ప్రజారోగ్యం గాలికి | Simply wind | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం గాలికి

Published Mon, Mar 24 2014 1:59 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM

ప్రజారోగ్యం  గాలికి - Sakshi

ప్రజారోగ్యం గాలికి

 పేదల ఆరోగ్యంపై పాలకుల చిన్నచూపు
{పభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం

 

 ప్రభుత్వ ఆస్పత్రులంటేనే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పదేళ్లకు ముందూ, గడిచిన ఈ నాలుగేళ్లూ ఇదే పరిస్థితి. చూడ్డానికి బోలెడన్ని ఆస్పత్రులున్నా అవన్నీ సమయానికి సామాన్యునికి వైద్యం అందించలేని దీనస్థితిలో ఉన్నాయి. సాధారణ జబ్బులకూ దిక్కులేని పరిస్థితి. ప్రజారోగ్యం పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏటా నాలుగు కోట్ల మంది ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే రెండున్నర కోట్ల మందికి కూడా సరైన వైద్యం అందడం లేదు. ఏటా పధ్నాలుగు  లక్షల కాన్పులు జరుగుతూ ఉంటే సరైన వసతులు, వైద్యం అందని కారణంగా తొమ్మిది లక్షల మందికి పైగా గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్నీ వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.

 

రాష్ట్రవ్యాప్తంగా 1630 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ఏడు వందల కేంద్రాల్లో వైద్యులు లేరు. ఏటా మూడువేల మంది మెడిసిన్ పట్టభద్రులు వస్తున్నా మనకు వైద్యులు కరువు.

    
  {పెగ్నెన్సీ టెస్టు కోసం పీహెచ్‌సీకెళితే ఆ టెస్టు చేయలేరు. గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ కోసం వెళితే ఆ పరికరాలుండవు. ఆరు లక్షల మందికి రెండు సార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉండగా, రెండు లక్షల మందికి ఒక్కసారి కూడా చెయ్యలేదు. ఇప్పటికీ అన్ని రకాల మందులూ కరువే.

     
సామాజిక ఆరోగ్య కేంద్రాల(సీహెచ్‌సీ) పరిస్థితి ఘోరం. ప్రతి సీహెచ్‌సీలో ప్రసూతి, చిన్నపిల్లల, అనస్తీషియా వైద్యులు ఉండాలి. కానీ 70 సీహెచ్‌సీల్లో మినహా అన్ని అస్పత్రుల్లోనూ వైద్యుల కొరతే. గత నాలుగేళ్లలో ఈ ఆస్పత్రులకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధుల కింద రూ.200 కోట్లు మాతా శిశు వైద్యానికి ఖర్చు చేసినట్టు చెప్పుకుంటున్నా ఫలితం లేదు. ఇప్పటికీ ప్రతి వెయ్యి ప్రసవాలకు 44 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.

 
సెకండరీ కేర్ కూడా అధ్వానమే

     
{పాథమిక ఆరోగ్యం తర్వాత సెకండరీ కేర్ చాలా కీలకం. రాష్ట్రంలో సెకండరీ కేర్‌కు 17 జిల్లా ఆస్పత్రులు, 58 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలోనూ వసతుల కొరతే. ఈ ఆసుపత్రులకు అవసరమైన 350 మంది స్పెషలిస్టు డాక్టర్లు లేరు.


 కార్పొరేట్ హవా

    
  బోధనాసుపత్రులను 1994 నుంచి 2004 వరకూ అంటే దశాబ్దం పాటు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఈ పదేళ్లలో కార్పొరేట్ ఆస్పత్రులను బాగా ప్రోత్సహించారు. మెడికల్ టూరిజం అంటూ విదేశీ రోగులను ఆహ్వానించి, సామాన్య స్వరాష్ట్ర రోగులను గాలికొదిలారు. కొత్త వైద్య కళాశాలలు గానీ, కొత్తగా వైద్య సీట్లుగానీ రాకపోగా, పనిచేసే వైద్యులపైన కూడా ఆంక్షలు పెట్టడంతో చాలామంది ప్రభుత్వ వైద్య కళాశాలలను వదిలేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు.


 రిమ్స్‌లతో మళ్లీ ప్రాణం

     
బోధనాసుపత్రులు లేని ప్రాంతాల్లో వాటితో పాటు పెద్దాసుపత్రులను నిర్మించడానికి 2007లో వైఎస్‌ఆర్ పూనుకు న్నారు. రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) పేరుతో శ్రీకాకుళం, ఒంగోలు, కడప, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో ఒక్కో కళాశాలను రూ.200 కోట్లతో నిర్మించడమే కాకుండా, ప్రతి కళాశాలకూ 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేవిధంగా చేశారు.

     
విశాఖపట్నంలో రూ.250 కోట్లతో విమ్స్ పేరిట సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకోగా.. ఆయన మరణం తర్వాత అదికూడా పడకేసింది. దీనికిప్పుడు నిధులివ్వడం లేదు.


 రోగులకు సరిపడా మందులు

    
1994-2004 మధ్య కాలంలో ప్రభుత్వాసుపత్రిలో మందులంటే బంగారం దొరికినంత భాగ్యం. అతికష్టమ్మీద ఆపరేషన్ జరిగినా మందులు బయట కొనుక్కోవాలి.

     
2004 నుంచి 2009 వరకూ ఎక్కడా రోగులకు మందుల కొరత లేదు. ఏటా రూ.198 కోట్లు కేవలం మందుల కొనుగోలుకే ఇచ్చేవారు. పీహెచ్‌సీలకు, బోధనాసుపత్రులకు అవసరమైతే అదనంగా కూడా కేటాయించారు. ఇప్పుడు ఏటా రూ.330 కోట్లు కేటాయిస్తున్నా రూ.165 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement