Kacheguda railway station
-
ప్లాట్‌ఫాం టిక్కెట్ చార్జీ పెంపు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ నియంత్రణ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచింది. ఈ నెల 8వ తేదీ నుంచి 20 వరకు కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో పెద్ద ఎత్తున జన సమూహం ప్లాట్‌ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు, రద్దీ వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–శ్రీకాకుళం(07016) స్పెషల్ ట్రైన్ జనవరి 7,14,21,28, ఫిబ్రవరి 4,11,18,25, మార్చి 3,10,17,24,31 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. తిరుపతి–కాచిగూడ (07479) స్పెషల్ ట్రైన్ జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ– శ్రీకాకుళం (07148/ 07147) స్పెషల్ ట్రైన్ జనవరి 5, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55కు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.15 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు కాచిగూడ చేరుకుంటుంది. ఇవీ చూడండి.. పండగ వేళ ప్రత్యేక రైళ్లు విజయనగరం, కాకినాడకు వెళ్లాలంటే... -
రైలు ప్రమాదంపై కమిటీ విచారణ వేగవంతం
హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రోజుల క్రితం హంద్రీ ఇంటర్‌సిటీని ఎంఎంటీఎస్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సంఘటనకు సంబంధించి కాచిగూడ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌కృపాల్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. కాగా నేడు విచారణలో భాగంగా స్టేషన్ మేనేజర్ రవీందర్, డివిజన్ రీజనల్ మేనేజర్ ఎన్వీఎస్ ప్రసాద్, అడిషనల్ డివిజన్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్‌లు రైల్వేసేఫ్టీ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను, ప్రమాద సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని విచారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైల్వే సేఫ్టీ కమీషనర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదస్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ రైల్‌భవన్‌లో ఈ ఘటనపై అధికారులను సుదీర్ఘంగా విచారించనున్నారు. చదవండి : కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ.. -
మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్ 8 గంటల ఉత్కంఠ... ప్రమాదంలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్‌బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్సిటీ రైలు ఇంజిన్‌ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు. 11.15 గంటలకు లోకోపైలట్‌కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు. సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు. సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్షీట్ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి. సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. రియల్ హీరో ‘నిశాంత్’ ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్‌ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్‌పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్‌కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్‌ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. -
కాచిగూడ వద్ద ప్రమాదం.. పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు, హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాద ఘటన నేపథ్యంలో సోమవారం కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. 12 ఎంఎంటీఎస్ రైళ్లు, 16 ప్యాసింజర్ రైళ్లు, మరో 3 ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అలాగే 38 రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరో 7 రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లించారు. 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకూ రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ సర్వీసులు సికింద్రాబాద్ వరకే పరిమితమయ్యాయి. నాంపల్లి నుంచి ఫలక్‌నుమా మధ్య సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయిన రైళ్లు.. కాచిగూడ–చెంగల్పట్టు (17652), కాచిగూడ–టాటానగర్ (07438/07439), కాచిగూడ–చిత్తూరు (12797/12798) ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. కాచిగూడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా–ఉందానగర్, ఉందానగర్–సికింద్రాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్–మీర్జాపల్లి, మహబూబ్‌నగర్–కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. షోలాపూర్–ఫలక్‌నుమా (57659) రైలును సనత్‌నగర్ వరకే పరిమితం చేశారు. బోధన్–మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు మల్కాజిగిరి వరకే పరిమితమైంది. మల్కాజిగిరి–మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలును రద్దు చేశారు. మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్ రైలు ను సీతాఫల్మండి వద్ద నిలిపివేశారు. కాచిగూడ నుంచి మిర్యాలగూడ వెళ్లవలసిన రైలును సీతాఫల్మండి నుంచి నడిపారు. బోధన్–మహబూబ్‌నగర్, నిజామాబాద్–కాచిగూడ రైళ్లను మల్కాజిగిరి వరకు పరిమితం చేశారు. వికారాబాద్–కాచిగూడ రైలు సికింద్రాబాద్ వరకు పరిమితమైంది. మేడ్చల్–కాచిగూడ రైలును బొల్లారం వరకే నడిపారు. నడికుడి–కాచిగూడ రైలు మల్కాజిగిరి వరకు నడిపారు. పలు రైళ్ల దారి మళ్లింపు.. అమరావతి–తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12766)ను బొల్లారం–సికింద్రాబాద్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కాచిగూ డ–చెంగల్పట్టు (17652) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్–రాయ్‌చూర్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కోయంబత్తూర్–హజ్రత్ నిజాముద్దీన్ (12647) ఎక్స్‌ప్రెస్‌ను డోన్–గుంతకల్–సికింద్రాబాద్ మార్గంలో మళ్లించారు. నాగర్సోల్–చెన్నై (16004) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, రాయచూర్, గుంతకల్ మీదుగా మళ్లించారు. కాచిగూడ–రేపల్లె (17625) రైలు సోమవారం రాత్రి 10.10కి బయలుదేరవలసి ఉండగా దీనిని అర్ధరాత్రి 12.30కి మార్చారు. -
ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమా?
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదానికి మానవ తప్పి దమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ సిగ్నల్‌ను గమనించకపోవటంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జీఎం ఆదేశం మేరకు అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఏ రైలుకు సిగ్నల్ ఇచ్చింది, ఏది ముందు వెళ్లాల్సి ఉంది తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి ఆ సమాచారాన్ని నిర్ధారించుకున్నారు. ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్ సిగ్నల్‌ను గమనించకుండా రైలును ముందుకు తీసుకెళ్లటం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని గుర్తించినట్టు వారు పేర్కొన్నారు. కర్నూలు నుంచి వచ్చిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారని, అది పూర్తిగా వెళ్లిన తర్వాతే ఎంఎంటీఎస్‌కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని వివరించారు. కానీ ఇంటర్సిటీ రైలు రెండో ట్రాక్‌పై ఉండగానే ఎంఎంటీఎస్ ముందుకు వెళ్లిందని, ఆ సమయంలో సిగ్నలింగ్ ప్యానెల్ బోర్డుపై దానికి రెడ్ సిగ్నలే ఉన్నట్టుగా గుర్తించామని పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ చంద్రశేఖర్ పొరబడి.. సిగ్నల్ లేకున్నా రైలును ముందుకు తీసుకెళ్లినట్టుగా భావిస్తున్నారు. రైలు కేబిన్‌లో ఇరుక్కుపోయి, 8 గంటల తర్వాత బయటపడిన ఆయన కాస్త కోలుకున్నాక కారణాలు తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నల్ వ్యవస్థ... ప్రస్తుతం మన రైల్వే ప్రధాన స్టేషన్లో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థనే వినిగియోగిస్తున్నారు. ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలో కూడా అదే వ్యవస్థ ఉన్నందున సిగ్నలింగ్‌కు సంబంధించి సాం కేతిక లోపం తలెత్తే అవకాశం లేదని స్పష్టంచేస్తున్నారు. ‘ఇది సిగ్నల్ వ్యవస్థలో లోపంతో జరిగిన ప్రమాదం కాదు. మానవ తప్పిదంగానే భావిస్తున్నాం. ఆటోమేటిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టంలో ఒకే మార్గంలో రెండు రైళ్లకు సిగ్నల్ ఇవ్వటం కుదరదు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కే సిగ్నల్ ఉన్నందున ఎంఎంటీఎస్‌కు లేనట్టే. కానీ దాన్ని గమనించకుండా లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లినట్టు భావిస్తున్నాం’అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ పేర్కొన్నారు. ఆ లోకోపైలట్‌కు ఎనిమిదేళ్ల అనుభవం.... ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ చంద్రశేఖర్‌కు రైళ్లు నడపటంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉంది. ఆయన 2011లో ఆ ఉద్యోగంలో చేరారని అధికారులు పేర్కొన్నారు. తొలుత గూడ్సు రైళ్లకు లోకోపైలట్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లకు, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు లోకోపైలట్‌గా వ్యవహరించారు. ఆరు నెలల క్రితం ఆయనకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే బాధ్యత అప్పగించారు. ఈ ఆరు నెలల్లో ఆయన ఎలాంటి పొరపాట్లూ చేయలేదని చెబుతున్నారు. అప్రమత్తం చేసేందుకు యత్నించా నాకు గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే గార్డుకు సమాచారం అందించా. ఆ తర్వాత రైలును ముందుకు కదిలించా. రెండో ట్రాక్ నుంచి మూడో ప్లాట్‌ఫామ్‌కు మళ్లే క్రమంలో ఎదురుగా ఎంఎంటీఎస్ రైలు రావటాన్ని గమనించా. వెంటనే ఆ లోకోపైలట్‌ను అప్రమత్తం చేసే సిగ్నల్ కూడా ఇచ్చాను. కానీ ఆయన దాన్ని గమనించలేదేమో. అప్పటికే దగ్గరకు వచ్చినందున బ్రేక్ వేసే వీలు కూడా లేనట్టుంది. – బాలకృష్ణ, ఇంటర్సిటీ లోకోపైలట్ ఆ మలుపే కాపాడింది.. ప్రమాద సమయంలో రెండు రైళ్లు తక్కువ వేగంతోనే ఉన్నాయి. వేగం తక్కువగానే ఉన్నా.. రెండు రైళ్లు కదులుతున్న పరిస్థితిలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అందుకే ఇంటర్సిటీ ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. అయినా కూడా తీవ్ర గాయాలు కాకుండా లోకోపైలట్ చంద్రశేఖర్ తప్పించుకోగలిగారు. దీనికి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారే క్రమంలో దాని ఇంజిన్ సరిగ్గా ఎదురుగా కాకుండా కొంత పక్కగా ఉండటమే కారణంగా భావిస్తున్నారు. రెం డు ఇంజిన్లు కుడివైపు ఢీకొన్నాయి. ఇంటర్సిటీ ఇంజిన్ ఎంఎంటీఎస్ కేబిన్‌లో దూసుకుపోయినా.. నేరుగా దాని లోకోపైలట్ ఉన్న భాగాన్ని ధ్వం సం చేయలేదు. ఆయన కూర్చున్న ప్రాంతానికి కాస్త పక్కగా ఇంజిన్ దూ సుకొచ్చింది. దీంతో ఆయన కుర్చీ పైకి లేచి ఇరుక్కుపోయింది. ఫలితంగా లోకోపైలట్‌కు తీవ్ర గాయాలు కాలేదు. అదే సరిగ్గా ఎదురెదురుగా ఢీకొని ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. -
కాచిగూడ స్టేషన్లో రెండు రైళ్లు ఢీ
సాక్షి, హైదరాబాద్ : నిత్యం పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. స్టేషన్ కావడంతో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఒకవేళ రెండు రైళ్ల వేగం ఎక్కువగా ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రాణనష్టం లేకపోవటంతో దీనిని చిన్న ప్రమాదంగానే పరిగణిస్తున్నా, ప్రమాదానికి దారితీసిన కారణాన్ని మాత్రం భారీ తప్పిదంగానే రైల్వే భావిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే సేఫ్టీ కమిషనర్ రాంక్రిపాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టనుంది. నుజ్జునుజ్జయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్ (ఇన్సెట్లో) ప్రమాదంలో గాయపడిన పి.శేఖర్ ఏం జరిగింది? కాచిగూడ స్టేషన్లోకి సోమవారం ఉదయం 10:20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. అంతకు ముందే కర్నూలు టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ వద్దకు చేరుకుంది. అది మూడో నంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్లాల్సి ఉంది. అది వచ్చిన సమయంలో మరో రైలు ఆ ప్రాంతాన్ని దాటాల్సి ఉండటంతో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను హోం సిగ్నల్ ప్రాంతంలో ఆపి ఉంచారు. అది ఆగిన ప్రాంతం ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 10.30 గంటల సమయంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన లైన్ మీదుగా వచ్చినందున అది తొలుత ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్, ఆ తర్వాత రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్‌లను దాటుకుని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్‌పైకి వెళ్లాలి. సిగ్నల్ పడగానే ఆ రైలు బయలుదేరి మొదటి ట్రాక్‌ను దాటి రెండో ట్రాక్‌పైకి వచ్చి దాన్ని క్రాస్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అప్పటికే రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా వైపు ముందుకు కదిలింది. దాని లోకోపైలట్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ ట్రాక్ మీదుగా మరో ట్రాక్‌లోకి క్రాస్ అవుతున్న సంగతిని గుర్తించలేదు. దీంతో ఎంఎంటీఎస్ నేరుగా దూసుకెళ్లి ఇంటర్సిటీ ఇంజిన్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగింది ఇలా.. (సీసీ టీవీ దృశ్యాలు) ఈ ఘటనలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. ఎంఎంటీఎస్ తొలి నాలుగు బోగీలు ఎగిరి పట్టాల పక్కన పడిపోగా.. మరో రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఇంటర్సిటీకి చెందిన మూడు బోగీలు సైతం పట్టాల నుంచి పక్కకు దిగిపోయాయి. ప్రమాద ఘటనలో ఎంఎంటీఎస్ ఒక్కసారిగా పెద్ద కుదుపుతో గాలిలోకి ఎగిరి కింద పడటంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. బోగీ డోరు వద్ద ఉన్నవారు కొందరు కిందకు పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రయాణికులు బోగీల నుంచి దూకి చెల్లాచెదురుగా పారిపోయారు. ఇంటర్సిటీ ఇంజిన్ చొచ్చుకెళ్లడంతో లోకోపైలట్ చంద్రశేఖర్ కేబిన్‌లోనే చిక్కుకుపోయారు. దాదాపు 8 గంటల తర్వాత ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఆయన్ను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. వేగం తక్కువగా ఉండటంతో.... ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్రాక్ మారే ప్రయత్నంలో ఉన్నందున ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వేగం 10 కిలోమీటర్ల లోపే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ వేగం 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉందని రైల్వే చెప్పారు. సాధారణంగా ప్లాట్‌ఫామ్ నుంచి బయలు దేరి 500 మీటర్ల దూరం వచ్చేసరికి ఎంఎంటీఎస్ రైళ్ల వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ట్రాక్ ఛేంజింగ్ పాయింట్ కావటంతో అక్కడ వేగం అందులో సగానికి తక్కువే ఉంటుంది. ఇదే ఇక్కడ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఉస్మానియా, కేర్లలో చికిత్స.. ప్రమాద ఘటనలో గాయపడినవారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాస్త ఎక్కువ గాయాలైన 17 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో 11 మందికి ఓపీలో చికిత్స చేసి పంపించగా.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. పరకాలకు చెందిన పి.శేఖర్(36)కి తల, చేతులపై తీవ్ర గాయాలు కాగా, యాకుత్‌పురాకు చెందిన రహీమోద్దీన్(55)కి కూడా బలమైన గాయాలయ్యాయి. వీరికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. గద్వాలకు చెందిన బాలేశ్వరమ్మ(52)కు ఎడమ కాలు, హఫీజ్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్(35)కు కుడికాలు విరిగిపోయాయి. వీరికి ఉస్మానియాలో కట్టు కట్టిన తర్వాత మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లోకోపైలట్ చంద్రశేఖర్‌తోపాటు మరో క్షతగాత్రుడు సాజిద్‌ను కూడా కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వల్ప గాయాలతో బయటపడిన సులోచన(32), ఆంజనేయులు(35), మహ్మద్ అలీ(45), ప్రభాకర్(65), రాజ్‌కుమార్(24), మౌనిక(18), అనురాధమ్మ(40), మీర్జాబేగం(46), బలరాం(45), మల్లమ్మ(50), ఆనంద్(25)లకు ఉస్మానియా ఓపీలో చికిత్స చేసి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే బోగీ నుంచి బయటకు దూకి పరుగులు తీస్తున్న ప్రయాణికులు గవర్నర్ ఆరా... రైలు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు రైల్వే అధికారులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి చికిత్స నిమిత్తం రూ.25 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దశబ్దం వచ్చింది రైళ్లు ఢీకొనగానే భారీగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను మహిళా బోగీలో ఉన్నాను. అంతా హాహాకారాలు చేశారు. బోగీలో కొద్దిగా తొక్కిసలాట కూడా జరిగింది. వెంటనే తేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం.– ఆంజనేయరాజు, ఆర్పీఎఫ్ కొందరు బయటపడ్డారు నేను మహిళా బోగీలో విధుల్లో ఉన్నాను. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. డోర్ల వద్ద నిలుచున్న చాలామంది ఎగిరి అవతల పడ్డారు. రైలు పట్టాలు తప్పిందని అర్థమైంది. నేను వెంటనే బోగీ నుంచి కిందకు దిగి, రైలు ఇంజిన్ వైపు పరిగెత్తాను. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి, అధికారులను అప్రమత్తం చేసాను. – ఎమ్మార్సీ రాజు, ఆర్పీఎఫ్ -
దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్ల డిజిటైజేషన్
కాచిగూడలో డిజి–పే సర్వీసులను ప్రారంభించిన ద.మ. రైల్వే జీఎం సాక్షి, హైదరాబాద్/హైదరాబాద్: డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా దేశంలోనే వంద శాతంవస్తు, సేవలను అందజేసే మొదటి ‘డిజి–పే స్టేషన్’గా కాచిగూడ రైల్వేస్టేషన్ అవతరించింది. టికెట్ బుకింగ్‌లతో పాటు, పార్సిళ్లు, రిటైరింగ్ రూమ్స్, పార్కింగ్ తదితర రైల్వే సదుపాయాలు, స్టాళ్లలో లభించే వస్తువులను డిజిటల్ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం డిజిటల్ సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా దక్షిణమధ్య రైల్వేలోని అన్ని రైల్వేస్టేషన్లను డిజి–పే స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మొట్టమొదట 10 ఏ క్లాస్, ఏ–1 స్టేషన్లలో రెండో దశ డిజి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. దశల వారీగా మిగతా స్టేషన్లలోనూ నగదురహిత సేవలు ప్రారంభించనున్నామన్నారు. డిజి–పే విధానం వల్ల ప్రతి వస్తువు కొనుగోలుకు బిల్లు వస్తుందని, దీంతో అక్రమాలకు పాల్పడే అవకాశమే లేదన్నారు. స్వయంగా కొనుగోలు చేసిన జీఎం జీఎం వినోద్‌కుమార్ స్వయంగా ఒక స్టాల్లో డెబిట్ కార్డు ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. డిజి–పే పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. డిజిటల్ సర్వీసులను అందిస్తున్న స్టాల్ నిర్వాహకులకు డిజి–పే జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అదనపు జనరల్మేనేజర్ ఏకే గుప్తా, హైదరాబాద్ డీఆర్ఎం అరుణాసింగ్, ఆంధ్రాబ్యాంకు సీజీఎం సత్యనారాయణ మూర్తి, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.డి.క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
కాచిగూడ స్టేషన్ లో అంతా కార్డుమయం!
► దేశంలోనే తొలి ‘డిజిటల్’ రైల్వే స్టేషన్ గా గుర్తింపు ► నేడు ప్రారంభించనున్న రైల్వే జీఎం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రథమంగా పూర్తిస్థాయి డిజిటల్ స్టేషన్ గా కాచిగూడ రైల్వేస్టేషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. కౌంటర్లో టికెట్ కొనాలన్నా.. దుకాణాల్లో వస్తువులు కావాలన్నా.. పార్కింగ్ యార్డులో బిల్లు చెల్లించాలన్నా.. క్లాక్‌రూంలో సామాను భద్రపరచాలన్నా.. చెల్లింపులన్నీ కార్డుతోనే. ఎక్కడా డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం ప్రారంభించనున్నారు. నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్‌యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాచిగూడను వంద శాతం డిజిటల్ స్టేషన్ గా మార్చాలని నిర్ణయించి నెల రోజుల పాటు కసరత్తు చేశారు. సేషన్ లోని అన్ని దుకాణాల యజమానులు, పార్కింగ్ కాంట్రాక్టర్, క్లాక్‌రూం నిర్వాహకులతో చర్చించి అందరూ స్వైపింగ్ మెషీన్లు సమకూర్చుకునేలా చూశారు. ఇప్పుడు అన్ని దుకాణాల్లో మెషీన్లు సమకూరాయి. ఇప్పటి వరకు దేశంలో మరే స్టేషన్ శాతం కార్డుతో చెల్లింపు వసతి లేదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. టికెట్ కౌంటర్లకే పీఓఎస్‌లు పరిమితమవుతున్నాయి. -
కరెన్సీ..ఎమర్జెన్సీ
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే కాచిగూడ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఇలా బోసిపోరుు కనిపించింది. పెద్ద నోట్ల రద్దుతో చాలా మంది ప్రయాణాలను వారుుదా వేసుకుంటున్నారు. కాచిగూడ నుంచి బెంగళూర్, తిరుపతి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు ప్రతి రోజు సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగిస్తారుు. వందకు పైగా ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తారుు. 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాంటి రద్దీ స్టేషన్లో కొద్ది రోజులుగా ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా సోమవారం బుకింగ్ కౌంటర్ల వద్ద, స్టేషన్ బయట ఇలా ప్రయాణికులు లేకుండా వెలవెల పోతూ కనిపించింది. - సాక్షి, సిటీబ్యూరో -
కాచిగూడ స్టేషన్లో ఉచిత వైఫై
♦ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ♦ త్వరలో సికింద్రాబాద్, నాంపల్లిలలో... సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉచిత అన్లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రోజుకు నలభై నుంచి యాభై వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో లింక్ ద్వారా ఈ సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎంపీలు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మహ్మద్ అలీఖాన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 18 ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్న శాఖ... కాచిగూడతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా అన్లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కల్పించనుంది. త్వరలో నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో కూడా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో అరగంట పరిమిత ఉచిత ఇంటర్నెట్ సదుపాయం ఉంది. -
కాచిగూడలో రైల్వే మ్యూజియం
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కే.శ్రీవాత్సవ ప్రారంభించారు. రైల్వే వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నేటి అత్యాధునిక రైల్వే వ్యవస్థ వరకు కాల క్రమేణా మారుతున్న పరిణామాలకనుగుణంగా మారిన విధంగా అన్ని రకాల మోడల్ రైళ్ల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆడియో విజువల్ లాంజ్‌ను కూడా ప్రారంభించారు. కుతుబ్‌షాహీ కాలం నుంచి మీర్ మెహమూద్ ఆలీ ఖాన్ కాలంలోని ఉస్మానియన్ శైలి వరకు జరిగిన మార్పులకు ప్రతీకగా నిలిచింది. ఇక్కడ ఉన్న సాంప్రదాయ ముస్లిం శైలితో అద్భుతమైన తోథిక్ స్టైల్‌ని కలుపుకుంటూ మధ్య డోమ్ మరియు ఇరువైపులా ఉండే డోమ్‌లు నిర్మాణం చేశారు. ఇవే అనంతరం హైదరాబాద్‌లో నిర్మించబడే సరికొత్త సమాజిక భవన సముదాయాల నిర్మాణానికి నాంది పలికాయి.