కోసమే కేటాయించిన ముందు భాగంలోని ప్రవేశ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కొన్ని బస్సుల్లో మెటాలిక్ డోర్లు ఏర్పాటు చేయనేలేదు. ఎక్కడా ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని మహిళలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గౌరవప్రదంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన ద్వారం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. నగరంలో మహిళల భద్రత కోసం పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. షీటీమ్స్, షీక్యాబ్స్, సిటీ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 2,600 ఆర్డినరీ బస్సులకు రూ.4 కోట్లతో ఈ మెటాలిక్ డోర్లను ఏర్పాటు చేశారు. దశలవారీగా మిగతా బస్సులకు సైతం ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు 90 శాతం బస్సుల్లో ఆ మెటాలిక్ డోర్లు బార్లా తెరుచుకుంటున్నాయి. మరోవైపు ఈ డోర్లను ఏకంగా తాళ్లతో కట్టేసి ఉంచడం గమనార్హం. ఆర్టీసీ బాధ్యతారాహిత్యం... ‘మహిళలను గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..’ ఆర్టీసీ బస్సుల్లో కనిపించే నినాదం ఇది. కానీ అమలులోనే ఆచరణకు నోచుకోవడం లేదు. బస్సుల నిర్వహణలో అధికారుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు ప్రవేశద్వారం నుంచి పురుషులు ఎక్కినా.. దిగినా.. మహిళల సీట్లలో కూర్చున్నా గతంలో జరిమానా విధించే పద్ధతి ఉండేది. అలాగే ఫుట్‌బోర్డు ప్రయాణం పట్ల కూడా నిఘా ఉంచేవారు. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకుండా పోయింది. సీసీ కెమెరాలు కూడా అంతేసంగతులు.. ఆర్డినరీ బస్సులకు ఏర్పాటు చేసిన విధంగానే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో డిలక్స్లతో పాటు మొత్తం 3,850 బస్సుల్లోనూ నిఘాను కట్టుదిట్టం చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందుకోసం జీపీఎస్‌తో అనుసంధానం చేసిన చేసిన బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కనీసం 48 గంటల పాటు రికార్డయ్యే సామర్థ్యం ఉన్న సీసీ కెమెరాలను బస్సు లోపలి వైపు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం 80 సిటీ ఓల్వో బస్సులకే అది పరిమితమైంది. దర్జాగా కూర్చుంటారు ఆడవాళ్ల సీట్లలో కూర్చోవద్దనే కనీస మర్యాద కూడా పాటించడం లేదు. దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు వారిని ఏ మాత్రం నియంత్రించడం లేదు. ఇక వెనుక వైపు నుంచి ఎక్కిన వాళ్లు కూడా క్రమంగా ముందుకు చొచ్చుకొని వస్తున్నారు. మెటాలిక్ డోర్లు పూర్తిగా తెరిచే ఉంటాయి. ఇప్పుడు వాటి వల్ల ఎలాంటి భద్రతా లేకుండా పోయింది. -మాలతి, కూకట్పల్లి ఫుట్‌బోర్డు కిక్కిరిసిపోతుంది ఉదయం, సాయంత్రం బాగా రద్దీ ఉండే సమయాల్లో స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ముందు డోర్ నుంచి ఎక్కేసి అక్కడే ఉండిపోతున్నారు. దీంతో మహిళలు బస్సులోకి ఎక్కాలన్నా, దిగాలన్నా కష్టంగా ఉంటుంది. -శిరీష , చందానగర్ డోర్లు ఉండి ఏం లాభం చూడ్డానికి అన్ని బస్సుల్లో ఈ డోర్లు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు చూసినా తెరిచే ఉంచుతారు. దీంతో పురుషులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు యథేచ్ఛగా వస్తారు. నిలబడి ఉండే మహిళా ప్రయాణికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. - చంద్రకళ, సికింద్రాబాద్ -
ప్చ్..టైం బాగాలేదు
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలపై ప్రయాణికుల పెదవి విరుపు ఏసీ బెర్తులకు టికెట్ ఛార్జీల సెగ విశాఖపట్నం సిటీ: విశాఖ-ఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలపై ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. రెండు పగటి సమయాలు రైల్లోనే గడిచిపోతున్నాయని, ఒక రాత్రి రైల్లోనూ, రైలు దిగిన ఒక రాత్రి ఢిల్లీలో గడిచిపోతుందని వీరంటున్నారు. రెండు రోజులు పూర్తిగా వృధా అవుతోంది. రాత్రి వేళ విశాఖలోబయల్దేరి మరసటి రోజు తెల్లవారు జామున ఢిల్లీకి చేరుకునేలా వేళలను సవరిస్తే ఢిల్లీకి వెళ్లే వారికి ఉపయోగపడుతుందనే భావన వెలిబుచ్చుతున్నారు. ఢిల్లీలో కూడా రాత్రి రైలు బయల్దేరి తిరిగి విశాఖకు పగటి పూట చేరుకునేలా ప్రయత్నిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లే వారిలో వ్యాపారస్తులతో పాటు కోర్టు కేసుల నిమిత్తం వెళ్లే న్యాయవాదులు, కక్షిదారులుంటారు. వివిధ పరిశ్రమలకు అనుమతుల కోసం వెళ్లే పారిశ్రామిక వేత్తలు, రాజకీయ అనుచరులు భారీగా ఉంటారు. వీరంతా దక్షిణ్ లింక్ ఎక్స్‌ప్రెస్, స్వర్ణ జయంతి, అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లపైనే ఆశ పెట్టుకున్నారు. ఆ రైళ్లకు చాంతాడంత క్యూ ఉండడంతో తాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై ఆధారపడతారు. బెర్తులు ఖాళీ : వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చే నాలుగు మాసాలకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి ఆన్లైన్లో బుకింగ్ తెరిచారు. రెండు వైపులా ప్రయాణానికి అనుకూలంగా కావ ల్సినన్ని బెర్తులు ఉండడంతో ప్రయాణికులు ఉత్సాహంగా ఎగబడ్డారు. అన్నీ ఏసీ బెర్తులే కావడంతో ధరలు కాస్త వణుకు పుట్టిస్తున్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ ఛార్జీలు భారీగా ఉన్నాయి. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే రూ. 200 నుంచి రూ.500 వరకూ వ్యత్యాసం కనిపిస్తోంది. లింక్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లతో పోల్చుకుంటే ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు స్వల్పంగానే ధరలు పెంచినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే ఈ రైలు నేరుగా న్యూ ఢిల్లీకి వెళుతుందనే కారణం చెబుతున్నాయి. థర్డ్ ఏసీ బెర్తు రూ. 2 వేలు, సెకండ్ ఏసీ బెర్తు-రూ.2935, ఫస్టు ఏసీ బెర్తు రూ. 5070గా ఉంది. అంటే ఫస్టు ఏసీ ఛార్జీతో విమానంలోనే హాయిగా వెళ్లిపోవచ్చని ప్రయాణికులు అంటున్నారు. -
తిరుమల భక్తులకు పుష్కర కష్టాలు
తిరుచానూరు :శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి రైలులో తిరుపతి వచ్చే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో పుష్కర కష్టాలు ఎదురవుతున్నాయి. రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు అటు వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. దీంతో నెలల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. బుధవారం రాత్రి తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై ప్రమాదకర రీతిలో ప్రయాణించాల్సి వచ్చింది. కనీసం నిలబడి ప్రయాణించేందుకు సైతం రైలులో స్థలం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం రెండు నెలల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ రైలులో ప్రయాణించలేకపోయారు. రైల్వే పోలీసులు, రైల్వే అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పైగా తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. అలాగే పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకపోవడంతో రైల్వే స్టేషన్లోనే గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. తాము ఎలా గమ్యస్థానాలకు చేరుకోవాలంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక రైళ్లు నడిపి తమను గమ్యస్థానాలకు చేర్చాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. -
ఇక సెల్ ఫోన్‌తో రైలు టికెట్ బుకింగ్
♦ ఈ నెల 8 నుంచి ప్రవేశపెట్టనున్న వెస్ట్రన్ రైల్వే ♦ ైరె ల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు సాక్షి, ముంబై : నగరవాసులకు సెల్‌ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని వెస్ట్రన్ రైల్వే కల్పిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి మొబైల్‌కు సంబంధించిన టికెటింగ్ విధానాన్ని రైల్వే ప్రవేశపెట్టనుంది. వెస్ట్రన్ రైల్వే ప్రయాణికులు మొబైల్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను ఉపయోగించి టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ విధానంలో ఏటీవీఎంలో టికెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్త విధానంలో ప్రయాణికులు రైల్వేవాలెట్ (ఆర్-వాలెట్) ద్వారా టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆర్-వాలెట్లో ప్రయాణికులు వంద నుంచి రూ.5,000 వరకు బ్యాలెన్స్ రిచార్జ్ చేయించుకోవచ్చు. జూలై 8వ తేదీన పేపర్‌లెస్ మొబైల్ టికెటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు. సమయం వ ృథా అవదు.. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద కొంత మేర క్యూ తగ్గుతుందని, ప్రయాణికుల సమయం వృథా కాదని అధికారులు అంటున్నారు. మొదటిసారిగా సెల్ఫోన్లో యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలలో నడుస్తోందని, త్వరలో ఇతర ప్లాట్‌ఫాంలకు విస్తరించనున్నామని తెలిపారు. యూటీఎస్ మొబైల్ టికెటింగ్ విధానిన్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. టికెట్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్లలో జీపీఆర్ఎస్ విధానం ఉండాలన్నారు. ఇదిలా వుండగా స్మార్ట్ కార్డ్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన తర్వాత టికెట్ ప్రింట్ కోసం ఇబ్బంది పడాల్సివస్తోందని, దీంతో సమయం వృథా అవుతోందని ఓ ప్రయాణికుడు వాపోయాడు. కాగా, రోజుకు ఒక లక్ష మంది స్మార్ట్ కార్డును ఉపయోగించి టికెట్‌ను బుక్ చేసుకుంటున్నారని వెస్ట్రన్ రైల్వే అధికారి పేర్కొన్నారు. -
విశాఖ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
విశాఖపట్నం(ద్వారకానగర్): దూర ప్రాంత ప్రయాణికులు విశాఖ సిటీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించొచ్చు. దూర ప్రాంత బస్..బస్టాండ్‌లో బయలుదేరే సమయానికి రెండు గంటల ముందు నుంచి ఇలా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే, దూర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న వారు కూడా ఈ సౌకర్యం పొందే వీలుంది. అయితే, వారు విశాఖ బస్‌స్టేషన్‌లోని డ్యూటీ కంట్రోలర్ వద్ద ప్రయాణపు టికెట్టుపై స్టాంపు, సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం నుంచి వారు రెండు గంటల వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు విశాఖ రీజినల్ మేనేజర్ సుధీష్కుమార్ పేర్కొన్నారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన ‘రాజ్‌కోట్’
- అప్రమత్తమైన డ్రైవర్.. తప్పిన ప్రమాదం - పలు రైళ్ల రద్దు.. ప్రయాణికుల ఇక్కట్లు నవాబుపేట: సాంకేతిక లోపంతో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం శంకర్పల్లి మండలం గొల్లగూడ- రావులపల్లి స్టేషన్ల మధ్య సుమారు మూడు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు.. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌కు వెళుతుంది. గొల్లగూడ, రావులపల్లి స్టేషన్ల మధ్యకు రాగానే సాంకేతిక లోపం సంభవించినట్లు డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై రైలును అదుపు చేసి నిలిపివేశాడు. గొల్లగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ కె. నాగరాజుకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం మొదటి ఇంజిన్ మరమ్మతులకు గురైనట్లు తెలుసుకున్నాడు. రెండో ఇంజిన్ సహాయంతో ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి గొల్లగూడ స్టేషన్ వరకు మెల్లగా వెనక్కి తీసుకెళ్లి స్టేషన్ వద్ద ఉంచాడు. విషయాన్ని స్టేషన్ మాస్టర్, సికింద్రాబాద్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి సంఘటన స్థలానికి చేరుకుని సాంకేతిక లోపానికి గురైన మొదటి ఇంజిన్‌ను తొలగించారు. రైలుకు ఉన్న రెండో ఇంజిన్ కూడా సక్రమంగా లేకపోవడంతో వారు తీసుకువచ్చిన మరో ఇంజిన్‌ను జత చేసి రైలును మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సికింద్రాబాద్‌కు తరలించారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సుమారుగా మూడు గంటలు నిలిచి పోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రైవర్ సాంకేతిక లోపాన్ని గమనించి రైలును ఆపక పోయి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. రైళ్ల నిలిపివేతతో ప్రయాణికుల ఇబ్బందులు.. వికారాబాద్ రూరల్ : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు వచ్చే పల్నాడు, తాండూరు ప్యాసింజర్లు రద్దయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. వికారాబాద్ నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు వందలాది మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్ రద్దు కావడం, ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. శంకర్పల్లి: శంకర్పల్లి స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి నిత్యం వందలాది ప్రయాణికులు శంకర్పల్లి రైల్వేస్టేషన్ నుంచి హైదరాబాద్- వికారాబాద్ వైపు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మంగళవారం ఉదయం రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గొల్లగూడ-రావులపల్లి రైల్వే స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. అసలే ఆర్టీసీ సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మరింత ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను మరమ్మతులు చేయడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు 3 గంటల పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్ స్టేషన్లలో నిలిపివేశారు. వికారాబాద్- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలును పూర్తిగా రద్దు చేశారు. -
డబుల్ డెక్కర్ రైలు సందడి
కాజీపేటరూరల్/మహబూబాబాద్/డోర్నకల్ : విజయవాడ-కాచిగూడ స్టేషన్ల మధ్య డబుల్ డెక్కర్ రైలు సోమవారం సందడి చేసింది. ఉదయం 11 గంటల సమయంలో విజయవాడ వైపు, సాయింత్రం 3.40 ప్రాంతంలో కాచిగూడ వైపు వెళ్తూ జిల్లాలోని ప్రధాన స్టేషన్లలో కొద్దిసేపు ఆగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులెవరూ ఈ రైలుకు టికెట్ తీసుకోలేదు. డోర్నకల్‌లో మిగతా రైళ్లకు టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్లోకి ఎక్కగా టీసీలు ప్రయాణికులను దించేశారు. కాజీపేటలో మాత్రం టిక్కెట్ తీసుకుని ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ఎక్కారు. ఆర్టీసీ సమ్మె బంద్ అయ్యేంత వరకు ఈ రైలును నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు పూర్తిగా ఏసీ చైర్ కార్లతో ఉంది. కురవికి చెందిన ఎర్ర నాగేశ్వర్రావు అనే కాంట్రాక్టర్ రూ.250 వెచ్చించి వరంగల్ నుంచి మానుకోటకు వచ్చానని తెలిపారు. డబుల్ డెక్కర్ రైలు హాల్టింగ్ స్టేషన్లు కాచిగుడ-విజయవాడ మధ్య నడిచే డబల్ డెక్కర్ రైలుకు మల్కాజిగిరి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో హా ల్టింగ్ ఇచ్చారు. 10 ఏసీ బోగిలు, 950 సీట్లతో ఈ డబుల్ డెక్కర్ రైలు నడుస్తుంది. కాగా డబు ల్ డెక్కర్ రైలును తిలకించి అందులో ప్ర యాణించి ప్రయాణికులు, పిల్లలు అబ్బురపడ్డారు. -
సమ్మె మాటున ఆర్టీసీ దందా
- అద్దె బస్సుల యాజమాన్యంతో అధికారుల కుమ్మక్కు - స్లాబ్ పద్ధతిలో టికెట్ ధరలు పెంచి బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం - వచ్చిన ఆదాయాన్ని అధికారులే నొక్కేస్తున్న వైనం - 150 బస్సులు తిరిగినా రూ.లక్ష కూడా దాటని రాబడి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమ్మె సాకుతో ఆర్టీసీని లూటీ చేస్తున్నారు.. అద్దె బస్సుల యాజమాన్యంతో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కై వచ్చిన ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. మొదటి నుంచి బస్సులను స్వల్పంగా నడుపుతున్నారు. సదరు బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. కానీ ఈ నాలుగు రోజుల్లో ఏ ఒక్క రోజూ కనీసం రూ.లక్ష కూడా ఆర్టీసీ ఖాతాలో జమ కాలేదు. బస్సులు నడిపి సమ్మెను నిర్వీర్యం చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఆదాయం విషయాన్ని గాలికి వదిలేసింది. దీంతో అద్దె బస్సుల యాజమాన్యం ఆర్టీసీ అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని రాబడిని పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో... నిత్యం జిల్లాలోని ఏడు డిపోల్లో కలిపి 610 బస్సులు తిరగుతాయి. రోజుకు కనీసం రూ.50 లక్షల ఆదాయం సమకూరుతుంది. గ్రామీణ ప్రాంత రూట్లల. -
కదలని చక్రం
సమ్మె ఉధృతం.. తొలి రోజు సక్సెస్ స్తంభించిన రవాణా.. ప్రయూణికుల అవస్థలు డిపోలకే పరిమితమైన బస్సులు బోసిపోరుున బస్స్టేషన్లు {పత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు తరలివచ్చిన తాత్కాలిక నిరుద్యోగులు అభ్యర్థులు, కార్మికుల మధ్య ఘర్షణ హన్మకొండ బస్టాండ్‌లో 144 సెక్షన్ హన్మకొండ : జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా స్తంభించింది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచారుు. వేతన సవరణ చేయూలని ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారుు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్స్టేషన్లు బోసి పోయాయి. సమ్మె విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాల జోరు పెరిగింది. ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు. కార్మిక సంఘాల మండిపాటు ప్రభుత్వం నష్టాల సాకుతో వేతన సవరణ చేయకుండా తప్పించుకుంటుందని కార్మికులు మండిపడుతున్నారు. నష్టాలను పూడ్చుకోవడానికి అవకాశాలున్నా.. వాటిని వదిలేసి కార్మికులు పొట్ట కొడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేతనాలు సరిపోక, వడ్డీ వ్యాపారుల వద్ద ఏటీఎం కార్డులు కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చి కుటుంబాలను పోషించాల్సి వస్తుందని కార్మిక సంఘాల నాయకులు వాపోయారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మిక వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు, సూపర్వైజర్ల సంఘాలు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది సమ్మెబాట పట్టామని కార్మికులు చెప్పారు. ఆర్ఎం డిప్యూటీ సీటీఎం, డిప్యూటీ సీఎం, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డీఎంలు, సెక్యూరిటీ సిబ్బంది మినహా కార్మికులు, ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీ జిల్లాలో తొమ్మిది డిపోలలో 965 బస్సులు నిలిచాయి. ఇందులో 758 సంస్థ, 207 అద్దె బస్సులున్నాయి. వరంగల్ రీజియన్‌లో 4,539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3,605 మంది ఉండగా.. మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ అద్దె బస్సులను నడిపించాలని చూసినా కార్మికులు అడ్డుకోవడంతో అద్దె బస్సులు కదలలేదు. అధికారులు 34 బస్సులు తిరిగాయని చెపుతున్నా ఎక్కడా కనిపించ లేదు. దీంతో సమ్మె ప్రభావంతో మొదటి రోజు దాదాపు రూ.కోటి వరకు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించాలనే ఆలోచనతోపాటు, హెవీ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న డ్రైవర్లకు బుధవారం డ్రైవింగ్ పరీక్ష నిర్వహించారు. డ్రైవింగ్‌లో నైపుణ్యం కనబరిచిన వారిని విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపాలని అధికారులు చూస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్తె ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీరితోపాటు 60 ఏళ్ల లోపు వయసు ఉన్న రిటైర్డ్ డ్రైవర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడానికి అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించారు. అయినా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సేవలందించడం కష్టమైన పనే. సమ్మెతో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. యాజమాన్యం తాత్యాలిక నియామకాలు చేపట్టింది. డ్రైవర్లకు రోజుకు రూ.1000, కండక్టర్లకు రూ.800 ఇస్తామని యూజమాన్యం ప్రకటించడంతో వందల సంఖ్యలో నిరుద్యోగులు బుధవారం హన్మకొండ ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయానికి చేరుకున్నారు. తాత్కాలిక విధులు నిర్వహించడానికి వచ్చిన అభ్యర్థులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మదిర డిపో, కరీంనగర్ డిపోకు చెందిన అద్దె బస్సులు రావడంతో అడ్డుకున్నారు. మదిర డిపోకు చెందిన బస్సు అద్దం పగిలింది. తాత్కాలిక ఉద్యోగాలకై వచ్చిన అభ్యర్థులు, బయటి నుంచి వచ్చిన అద్దె బస్సులు అడ్డుకోవడంతో హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ విధించారు. హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్, కేయూ సీఐ ఎస్ఎం అలీ నేతృత్వంలో ఎస్సైలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టారు. డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో అధికారులు సర్టిఫికేట్లు పరిశీలించి ఫోన్ నంబర్లు తీసుకొని సమాచారం ఇస్తామని పంపించారు. డ్రైవింగ్ విధులకై వచ్చిన అభ్యర్థులకు వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవింగ్ లెసైన్స్, సర్టిఫికేట్లు పరిశీలించి అనంతరం డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు. -
2 గంటలు.. లబ్‌డబ్
ముక్త్యాల(జగ్గయ్యపేట) : కృష్ణానదిలో కొద్దిసేపు పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణానది అవతల ఒడ్డు గుంటూరు జిల్లా మాదిపాడు వరకు బల్లకట్టు ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం 6 గంటల సమయంలో ముక్త్యాల ఒడ్డు నుంచి వంద మంది ప్రయాణికులతో మర పడవ అవతల ఒడ్డుకు బయలు దేరింది. నది మధ్యలోకి వెళ్లే సరికి ఇంజిన్ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా పడవ ఆగిపోయింది. రెండు కిలోమీటర్ల వరకు దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పడవ ఆపరేటర్లు ఇంజిన్‌ను బాగు చేసి ఒడ్డుకు తీసుకువచ్చారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పడవ మరమ్మతుకు గురైందని ప్రయాణికులు అంటున్నారు. -
టీటీఐ వేషంలో ప్రయాణికులకు టోకరా
* ఇద్దరు కేటుగాళ్ల రిమాండ్ * జువైనల్ హోమ్‌కు బాలుడి తరలింపు సికింద్రాబాద్: రైల్వే టీటీఐల వేషంలో బెర్త్‌లు కన్ఫామ్ చేయిస్తామని ప్రయాణికుల నుంచి డబ్బు దండుకోవడంతో పాటు లగేజీ ఎత్తుకెళ్తున్న ఇద్దరు కేటుగాళ్లను గోపాలపురం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన వీరిద్దరికీ సహకరిస్తున్న ఓ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం....గచ్చిబౌలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రశాంత్ పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో పాట్నా వెళ్లేందుకు ఈనెల 22న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అయితే అతను కొనుగోలు చేసిన ఆన్లైన్ టికెట్‌పై బెర్త్ కన్ఫామ్ కాకపోవడంతో జనరల్ టికెట్ కొనుగోలు చేసేందుకు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. ఇది గమనించిన ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. తనకు తెలిసిన టీటీఐ ఉన్నాడని, టికెట్ కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తే స్పాట్లో బెర్త్ కన్ఫామ్ చేయిస్తాడని నమ్మబలికి రైల్వేరిజర్వేషన్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ టీటీఐ యూనిఫామ్ ధరించి ఉన్న ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. టీటీఐ డ్రస్‌లో ఉన్న అతను లగేజీని బయటే పెట్టించి, ప్రశాంత్ ఒక్కడినే రిజర్వేషన్ కార్యాలయంలోకి తీసుకెళ్లి రిజర్వేషన్ ఫామ్ పూరించి, టికెట్ డబ్బు, అదనపు డబ్బు తీసుకున్నాడు. కొద్దిసేపు ఎవరికో ఫోన్ చేస్తున్నట్టు నటించాడు. తర్వాత మేనేజర్‌ను కలిసి వస్తానని చెప్పి లోపలికి వెళ్లిన నకిలీ టీటీఐ వెనుకవైపు ద్వారం గుండా బయటకు ఉడాయించాడు. సమయం గడపిచిపోతున్నా టికెట్ ఇప్పిస్తానన్న వ్యక్తి కనిపించకపోవడంతో ప్రశాంత్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి చూడగా... లగేజీతో పాటు తనను అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రశాంత్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ద్వారా నిందితులను గుర్తించిన గోపాలపురం పోలీసులు రెండ్రోజులుగా రైల్వేస్టేషన్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించగా ఆ కేటుగాళ్లు కనిపించారు. నిందితుల్లో ఒకడు టీటీఐ యూనిఫామ్ ధరించి ఉన్నాడు. పోలీసులు నిందితుల నుంచి టీటీఐ యూనిఫామ్‌తో పాటు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరిస్తున్న ఓ బాలుడిని పట్టుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
జనం లేక...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై పన్ను విధింపు వివాదం నేపథ్యంలో రెండో రోజైన బుధవారం కూడా నగరంలో కొన్ని ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మరికొన్ని సర్వీసులు నడిచినా... ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. -మన్సూరాబాద్ -
రెప్పపాటులో
ఉలిక్కిపడిన ప్రయాణికులు ఉద్యాననగరిలో అప్పుడప్పుడే తెలతెలవారుతోంది. బెంగళూరులోని సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.25గంటలకు బయలుదేరిన బెంగళూరు-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు సాఫీగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. అంతలోపే ఓ పెద్ద కుదుపు. వివిధ పనుల కోసం రైలులో బయలుదేరిన ప్రయాణికులు ఒక్కసారిగా ఏమైందో అర్థం కాక ఉలిక్కిపడ్డారు. చూస్తుండగానే రైలులోని డీ7, డీ8, డీ9, బీ6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో గమ్యస్థానం చేరుకోకుండానే కొంతమంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోగా, అనేక మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఆనేకల్ వద్ద శుక్రవారం ఉదయం 7.30గంటలకు జరిగిన రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, ప్రమాదం నుంచి బయటపడిన వారితో పాటు మరికొంతమంది ముఖ్యుల స్పందన వారి మాటల్లోనే..... - హొసూరు నాకిది పునర్జన్మ ‘కోవైకు వెళ్లేందుకు ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ట్రైన్ ఎక్కాను. డీ8 బోగీ లో నేను ఉన్నాను. ఆనేకల్ దగ్గరకు చేరుకోగానే ఓ పెద్ద శబ్దం వినిపించింది. అదే సమయంలో చాలా మంది హహాకారాలు చేశారు. అసలేం జరిగిందా అనుకొని తేరుకొని చూసేలోపు భోగీ మరో బోగీలోకి దూసుకుపోయి కనిపించింది. భోగీలో జ్యోతి అనే తోటి ప్రయాణికురాలు కాళ్లు విరిగింది. భోగీ తలుపు కుచించుకుపోయింది. ఇరుకైన తలుపు నుంచి బయటకొచ్చి క్షతగాత్రులను కాపాడే యత్నం చేశా. నాకిది పునర్జన్మ అనుకుంటున్నాను’ - సేతుకుమార్, ఐటీ ఇంజినీర్, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు మాటలు రావడం లేదు ‘బెంగళూరు నుంచి త్రిసూర్‌కు వెళ్లేందుకు డి. 9వ నంబర్ భోగీలో సీటు రిజర్వ్ చేయించుకున్నాను. ఉదయం 7.15-7.30 గంటల మధ్య భయంకరమైన శబ్దం వినిపించింది. డి. 9వ భోగి, డి.8 వ భోగీని ఢీకొంది. 9వ భోగీలోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డి. 9వ భోగీలో సీట్లు ఖాళీ లేవు. బయటకు దిగిచూస్తే ఐదారు బోగీలు కుడిపక్క వాలిపోయి కనిపించాయి. ప్రమాదంలో మరణించిన వారు కనిపించగానే నోట మాటరాలేదు. గాయపడిన వారి ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి.’ - సురేఖమ్యాథ్యూ, బెంగళూరు నమ్మలేకపోతున్నాను ‘నేను డి1 బోగీలో ప్రయాణం చేస్తున్నాను. ఆనేకల్ వద్దకు చేరుకోగానే అనుకుంటా ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందోనని భయపడుతూనే మా భోగీలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కిందకు దిగి చూశా డి. 8, డి.9 భోగీలు కుడిపక్కకు వాలి ఉన్నాయి. సంఘటనను దగ్గరి నుంచి చూసినా ఇప్పటికీృఆదశ్యాలను తలుచుకుంటే భయం వేస్తోంది. మాతో ప్రయాణిస్తున్న ఇంతమంది చనిపోయారంటే నమ్మలేకుండా ఉన్నాను’. - జోసెఫ్, ఉపాధ్యాయుడు, ఆర్టీనగర్, బెంగళూరు -
ఆర్టీసీ అద్దె బస్సులు డేంజర్
పల్లె వెలుగు అద్దె బస్సులు ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల అనేక ప్రాంతాలలో ఆర్టీసీ అద్దె బస్సుల టైర్లు ఊడిపోవడం, చక్రం రాడ్లు విరిగిపోవడం వంటి సంఘ టనలు జరిగాయి. కొన్నిచోట్ల డ్రైవర్ల అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొన్నిచోట్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. ముఖ్యంగా అనేక బస్సులు ఫిట్నెస్ లేకుండా, కాలం చెల్లినవి ఉన్నాయి. డిపో అధికారులు, మెకానికల్ సిబ్బంది సరైన తనిఖీ చేయకుండానే బస్సులను డిపోల నుండి వదులు తున్నారు. నిబంధనల ప్రకారం బస్సును డిపోలో క్షుణ్ణంగా ఆయా యంత్రాలను తనిఖీ చేయాలి. చెడిపోయిన భాగాలను మరమ్మతులు చేయాలి. అలాగే దుమ్ము, ధూళితో ఉన్న బస్సులను శుభ్రం చేయాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో భయంతో ప్రయాణిస్తున్నారు. అలాగే దుమ్ము, ధూళి బస్సులలో బాగా ఉండటంతో శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను నిషేధించాలి. బస్సు కండిషన్ తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి. అలాగే బస్సులలో పరిశుభ్రతపై దృష్టి సారించాలి. - బి. ప్రేమ్‌లాల్ వినాయక్ నగర్, నిజామాబాద్ -
దారి గండం
మేల్కొనకపోతే మృత్యు గూటికే..! పలు దారుల్లో పొంచి ఉన్న ప్రమాదం చిన్న పాటి జాగ్రత్తలతో పెద్ద ముప్పు నివారణ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులకు పట్టడం లేదు.. పనులు చేసే కాంట్రాక్టర్ల తీరూ మారడం లేదు.. పట్టించుకోవాల్సిన అధికారుల్లో చలనం కలగడం లేదు.. ఇంకేముంది రక్షణ గోడలేని బ్రిడ్జిలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ప్రమాద సూచికలు లేని మలుపులు మృత్యు పిలుపులుగా మారుతున్నాయి. శిథిలావస్థలోని వంతెనలు ప్రమాదాలకు చిరునామాగా నిలుస్తున్నాయి. రోడ్డు నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కాంట్రాక్టర్లు గాలికి వదిలేశారు. ఫలితంగా ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ప్రమాదకరంగా ఉన్న రహదారుల్లో చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. -
చెరువులో బస్సు బోల్తా
* ముగ్గురి జల సమాధి * 25 మందికి గాయాలు * ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి జీఎం సిద్దేశ్వర్ దావణగెరె : ప్రైవేట్ బస్సు అదుపు తప్పి శాంతిసాగర (సూళెకెరె) చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని చెన్నగిరి తాలూకాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు దావణగెరెలోని ప్రైవేట్ బస్టాండ్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అమరేశ్వర అనే ప్రైవేట్ బస్సు చెన్నగిరికి బయలుదేరింది. 4.10 గంటల సమయంలో మార్గమధ్యంలో శాంతిసాగర చెరువు పక్క నుంచి వెళుతున్న సమయంలో బస్సు అదుపుతప్పి చెరువులోకి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ సంఘటనను గమనించిన సమీపంలో ఉన్న వారు, గ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. 25 మందికి పైగా గాయపయడ్డారు. క్షతగాత్రులను దావణగెరె, చెన్నగిరి, నల్లూరు, కెరెబిళచిలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర్, చెన్నగిరి ఎమ్మెల్యే వడ్నాళ్ రాజణ్ణ, మాయకొండ ఎమ్మెల్యే కే.శివమూర్తి నాయక్‌లతో పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ ఎంబీ బోరలింగయ్య, ఏఎస్పీ భావిమని, డీఎస్పీ నేమగౌడ, సీఐ రవినాయక్, ఎస్ఐలు మహ్మద్ నూరుల్లా, సతీష్ నాయక్ తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై బసవాపట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మృతుల్లో ఇద్దరిని చెన్నగిరి తాలూకా దిగ్గేనహళ్లికి చెందిన విజయమ్మ (30), రాణిబెన్నూరు తాలూకాకు చెందిన మహాదేవప్ప (45)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును వెలికి తీసే పనులు చేపట్టారు. -
దసరా రష్
రైళ్లన్నీ కిటకిట తరగని వెయిటింగ్ లిస్టు ప్రయాణికులఅవస్థలు విశాఖపట్నం సిటీ : రైళ్లకు దసరా తాకిడి పెరిగిం ది. రైళ్లన్నీ రద్దీగా కదులుతున్నాయి. నిరీక్షణ జాబితా చాంతాడులా వేలాడినట్టే బోగీల్లో ప్రయాణికులు కూడా వేలాడుతున్నారు. బుధవారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుంచే రద్దీ తీవ్రత మొదలైంది. జనరల్ బుకింగ్ కౌంటర్ దాటి ప్రయాణికులు టికెట్ల కోసం నిరీక్షించారు. జ్ఞానాపురం వైపు కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు క్యూ కట్టారు. ఉదయం 5 గంటలకు క్యూకట్టినా అనుకున్న రైలుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు సిద్దపడి టిక్కెట్ కోసం నిరీక్షించిన వారిలో అనేక మంది సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోచుకుంటూ రెలైక్కేందుకు ఒక్కసారిగా పోటీపడడంతో తోపులాట జరిగింది. జనరల్ బోగీల్లోకి వెళ్లేందుకు ఉభయగోదావరి జిల్లాల ప్రయాణికులు పోటీపడడంతో తోపులాటలు జరిగాయి. సికింద్రాబాద్ వెళ్లేందుకు సాయంత్రం విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ల వద్ద కూడా రద్దీ కనిపించింది. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికులను క్యూ కట్టించడంతో కాస్త తోపులాటలు తగ్గాయి. హౌరా వైపునకు బాగా డిమాండ్.! విశాఖ నుంచి హౌరా వైపు వెళ్లేందుకు భారీ డిమాండ్ వుంది. హౌరా వెళ్లే రైళ్లలో నిలబడేందుకే చోటు కనిపించడం లేదు. చెన్నె, బెంగుళూరు, ముంబాయి నుంచి హౌరా వెళ్లే అన్ని రైళ్లలో రద్దీ విపరీతంగా వుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆ రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయి వుంటున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఎక్కేందుకు చోటుండడం లేదు. హౌరా మెయిల్, కోరమండల్, ఈస్టుకోస్టు, ఫలక్నామా, యశ్వంత్‌పూర్-హౌరా, విశాఖ-షాలిమార్, సికింద్రాబాద్-హౌరా వంటి రైళ్లన్నీ కిక్కిరిసినడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు సైతం బెర్తులన్నీ ఫుల్‌గా నిండిపోయాయి. పాఠశాలలకు, ప్రై వేట్ కాలేజీలకు, కోచింగ్ కేంద్రాలకు సెలవులు ఇచ్చేస్తుండడంతో ఊర్ల బాట పట్టారు. -
దసరా ప్రయాణం ప్రియం.. ప్రియం..
రైళ్లు, బస్సులు హౌస్‌ఫుల్ ఫ్లైట్ చార్జీలను తలపిస్తున్న ప్రైవేటు బస్సుల రేట్లు ప్రత్యేక బస్సులు సిద్ధం మూడు రెట్లు పెరిగిన విమాన టికెట్ ధరలు సాక్షి, విజయవాడ : దసరా పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో జిల్లా వాసులు ప్రయాణాలకు సిద్ధమౌతున్నారు. అయితే ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాల టికెట్ల బుకింగ్ అయిపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే రూట్లలో బస్సులు, రైళ్లలో టికెట్ దొరకడం గగనమైపోతోంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను మూడు రెట్లు పెంచేశారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ 150 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులివే.... హైదరాబాద్‌లో నివసించే వారు పండుగకు తమ స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 26వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికుల్ని తీసుకొచ్చేందుకు 400 బస్సుల్ని అదనంగా ఆర్టీసీ నడుపుతోంది. అక్టోబర్ 5 వతేదీ ఆదివారం రాత్రి విజయవాడ నుంచి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉన్నందున ఆరోజు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 బస్సులు హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ నుంచి చైన్నై, బెంగళూరు, రాజమండ్రి, భద్రాచలం, కడప, కర్నూలు ప్రాంతాలకు వెళ్లేందుకు మరో 50 బస్సుల్ని సిద్ధం చేశారు. 28వ తేదీ నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న షెడ్యూళ్లకు అదనంగా మరో 60 బస్సులను రాయలసీమ జిల్లాలకు పంపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఇవే కాకుండా గ్రూపుగా ఒకే ఊరుకు వెళ్లేవారు కోరితే వారికి ప్రత్యేకంగా బస్సు కేటాయిస్తామని ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఏసీ బస్సులు, రైల్వే సీట్లకు యమా డిమాండ్! ప్రస్తుతం సాధారణ బస్సులు, రైళ్ల కంటే ఏసీ సర్వీసులకు యమా డిమాండ్ ఉంది. చైన్నై, బెంగళూరు రూట్లలో ఏసీ బస్సుల కోసం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. రైల్వేలో త్రీటైర్ బెర్త్‌ల కోసం కొల్లేటి చాంతాడంత వెయిటింగ్ లిస్టులున్నాయి. పండుగ రోజుల్లో శేషాద్రి, ప్రశాంతి, ఫలక్నామా, నర్సపూర్, మచిలీపట్నం, అమరావతి తదితర రైళ్లలో త్రీటైర్ బర్త్‌లు రెండు నెలల ముందుగానే బుకింగ్ అయిపోయాయయని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తుతం పరపతి ఉన్న వారు ఈక్యూలపై దృష్టిసారిస్తున్నారు. త్రీటైర్ ఈక్యూ కంటే స్లీపర్ సీట్లు సులభంగా లభిస్తున్నాయని రైల్వే వ ర్గాలు చెబుతున్నాయి. విమాన చార్జీలు ఆకాశంలో.... విమాన చార్జీలు ఆకాశంలో విహరిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు రేట్లను బాగా పెంచేశారు. సాధారణంగా విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.3000 చార్జీల ఉంటుంది. ప్రస్తుతం ఇదే చార్జీ రూ.9000కు చేరిందని సమాచారం. రాబోయే రోజుల్లో చార్జీ మరింత పెరిగే అవకాశం ఉంది. అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు.... ప్రైవేటు ఆపరేటర్లు చార్జీలను మూడు రెట్లు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సు చార్జీలను రూ.1500 వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు సాధారణ రోజుల్లో రూ.1000 తీసుకువెళ్లితే ప్రస్తుతం రూ.3000కు పెంచేశారు. అలాగే ఇతర రూట్లలో బస్సుల చార్జీల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో బెంగళూరుకు రూ.3000తో విమానంలో ప్రయాణం చేయవచ్చు. అదే రేటుతో ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. -
ఎలుకతో తంటా... రైల్వేకి రూ.10 వేల వడ్డన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రైళ్లలో ఎలుకల స్వైర విహారం చేస్తూ ప్రయాణికులను భయపెడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి పళ్ల వాడికి అనేక వస్తువులు పనికి రాకుండా పోవడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు సహజంగా ‘ఇదంతా మన ఖర్మ’ అనుకుని వెళ్లిపోతుంటారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుడు అలా కర్మ సిద్ధాంతాన్ని వళ్లించి ఊరుకోలేదు. వినియోగదారుల వేదికను ఆశ్రయించి రూ.10 వేల జరిమానా రాబట్టాడు. వివరాల్లోకి వెళితే...ఉడిపి జిల్లా కుందాపురకు చెందిన ప్రదీప్ కుమార్ శెట్టి తన మిత్రులతో కలసి గత ఏడాది రైలులో శబరిమల యాత్రకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కేరళలోని చెంగనూరులో వారంతా తమ భార్యలకు చీరలు, పిల్లలకు దుస్తులు కొనుగోలు చేశారు. వీటితో పాటు అయ్యప్ప ప్రసాదాన్ని బ్యాగుల్లో పెట్టి, బెర్త్‌ల కింద ఉంచారు. ప్రయాణంలో ఎలుకలు బ్యాగుల్లోకి ప్రవేశించి అంతా చిందర వందర చేశాయి. చీరలు, పిల్లల బట్టలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలి పెట్టాయి. మంగళూరుకు వచ్చాక శెట్టి, ఆయన స్నేహితులు బ్యాగులు తెరిచి చూసి నివ్వెర పోయారు. దీనిపై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసి, రసీదు కూడా తీసుకున్నారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దక్షిణ కన్నడ జిల్లా వినియోగదారుల వేదికను ఆశ్రయించారు. వేదిక పంపిన నోటీసులకు కూడా రైల్వే అధికారులు స్పందించలేదు. దీంతో రైల్వేకి శుక్రవారం రూ.10 వేల జరిమానా విధించింది. నెలలోగా చెల్లించకపోతే ఏడాదికి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
ప్రయాణికులతో ఆర్ఆర్బీ అభ్యర్థుల ఘర్షణ
గుంటూరు వరకూ 15చోట్ల ఆగిన ఫలక్‌నుమా గుంటూరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు, ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. ఫలితంగా 15 చోట్ల రైలు నిలిచిపోయింది. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు సెంటర్లలో ఆదివారం నిర్వహించిన ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది అభ్యర్థులు వచ్చారు. ఉచిత పాస్‌లు, టికెట్లు విక్రయించిన రైల్వే శాఖ అభ్యర్థులకు అవసరమైన ప్రత్యేక రైళ్లను కానీ, ప్రత్యేక బోగీలను కానీ కేటాయించలేదు. వారంతా సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైల్లోని అన్ని బోగీల్లో కిక్కిరిసి ఎక్కారు. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వీలు లేకపోయింది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల స్టేషన్లలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు స్థానిక ప్రయాణికులకు మధ్య ఘర్షణ జరిగింది. పిడుగురాళ్లలో స్థానిక ప్రయాణికులపై ఇతర రాష్ట్రంనుంచి వచ్చిన అభ్యర్థులు రాళ్లతో దాడి చేశారని టికెట్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. రైలు కిటీకీలు కూడా ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు చేరేలోగా మార్గ మధ్యంలో 15 చోట్ల రైలు నిలిచిపోయింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు రైలు ఎక్కే వీలు లేక ఆయా స్టేషన్లలోనే నిలిచిపోయారు. రైల్వే పోలీసుల అభ్యర్థన మేరకు గుంటూరు సివిల్ పోలీసులు రైలు గుంటూరు రైల్వేస్టేషన్ చేరుకునే సరికి అప్రమత్తమయ్యారు. రైల్వే, సివిల్ పోలీసులు మోహరించి రిజర్వేషన్ బోగీల్లో రిజర్వేషన్ లేని వారిని దించేందుకు యత్నించినా కొంతవరకే సఫలీకృతులయ్యారు. గుం టూరు నుంచి రిజర్వేషన్ చేసుకున్న వారిని ఎక్కించలేకపోయారు. దీంతో ఆందోళనకు దిగారు. అనంతరం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో పంపారు. -
స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా
దేశీయ విమానయాన సంస్థకు పెరగనున్న ప్రయాణికులు, ఆదాయం - ఎయిరిండియాకు అందుబాటులోకి - అలయెన్స్ గ్లోబల్ నెట్వర్క్ - కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడి న్యూఢిల్లీ: ఎయిరిండియా ఏడేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థల కూటమి ‘స్టార్ అలయెన్స్’లో భాగస్వామి అయింది. సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన స్టార్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ఎయిరిండియాను చేర్చుకోవడానికి అనుకూలంగా ఓటు వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద కూటమి స్టార్ అలయెన్స్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. అలయెన్స్‌లో చేరడం వల్ల ఎయిరిండియా ఆదాయం 4-5% పెరగవచ్చని చెప్పారు. యునెటైడ్ (అమెరికా), సింగపూర్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎయిర్ చైనా, ఎయిర్ కెనడా, స్విస్, ఆస్ట్రియన్, ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ వంటి ప్రసిద్ధి చెందిన 27 సంస్థలకు స్టార్ అలయెన్స్‌లో సభ్యత్వం ఉంది. ఎయిరిండియా 28వ భాగస్వామ్య సంస్థ అవుతుంది. స్టార్ అలయెన్స్‌లో చేరిన తొలి భారతీయ విమానయాన కంపెనీగా ఎయిరిండియా ఆవిర్భవించనుంది. స్టార్ అలయెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఎయిరిండియా గత 6 నెలలుగా విమాన రాకపోకల వేళలు, టికెట్ బుకింగ్ అంశాల్లో మార్పులు చేస్తోంది. ఎన్నో లాభాలు... - భారత్ - అమెరికాల మధ్య ప్రయాణించే వారిలో ప్రస్తుతం 13 శాతం మంది ఎయిరిండియా విమానాల్లో వెళ్తున్నారు. స్టార్ అలయెన్స్‌లో సభ్యత్వం కారణంగా ఈ సంఖ్య ఒక్క ఏడాదిలోనే 20 శాతానికి పెరగనుంది. - అమెరికా వెళ్లే ప్రయాణికులకు మరిన్ని నగరాలు సులువుగా అందుబాటులోకి రానున్నాయి. స్టార్ అలయెన్స్‌లో సభ్యత్వమున్న ఇతర ఎయిర్‌లైన్స్‌లోనూ వారు ప్రయాణించవచ్చు. - స్టార్ అలయెన్స్ సభ్యత్వ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లోని 1,328 ఎయిర్‌పోర్టులకు నిత్యం 21,980 విమాన సర్వీసులను నడుపుతున్నాయి. ఈ సంస్థలకు మొత్తం 4,338 సొంత విమానాలుండగా ఏటా 64 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. - సభ్యత్వం ఫలితంగా అలయెన్స్ నెట్వర్క్ అంతా ఎయిరిండియాకు అందుబాటులోకి రానుంది. - తనవంతుగా, ఎయిరిండియా భారత్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు స్టార్ అలయెన్స్‌కు కనెక్టివిటీ కల్పించనుంది. అలయెన్స్‌లో సభ్యత్వమున్న ఇతర ఎయిర్‌లైన్స్‌లో ఇండియాకు వచ్చిన వారు ఎయిరిండియా విమానాల్లో భారతీయ నగరాలకు చేరుకోవచ్చు. - ఎయిరిండియా ప్రయాణికులు వేరే దేశంలో ప్రధాన నగరంలో దిగాకసులభంగా ఇతర ఎయిర్‌లైన్స్‌లో వారి గమ్య నగరాలకు వెళ్లవచ్చు. -
‘తుంగభద్ర’లో సాంకేతిక సమస్య
- రెండున్నర గంటల పాటు నిలిచిన రైలు - తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు - దరిదాపుల్లోకి రాని రైల్వే అధికారులు గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: కర్నూలు నుంచి గద్వాల మీదు గా సికింద్రాబాద్‌కు వెళ్లే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గద్వాల మండలం మేలచెర్వు శివారులో ఆదివారం సాయంత్రం నిలిచిపోయింది. ఇంజన్‌కు మరమ్మతులు చేసేందుకు డ్రైవర్లతో పాటు మెకానిక్‌లు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండున్నర గంటలు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కర్నూలు నుంచి మరో ఇంజన్‌ను తెప్పించడంతో రైలు కదిలింది. ఇంత జరిగినా రైల్వే అధికారులు దరిదాపుల్లోకి రాలేదు. కర్నూలు నుంచి బయల్దేరిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు గద్వాల రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంజన్లో ఓవర్ స్పీడ్ టెంపరేచర్ ట్రిప్ అయ్యి ఒక్కసారిగా గద్వాల పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మేలచెర్వు శివారులో రైలు ఆగిపోయింది. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు ఇంజన్ వచ్చింది. వెనుక భాగంలో ఇంజన్‌ను అటాచ్ చేసి రైలును కదిలించారు. గద్వాల స్టేషన్‌కు 6 గంటల 50 నిమిషాలకు చేరుకుంది. మరమ్మతులకు గురైన ఇంజన్‌ను మార్చి అటాచ్ చేసిన ఇంజన్‌ను ముందు భాగానికి మార్చి కదిలించారు. ప్రయాణికుల అవస్థలు... రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎండ వేడిమికి తాళలేక అల్లాడిపోయారు. కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్రయాణికులు నడుచుకుంటూ గద్వాలకు వెళ్లారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. పిల్లాపాపలతో వచ్చిన వారు మరింత ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగునీరు లేక అల్లాడిపోయారు. సమీపంలోని చేతిపంపును ఆశ్రయిం చారు. అక్కడ కూడా కొద్దిసేపు మాత్రమే నీరు వచ్చి ఆగి పోయింది. విషయం తెలుసుకున్న మేలచెర్వు సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి ట్యాంకర్‌ను తెప్పించి ప్రయాణికుల దాహార్తిని తీర్చారు. సందట్లో సడేమియాగా రైలులో వాటర్ బాటిళ్లు, టీని విక్రయించే చిరువ్యాపారస్తులు ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. ఇదిలా ఉం టే గద్వాల నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన చాలా మంది టికెట్లను వాపసు చేశారు. పత్తాలేని రైల్వే అధికారులు! రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోయి నా రైల్వే అధికారులు స్పందించలేదు. ఒక్క అధికారి సైతం సంఘటన స్థలానికి చేరుకోలేదు. అస లు రైలు కదులుతుందా? మరో ఇంజన్ వస్తుందా? అన్న విషయం కూడా తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అక్కడున్న మె కానిక్‌లను కొంత మంది ప్రయాణికులు ప్రశ్నించగా..సరైన సమాధానం రాలేదు. రైల్వే ప్రయాణికుల పట్ల అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. -
దారి దోపిడీ
ధరలు పెంచేసిన ప్రయివేట్ ట్రావెల్స్ సంక్రాంతికి పెరిగిన రద్దీ రైళ్లన్నీ కిటకిట.. దిక్కుతోచని పండగ ప్రయాణికులు డాక్‌యార్డులో పనిచేసే శంకర్‌కు పండగకు ఎలా ఊరికి వెళ్లాలో పాలుపోవడం లేదు. విజయవాడలో అమ్మానాన్నా... రైళ్లన్నీ కిటకిట..బస్సులో ఆపసోపాలు పడలేని పరిస్థితి..పోనీ ప్రయివేట్ బస్సెక్కుదామంటే గుండెలదిరే రేట్లు చెబుతున్నారు. అవును మరి..సంక్రాంతి పండగకు అందరూ ఊళ్లు వెళ్లాల్సిందే. దీంతో ఒకటే డిమాండ్.. దీన్ని ప్రయివేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటికే విద్యాలయాలు సెలవులు ప్రకటించడంతో కుటుంబాలతో ప్రయాణాలు పోటెత్తాయి. ట్రావెల్స్ ఆపరేటర్లు బిజీ అయ్యారు. పండగకు స్వస్థలాలు చేరుకోవాలంటే రవాణా ఛార్జీలు ధడ పుట్టిస్తున్నాయి. పండగ పేరిట ట్రావెల్స్ ఆపరేటర్లు రెట్టింపు ధరల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తిరుపతి, తదితర ప్రాంతాలకు సామాన్యులు చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీల కంటే ఒకటి, రెండు రెట్లు అదనంగా ఆపరేటర్లు వసూలు చేస్తుండటం విశేషం. రైలులో ప్రయాణాలకు అవకాశం లేకపోవడం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకోంది. గత రెండు నెలలుగా రోడ్డెక్కని ప్రైవేట్ బస్‌లు ఇదే అదునుగా భావించి ధరలు అమాంతంగా పెంచేశారు. ఆన్లైన్లో టికెట్ల ధరలు సాధారణంగా ఉంటున్నా ఖాళీలు లేనట్టు చూపడం, నేరుగా ట్రావెల్స్ కార్యాలయాలకు వెళితే అధిక ధరలు వసూలు చేస్తుండటం గమనార్హం. అదే బాటలో ఆర్టీసీ..: ఆర్టీసీ ధరలు ప్రయాణికులకు చుక్క లు చూపిస్తున్నాయి. అధిక ధరలు రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డిమాండ్‌కు తగ్గట్టు సొమ్ములు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ భరించలేక ఆర్టీసీని ఆశ్రయిస్తే అక్కడా అదే పరిస్థితి ఎదురవుతోంది. పండగ సీజన్లో దాదాపు వెయ్యి ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూప ర్ లగ్జరీ, హైటెక్ బస్‌లు రాకపోకలకు వినియోగిస్తున్నారు. -
ఆర్టీసీ రైట్..రైట్..
= రోడ్డెక్కిన బస్సులు = వివిధ కారణాలతో 90 నిలిపివేత = రెండు రోజుల్లో సాధారణ స్థితి = ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు సాక్షి, విశాఖపట్నం : సరిగ్గా రెండు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దూకుడుకు కొంత చెక్ పడినట్టే. దసరా పండుగకు వెళ్లేవారంతా కాంప్లెక్స్‌ల్లో పిల్లాపాపలతో క్యూ కట్టారు. సమైక్యాంధ్ర సమ్మె నేపథ్యంలో విశాఖ రీజియన్ పరిధిలో సుమారు 1060 బస్సులు రెండు నెలలుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాంట్రాక్ట్ సిబ్బందితో బస్సులు నడుపుదామని భావించినా ఉద్యమకారులు అంగీకరించకపోవడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఫలితంగా ఆర్టీసీ సుమారు రూ.48 కోట్ల ఆదాయం కోల్పోయింది. సీఎం, రవాణాశాఖ మంత్రితో ఆర్టీసీ కార్మిక నాయకులు, అధికారులు శుక్రవారం జరిపిన చర్చలు ఫలించడంతో శనివారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తొలి సర్వీసు 4.30కే : అర్ధరాత్రే బస్సుల్ని సిద్ధం చేసిన అధికారులు శనివారం ఉదయం 4.30 గంటలకే వాహనాల్ని రోడ్డుమీదకు పంపించేశారు. ఇతర ప్రాంతాల నుంచి 5 గంటల సమయంలో బస్సులు రయ్ మంటూ వచ్చేశాయి. అయితే రెండు నెలల పాటు బస్సులు కదలకపోవడంతో మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, సెల్ఫ్ ఆగిపోవడం వంటి ఇబ్బందుల కారణంగా సుమారు 90 బస్సులు ముందుకు కదల్లేకపోయాయి. దీంతో స్టాండ్‌బై బసుల్ని (అత్యవసర సర్వీసులు) వాడుకున్నారు. అవి తప్పా మిగిలిన బస్సులన్నీ రోడ్లపై పరుగులు తీశాయి. ప్రయాణికుల్ని మోసుకుంటూ వెళ్లిపోయాయి. విశాఖ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ బస్సుల్ని పంపించారు. కొంతమంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ఇబ్బంది ఎదురైనా అధికారులు క్రమంగా పునరుద్ధరించారు. రెండు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికే వచ్చేస్తాయని ఆర్టీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. స్పందన బావుంది బస్సులు యథావిధిగా నడపడంతో జనం నుంచి స్పందన బాగానే ఉంది. సాధారణ స్థితిలో ఉన్నట్టే బస్సుల్ని పంపించాం. ఇన్నాళ్లూ తాము చాలా ఇబ్బందులకు గురయ్యామని, ప్రైవేట్ ట్రావెల్స్ తమను దోచుకున్నారని ప్రయాణికులు మా వద్ద వాపోయారు. తొలిరోజు ఆపరేషన్ సక్సెస్. దసరా నేపథ్యంలో ప్రత్యేక సర్వీసుల గురించి ఆలోచిస్తున్నాం. సమ్మె కాలంలో సహకరించిన జనానికి, కార్మిక సంఘాలకు, సిబ్బందికి కృతజ్ఞతలు. - వై. జగదీష్‌బాబు, రీజినల్ మేనేజర్