The cancellation of the notes
-
రండి..రండి దయచేయండి!
పెద్ద హోటళ్లలో తగ్గిన ఆక్యుపెన్సీ నోట్ల రద్దుతో ‘ఆతిథ్యానికి’ భారీ ఎఫెక్ట్ గ్రేటర్లో రెండు నెలలుగా ఇదే పరిస్థితి మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే భారీ తగ్గుదల సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని లగ్జరీ హోటళ్లకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ తగిలింది. ఆక్కుపెన్సీ రేటు భారీగా పడిపోయింది. అతిథుల కోసం స్టార్ హోటళ్లు సైతం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గత రెండునెలలుగా నగరంలోనే హోటల్స్ బుకింగ్స్ అధికంగా తగపట్టినట్లు గుర్గావ్లోని ‘హోటల్ రీసెర్చ్ అసోసియేషన్’ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో బుకింగ్స్ నామమాత్రంగానే తగ్గాయి. అక్కడ 71.6 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..ఢిల్లీలో 62.3 శాతం, ఆ తర్వాత కోల్‌కతాలో 60 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైంది. పొరుగునే ఉన్న బెంగళూరు నగరంలో 57.8 శాతం, చెన్నైలో 57 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..మన గ్రేటర్హైదరాబాద్ నగరంలో మాత్రం 56.4 శాతమే ఆక్యుపెన్సీ ఉందని ఆ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగరంలోని పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక, ఆర్థికేతర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లగ్జరీ హోటళ్లను కాస్త దూరం పెట్టాయి. బడ్జెట్ హోటళ్లలోనే సాదాసీదాగా సమావేశాలు, సదస్సులు నిర్వహించడమూ దీనికి ప్రధాన కారణమని హోటల్‌రంగ నిపుణులు తెలిపారు. ఆక్యుపెన్సీ తగ్గేందుకు పలు కారణాలు.. ►నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో కార్పొరేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల యజమానుల ఆలోచనా విధానం మారింది. ►అవనవసర ఖర్చులు, ప్రణాళికేతర వ్యయాన్ని బాగా తగ్గించడం. కాస్ట్‌కటింగ్ చర్యలకు ప్రాధాన్యతనివ్వడం. ►లగ్జరీ హోటళ్ల స్థాయిలో కాకపోయినా.. బడ్జెట్ హోటళ్లలోనూ సేవలు, ఆతిథ్యం, వసతులు మరింత మెరుగవడం. ►వివిధ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, మెడికల్టూరిజం, మార్కెటింగ్ తదితరాల పనుల నిమిత్తం నగరానికి వచ్చే విదేశీ, స్వదేశీ టూరిస్టులు సైతం లగ్జరీ హోటల్స్ కంటే బడ్జెట్ హోటళ్ల వైపు మొగ్గుచూపడం. ►మెట్రో నగరాల్లో గత రెండునెలలుగా లగ్జరీ హోటళ్లలో నమోదైన ఆక్యుపెన్సీ శాతం ఇలా ఉంది. భవిష్యత్ బడ్జెట్ హోటల్స్‌దే... రాబోయే రెండేళ్లలో(2017–19) పలు మెట్రో నగరాల్లో లగ్జరీ, సెవన్‌స్టార్, ఫైవ్‌స్టార్ హŸటల్స్ కంటే బడ్జెట్ హోటళ్లకే గిరాకీ అధికంగా ఉంటుందని తాజా సర్వే ఆధారంగా హోటల్స్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ అంచనా వేసింది. ఆక్యుపెన్సీ(అతిథుల భర్తీ) విషయంలో బడ్జెట్హోటళ్ల సెగ్మెంట్లలో ఆయా నగరాల్లో పెరుగుదల శాతం ఇలా ఉంటుందని అంచనా వేసింది. విమానయానానికి తగలని నోట్లరద్దు సెగ... పెద్ద నోట్ల రద్దు దెబ్బకు నగరంలోని అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతోపాటు రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలకూ లాభాలు తగ్గిన విషయం విదితమే. అయితే నగరం నుంచి నిత్యం రాకపోకలు సాగించే 370 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రం గిరాకీ ఏమాత్రం తగ్గలేదని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రోజువారీగా సుమారు 40 వేల మంది ప్రయాణికులు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. పెద్దనోట్లు రద్దుతో దేశీయ,అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకోలేదని పేర్కొన్నారు. విమాన టిక్కెట్లను ముందుగానే బుకింగ్చేసుకునే అవకాశం ఉండడం,నోట్లు రద్దయిన అనంతరం కూడా పాతనోట్లను చాలా కాలం టిక్కెట్ల బుకింగ్‌కు స్వీకరించడం, అత్యవసర ప్రయాణాలు అనివార్యం కావడం వంటి అంశాల కారణంగా విమాన ప్రయాణికులు తగ్గలేదని విశ్లేషించారు. -
నగదు రహితం సాధ్యమేనా..
డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేని గ్రామీణులు బ్యాంకులకు వెళ్లడమే ఏడాదికి ఒకటి, రెండు సార్లు.. జిల్లాలో నిరక్షరాస్యులే అధికం.. నర్సంపేట : నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి మొదలైన సామాన్యుల కష్టాలు ఇంకా తీరడం లేదు. నోట్ల డిపాజిట్, మార్పిడికి గడువు ముగిసిన నేపథ్యంలో.. నగదు రహిత లావాదేవీల నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న జనాభాలో 93.01 శాతం గ్రామాల్లో నివసిస్తుండడం.. సగం మంది కూడా అక్షరాస్యులు కాకపోవడంతో ఈ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు కత్తి మీద సామేనని పలువురు భావిస్తున్నారు. విరుగుడు ఇదే.. పెద్ద నోట్లను రద్దు చేశాక ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సద్దుమణగాలంటే నగదు రహిత చెల్లింపులే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ప్రజలకు సాంకేతిక సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ, సగం జనాభా కూడా అక్షరాస్యులు లేని వరంగల్ రూరల్ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు చేయడం సాధ్యం కాక ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో ద్రువీకరణ పత్రం రాసేందుకు పేదలు ఇతరులపై ఆధారపడుతుండగా నగదు రహిత వ్యవస్థకు వరంగల్ జిల్లా ఎంత దూరమో ఇట్టే చెప్పొచ్చు. -
నేడు కాంగ్రెస్ నిరసన
కరెన్సీ కష్టాలపై కదన భేరి కలెక్టరేట్ నుంచి ఏకశిల పార్కుకు మారిన వేదిక పెద్ద ఎత్తున నిర్వహణకు పార్టీ శ్రేణుల సమాయత్తం స్థల పరిశీలన చేసిన జిల్లా నాయకులు వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అఖిల భారత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తొలుత హన్మకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపాలని భావించినప్పటికి జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడంతో వేదికను బాలసముద్రంలోని ఏకశిల పార్కు(జయశంకర్ స్మృతివనం)కు మార్చారు. ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న సభాస్థలి వద్ద చేపట్టిన ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ రీజినల్ కోఆర్డినేటర్, కేరళ మాజీ శాసనసభ్యుడు పీసీ విష్ణునాథ్, జిల్లా పార్టీ పరిశీలకులు, పార్టీ సీనియర్ నా యకులు, కొత్త జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నట్లు తెలిపా రు. కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నగదు కష్టాలను తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంలల్లో నిత్యావసరాల మేరకు నోట్లను అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం నిరసన కార్యక్రమాల ఏర్పాట్లపై సుబేదారి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తో రాజేందర్‌రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యదర్శి ఈవీ.శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మెడకట్ల సారంగపాణి, నా యకులు శ్రీనివాస్‌రెడ్డి, మానుపాటి శ్రీనివాస్, శ్యాం, రాజు, సమద్, గణేష్ పాల్గొన్నారు. -
కరెన్సీ కష్టాలు.. కంటిన్యూ!
ఇంకా తెరుచుకోని ఏటీఎంలు.. పనిచేస్తున్న వాటిలో పెద్ద నోట్లే.. చిల్లరతో చిరు వ్యాపారుల విలవిల నిజామాబాద్ : కరెన్సీ కష్టాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసి సుమారు రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ.. ప్రజలకు నోట్ల ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా అవసరాల మేరకు రూ.500, రూ.100 నోట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లాలో చిల్లర సమస్య తీవ్రమైంది. ఇది చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజువారి వ్యాపారాలు సాగక, గిరాకీలు పడిపోవడంతో రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు. తెరుచుకోని ఏటీఎంలు.. ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులు కలిపి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 371 బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులకు సంబంధించి 345 ఏటీఎంలు ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ఆయా బ్యాంకుల మెయిన్ బ్రాంచుల వద్ద ఉన్న కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ఏటీఎంలు పనిచేయడం ప్రారంభించాయి. పనిచేస్తున్న ఈ ఏటీఎంలలో కూడా రూ.100 నోట్లు, రూ.500 నోట్లు వస్తున్న ఏటీఎంలు నామమాత్రమే. ఎక్కువ ఏటీఎంలలో రూ.2 వేల నోట్లే వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొనసాగుతున్న ఆంక్షలు.. బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాకు ఆంక్షలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. వారానికి రూ.24 వేల పరిమితి ఇంకా ఎత్తివేయలేదు. రోజుకు ఇచ్చే రూ.4 వేల పరిమితిని కొంత సడలించారు. రూ.10 వేల వరకు ఇస్తున్నారు. దీంతో ఆయా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా కోసం బారులు కొంత మేరకు తగ్గాయి. కానీ.. రద్దీ మాత్రం అలాగే కొనసాగుతోంది. సుమారు రూ.6 వేల కోట్ల డిపాజిట్లు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్ల నగదు డిపాజిట్ అయినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ఖాతాదారులు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను తమ ఖాతాల్లో వేస్తున్నారు. అయితే డిపాజిట్ల మేరకు కొత్త కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సుమారు రూ.6వేల కోట్లు డిపాజిట్లు అయితే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే జిల్లాకు కొత్త కరెన్సీ వచ్చినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల అంచనా. అంటే డిపాజిట్లు అయిన మొత్తంలో కనీసం 20 శాతం కూడా కొత్త నోట్లు జిల్లాకు రాలేదు. ఇలా జిల్లా అవసరాల మేరకు కరెన్సీ జిల్లాకు చేరకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కరెన్సీ కోసం పలుమార్లు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. యథేచ్ఛగా అక్రమాలు.. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీని పెద్ద మొత్తంలో వైట్ మనీగా మార్చుకున్నారు. ఇందుకు కొన్ని బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకారంతో భారీ మొత్తంలో నగదు అక్రమ మార్పిడి జరిగింది. ముఖ్యంగా బడా వ్యాపారులకు బ్యాంకు అధికారులు సహకరించారనేది బహిరంగ రహస్యంగా మారింది. నల్లదనం ఉన్న వారు తమ కరెన్సీని రూ.100 నోట్లుగా మార్చుకుని తమ వద్ద ఉంచుకోవడంతో కూడా చిల్లర సమస్యకు పరోక్ష కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పాత నోట్లు.. రూ.350 కోట్లు
గడువు ముగిసే సమయానికి బ్యాంకుల్లో డిపాజిట్ ఒక్కో పట్టణంలో రూ.కోటికి పైగానే.. ఇంకా తెరుచుకోని ఏటీఎంలతో ప్రజల ఇక్కట్లు కానరాని రూ.100 నోట్లు.. రూ.500 నోట్లూ అక్కడక్కడే! ఆత్మకూరు : కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి రెండు నెలలు కావస్తున్నా సాధారణ ప్రజల కష్టాల అంతు తేలడం లేదు. చెలామణి నిలిపివేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్, మార్పిడికి కేంద్రం అప్పట్లో అవకాశం కల్పించింది. కానీ నోట్ల మార్పిడిని రద్దు చేసిన ప్రభుత్వం బ్యాంకుల్లో ఖాతాదారులు మాత్రమే జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తన ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీతో బ్యాంకుల్లో పాత నోట్లను జమ చేసుకునే గడువు ముగియగా.. అప్పటి వరకు డిపాజిట్ అయిన మొత్తం వివరాలను బ్యాంకుల వారీగా ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల్లోనే.. వరంగల్ రూరల్ జిల్లాలో ఎక్కువగా ఎస్బీహెచ్, ఆంద్రా బ్యాంకులోనే డిపాజిట్లు జరిగాయి. ఒక్క పరకాల పట్టణంలోని ఎస్‌బీహెచ్‌లోనే రూ.80కోట్ల 50లక్షలు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇలా జిల్లా మొత్తం రూ.350 కోట్ల మేరకు పాత నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. 17 బ్యాంకులు.. 64 శాఖలు జిల్లాలో 17 బ్యాంకులకు సంబంధించి 64 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 57 ఏటీఎంలు ఉండగా అందులో 45ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. పనిచేస్తున్న వాటిల్లోనూ డబ్బు లోడ్ చేసిన గంట, రెండు గంటల్లో ఖాళీ అవుతున్నాయి. మంగళవారం కూడా అధికంగా ఏటీఎంలు మంగళవారం మ««ధ్యాహ్నం వరకే ఖాళీ అయ్యాయి. సంగెం ఆంధ్రాబ్యాంకులో ఏటీఎంలో రూ.4లక్షలకు పైగా లోడ్ చేసినా సాయంత్రం తర్వాత ఖాతాదారులకు డబ్బు లభించలేదు. ఇక జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఉన్న ఏటీఎంల్లో రూ.100 నోట్లు కరువయ్యాయి. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో పనిచేసే పది, పదిహేను ఏటీఎంల్లో రూ.2వేల నోట్లే లోడ్ చేస్తున్నారు. ఇక నూతన రూ.500నోట్లు విడుదలైనా చాలా తక్కువగా ఖాతాదారులకు అందుతున్నాయి. రుణాల విషయంలో కరువైన స్పష్టత ఖాతాదారులు పాత నోట్లను జమ చేసే గడువు ముగిసి నాలుగు రోజులు దాటింది. అయినప్పటికీ రైతులు, వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఫసల్ భీమా యోజన దరఖాస్తుకు గడువు గత నెల 31తో ముగిసినా ఇంకా పది రోజులు పొడిగించారు. ఇక బ్యాంకర్లు రుణాల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్ని వర్గాల -
మోదీ దేశ ప్రతిష్ట దిగజార్చారు
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: పెద్దనోట్లు రద్దు చేసి ప్రధాన మంత్రి మోదీ దేశ ప్రతిష్టను దిగజార్చారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లకుబేరులను బయటకు తీస్తామని వాగ్దానం చేసిన ప్రధాని కోట్లాది రూపాయలు రుణాలు ఎగవేసిన వారికి వత్తాసు పలికారన్నారు. పేద ప్రజలను రోడ్డుకీడ్చారని, పెద్దనోట్ల రద్దును కప్పిపుచ్చుకునేందుకు క్యాష్‌లెస్ లావాదేవీలు అని, బంగారం నియంత్రణ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సామాన్యుల వద్దనున్న డబ్బును బ్యాంకుల్లో జమ చేయించి ప్రభుత్వం కరెన్సీ వినియోగం తేవడానికి ప్రత్యామ్నాయ నోట్ల ముద్రణ చేయకుండా ప్రజలను ఇబ్బం దులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే.. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వంలో రైతులకు లక్షలోపు రుణాలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం, రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ మాఫీ చేస్తుందని దేశంలో ఉన్న రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకే రెండు మాసాలు వడ్డీ మాఫీ చేస్తామనడం మోసపూరిత ప్రకటననే అన్నారు. అసలు బ్యాంకర్లు రుణాలే ఇవ్వని పరిస్థితిలో గృహ రుణాల వడ్డీ తగ్గిస్తున్నామని చెప్పుకోవడం సబబు కాదన్నారు. 50 రోజులు గడుస్తున్నా ఏటీఎంలు కూడా పనిచేయడం లేదని అన్నారు. పెళ్లిళ్ల కోసం రూ.2.50 లక్షలు నగదు చెల్లిస్తామని ప్రధాని వాగ్దానం చేసినా ఇప్పటి వరకు ఏ పెళ్లికి డబ్బులు ఇచ్చిన దాఖలా లేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ నాయకులు గాలి జనార్దన్‌రెడ్డి ఇంట్లో వివాహాలకు మాత్రం పెద్ద ఎత్తున నగదు ఎలా లభ్యమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నగదు దొరకక ఈజీఎస్ కూలీలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కొత్తనోట్ల సరఫరా చేయడంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంలో రుణమాఫీ సాధ్యం కాదని, ప్రస్తుతం 12.50 శాతం రుణమాఫీ జమచేశామని చెబుతున్నా, ఏ ఒక్క బ్యాంక్ నుంచి రైతుకు డబ్బులు అందిన దాఖలు లేవన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిందని, అది పెన్షన్ల తొలగింపునకు మాత్రమే అక్కరకు వచ్చిందన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి ఇప్పటి వరకు రద్దు అయిన నోట్లతో దేశంలో ఎంతో సొమ్ము వచ్చిందని, రాలేకపోయిన సొమ్ము ఎంతో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలను ఉపాధికి దూరం చేశారని, ప్రతి పేద కుటుంబానికి రూ.25వేలు వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో దేశంలో 150 మంది మరణించారని, వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, ఎంపీపీ గర్వందుల మానస, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గర్వందుల నరేశ్‌గౌడ్, ముఖేశ్కన్నా,రాజేందర్ పాల్గొన్నారు. అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల దాడులు సారంగాపూర్: సారంగాపూర్ మండలంలోని నాగునూర్ గ్రామంలో సోమవారం అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. కొంతమంది రైతుల ఇళ్లలో అక్రమంగా కలప నిలువ ఉందనే సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించి దాచి ఉంచిన కలపను పట్టుకున్నారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజర్ ఖలీల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్‌లెస్ వైపు అడుగులు
జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక ఆ గ్రామాల్లోని అన్ని కుటుంబాలలో నగదు రహిత లావాదేవీలు నిజామాబాద్ : నగదు రహిత లావాదేవీల వైపు అడుగులు పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నగదు రహిత లావాదేవీల ప్రాధాన్యతపై గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించే దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో నాలుగు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుంది. ఆయా గ్రామాల్లో ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీలతో ఉన్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా అవగాహన కలిగేలా చర్యలు చేపట్టింది. ఇలా మొదటి విడతలో తుంగిని, బాదన్పల్లి, దోమలెడిగి, కేశారం గ్రామాలను పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగిని గ్రామంలో ఉన్న సుమారు 180 కుటుంబాలతో సుమారు 400 లావాదేవీలు జరిపించారు. అంటే ఒక్కో కుటుంబం నుంచి కనీసం రెండు నగదు రహిత లావాదేవీలు జరిపించారు. అలాగే కేశారం గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని కుటుంబాలు కనీసం రెండు చొప్పున నగదు రహిత లావాదేవీలు జరిపించారు. అలాగే దోమలెడిగి, బాదన్పల్లిలో కూడా అన్ని కుటుంబాలతో నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు చేపట్టింది. ఇలా మరో 31 గ్రామాలను ‘క్యాష్ లెస్’ గ్రామాలు గా చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఆధార్ ఎనేబుల్డ్ ద్వారా.. పేటీఎం వంటి యాప్‌లు స్మార్ట్‌ఫోన్ ఉన్న వారితో మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. కానీ గ్రామాల్లో అందరి వద్ద స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండవు. దీంతో ఆధార్ ఎనేబుల్డ్ విధానం ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ఆయా బ్యాంకుల కరస్పాండెంట్లను నియమించి, వేలిముద్రల ద్వారా ఈ లావాదేవీలు జరుపుతున్నారు. రేషన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో ఈ విధానం ద్వారా లావాదేవీలు జరిగేలా చూస్తున్నారు. ఇటీవల ఈ గ్రామాల్లో కొందరు రేషన్ కార్డుదారులు కిరోసిన్‌ను ఇలా నగదు రహిత లావాదేవీల ద్వారానే పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. బ్యాంకు కరస్పాండెంట్ల కొరత జిల్లాలో పూర్తి స్థాయిలో బ్యాంకు కరస్పాండెంట్లు లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు వీలు పడటం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం సుమారు రెండు వందలకు మించి బ్యాంకు కరస్పాండెంట్లు లేరు. ఎస్బీహెచ్, ఎస్బీఐ, గ్రామీణ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, విజయ బ్యాంకులకు మాత్రమే బ్యాంకు కరస్పాండెంట్లు ఉన్నారు. బ్యాంకు కరస్పాండెంట్లు ఎక్కువ మంది ఉంటే ఈ నగదు రహిత లావాదేవీలు విస్తృతంగా జరిపేందుకు వీలు పడుతుంది. ఈ కరస్పాండెంట్ల నియామకాలు చేపట్టేలా బ్యాంకులపై అధికార యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది. -
ఆసరా కు పెద్ద దెబ్బ!
డబ్బులు మంజూరైనా చేతికందని పరిస్థితి రెండు నెలలుగా అవస్థలు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకో చేస్తున్న వృద్ధులు, వికలాంగులు ఇందూరు :కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం సామాజిక పింఛన్(ఆసరా) లబ్ధిదారులపై పడింది. కొత్త నోట్లు తగినన్ని ముద్రించక పోవడంతో నగదు కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, చేనేత, కల్లు గీత కార్మికులతోపాటు బీడీ కార్మికులు రెండు నెలలుగా పింఛన్ రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రతినెల మంజూరు చేసే పెన్షన్ డబ్బులు నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి మంజూరు చేసింది. ఈ డబ్బులు ఆన్లైన్లో రావడంతో బ్యాంకు అధికారులు వాటిని నగదు రూపంలోకి మార్చి పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసులకు పంపాలి. కానీ.. నగదు లభ్యత లేకపోవడంతో బ్యాంకులకు డబ్బులు పంపలేదు. నగదు కొరత.. చేతులెత్తేసిన అధికారులు జిల్లాలో సామాజిక భద్రత పింఛన్‌దారులు 2,27,568 మంది ఉన్నారు. ఇందులో వృద్ధులు 63,256, వితంతులు 66,429, వికలాంగులు 18,974, చేనేత 206, గీత కార్మికులు 1005 మంది. వీరితో పాటు 1,773 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, 77,428 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలాS 18 నుంచి 26 వరకు గ్రామీణ ప్రాంతాల వారికి పోస్టాఫీసుల్లో, పట్టణ ప్రాంతాల వారికి బ్యాంకుల ద్వారా డబ్బు అందించాలి. కానీ, నగదు కొరతతో ఈసారి సమస్య వచ్చింది. అక్టోబర్‌లో కొందరు పింఛన్లు పొంద గా.. ఇంకా రూ.12 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ రూ.12 కోట్లు, డిసెంబర్ నెలలో రావాల్సిన పింఛన్ డబ్బులు కలుపుకుని రూ.36.41 కోట్లను సర్కారు ఈ నెల 17న మంజూరు చేసింది. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని 1,90,842 మంది లబ్ధిదారులకు రూ.32.53 కోట్లను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలి. పట్టణ ప్రాంతాల్లోని 36,726 మంది లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. కానీ.. ఆర్మూర్, నిజామాబాద్ ఎస్బీహెచ్ వారు పోస్టాఫీసులకు సరిపడా డబ్బులు పంపడం లేదు. పట్టణ ప్రాంత లబ్ధిదారులు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి నిలబడి పెన్షన్ డబ్బులు పొందుతున్నారు. జిల్లాకు రూ.36.41 కోట్ల పెన్షన్ డబ్బులు నగదు రూపంలో బ్యాంకర్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. దీనిపై కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు కలిసి బ్యాంకు అధికారులను సంప్రదించగా, ఆర్బీఐ నుంచి సరిపడా నగదు రాలేదని, అందుకే డబ్బులు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. పెరుగుతున్న ఆందోళనలు.. పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో నగదు కొరతతో లబ్ధిదారులకు డబ్బులు అందక పోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. డబ్బుల కోసం నిరీక్షించి, సహనం నశించి రాస్తారోకోలు చేస్తున్నారు. బ్యాంకు, పోస్టాఫీసు అధికారులను నిలదీస్తున్నారు. వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీడీ కార్మికులు తమకు నగదు రూపంలోనే బీడీ పెన్షన్ ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం డిచ్పల్లి, ఎడపల్లి, నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయాల ఎదుట వృద్ధులు, వికలాంగులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆందోళనలు అధికమయ్యే అవకాశం ఉంది. సర్కారు ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఉంది. వేరే ఆధారం లేదు.. రెండు నెలలుగా పెన్షన్ రావట్లేదు. పోస్టాఫీసు వద్దకు వెళ్లి అడిగితే.. బ్యాంకుS నుంచి డబ్బులు రాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులే నా కుటుంబానికి ఆసరా. సరుకులు కొనుక్కోవడానికి డబ్బు లేక ఉద్దెర తెచ్చుకుంటున్నా. – సాయిలు, వికలాంగుడు, నందిపేట్ ఇంటికి సగం ఆసరా.. ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త లేకపోవడంతో కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. అయితే ప్రభుత్వం ఇచ్చే వితంతు పెన్షన్ ఇంటిని సగం ఆసరాగా ఉండేది. ప్రస్తుతం రెండు నెలలుగా పోస్టాఫీసు వద్ద డబ్బులు లేవని పెన్షన్ ఇవ్వడం లేదు. నిత్యవసర సరుకులు కొనుక్కోలేక ఉన్నంతలో సర్దుకుంటున్నాం. – సువర్ణ, వింతంతువు, నందిపేట్ -
చిన్నబోయిన సన్నాలు ‘వెల’ విల
ఇళ్లు, కళ్లాల్లోనే ధాన్యం మద్దతు ధర రూ.1,800 వట్టిమాటే.. రూ.1,600లకే దండుకుంటున్న దళారులు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా ఉంది.. వరి మద్దతు ధర దొడ్డు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తుంటే.. సన్న రైతులు చిన్న బోతున్నారు.. అమ్ముకోలేక ఇళ్లలో, పొలాల వద్ద నిల్వ పెడుతున్నారు.. దొంగల పాలు కాకుండా ఎముకలు కొరికే చలిలో కాపలా ఉంటూ జాగారం చేస్తున్నారు.. సర్కారు మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు..– బోధన్ రూరల్ నా పేరు బేగరి శ్రీనివాస్. మాది బోధన్ మండలం ఏరాజ్‌పల్లి. నాకు ఎకరం సొంత పొలం ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సన్న రకం ధాన్యం (బీపీటీ) సాగు చేశాను. ఒక పంటకు మూడెకరాల కోసం కౌలుకు రూ.39 వేలు.. పెట్టుబడి రూ.80 వేలు ఖర్చు చేశాను. మొత్తం రూ.1.19 లక్షలు అయ్యాయి. 72 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన రూ.1800 ధర లభించక పోవడంతో బహిరంగ మార్కెట్లో ధాన్యం రూ.1,610 లకు అమ్ముకుంటే రూ.1.16 లక్షలు వచ్చాయి. ఈ లెక్కన ఖరీఫ్ అంతా కష్టపడి సాగు చేస్తే రూ.3వేల నష్టం వచ్చింది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో 1.60 లక్షల హెక్టర్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. వీటిలో ప్రధానంగా వరి పంటను సుమారు 65 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి సరైన సమయంతో వర్షాలు కురిసి పంటలకు ధీమా కలిగించాయి. అల్ప పీడన ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలాల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని రకాల పంటలు నీట మునిగి నష్టపోగా.. వరి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పొచ్చు. వాతావరణం అనుకూలించడంతో వరి పంటలను సాగు చేసిన ఈ ఏడాది కరెన్సీ నోట్లు, మద్దతు ధర విషయంలో అన్నదాతలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతులకు ఈ కష్టాలు అధికంగా వెంటాడుతున్నాయి.– బోధన్ రూరల్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. ఈ ఏడాది ఖరీఫ్‌లో సన్నరకం ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా తయారైంది. వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం పంట పొలాల్లో శ్రమించి పండించిన పంటలు అమ్ముకుందామంటే రైతులకు నానా తిప్పలు తప్పడం లేదు. పండించిన పంటకు లాభసాటి మద్దతు ధర లభించక సన్న రకం ధాన్యం రైతులు విలవిలలాడుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకే మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదురుర్కొంటుంటే ఇక యాసంగిలో ఎలా సాగు చేయాలో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ ఏదాది దొడ్డు రకం ధాన్యానికి రూ.1,510 మద్దతు ధర ప్రకటించి ఐకేపీ, సివిల్ సప్లయ్, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. సన్న రకం ధాన్యం మాత్రం ప్రభుత్వం నుంచి ఆశించిన లాభసాటి ధర లభించడం లేదు. ఇక బహిరంగ మార్కెట్లో అమ్ముకుందామంటే కరెన్సీ నోట్ల కష్టాలతో దళారులు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో చేసేది లేక రైతులు తమ ఇళ్లలో, పంట పొలాల్లో ధాన్యం నిల్వ ఉంచుకుంటున్నారు. రాత్రుళ్లు జాగారం చేస్తున్నారు. -
కాస్త ఊరట?
ఆర్బీఐ నుంచి రూ.1500 కోట్లు రాక.. ఇందులో విశాఖకు రూ.300 కోట్లు విశాఖపట్నం : నగదు కష్టాల నుంచి జిల్లా వాసులకు కాస్త ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. రిజర్వు బ్యాంకు నుంచి విశాఖకు మంగళవారం సాయంత్రం రూ.1500 కోట్ల నగదు చేరింది. రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల శాఖలకు నగదును విశాఖలోని స్కేబ్ (స్టేట్ బ్యాంకు చెస్ట్ బ్రాంచి) నుంచే పంపిస్తుంటుంది. రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు అంటే నవంబరు ఏడో తేదీన కొత్త 2 వేల రూపాయల నోట్లను పెద్దసంఖ్యలో విశాఖకు పంపింది. ఆ మర్నాడే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో చేరవేశారు. ఆ తర్వాత స్కేబ్‌కు ఇంత మొత్తంలో నగదు రావడం ఇదే తొలిసారి. ఈ సొమ్మును బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని బ్యాంకు శాఖలకు అందేలా వ్యాన్లు, కంటెయినర్ల ద్వారా పంపనున్నారు. మంగళవారం స్కేబ్‌కు వచ్చిన రూ.1500 కోట్లలో దాదాపు రూ.300 కోట్లను విశాఖకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 18న విశాఖకు రిజర్వు బ్యాంకు రూ.376 కోట్ల నగదును పంపింది. సోమవారం చలామణీ అయ్యాక మంగళవారం నాటికి జిల్లాలో రూ.211 కోట్ల నగదు బ్యాలెన్స్ ఉంది. మంగళవారం వచ్చిన సొమ్ముతో విశాఖ నగరం, జిల్లా అవసరాలకు రూ.500 కోట్ల నగదు ఉంటుందన్నమాట! క్రిస్మస్ను దృష్టిలో ఉంచుకుని.. నాలుగు రోజుల్లో రానున్న క్రిస్మస్ పండగను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ అదనపు నగదును పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో నగదు కొరతతో ఖాతాదార్లకు తగినంత సొమ్ము ఇవ్వడం లేదు. ఏటీఎంల్లో అరకొరగా పెడుతున్న నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. జిల్లా, నగర వ్యాప్తంగా ఉన్న 1112 ఏటీఎంల్లో 25 శాతం ఏటీఎంలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. పనిచేస్తున్న ఏటీఎంల్లో నగదు ఉండడం లేదు. దీంతో జనం పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన సొమ్ముతో బుధవారం నుంచి బ్యాంకులతో పాటు ఏటీఎంల్లోనూ కొంతమేర పాట్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు తాజాగా ఆర్బీఐ నుంచి వచ్చిన నగదులో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అన్నిటికీ మించి రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే జనానికి చాలా వరకు నగదు కష్టాలు, చిల్లర కష్టాలు తీరనున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఏటీఎంల్లో రూ.500 నోట్లు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న రూ.500 నోట్లు నగరానికి వచ్చేశాయి. కొత్త నోటు సైజు చిన్నది కావడంతో ఇప్పటికే చాలా ఏటీఎంల్లో సాంకేతిక మార్పులు చేశారు. జిల్లాలోని సగానికి పైగా మిషన్లలో ఈ మార్పులను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయా ఏటీఎంల్లో కొత్త రూ.500 నోట్లను అందుబాటులో ఉంచే అవకాశం ఉందని బ్యాంకు వర్గాల సమాచారం. ఇప్పటికే మంగళవారం నుంచి బ్యాంకుల ద్వారా ఈ రూ.500 నోట్లను ఖాతాదార్లకు చెల్లింపులు జరుపుతున్నారు. బుధవారం నుంచి ఇవి మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే రెండు వేల రూపాయల కొత్త నోట్ల మార్పిడికి పడుతున్న అగచాట్ల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. -
అక్కడ మోదీకి, ఇక్కడ బాబుకు జనం గుణపాఠం
కార్వేటినగరం:ముందస్తు ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, పెద్దనోట్ల రద్దుకు సలహాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలే గుణపాఠం చెప్పను న్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని ఆర్కేవీబీపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సలహాలతోనే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని గొప్పలు చెప్పు కుంటున్న ముఖ్య మంత్రి తాను తీసిన గోతిలో తానే పడ నున్నారని విమర్శించారు. ప్ర జా సమస్యలను గాలికొదిలి, వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకు ఇతరలను విమర్శిం చించడం బాబునైజమని ఆరో ³ంచారు. నరేంద్రమోదీ, బాబు పుణ్యమా అంటు జనం కరెన్సీకోసం చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా రోడ్లపై పడి బ్యాంకుల వద్ద బారుల తీరుతున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదని మండి పడ్డారు. కళ్లున్న గుడ్డివాడిలా సీఎం వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. ప్రజలు అమాకులు కారని, తమ సమస్యలు పట్టని టీడీపీ, బీజేపీ లను భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాజకీయ పదవులు శాశ్వతం కాదని, సేవలే శాశ్వత మన్నా రు. ప్రతి నెల ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చే పింఛన్లను బ్యాంకు ఖాతా ల్లో జమ చేసి పండుటాకుల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని, పలుచోట్ల క్యూలో నిలబడలేక పోతున్నా రని తెలిపారు. ఇలాగే కొనసాగితే జనం ప్రభుత్వంపై తిరగబడడం ఖాయమని నారాయణ స్వామి పేర్కొన్నారు. -
రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం
వాహనాల కొనుగోళ్లకు ముందుకురాని ప్రజలు విజయనగరం ఫోర్ట్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం వాహనకొనుగోళ్లపై పడింది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేకపోవడంతో వాహనాల కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. నవంబర్ 8 వరకు కొనుగోళ్లు ఆశాజనకంగా జరిగినా, ఆ తర్వాత నెమ్మదించారుు. కొంతమంది కొనుగోళ్లు చేస్తున్నా పూర్తిస్థారుు ఫైనాన్స తీసుకుంటున్నారు. అక్టోబర్ కంటే నవంబర్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గింది. అక్టోబర్‌లో 1014 రిజిస్ట్రేషన్లు జరగ్గా, నవంబర్‌లో 820 జరిగారుు. ఇందులో కూడా సుమారు 500 వరకు రిజిస్ట్రేషన్లు నవంబర్ 8వ తేదీకి ముందు జరిగినవే. ఫైనాన్సర్లను ఆశ్రరుుస్తున్న కొనుగోలుదారులు చేతిలో డబ్బులు లేకపోవడంతో వాహనదారులు పూర్తిస్థారుు ఫైనాన్‌సపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. షోరూం యజమానులు కూడా కేవలం నాలుగైదు వేల రూపాయలు కట్టినా వాహనాలు ఇచ్చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వాహనాలు కొనుగోలు మందగించడంతో షోరూంలు వెలవెలబోతున్నారుు. -
వచ్చే నెల 2 నుంచి ప్రొ రెజ్లింగ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వారుుదా పడిన ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్‌ను జనవరి 2 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో కలిసి ప్రొ స్పోర్టిఫై సంస్థ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 15 నుంచి ఈ సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత పరిస్థితుల దృష్ట్యా ఫ్రాంచైజీ యజమానులు వారుుదా వేయాలని కోరారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, జైపూర్‌లకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు ఇందులో తలపడనున్నారుు. సుమారు 12 మందికి పైగా ఒలింపిక్ విజేతలు ఇందులో పాల్గొంటారని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత్ నుంచి యోగేశ్వర్ దత్, సాక్షిమలిక్, సందీప్ తోమర్ బరిలోకి దిగుతున్నారు. -
చిన్ననోట్లు అందుబాటులో ఉంచాలి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం ఒంగోలు టౌన్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. బ్యాంకుల్లో చిన్ననోట్లు అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలు తీర్చడానికి బ్యాంకు అధికారులు తమ వంతు సహకారం అందించాలని ఎల్డీఎంను ఆదేశించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కరెన్సీ నోట్లు, మొబైల్ బ్యాంకింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాజిక భద్రత పింఛన్లు పొందుతూ లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు కొంత మొత్తం నగదు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విసృ్తతంగా వినియోగించుకోవాలని కోరారు. ఉపాధి కూలీలు, పింఛన్‌దారులకు రిజిస్ట్రేషన్ చేపట్టాలి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన కూలీలు, సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులంతా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందే విధంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల్లో రిసోర్స్ పర్సన్ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించి నగదు రహిత లావాదేవీలు జరిపే విధంగా చైతన్యవంతం చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని 1.8 లక్షల మంది వేతన కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేపట్టాలన్నారు. ఆధార్ సీడింగ్ అనంతరం బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్రాంచ్‌ల వివరాలను ఎల్డీఎంకు అందించి మొబైల్ రిజిస్ట్రేషన్ చేరుుంచేలా చూడాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారిని గుర్తించి జన్‌ధన్ ఖాతాలు తెరిపించి రూపే కార్డులు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. పోస్టాఫీసు ఖాతాలు కలిగిన వాటిని బ్యాంకు ఖాతాలకు మార్చాలని ఆదేశించారు. రెండువేల మందిని రిజిస్ట్రేషన్ చేరుుంచాలి మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా మండలానికి కనీసం రెండువేల మందితో మొబైల్ రిజిస్ట్రేషన్ చేరుుంచాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఫీల్డ్ అసిస్టెంట్, వీఏవో, బ్యాంకు మిత్రలతో మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేపట్టాలన్నారు. ఏ బ్యాంకు ఖాతాదారుడు అరుున మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు కామన్ ఫారం రూపొందించాలని ఎల్డీఎంకు సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కలిగించాలని మెప్మా పీడీని ఆదేశించారు. మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అంశంలో ఖాతాదారులకు బ్యాంకులు సహకరించాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, ఖజానా శాఖ డిప్యూటీ డెరైక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
జీవితం కుప్పకూలింది
భూవిలయం, జల ప్రళయం, దావానలం, వాయు ప్రచండం, గగన గమనం... ఇవన్నీ మనిషి చేతిలో ఉండని విపత్తులు, విషాదాలు, ప్రకృతి వైపరీత్యాలు. యుద్ధాలు, ఎమర్జెన్సీలు, పాలనా విధానాలు... ఇవి మాత్రం మానవ స్వయంకృతాలు. ఎలాగూ చేతిలో లేనివాటిని నివారించలేం. నిరోధించలేం. చేజేతులా చేసుకున్నదాన్ని చక్కబెట్టుకోలేమా? పెద్ద నోట్లు రద్దయ్యాక జనజీవనం అస్తవ్యస్తమయింది. రైతులు, చిన్నచిన్న వ్యాపారులు కుప్పకూలిపోయారు. వృద్ధులు రాలిపోయారు. వీరి కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలి. ‘పెద్దవాళ్లను’ కట్టడి చెయ్యడం మంచిదే. చిన్నవాళ్ల కష్టాలు కూడా చూడాలి కదా! పండ్లమ్మిన చోటే పడిగాపులు సైదులు పండ్ల వ్యాపారి. సూర్యాపేట ‘వాణిజ్య భవన్’లో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ముప్ఫై ఏళ్లుగా ఇదే ఆయన జీవనోపాధి. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడా ఉపాధికి గండి పడింది. రోజుకు సుమారు రు.6 వేల వరకు పండ్ల అమ్మకాలు జరిపే సైదులుకు ఇప్పుడు రూ.500 వ్యాపారం కూడా జరగడం లేదు. గతంలో 10 గెలల అరటిపండ్లు, 5 బాక్సుల ఆపిల్స్, రెండు బాక్సుల దానిమ్మ, ఎనిమిది బాక్సుల కమలాలు అమ్మకానికి తెచ్చుకుంటే సాయంత్రానికి మొత్తం అమ్ముడయ్యేవి. ఇప్పుడు అమ్మకాలు తగ్గి, తెచ్చిన పండ్లు తెచ్చినట్టుగానే పాడైపోతున్నాయి. చిల్లర లేని కారణంగా గిరాకీని వదులుకోవలసి వస్తోంది. పంట డబ్బొచ్చినా పైసా లేదు! నక్కా భగవంతరెడ్డి వృద్ధ రైతు. ఆయనది నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలోని జలాల్పురం గ్రామం. లక్ష రూపాయలకు పైగా పంట డబ్బు పోచంపల్లి కెనరా బ్యాంకులో జమ అయింది. డ్రా చేసుకోడానికి బ్యాంకు దగ్గర పొద్దస్తమానం క్యూలో నిలబడాల్సి రావడంతో, ఇంటి దగ్గర పశువులను చూడ్డానికి రోజుకు రూ.300 ఇచ్చి మనిషిని కూలీకి పెట్టుకున్నారు. ఆ నష్టం ఒకటైతే తను బ్యాంకు క్యూలో నిలుచున్నా రోజుకు రూ.4 వేలకు మించి డ్రా చేసుకోలేకపోయారు. బ్యాంకు వాళ్లు పూర్తి డబ్బు ఇవ్వకపోతే రబీలో దుక్కులకు, విత్తనాలకు, ఎరువులకు కష్టమే అని తీవ్రంగా బాధ పడుతున్నాడు. ఖరీఫ్‌కి అప్పులు... రబీకి తిప్పలు గగ్గనపల్లి రాజశేఖర్‌రెడ్డి ఓ రైతు. ఊరు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్ల గ్రామం. ఇరవై రోజుల క్రితం 105 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా అకౌంట్లో రూ.1,59,406 లు జమ అయ్యాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోడానికి నెమ్మికల్‌లోని బ్యాంకుకు వెళితే మొదట 20 వేలు ఇచ్చారు. తర్వాత రోజుకు 2 వేలు మాత్రమే ఇస్తున్నారు. వాటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలుచోవలసి వస్తోంది. ఖరీఫ్‌లో పంట కోసం అప్పు తెచ్చాడు. ఆ డబ్బు కోసం వ్యాపారులు రాజశేఖరెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రబీ సీజన్లో పెట్టుబడి పెట్టడానికి ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు. లక్ష ఉన్నా... రోజుకింత భిక్ష! సంగారెడ్డి జిల్లా చింతకుంట రైతు ఎం.డి. మౌలానా అప్పు చేసి పంట పండించాడు. 70 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. వారం తర్వాత ఆయన ఖాతాలో లక్షా ఆరు వేల రూపాయలు జమ అయ్యాయి. అయితే ఆ డబ్బును పూర్తిగా డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వారానికి రూ.2 వేలు మాత్రమే ఇస్తారని తెలిసి హతాశుడయ్యాడు. డబ్బంతా ఒకేసారి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని బ్యాంకు అధికారులు కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడేం చెయ్యాలో ఆయనకు దిక్కుతోచడం లేదు. అప్పులోళ్ల దగ్గర మాట పోతోందని ఆవేదన చెందుతున్నాడు. క్యూలోనే తెల్లారుతున్న జీవితాలు నల్లధనానికి చెక్ పెట్టడానికంటూ కేంద్ర సర్కారు తీసుకున్న హఠాత్ నిర్ణయం వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్ళకే పెద్ద తలనొప్పిగా మారితే, వయసు మళ్ళినవారికి ఈ కష్టం ప్రాణం తీస్తోంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంకి చెందిన పోలంకి ఇన్నయ్య అగ్నిమాపకదళంలో ఫైర్ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత పాత నోట్లు చెల్లకపోవడంతో కొత్త నోట్లుతీసుకునేందుకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకుకు వచ్చి వెళు తున్నా ఖర్చులకు కొత్త కరెన్సీ దొరకలేదు. నవంబర్ 15వ తేదీ మంగళవారం ఆయన అయిదో రోజు క్యూలో నిలుచున్నాడు. శారీరకంగా, మానసికంగా నలిగిపోయి గుండెపోటుకు గురయ్యాడు. దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. చేయని పాపానికి పడిన పెద్ద శిక్షతో గుండెలవిసేలా ఏడుస్తున్న ఇన్నయ్య కుటుంబ సభ్యుల లాంటి ఎందరికో ఎవరు జవాబుదారీ? నా మొగుడ్ని తెచ్చిస్తరా? జూలూరి నర్సయ్యది మెదక్‌జిల్లా వెల్దుర్తి మండలం, అచ్చంపేట. 65 ఏండ్లకు పైనే ఉంటడు. భార్య దుర్గమ్మే అతని తోడు. చలికాలం ఆరోగ్యం అంతంత మాత్రం కావడంతో ఆమె భయపడుతున్నట్టుగానే నర్సయ్యకు సుస్తి చేసింది. దానికి తోడు నోట్ల రద్దు వచ్చి పడింది. ఆమె పాతనోట్లనే తీస్కొని, చుట్టుపక్కల హాస్పిటళ్లకు తిరిగితే ఎవరూ పాతనోట్లు తీసుకోము అన్నారు. అట్లనే హైదరాబాద్ తీస్కొచ్చింది చుట్టాల సాయంతో. హైదరాబాద్‌లో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ తిప్పితే, అక్కడా పాత పెద్దనోట్లు చెల్లవన్నరు. డాక్టర్లు రాసిచ్చిన టెస్టులు చేయించడానికి పోతే పాత నోట్లు తీసుకోలేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగి, భర్తను ఇంటికి తీసుకొస్తే ఇంటికొచ్చిన కాసేపటికే నర్సయ్య ప్రాణం వదిలాడు. ‘ఎంత పనిజేస్తివిరా.. బగమంతుడా.. ’ అంటూ ఆమె గుండెలవిసేలా ఏడ్చింది. ‘గింత అన్యాయమా? పాత నోట్లు డాక్టర్లు తీస్కోకనే మా ఆయనను షెరీఖ్ జేస్కోలే. మనుషుల పానాలతో ఆడుకుంటుండ్రు. ఇప్పుడు నా మొగుడ్ని పాణాలతో తెచ్చిస్తరా’ అని అడుగుతోంది దుర్గమ్మ. డబ్బులకెళితే... దెబ్బలు! మాధవరెడ్డి అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాతావరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. నోట్ల మార్పిడి ప్రకటన జారీ అయ్యాక మూడు రోజులు ఆగి సాయి నగర్ స్టేట్బ్యాంకుకెళ్లాడు. తన వంతు కోసం ఎదురు చూస్తూ క్యూలో గంటలకొద్దీ వేచి ఉన్నాడు. ఇంతలో పోలీసు పటాలం బ్యాంకు దగ్గర దిగింది. రావడం రావడమే రాయలేని భాషతో రెచ్చిపోయింది. అదేమిటని ప్రశ్నించిన వారి మీద విరుచుకుపడింది. నిలదీసిన మాధవరెడ్డిని ఎస్ఐ మీద చేయిచేసుకున్నాడంటూ చితకబాదారు. బూటుకాలితో తంతూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మాధవ్‌రెడ్డి ఏమయ్యాడో తెలియక రెండ్రోజులపాటు అనిశ్చితి కొనసాగింది. భర్త ఆచూకీ చెప్పమని స్టేషన్‌కొచ్చిన భార్యకు సమాధానం చెప్పలేదు పోలీసులు. చివరకు వదిలిపెట్టారు ‘ఆయన మృదు స్వభావి. పోలీసుల మీద చెయ్యి చేసుకున్నాడంటే ఎవరూ నమ్మరు. అన్యాయంగా అరెస్టు చేశారు’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది భార్య భార్గవి. ఆ రైతు చివరకు అంతకు తెగించాడు! కర్నూలు జిల్లా, తూడిచెర్లకు చెందిన నల్లబోతుల పుల్లయ్య, భార్య వెంకటేశ్వరమ్మ ఏడాదంతా కష్టపడి పంట పండించారు. ఈ ఏడాది కొడుక్కి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ధాన్యం అమ్మితే డెబ్భై వేలు చేతికి వచ్చాయి. పాత నోట్లు చెల్లవనే ప్రకటనతో చేసేదేమీ లేక చేతిలో ఉన్న డబ్బుని బ్యాంకులో వేశారు. వాటిని తిరిగి ఇమ్మంటే బ్యాంకువాళ్లు చిన్న నోట్లు లేవు, కొత్త నోట్లు రాలేదు పొమ్మంటున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన కొడుకు పెళ్లి. పెళ్లి కూతురికి ప్రధానం చీర, సారె పట్టుకెళ్లాలి. చేతిలో డబ్బులేదు. ఇంట్లో ఎవరూ పెళ్లికి కొత్త దుస్తులు కొనుక్కోలేదు. బంధువులను పిలుచు కున్నారు. వారికి విందు భోజనం పెట్టాలంటే దినుసులు కొనడానికి పైసల్లేవు. దిక్కుతోచని పుల్లయ్య పురుగుల మందు డబ్బా అందుకున్నాడు. ‘నా డబ్బు నాకు ఇస్తారా, చావమంటారా’ అంటూ బ్యాంకు ముందు డబ్బా మూత తీశాడు. ఆ చిన్న రైతు బ్యాంకులో దాచుకున్న తన రెక్కల కష్టం తాను తీసుకోవడానికి అంతటి అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది. ఉపాసమే ఉన్నం! సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని తహసిల్దార్ ఆఫీస్‌కు పొయ్యే దారిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. దాని ప్రహరీ ముందు ఓ జంట కనిపిస్తుందెప్పుడూ. అతని పేరు శివరాజ్. ఆమె అతని భార్య. పొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిద్దాక వాళ్లు అక్కడే చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర లేక జనం కూరగాయలే కొనడం లేదు. ఇక చెప్పులు కుట్టించుకునేందుకు ఎవరు వస్తారు? ‘మొన్న ఒకాయన వొచ్చిండు.. కుడి కాలు చెప్పు తెగిపోయింది కుట్టియ్యమని. నా భార్య కుట్టిచ్చింది. పది రూపాయలని జెప్పినం. ‘యాభై నోటుంది.. చిల్లరుందా?’ అని అడిగిండు. అప్పటిదాకా అయిన గిరాకీ నలభై రూపాయలిచ్చి, యాభై నోటు దీస్కున్నం. అంతా సగవెట్టుకొని ఇంటికి వోకుంటా ఏదో సామాన్ దీస్కపోదామని కిరాణ దుకునంకు పోయినం. సామాను దీస్కోని యాభై నోటిస్తే నోటును ఎన్కకు, ముందుకు చూసిన సేఠ్ ‘ఎయ్.. గిది నకిలీ నోటు. చెల్లదు’ అని మా సామాన్ వాపస్ దీస్కోని మా నోటు మాకు ఇచ్చేసిండు. రోజంతా కష్టపడ్డ పైసలు కూడా మాకు దక్కకపోయే. ఏం జేస్తం? ఆ పూట ఉపాసమే ఉన్నం’ అంటూ బాధపడ్డాడు శివరాజ్. నా పెన్షన్ ఇస్తే అన్నం తింటా! ఈమె కత్తి లక్ష్మమ్మ. నెల్లూరు జిల్లా కోవూరు. పంచాయతీ కార్మికుల కాలనీలో నివాసం. భర్త పంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తూ మరణించాడు. భర్త మరణానంతరం లక్ష్మమ్మకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తోంది. అదే ఆమెకు జీవనాధారం. అయితే 5 నెలల నుంచి ప్రభుత్వం ఫించన్ విడుదల చేయట్లేదు. అందిన చోటల్లా అప్పు చేసి, పొట్ట నింపుకుంటూ ఫించన్ డబ్బు కోసం ఎదురు చూస్తూ గడిపింది. ఇటీవల పెద్ద నోట్ల రద్దుకు ముందు పింఛను డబ్బు ఆమె ఖాతాలో జమ అయింది. దానిని తీసుకుని అప్పులు తీరుద్దామని ఆశతో బ్యాంకుకు వెళితే డబ్బులు లేవనీ, రేపు రావాలనీ పంపేశారు. అలా రోజూ బ్యాంక్‌కు వెళ్లడం, బ్యాంకు వాళ్లు డబ్బుల్లేవనడం... ఆమె ఉసూరు మంటూ కాళ్లీడ్చుకుంటూ ఇంటికెళ్లడం... చివరకు ఎదురుపడిన అప్పులోళ్లకు ముఖం చూపించలేక ఊరు వదిలి కూతురింటికి వెళ్లిపోయింది. కాలూ చెయ్యి ఆడనప్పుడు బిడ్డ పంచన చేరాలి అని అనుకున్న ఆమె పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు కూతురి మీద ఆధారపడే స్థితికి చేరుకుంది. ఇది ఆమెను వేదనకు గురి చేస్తోంది. ఈ లెక్కకు బదులేది? ►దేశంలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బ్యాంకులు లేవు. పెద్ద నోట్ల ఉపసంహరణతో వచ్చే ఇబ్బందుల నుంచి వాళ్ళను గట్టెక్కించే మార్గం ప్రభుత్వం చూసుకోనే లేదు. ►పెద్ద నోట్ల దెబ్బతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయి. ఇక, అసంఘటిత రంగంలో దాదాపు 4 కోట్ల మందికి ఉపాధి, ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ►మన ‘స్థూల జాతీయోత్పత్తి’ (జి.డి.పి)లో దాదాపు 40 శాతం నగదు లావాదేవీల ద్వారా జరుగుతుంది. ►దేశ యువజనుల్లో నూటికి 31 మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు. ►భారత్‌లో దాదాపు 45 కోట్ల మంది శ్రామికులు ఉన్నారు. వారిలో ప్రతి 100 మందిలో 7 మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ 3.1 కోట్ల మందిలో కూడా దాదాపు 2.4 కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వంలో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంటే, మిగతావాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ►అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న 41.5 కోట్ల మందిలో సగం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. ►ఇక, భవన నిర్మాణం, చిన్న తరహా తయారీ, రిటైల్ రంగాల్లో ఒక్కోదానిలో 10 శాతం మంది వంతున పనిచేస్తున్నారు. ►అసంఘటిత రంగంలో అత్యధిక మంది రోజు వారీ కూలీలే. పెపైచ్చు, ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న కనీస వేతనాల కన్నా తక్కువ సంపాదిస్తున్నవాళ్ళు. కాబట్టి, ఒక రకంగా ప్రభుత్వం ‘అన్ ఎకౌంటెడ్ మనీ’ అని చెబుతున్నదంతా నిజానికి ఇలా చలామణీలో ఉన్న డబ్బే అని విశ్లేషకుల మాట! ►2200 కోట్లు ...ఇది ప్రస్తుతం చెల్లకుండాపోయిన నోట్ల సంఖ్య. ఇన్ని కోట్ల నోట్ల స్థానంలో సరికొత్త నోట్లు తేవడానికి చాలా టైమ్ పడుతుందని ఆర్.బి.ఐ. తేల్చేసింది. ►100 కోట్ల పైగా జనాభా ... ఇది మన దేశంలో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న జన సంఖ్య. కానీ, ఆ ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికీ కేవలం 7.8 బ్యాంకు శాఖలే ఉన్నాయి. మనది ‘బ్యాంకులు తక్కువున్న ఆర్థిక వ్యవస్థ’ అనేది అందుకే! ►4 శాతం ... ఇది మొత్తం మన దేశ జనాభాలో టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేవారి శాతం. ► 90 శాతం ...లావాదేవీలు మన దేశంలో నగదుతోనే జరుగుతాయి. ► 48.2 కోట్ల మంది ... జీవనోపాధికి ఈ నోట్ల రద్దు దెబ్బతో ముప్పు ఏర్పడింది. మన జనాభాలో వీరంతా డబ్బు రూపంలో సంపాదన చేసేవారే! ఒక శాతం దొంగల్ని పట్టుకోవడానికి 99 శాతం మందిని బాధిస్తారా? ► భారతదేశ ఆర్థికవ్యవస్థ విలువ దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్లు (రూ. 156 లక్షల కోట్లు). ► ఇందులో 20 శాతం దొంగ డబ్బే. ఇది ముంబయ్‌కి చెందిన ‘యాంబిట్ క్యాపిటల్’ చెప్పిన లెక్క. ► దేశ జి.డి.పి.లో 20 శాతం , దాదాపు రూ. 30 లక్షల కోట్లు (నగదే కాక మిగతావన్నీ కలిపి) దొంగ డబ్బు అని వివిధ సంస్థల అంచనా. దేశంలోని లెక్కచూపని డబ్బులో 60 శాతం కేవలం ఒక శాతం బడాబాబుల దగ్గరుంటే, వాళ్ళను పట్టుకోవడానికి 99 శాతం మంది సామాన్యుల్ని బాధిస్తారా? ఏ నోట్లు ఎంత ఉన్నాయి? ►38 శాతం.... రూ. 1000 నోట్లు ►47 శాతం... రూ. 500 నోట్లు ►10 శాతం... రూ. 100 నోట్లు ►4 శాతం... రూ. 100 కన్నా తక్కువ నోట్లు 1 శాతం... చిల్లర నాణాలు కొత్త నోటు... బాగా ఖర్చే ! ► 30 వేలు... ఇది మొత్తం 2.2 లక్షల ఏ.టి.ఎం.ల్లో ఇప్పటికి కొత్త 2వేల నోటుకి తగ్గట్లు రిపేరైనవాటి సంఖ్య. ► 12 వేలు... ఇది ప్రతిరోజూ కొత్త నోటుకి తగ్గట్లు రిపేరవుతున్న ఏ.టి.ఎం.ల సంఖ్య. ►రూ.10 వేలు... ఇది ఒక్కో ఏ.టి.ఎం.ను ఇలా కొత్త నోటుకు తగ్గట్లు మార్చడానికయ్యే ఖర్చు. ►రూ. 200+ కోట్లు... మొత్తం ఏ.టి.ఎం.లను ఇలా మార్చడానికి అవుతున్న ఖర్చు. -
కరెన్సీ..ఎమర్జెన్సీ
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే కాచిగూడ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఇలా బోసిపోరుు కనిపించింది. పెద్ద నోట్ల రద్దుతో చాలా మంది ప్రయాణాలను వారుుదా వేసుకుంటున్నారు. కాచిగూడ నుంచి బెంగళూర్, తిరుపతి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు ప్రతి రోజు సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగిస్తారుు. వందకు పైగా ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తారుు. 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాంటి రద్దీ స్టేషన్లో కొద్ది రోజులుగా ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా సోమవారం బుకింగ్ కౌంటర్ల వద్ద, స్టేషన్ బయట ఇలా ప్రయాణికులు లేకుండా వెలవెల పోతూ కనిపించింది. - సాక్షి, సిటీబ్యూరో -
ప్రజలే నోటిచ్చి ఓటేస్తారు..!
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇదే కానుక: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. సామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. నలభై ఏళ్ల కిందట జనతా పార్టీకి ప్రజలు నోటిచ్చి ఓటేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుంది. మా పార్టీ నల్లధనంతో ఓట్లు కొనుగోలు చేసేది కాదు. మా ప్రభుత్వానికి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఓ న్యూస్ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన సర్వే లో 78 శాతం ప్రజలు మోదీకి మద్దతు పలికా రు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు ఇది రెట్టింపు’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల తో ఆయన మాట్లాడుతూ.. ‘రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో ప్రజలు, కార్మిక వర్గాలకు కొంత అసౌకర్యం కలిగింది. దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికుల నివాస ప్రాంతాలు, వ్యాపా ర సముదాయాలు, మార్కెట్ల వద్ద మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని విసృ్తతం చేస్తాం. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నాకు సమయమిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తా. నోట్ల రద్దు అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక నేపథ్యంలో స్వీకరించాలి. నల్లడబ్బును నిర్మూలిస్తే దేశ అభివృద్ధి మరింత పరుగులు పెడుతుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విషయాన్ని గమనించాలి’అని వివరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నోట్ల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచెంద్రారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్‌కు అర్థమైంది.. అందుకే సహకరిస్తున్నారు.. నోట్ల రద్దు అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అర్థం చేసుకున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. ‘ప్రజల అసౌకర్యంపై కేసీఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానితో సమావేశమై చర్చించారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మోదీ హామీ ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నాతో కూడా మాట్లాడితే పరిస్థితి వివరించా. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కొంత తగ్గుతుందని పేర్కొన్నప్పటికీ.. ఇబ్బందులుండవని, కేంద్రం సహకరిస్తుందని వివరించా’అని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌లా అర్థం చేసుకుంటే సమస్యే ఉండదన్నారు. పాక్ నుంచి వచ్చే నల్లధనం తగ్గిందని, ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల నకిలీ నోట్లు దేశంలోకి వచ్చాయని చెప్పారు. -
చిన్నోళ్లకే కష్టం..
కుదేలవుతున్న వ్యవసాయం రంగం వ్యవసాయ, నిర్మాణ రంగ కూలీలకు దొరకని పని బ్యాంకుల్లో డబ్బు లేదంటూ బోర్డులు చెన్నారావుపేట మండలం ఖాధర్‌పేటకు చెందిన ఈయన 30 గుంటల భూమిలో క్యాబేజీ పంట సాగుచేశాడు. పంట చేతికంది మార్కెట్‌కు తీసుకువెళ్దామనుకునే సమయంలోనే పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదల్లో రెండు రోజులు తన వద్ద ఉన్న డబ్బుతో కూలీలను పెట్టి పంట ఏరించాడు. అరుుతే, మార్కెట్లో అమ్మేందుకు వెళ్తే కొనుగోలు జరగలేదు. ఎలాగో పంట అమ్ముకుని ఇంటికి చేరాడు. ఆ తర్వాత తోటలో మిగిలిన క్యాబేజీ ఏరించేందుకు కూలీలను పిలుద్దామంటే డబ్బు లేదు. ఓ పక్క పంట ముదిరిపోతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొమురయ్య ఆవేదన చెందుతున్నాడు. పెద్దనోట్లు రద్దు చేసిన కారణంగా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు కొమురయ్య ఉదంతమే ఓ ఉదాహరణ. నర్సంపేట : పెద్దనోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లో పడేసింది. వ్యవసాయ కూలీల నుంచి ఇరవై ఎకరాల ఆసామి వరకు కష్టాలు పడుతున్నారు. యాసంగి పెట్టుబడికి డబ్బులేక.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేక సాగు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో పండిన పంటలకు గిట్టుబాటు లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అన్నదాత చిల్లర కష్టాలతో చిన్నాచితకా వ్యాపారాలు మూతపడుతున్నారుు. ఇప్పటికే పనులు లేక అల్లాడుతున్న గ్రామీణ ప్రజానీకం నోట్ల రద్దుతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల వంటి పట్టణాల్లో వ్యవసాయ కూలీలు పనుల కోసం రహదారులపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక.. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కొంత మంది కూలీలు నిత్యావసర సరుకుల కోసం కూలి పనికి వెళ్తే వారికి వ్యాపారులు పాత నోట్లనే ఇస్తున్నారు. వీటిని మార్చుకునే క్రమంలో వారి మరిన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. తగ్గిన పంట కొనుగోలు... పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో వానాకాలం పంటలను మార్కెట్లో అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదు. పంట అమ్మితే వ్యాపారులూ పెద్దనోట్లను ఇస్తున్నారని.. వాటిని ఎలా మార్చుకోవాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఆశాజనకంగానే వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయని ఆశ పడుతుంటే తమ ఆనందం ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అమ్మితే చెక్కులు ఇస్తామని అధికారులు అంటుండగా.. వ్యాపారులకు అమ్మితే వారు కనీసం డబ్బులు ఇవ్వడానికి రెండు నెలలు గడువు అడుగుతున్నారు. దీంతో పంట సరుకును చూస్తూ గడుపుతున్న రైతులు అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఇకనైనా బ్యాంకుల అధికారులు మార్పిడికి వచ్చే ప్రతీ వారికి రూ.2వేల నోట్లు ఇవ్వకుండా సరిపడా చిల్లర నోట్లను అందుబాటులో ఉంచాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. -
ఏ ’మనీ’ చెప్పేది...
► గదగ్ జిల్లా రోణా తాలూకా హీరేహళ్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది రైతులు తాము పండించిన జొన్నలను స్థానిక సంతలో కాయగూరలు విక్రరుుంచే వారికి ఇచ్చి వారి నుంచి కాయగూరలను తీసుకుంటున్నారు. దీంతో పూర్వపు వస్తుమార్పిడి పద్దతి వచ్చిందని అక్కడి స్థానికులు వాపోయారు. ► రామనగర్‌కు చెందిన రమేష్ అతని స్నేహితులు ఏడాది పాటు చీటీలు వేసి కొంత నగదు దాచిపెడుతారు. ఈ సొమ్ముతో ప్రతి ఏడాది శబరిమలె వెలుతుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు వల్ల సరిపడ కొత్తనోట్లు దొరక్కపోవడం వల్ల తమ యాత్రను జనవరికి వారుుదా వేసుకున్నారు. ► మైసూరు జిల్లా దండికెర గ్రామానికి చెందిన మోతుబరి హీరేమఠ్ తన కుమార్తె పెళ్లికి రూ. 10 లక్షలకు పైగా దాచిపెట్టాడు. పెద్ద నోట్ల రద్దుతో ఆ మొత్తాన్ని అతను బ్యాంకు నుంచి తీసుకోలేకపోయాడు. దీంతో రెండు రోజుల ముందు తన కుమార్తె పెళ్లిని సాదాసీదాగా ముగించాడు. చివరికి ముహుర్తానికి పట్టుచీరను కొత్తది కొనలేకపోయానని వాపోయాడు. ► నోట్ల రద్దు వల్ల పాడి రైతులకు వారం నుంచి సహకార సంఘాల ద్వారా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో పాడి రైతులు పశువులకు అవసరమైన దాణాను కొనలేకపోతున్నారు. ఫలితంగా రెండు రోజులుగా పాల ఉత్తత్తి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. -
ఎనీ టైం మూత
ఐదు శాతమే పనిచేస్తున్న ఏటీఎంలు కాసేపటికే ఖాళీ అవుతున్న నగదు క్యూలో నిరాశచెందుతున్న ప్రజలు మొబైల్ స్వైప్సేవలు ఒక్కపూటకే పరిమితం వెంటాడుతున్న వంద నోట్ల కొరత జిల్లావ్యాప్తంగా ఏటీఎంల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఇవి ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేవలం ఒకటీ అరా నామామాత్రంగానే పనిచేస్తున్నారుు. వంద నోట్ల కొరత ..సాంకేతికంగా అప్డేట్ కాకపోవడంతో అన్ని ఏటీఎంలు పనిచేయడమనేది ఇప్పట్లో సాధ్యం కాదేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటీఎంలు పనిచేయకపోవడంతో బ్యాంకులకు రద్దీ తగ్గడం లేదు. తిరుపతి (అలిపిరి): నగదు లావాదేవీల్లో కీలక భూమిక పోషించాల్సిన ఏటీఎంలు నామమాత్రమైపోయారుు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇవి తలుపులు తెరుచుకోకపోవడంతో జనం నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. కొన్ని రోజులుగా ఇదే తంతు. తొలుత రెండు రోజులు తెరుచుకోవని కేంద్రం ప్రకటించింది. తర్వాత కూడా ఇవి అక్కడక్కడా తెరుచుకుంటున్నాయే తప్ప పూర్తి స్థారుులో సేవలందించడం లేదు. ఒకటీ అరా పనిచేసినా గంటల వ్యవధిలోనే వంద నోట్లు అరుుపోతున్నారుు. క్యూలో నిలబడిన వారు మర్నాడు కోసం ఎదురు చూడకతప్పడం లేదు. వంద నోట్ల కొరతతోపాటు సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 708 ఏటీఎంలు ఉంటే 5శాతం మాత్రమే పనిచేస్తున్నా రుు. శుక్రవారం సాయంత్రం ఒకటి రెండు పని చేసినా కొద్దిసేపటికే నో సర్వీస్ బోర్డులు వేలాడారుు. తిరుపతిలో ప్రారంభించిన మొబైల్ స్వైప్ సేవలపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 మొబైల్ స్వైప్సేవలు(వాహనాలు) ప్రజలకు అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నానికే నగదు ఖాళీ కావడం తో వాహనాలు మళ్లీ బ్యాంకుల ఎదుట కొలువుతీరారుు. మరోపక్క డిమాండ్ మేరకు బ్యాం కులు, పోస్టాఫీసులు సేవలు అందించడంలో విఫలమవుతున్నారుు. నగదు కొరతంటూ బ్యాంకులు చేతులెత్తాశారుు. పెద్ద నోట్లు రద్దై 11 రోజులు గడుస్తున్నా ఇంతవరకు బ్యాంకులు ప్రజా అవసరాలకు తగ్గుట్టుగా నదును పంపిణీ చేయలేకపోతున్నారుు. ఆర్బీఐ కొత్త నిబంధనలు కూడా ప్రజలకు మరింత కష్టాలు తెచ్చిపెట్టారుు. నగదు మార్పిడి పరిమితిని రూ.4,500నుంచి రూ.2,000 కుదించడం ఇబ్బం ది కలిగించింది. బ్యాంకులు రూ.2వేల నోట్లు పంపిణీ చేస్తుండంతో ప్రజలు వాటిని చిల్లర నోట్లుగా మార్చుకోలేక తంటాలు పడుతున్నారు. రూ 2.8 వేల కోట్ల డిపాజిట్లు నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలోఆర్బీఐ ప్రకటన బ్యాంకులకు ఉపశమనం కలిగించింది. నగదు మార్పిడి పరిధిని రూ.4,500 నుంచి రూ.2వేలుకు కుదించింది. 40 జాతీయ బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల ద్వారా శుక్రవారం రూ.50 కోట్ల మేర నగదు మార్పిడి జరిగినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. గత 9 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో రూ.2 వేల 80 కోట్ల మేర డిపాజిట్లు అందారుు. రూ.250 కోట్ల మేర విత్‌డ్రాలు (ఆన్లైన్కాదు)జరిగారుు. -
వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్!
ఆటోమొబైల్ డీలర్లకు కరెన్సీ షాక్ పెద్ద నోట్ల రద్దుతో సగానికి పడిపోరుున అమ్మకాలు ద్విచక్రవాహనాలు, కార్లపై తీవ్ర ప్రభావం దాదాపు రూ.350 కోట్ల మేర స్తంభించిన లావాదేవీలు సిటీబ్యూరో : పెద్ద నోట్ల రద్దు కొత్త వాహన విక్రయాలకు కళ్లెం వేసింది. గత వారం, పది రోజులు గా గ్రేటర్లో వాహనాల అమ్మకాలు సగానికి సగం పడిపోయారుు. వ్యక్తిగత వాహనాలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. పెద్ద మొత్తంలో డ్రా చేసేందుకు అవకాశం లేకపోవడం, పాత నోట్లను తీసుకొనేందుకు ఆటోమొబైల్ డీలర్లు నిరాకరిస్తుండడంతో వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, ఉప్పల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టారుు. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు నవంబర్, డిసెంబర్ ఏడాది చివరి నెలలు కావడంతో ఆటోమొబైల్ రంగంలో స్తబ్ధత నెలకొంది. నోట్ల రద్దు ప్రభావమే ఎక్కువగా ఉందని, ఏడాది చివరి ప్రభావం డిసెంబర్లో మాత్రమే కనిపిస్తుందని పలువురు ఆటోమొబైల్ డీలర్లు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ నెలలో నోట్ల రద్దు కారణంగా సుమారు రూ.350 కోట్లకు పైగా ఆటోమొబైల్ వ్యాపారం స్తంభించినట్లు డీలర్లు చెబుతున్నారు. 50 శాతం తగ్గిన అమ్మకాలు... గ్రేటర్ హైదరాబాద్‌లో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తదితర రవాణా రంగానికి చెందిన వాహనాలను విక్రరుుంచే ప్రధాన ఆటోమొబైల్ డీలర్లు సుమారు 150 మంది ఉంటారు. సబ్‌డీలర్లు, షోరూమ్‌లు అన్నీ కలిపి 500 లకు పైగా వాహన విక్రయ కేంద్రాలు ఉన్నారుు. ప్రతి ఆర్టీఏ పరిధిలో రోజుకు 150 నుంచి 250 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఖైరతాబాద్ ఆర్టీఏలో సగటున 250 నుంచి 300 వాహనాలు నమోదవుతుండగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి ఆర్టీఏల్లో సగటున 150 నుంచి 170 వరకు కొత్త వాహనాలు నమోదవుతున్నారుు. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో మొత్తంగా ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఆటోమొబైల్ డీలర్లు, రవాణా అధికారుల అంచనాల మేరకు ప్రతి నెలా సుమారు 25000 ద్విచక్ర వాహనాలు, 70ఁఊ00 వరకు కార్ల విక్రయాలు జరుగుతారుు. కానీ ఈ నెలలో ఇప్పటి వరకు కేవలం 6 వేల ద్విచక్ర వాహనాలు, మరో 1500 కార్లు మాత్రమే విక్రరుుంచినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన ఏకంగా 407 వాహనాలు నమోదు కాగా, ఈ నెల 15వ తేదీన 209 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. సికింద్రాబాద్ ఆర్టీఓలో ఈ నెల 10వ తేదీన కేవలం 75 వాహనాలు నమోదయ్యారుు. బహదూర్‌పురా ఆర్టీఏలో ఈ నెల 11న 47 వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. అలాగే నగర శివార్లలోని మేడ్చల్ ఆర్టీఏలో ఈ నెల 6న 354 వాహనాలు నమోదు కాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం 11వ తేదీన 145 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. నగదు చెల్లింపులకు అవకాశం లేకపోవడమే.. కార్లు, ఇతర మోటారు వాహనాల కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలే ఎక్కువగా ఉంటారుు. 80 శాతం వినియోగదారులు బ్యాంకు రుణాలపైనే వాహనాలను కొనుగోలు చేస్తారు. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నగదు రూపంలో డౌన్‌పేమెంట్ చెల్లించి మిగతా మొత్తానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. కానీ పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకు లావాదేవీల్లో స్తబ్దత నెలకొనడం, పాతనోట్లు చెల్లకపోవడం, పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లభించకపోవడంతో వాహనాల కొనుగోళ్లు మందగించారుు. అలాగే కార్ల కొనుగోళ్లపైన కూడా ఇదేవిధమైన ప్రభావం కనిపిస్తుంది. పాతనోట్లతో పన్ను చెల్లింపులతో ఊరట... ఇలా ఉండగా, ఈ నెల 24వ తేదీ వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో జీవితకాల పన్నులు, త్రైమాసిక పన్నులు చెల్లించేందుకు రవాణాశాఖ అవకాశం కల్పించడంతో కొంత మేరకు ఊరట లభించిందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. వాహనదారులు ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ పన్నులు చెల్లించవచ్చు. అలాగే షోరూమ్‌ల నుంచి కూడా జీవితకాల పన్ను చెల్లింపునకు అనుమతి లభించింది. -
చిల్లర కష్టాలు
పనిచేయని ఏటీఎం కేంద్రాలు జిల్లాకు చేరుకోని రూ.500 నోట్లు బ్యాంకుల్లో వంద నోట్ల కొరత 8 రోజుల్లో రూ.1,400 కోట్ల నగదు మార్పిడి తిరుపతి (అలిపిరి) : పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లా ప్రజలను వీడడం లేదు. తెల్లారితే బ్యాంకుల ముందు పడిగాపులే. 10 రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లా ప్రజలకు నోటు పాట్లు తప్పడం లేదు. వంద నోట్ల కొరత ఫలితంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా పరిమిత సంఖ్యలో ఏటీఎంలు తెరుచుకోవడం.. గంటలోపే క్యాష్ ఖాళీ అవుతుండడంతో ఖాతాదారులు విసిగివేసారిపోతున్నారు. గడచిన 8 రోజుల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.1,400 కోట్ల నగదు మార్పిడి లావాదేవీలు జరిగారుు. నల్లధనంపై యుద్ధం మంచి చర్యే అరుునప్పటికీ ప్రస్తుతం మాత్రం సాధారణ ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టింది. చిన్నా చితక వ్యాపారస్తులు సరుకుల దిగుమతికి చిల్లర కష్టాలు మొదలయ్యారుు. వారు పాత నోట్లను చేతబట్టి బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. సామాన్య జనం అరకొర నగదును చేత బట్టి బ్యాంకులకు పరుగులు తీస్తూనే వున్నారు. దీంతో బ్యాంకుల్లో రద్దీ నెలకుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు సరిపడ చిల్లర నోట్లు రాకపోవడంతో బ్యాంకు యాజమాన్యం కౌంటర్లో క్యాష్ వున్నంత వరకు లావాదేవీలు జరిపి చేతులెత్తేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలలో నో క్యాష్ : జిల్లాలో 708 ఏటీఎంలు పూర్తి స్థారుులో పనిచేయడం లేదు. నగదు కొరత వల్ల 10 శాతం కంటే తక్కవ ఏటీఎంలు పనిచేస్తున్నారుు. అరకొర ఏటీఎం కేంద్రాల్లో గంటలోపే క్యాష్ ఖాళీ అవుతోంది. రూ.100 నోట్ల బ్యాంకుల్లో నిల్వ లేకపోవడం ఇందుకు కారణం. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు రూ.500 నోట్ల చేరుకున్నా ఇంతవరకు మన జిల్లాకు చేరుకోలేదు. గత 8 రోజుల్లో 593 బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల్లో రూ.1400 కోట్ల మేర నగదు మార్పిడి జరిగింది. బ్యాంకులు, పోస్టాపీసుల్లో గురువారం రూ.150 కోట్ల మేర నగదు మార్పడి జరిగిందని జిల్లా బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఆర్బీఐ శుక్రవారం నుంచి నగదు మార్పిడి పరిమితి రూ.4,500 నుంచి రూ.2వేలకు కుదించడంతో మరిన్ని నోటు కష్టాలు తప్పేటట్లు లేదు. గత 8 రోజులుగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జరిగిన నగదు మార్పిడి లావాదేవీలు ఇలా వున్నారుు. -
సామాన్యులు విలవిల
చేతిలో చిల్లర లేక ఇక్కట్లు వైద్య ఖర్చులకూ కటకట సగానికి పైకా ఏటీఎంల మూగనోము ఏడో రోజూ బ్యాంకుల వద్ద బారులు విశాఖపట్నం: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. నల్లకుబేరులకు చెక్ పెట్టే లక్ష్యంతో కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం సామాన్యుల పాలిట శాపంగా మారింది. నిరు పేదల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ నరకంచూస్తున్నారు. రోజువారీ ఖర్చులకు కూడాసొమ్ముల్లేక ఇక్కట్లపా లవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో సొమ్ము లేకుండా ఏపని జరిగే పరిస్థితి లేదు. ఇంట్లో పచారీ సామాన్ల దగ్గర నుంచి ఇంట్లోని పిల్లలు, వృద్ధుల వైద్య ఖర్చుల వరకు కటకటలాడిపోతున్నారు. కూలీ పనుల్లేవు. ఒక వేళ దొరికినా చేతికి కూలి డబ్బులురాని పరిస్థితి. మరోవైపు వ్యాపారాల్లేవు..ఆషాడ మాసంలో సైతం ఆఫర్ల పుణ్యమాని అమ్మకాలుంటాయి. అలాంటిది కార్తీక మాసం..మరో పక్క పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అయినా సరే అమ్మకాల్లేక చిరువ్యాపారుల నుంచి బడాషాపింగ్ మాల్స్ వరకు నిర్వహణ ఖర్చులు కూడా వస్తాయోలేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇక తోపుడు బండ్లు, చిల్లరవర్తకుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. అమ్మకాల్లేకపోవడంతో పండ్లు, కూరగాయలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖసిటీలోనే కాదు..గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడకెళ్లినా..ఎవర్ని కదిపినా నోట్లకష్టాలే ఎకరవుపెడుతున్నారు. ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమవుతున్నారు. వరుసగా తొమ్మిదో రోజు కూడా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద బారులు తీరిన క్యూలు కనిపిస్తున్నాయి. నిన్న కాస్త తక్కువరద్దీ కన్పించినప్పటికీ బుధవారం మాత్రం విపరీతమైన రద్దీ కన్పించింది. పోస్టాఫీసుల వద్ద తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరి కనిపించారు. గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నిబంధనలకు పాతరేస్తున్న బ్యాంకర్లు ఆర్బీఐ, కేంద్రం జారీ చేసిన నిబంధనలను కొంతమంది బ్యాంకర్లు తుంగలో తొక్కేస్తున్నారు. బుధవారం నుంచి బ్యాంకుల్లో రూ.4500, ఏటీఎంలో అయితే రూ.2500 కొత్తనోట్లు తీసుకో వచ్చని కేంద్రం ప్రకటించింది. కానీ మెజార్టీ బ్యాంకుల్లో సొమ్ముల కొరతను సాకుగా చూపి గతంలో మాదిరిగానే రూ.4వేలే ఇస్తున్నారు. ఇక ఏటీఎంల్లో ఈరోజు కూడా సగానికిపైగా మూగ నోము పాటిస్తున్నాయి. ఏపీజీవీబీలో డిపాజిట్లు తీసుకొని ఒక్క విత్‌డ్రాలు మాత్రమే ఇస్తున్నారు తప్పితే పాత నోట్లుకు కొత్త నోట్లు మార్పిడి ఇవ్వడంలేదు.గ్రామీణ ప్రాంతాల్లో డిపాజిట్లు, విత్‌డ్రాలకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జెరాక్స్ తప్పనిసరి చేశారు. పాతనోట్లుకు కొత్తనోట్లు మార్పు నిబంధన లేదు. యునియన్ బ్యాంక్‌లో డిపాజిట్, విత్‌డ్రాకు ఇదే నిబంధన అమలు చేసి పాతనోట్లుకు కొత్త నోట్లు మార్పుకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జెరాక్స్ కాపీలతోపాటు పాత నెంబర్లు వివరాలను పొందుపరచాలని కొత్త నిబంధన పెట్టారు. దీంతో అకౌంట్లు లేని ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. డెబిట్ కార్డుల్లేకపోవడంతో ఫారం నింపే అవగాహన లే క బ్యాంకుల వద్ద గిరిజనులు నరకం చూస్తున్నారు. మునగపాక ఎస్బీఐ వద్ద బ్యాంక్ సిబ్బంది ముందస్తుగా టోకెన్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతుండగా వాటిని తీసుకునేం దుకు ఎగపడాల్సి రావడంతో తోపులాటలు జరిగాయి. వారిని అదుపుచేసేందుకు పోలీసులు నానా హైరానా పడాల్చివచ్చింది. ఒడిలో పసిబిడ్డతో... ఈయన పేరు యరకం అప్పలకొండ, రాజుపేట, కోటవురట్ల మంలం. ఇటీవల తన ఇంటి వద్ద కుమార్తెకు పురుడు పోశారు. పండంటి బిడ్డ పుట్టింది. బాలింతరాలైన ఆమెకు అవసరమైన పత్యం సరుకులు కూడా కొనే పరిస్థితి లేక ఇబ్బందులపడుతున్నారు. ఎక్కడికెళ్లినా తన వద్ద ఉన్న రూ.500 నోటుకు చిల్లరలేదంటున్నారు. బ్యాంకృుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తే కాని మార్చడం కుదరడం లేదు.. బాలింత అయిన కుమార్తెను వెంటబెట్టుకోని నగదు మార్పిడికి బ్యాంకుకు వచ్చారు. కుమార్తె లోనికి వెళ్లడంతో రోజుల పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని ఆరుబయట నిరీక్షిస్తున్న దృశ్యమిది. -
బిచ్చగాళ్లను చేశారు: మమత
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలను బిచ్చగాళ్లను చేశారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మంగళవారం ఆరోపించారు. పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు క్యూలు కట్టుకుని బిచ్చగాళ్లలా నిలబడ్డారన్నారు. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకున్నా తృణమూల్ ముందుకు సాగుతుందన్నారు. ‘బుధవారం 40 మంది తృణమూల్ ఎంపీలతో కలసి రాష్ట్రపతిని కలుస్తున్నా.అందరూ కలిసొస్తే బాగుంటుంది’ అని తెలిపారు.రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు మమత చేపట్టిన ర్యాలీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, సీపీఎం నిర్ణయించాయి. ర్యాలీలో శివసేనపాల్గొనే అవకాశముంది. తల్లితో మోదీ రాజకీయాలు: కేజ్రీ న్యూఢిల్లీ: డబ్బులు మార్చుకునేందుకు ప్రధాని మోదీ తల్లి, హీరాబెన్ క్యూలో నిలుచోవటాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. 97 ఏళ్ల తల్లిని క్యూలైన్లో నిలబెట్టి రాజకీయాలు చేయటాన్ని ప్రధాని మానుకోవాలన్నారు. ఒకవేళ తనకు ఆ పరిస్థితి వస్తే తల్లి బదులుగా తనే లైన్లో నిలబడతానన్నారు. అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేయాలని రాష్ట్రపతికి దీన్ని పంపనున్నారు.మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.12 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఇవేనా అచ్ఛేదిన్: చిదంబరం నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయం హాస్యాస్పదమని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అచ్ఛేదిన్ ఇవేనా.. ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘బ్యాంకులేమైనా నిరుద్యోగులకు భృతి ఇస్తున్నాయా? ఇవేనా అచ్ఛేదిన్’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చేతిలో 12లక్షల కోట్లు: అమిత్ షా అహ్మదాబాద్: నల్లధనంపై కాంగ్రెస్ నేత విమర్శలను బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ నేతలు రూ.12 లక్షల కోట్లకు పైగా సంపాదించారని.. రాత్రికి రాత్రి ప్రధాని మోదీ వీటిని చిత్తుకాగితాల్లా మార్చేశారన్నారు. రూ. 4 కోట్ల కారులో రూ. 4వేల కోసం రాహుల్ బ్యాంకుకు వెళ్లటం హాస్యాస్పదమన్నారు. జనం చస్తోంటే నవ్వులా?: రాహుల్ గాంధీ ముంబై: నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడి 18-20 మంది ప్రజలు చనిపోతే.. ప్రధాని మోదీ నవ్వుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జపాన్‌లో మోదీ మాటలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నవ్వుతున్నారో లేక బాధపడుతున్నారో ఆయనే స్పష్టంచేయాలన్నారు. పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం అసంబద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. -
బడా బాబులకు మహా కష్టాలు
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కేంద్ర ఆకస్మిక ప్రకటనతో జనం నానా అవస్థలు పడుతున్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రంలోని బాడా బాబులకు ముచ్చెమటలు పడుతున్నారుు. విద్యా సంస్థ యజమానులు పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో ఫైనాన్సియర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా వారి నుంచి అప్పు తీసుకున్న నిర్మాతలు మాత్రం లబోదిబోమంటున్నారు. ఇక ఈ పెద్ద నోట్ల దెబ్బ కొన్ని ప్రభుత్వశాఖలపై కూడా పడుతోంది. మరోవైపు ట్రాఫిక్ సిబ్బంది రోజువారి కలెక్షన్లు తగ్గిపోవడంతో డీలా పడుతుండగా మందుబాబులు చుక్కకోసం దిక్కులు చూస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రైవేటు, మైనారిటీ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు టెక్నో, ఒలంపియాడ్ తదితర ’క్యాచీ’ పేర్లతో పాఠశాలలు నడుపుతున్నవారు కూడా ఉన్నారు. ఈ విద్యా సంస్థలన్నీ అడ్మిషన్ల సమయంలో డొనేషన్ల రూపంలో కోట్ల కొద్ది సొమ్మును వెనకేసుకున్న విషయం బహిరంగ రహస్యమే. ఇటీవల ఓ మెడికల్ కళాశాలపై జరిగిన ఐటీ దాడుల్లో వందల కోట్ల సొమ్ము పట్టుబడటం ఇక్కడ ప్రస్తావనర్హం. ఇలాంటి సంస్థలు బెంగళూరుతో పాటు మంగళూరు, హుబ్లీ, ధార్వాడల్లో కూడా ఉన్నారుు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సదరు సొమ్మును ఏం చేయాలో తెలియక సదరు విద్యాసం స్థల అధిపతులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు చిత్ర రంగంపై కూడా ప్రభావం చూపిస్తోంది. సినిమాలకు ఫైనాన్స చేసే వారు చాలా మంది తమ వద్ద ఉన్న నల్లడబ్బును నిర్మాతలకు అప్పుగా ఇస్తుంటారు. అరుుతే నిషేధానికి ఒకటి రెండు రోజుల ముందు నగదు రూపంలో అప్పు తీసుకున్న నిర్మాతలు సదరు సొమ్ముతో ఏం చేయాలో తోచక అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి బెంగళూరులోని గాంధీనగర్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. బంగారు దుకాణాలపై దాడులు.. ఇక బెంగళూరు లక్కసంద్ర వార్డు కార్పోరేటర్ మహేష్‌బాబు ఆకస్మిక మరణంతో ఈనెల 21న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ వార్డుకు పోటీ పడుతున్న ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులు పాత నోట్లతో ఓటర్లకు తారుులాలు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 8న నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే మంగళూరు ప్రాంతంలో పలువురు బంగారం కొనుగోలు చేశారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టడానికి వీలుగా ఐటీ అధికారులు దుకాణాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అంతేకాకుండా అక్కడి సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల కష్టాలు ట్రాఫిక్ సిబ్బందికి అనధికార చెల్లింపులు చేయలేకపోతున్నా రు. దీంతో తమ రోజువారి అదాయం తగ్గిపోరుుందని బెంగళూరులోని కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది వాపోతున్నారు. ఇక మందు బాబుల సంగతి వర్ణనాతీతం. బెంగళూరు వంటి చాలా నగరాల్లో చాలా మద్యం షాపుల్లో పాత ఐదు వందలు తీసుకోవడం లేదు. దీంతో మందుబాబులు చేతిలో ఐదు వందల నోటు ఉన్న చుక్క మందు కూడా లభించడం లేదు.