ఏ ’మనీ’ చెప్పేది...
► గదగ్ జిల్లా రోణా తాలూకా హీరేహళ్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది రైతులు తాము పండించిన జొన్నలను స్థానిక సంతలో కాయగూరలు విక్రరుుంచే వారికి ఇచ్చి వారి నుంచి కాయగూరలను తీసుకుంటున్నారు. దీంతో పూర్వపు వస్తుమార్పిడి పద్దతి వచ్చిందని అక్కడి స్థానికులు వాపోయారు.
► రామనగర్‌కు చెందిన రమేష్ అతని స్నేహితులు ఏడాది పాటు చీటీలు వేసి కొంత నగదు దాచిపెడుతారు. ఈ సొమ్ముతో ప్రతి ఏడాది శబరిమలె వెలుతుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు వల్ల సరిపడ కొత్తనోట్లు దొరక్కపోవడం వల్ల తమ యాత్రను జనవరికి వారుుదా వేసుకున్నారు.
► మైసూరు జిల్లా దండికెర గ్రామానికి చెందిన మోతుబరి హీరేమఠ్ తన కుమార్తె పెళ్లికి రూ. 10 లక్షలకు పైగా దాచిపెట్టాడు. పెద్ద నోట్ల రద్దుతో ఆ మొత్తాన్ని అతను బ్యాంకు నుంచి తీసుకోలేకపోయాడు. దీంతో రెండు రోజుల ముందు తన కుమార్తె పెళ్లిని సాదాసీదాగా ముగించాడు. చివరికి ముహుర్తానికి పట్టుచీరను కొత్తది కొనలేకపోయానని వాపోయాడు.
► నోట్ల రద్దు వల్ల పాడి రైతులకు వారం నుంచి సహకార సంఘాల ద్వారా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో పాడి రైతులు పశువులకు అవసరమైన దాణాను కొనలేకపోతున్నారు. ఫలితంగా రెండు రోజులుగా పాల ఉత్తత్తి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు.