
కరెన్సీ..ఎమర్జెన్సీ
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే కాచిగూడ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఇలా బోసిపోరుు కనిపించింది. పెద్ద నోట్ల రద్దుతో చాలా మంది ప్రయాణాలను వారుుదా వేసుకుంటున్నారు. కాచిగూడ నుంచి బెంగళూర్, తిరుపతి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు ప్రతి రోజు సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగిస్తారుు.
వందకు పైగా ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తారుు. 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాంటి రద్దీ స్టేషన్‌లో కొద్ది రోజులుగా ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా సోమవారం బుకింగ్ కౌంటర్‌ల వద్ద, స్టేషన్ బయట ఇలా ప్రయాణికులు లేకుండా వెలవెల పోతూ కనిపించింది. - సాక్షి, సిటీబ్యూరో