అక్కడ మోదీకి, ఇక్కడ బాబుకు జనం గుణపాఠం | news about notes cancellation | Sakshi
Sakshi News home page

అక్కడ మోదీకి, ఇక్కడ బాబుకు జనం గుణపాఠం

Published Sat, Dec 17 2016 2:33 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

అక్కడ మోదీకి, ఇక్కడ బాబుకు జనం గుణపాఠం - Sakshi

అక్కడ మోదీకి, ఇక్కడ బాబుకు జనం గుణపాఠం

కార్వేటినగరం:ముందస్తు ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి,  పెద్దనోట్ల రద్దుకు సలహాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలే గుణపాఠం చెప్పను న్నారని  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని ఆర్కేవీబీపేటలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సలహాలతోనే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని గొప్పలు చెప్పు కుంటున్న ముఖ్య మంత్రి  తాను తీసిన గోతిలో తానే పడ నున్నారని విమర్శించారు. 

ప్ర జా సమస్యలను గాలికొదిలి, వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకు  ఇతరలను విమర్శిం చించడం బాబునైజమని ఆరో ³ంచారు. నరేంద్రమోదీ, బాబు పుణ్యమా అంటు జనం కరెన్సీకోసం చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా రోడ్లపై పడి బ్యాంకుల వద్ద బారుల తీరుతున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదని మండి పడ్డారు. కళ్లున్న గుడ్డివాడిలా సీఎం వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. ప్రజలు అమాకులు కారని, తమ సమస్యలు పట్టని టీడీపీ, బీజేపీ లను భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.   రాజకీయ   పదవులు శాశ్వతం కాదని, సేవలే  శాశ్వత మన్నా రు.

  ప్రతి నెల ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చే పింఛన్లను బ్యాంకు ఖాతా ల్లో జమ చేసి పండుటాకుల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని, పలుచోట్ల క్యూలో నిలబడలేక పోతున్నా రని తెలిపారు.  ఇలాగే కొనసాగితే   జనం ప్రభుత్వంపై తిరగబడడం ఖాయమని నారాయణ స్వామి  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement