బడా బాబులకు మహా కష్టాలు
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కేంద్ర ఆకస్మిక ప్రకటనతో జనం నానా అవస్థలు పడుతున్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రంలోని బాడా బాబులకు ముచ్చెమటలు పడుతున్నారుు. విద్యా సంస్థ యజమానులు పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో ఫైనాన్సియర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా వారి నుంచి అప్పు తీసుకున్న నిర్మాతలు మాత్రం లబోదిబోమంటున్నారు. ఇక ఈ పెద్ద నోట్ల దెబ్బ కొన్ని ప్రభుత్వశాఖలపై కూడా పడుతోంది. మరోవైపు ట్రాఫిక్ సిబ్బంది రోజువారి కలెక్షన్లు తగ్గిపోవడంతో డీలా పడుతుండగా మందుబాబులు చుక్కకోసం దిక్కులు చూస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రైవేటు, మైనారిటీ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు టెక్నో, ఒలంపియాడ్ తదితర ’క్యాచీ’ పేర్లతో పాఠశాలలు నడుపుతున్నవారు కూడా ఉన్నారు. ఈ విద్యా సంస్థలన్నీ అడ్మిషన్ల సమయంలో డొనేషన్ల రూపంలో కోట్ల కొద్ది సొమ్మును వెనకేసుకున్న విషయం బహిరంగ రహస్యమే.
ఇటీవల ఓ మెడికల్ కళాశాలపై జరిగిన ఐటీ దాడుల్లో వందల కోట్ల సొమ్ము పట్టుబడటం ఇక్కడ ప్రస్తావనర్హం. ఇలాంటి సంస్థలు బెంగళూరుతో పాటు మంగళూరు, హుబ్లీ, ధార్వాడల్లో కూడా ఉన్నారుు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సదరు సొమ్మును ఏం చేయాలో తెలియక సదరు విద్యాసం స్థల అధిపతులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు చిత్ర రంగంపై కూడా ప్రభావం చూపిస్తోంది. సినిమాలకు ఫైనాన్‌స చేసే వారు చాలా మంది తమ వద్ద ఉన్న నల్లడబ్బును నిర్మాతలకు అప్పుగా ఇస్తుంటారు. అరుుతే నిషేధానికి ఒకటి రెండు రోజుల ముందు నగదు రూపంలో అప్పు తీసుకున్న నిర్మాతలు సదరు సొమ్ముతో ఏం చేయాలో తోచక అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి బెంగళూరులోని గాంధీనగర్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.
బంగారు దుకాణాలపై దాడులు..
ఇక బెంగళూరు లక్కసంద్ర వార్డు కార్పోరేటర్ మహేష్‌బాబు ఆకస్మిక మరణంతో ఈనెల 21న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ వార్డుకు పోటీ పడుతున్న ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులు పాత నోట్లతో ఓటర్లకు తారుులాలు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 8న నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే మంగళూరు ప్రాంతంలో పలువురు బంగారం కొనుగోలు చేశారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టడానికి వీలుగా ఐటీ అధికారులు దుకాణాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అంతేకాకుండా అక్కడి సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసుల కష్టాలు
ట్రాఫిక్ సిబ్బందికి అనధికార చెల్లింపులు చేయలేకపోతున్నా రు. దీంతో తమ రోజువారి అదాయం తగ్గిపోరుుందని బెంగళూరులోని కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది వాపోతున్నారు. ఇక మందు బాబుల సంగతి వర్ణనాతీతం. బెంగళూరు వంటి చాలా నగరాల్లో చాలా మద్యం షాపుల్లో పాత ఐదు వందలు తీసుకోవడం లేదు. దీంతో మందుబాబులు చేతిలో ఐదు వందల నోటు ఉన్న చుక్క మందు కూడా లభించడం లేదు.