Cooperatives
-
‘సహకార రంగ’ సంస్కరణల్లో ఏపీదే అగ్రస్థానం
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి) : ‘సహకార రంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సహకార రంగం బలోపేతానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. ఈ రంంగంలో అంతర్జాతీయంగా భారత్ ఎంత బలంగా ఉందో.. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతే బలంగా ఉంది. రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్)తో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు) చాలా బాగా పనిచేస్తున్నాయి. రికార్డుస్థాయి వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. 36 ఏళ్ల తర్వాత కర్నూలు, 28 ఏళ్ల తర్వాత కడప డీసీసీబీలు లాభాల బాట పట్టాయంటే ఆషామాషీ కాదు. ప్యాక్స్‌ను కూడా లాభాల్లోకి తేవాలి’ అని జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సమాఖ్య (ఐసీఏ) సభ్యుడు భీమా సుబ్రహ్మణ్యం చెప్పారు. ఐసీఏ సభ్యునిగా ఎన్నికై తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. డీసీసీబీలకూ షెడ్యూల్ హోదా వచ్చేలా కృషి రాష్ట్రాల సహకార బ్యాంకుల (అపెక్స్ బ్యాంకు)ను ఒకే గొడుగు కిందకు తేవాలన్న సంకల్పంతో నాఫ్స్కాబ్ ఏర్పాటైంది. ఇది అపెక్స్ బ్యాంకులకు – ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతులకు అనుకూలంగా పాలసీల రూపకల్పనలో కృషి చేస్తుంది. దేశంలోని 351 డీసీసీబీల్లో 348 డీసీసీబీలకు ఆర్బీఐ లైసెన్సులిచ్చేలా కృషి చేశాం. నాఫ్స్కాబ్ కృషి వల్లే దేశంలోని 34 అపెక్స్ బ్యాంకుల్లో 24 షెడ్యూల్ హోదా పొందాయి. డీసీసీబీలకు కూడా షెడ్యూల్ హోదా కలి్పంచేలా పాలసీ తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. నాఫ్స్కాబ్లో అపెక్స్ బ్యాంకులతో పాటు డీసీసీబీలకు కూడా సభ్యత్వం ఇవ్వాలా లేక అసోసియేట్‌గా గుర్తించాలా అనే విషయంపై సెపె్టంబర్లో నిర్ణయం తీసుకుంటాం. రీ ఫైనాన్స్ 80 శాతానికి పెంచాల్సిందే సహకార స్ఫూర్తితో ఏర్పాటైన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేయడం సరికాదు. నాబార్డు 80 శాతం రీఫైనాన్స్ చేస్తేనే అపెక్స్ బ్యాంకులు డీసీసీబీలకు, వాటి పరిధిలోని ప్యాక్స్‌కు ఆ స్థాయిలో రీఫైనాన్స్ చేస్తాయి. నాబార్డు రీఫైనాన్స్‌ను 50 శాతం నుంచి 80 శాతానికి పెంచేలా నాఫ్స్కాబ్ కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న ప్యాక్స్లకు ఆ ర్థిక సాయం చేయాల్సిన బాధ్యత అపెక్స్ బ్యాంకులదే. ఈ రంగంలో రెండంచెల వ్యవస్థ కంటే మూడంచెల వ్యవస్థ చాలా మంచిది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎ‹ఫ్పీవో)ను ప్రోత్సహించడం మంచిదే కానీ, సహకార చట్టం ప్రకారం వాటికి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయాలి. భారత్ సహకార వ్యవస్థ బలంగా ఉంది భారత్‌లో సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సుమారు 15 కోట్ల మంది భాగస్వాములైన వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. అయితే, దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన పాలక మండళ్ల ద్వారా పాలన సాగిస్తే సహకార వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆర్బీకేలతో అనుసంధానం మంచి ఆలోచనే దేశంలో ఏపీ, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి. మంచి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. ఏపీలో మంచి పురోగతి కన్పిస్తోంది. దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న బ్యాంకులు లాభాల బాట పట్టాయంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఆర్బీకేలతో పీఏసీఎస్‌లను అనుసంధానించడం మంచి ఆలోచనే. దీనివల్ల గ్రామ స్థాయిలో రైతులకు మరింత మంచి జరుగుతుంది. -
రిబేట్ ఆశ
‘సహకార’ రైతులకు రెండేళ్లుగా అందని రాయితీ ఉమ్మడి జిల్లాలో రూ. 8.26 కోట్ల బకాయిలు నిరీక్షిస్తున్న 6,236 మంది కర్షకులు సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్న రైతులకు ఆరు శాతం రిబేట్ అందడం లేదు. రెండేళ్లుగా ఈ సొమ్ము మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6,236 మంది రైతులకు సంబంధించి రూ.8.26 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం కర్షకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సదాశివనగర్ (ఎల్లారెడ్డి) : సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణం పొందిన రైతులు సకాలంలో రుణ వాయిదాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆరు శాతం రిబేట్ రూపంలో చెల్లిస్తుంది. ఇందుకోసం రుణగ్రహీతలు ఏటా ఫిబ్రవరి 28లోగా రుణ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ లభిస్తుందన్న ఆశతో చాలా మంది సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ రిబేట్ సొమ్ము మంజూరవడం లేదు. ఈ సొమ్ము కోసం అర్హులైన రుణ గ్రహీతలు సహకార సంఘాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు. 2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి రిబేట్ రావాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 56 సింగిల్ విండోలు, నిజామాబాద్ జిల్లా పరిధిలో 84 సింగిల్ విండోల పరిధిలో 6,236 మంది రైతులకు రూ. 8 కోట్ల 26 లక్షల 898 రిబెట్ మంజూరు కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఏ ’మనీ’ చెప్పేది...
► గదగ్ జిల్లా రోణా తాలూకా హీరేహళ్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది రైతులు తాము పండించిన జొన్నలను స్థానిక సంతలో కాయగూరలు విక్రరుుంచే వారికి ఇచ్చి వారి నుంచి కాయగూరలను తీసుకుంటున్నారు. దీంతో పూర్వపు వస్తుమార్పిడి పద్దతి వచ్చిందని అక్కడి స్థానికులు వాపోయారు. ► రామనగర్‌కు చెందిన రమేష్ అతని స్నేహితులు ఏడాది పాటు చీటీలు వేసి కొంత నగదు దాచిపెడుతారు. ఈ సొమ్ముతో ప్రతి ఏడాది శబరిమలె వెలుతుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు వల్ల సరిపడ కొత్తనోట్లు దొరక్కపోవడం వల్ల తమ యాత్రను జనవరికి వారుుదా వేసుకున్నారు. ► మైసూరు జిల్లా దండికెర గ్రామానికి చెందిన మోతుబరి హీరేమఠ్ తన కుమార్తె పెళ్లికి రూ. 10 లక్షలకు పైగా దాచిపెట్టాడు. పెద్ద నోట్ల రద్దుతో ఆ మొత్తాన్ని అతను బ్యాంకు నుంచి తీసుకోలేకపోయాడు. దీంతో రెండు రోజుల ముందు తన కుమార్తె పెళ్లిని సాదాసీదాగా ముగించాడు. చివరికి ముహుర్తానికి పట్టుచీరను కొత్తది కొనలేకపోయానని వాపోయాడు. ► నోట్ల రద్దు వల్ల పాడి రైతులకు వారం నుంచి సహకార సంఘాల ద్వారా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో పాడి రైతులు పశువులకు అవసరమైన దాణాను కొనలేకపోతున్నారు. ఫలితంగా రెండు రోజులుగా పాల ఉత్తత్తి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. -
సహకార సంఘాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
హన్మకొండ: సహకార సంఘాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గాల ఎస్సీ, ఎస్టీ డైరక్టర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జీడి సదయ్య కోరారు. మంగళవారం హన్మకొండలో ఫోరం జిల్లా ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ డైరక్టర్ల ఫోరం సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించి ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో డైరక్టర్లు పోలెపాక శ్రీనివాస్, బిక్యూనాయక్, మంకిడి వెంకటేష్, ఎర్రా జానకి పాల్గొన్నారు. -
సహ చట్టం కదిలిస్తుంది
సహకార సంఘాలలో సహకారం తక్కువ. అవినీతి, ప్రతీకారాలెక్కువ. ప్రతి సొసైటీలో రెండు లేదా అంతకు మించి వర్గాలు ఉంటాయి. వారు ఒకరి మీద ఒకరు కారాలూ మిరియాలూ నూరుతుంటారు. సహకార సంఘాల రిజిస్ట్రార్ ఈ సంఘాల కార్యక లాపాలను నియంత్రించాలి. వచ్చిన ఫిర్యాదులు విని తగిన చర్యలు తీసుకోవాలి. కాని వారి కష్టాలు వారివి. తగిన సిబ్బంది ఉండరు. అక్కడా అవినీతి, అసమర్థత, నిష్క్రియ కనిపిస్తాయి. ఏంచేసినా పని చేయబోమనే వైఖరి. ఈ సంఘాల పనిపట్టాలనీ, సర్కారు శాఖతో పనిచేయించాలని అనుకునే వారికి దొరికిన సాధనం ఆర్టీఐ. ఇప్పుడు విరివిగా పడు తున్న ఆర్టీఐ ప్రశ్నల పరంపరతో సర్కారు వారి సహకార శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. చర్య తీసుకోక తప్పని పరిస్థితి. పాపం, ఒక సహకార గృహ నిర్మాణ సంఘ కార్యదర్శి బెహల్ 65 సంవత్సరాల వయసులో రెండేళ్ల నుంచి రిజిస్ట్రార్ చుట్టూ తిరుగుతున్నారు. సభ్యుడు కాని ఒక వ్యక్తి అన్యాయంగా ఫ్లాట్‌ను ఆక్రమించినందుకు ఆరు లక్షల రూపాయలు వసూలు చేయాలన్న ఉత్తర్వును ఆర్సీఎస్ (రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్) ఎందుకు అమలు చేయడం లేదని, ఎప్పుడు వసూలు చేస్తారని ఆర్టీఐ కింద అడిగారు. సొసైటీకి ఎన్ని ఉత్తరాలు రాసినా దిక్కులేదు. ఆర్టీఐ దరఖాస్తు గతీ అంతే. మొదటి అప్పీలు అధికారి సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అతీ గతీ లేదు. సీపీఐఓ కనీసం కేసు విచారణ నోటీసుకు కూడా ప్రతిస్పం దించలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాలేదు. షోకాజ్ నోటీసుకు జవాబేలేదు. సమాచారం ఇవ్వాలన్న కమిషనర్ ఉత్తర్వులూ పాటించలేదు. మరో నోటీసు, మరి కొంత గడువు ఇచ్చినా ప్రయోజనం లేదు. కొత్తగా సీపీఐఓ (సమాచార అధికారి) పదవిని స్వీకరించిన అశోక్ కుమార్ తనకు ఫైలు దొరకలే దని, అయినా అదనపు గడువు ఇస్తే, విషయం తెలు సుకుని తగిన సమాచారం ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి విఫలమైతే జరిమానా విధించ డానికి చర్యలు తీసుకోవలసి ఉంటుందని రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కమిషన్ హెచ్చరించింది. సెక్షన్ 20 కింద తప్పుచేసిన అధికారిపైన జరిమానా విధించే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది. రోజుకు రూ.250 చొప్పున, గరిష్టం రూ. 25 వేల దాకా జరిమానా విధిస్తూ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని సిఫార్సుకూడా చేయవచ్చు. ఈ అధికారాన్ని ఏ విధంగా వినియోగించాలో, పద్ధతి ప్రక్రియలు ఏమిటో న్యాయస్థానాలు అనేక తీర్పులలో వివరిం చాయి. తమ ఉత్తర్వును తాము అమలు చేసుకునే బలం, శక్తి ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని జి. బసవరాజు వర్సెస్ శ్రీమతి అరుంధతి కేసులో (సీసీసీ నంబర్ 525, 2008 సివిల్ (తేదీ 27.1.2009) కర్ణాటక హైకోర్టు వివరించింది. సమగ్రమైన ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 20 ద్వారా, సమాచార కమిషన్ తన ఉత్తర్వులను తానే అమలు చేయించుకునే వీలుందని హైకోర్టు నిర్ధారించింది. ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, ఇటువంటి అధికారాలు ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని స్పష్టం చేసింది. మాజీ సమాచార అధికారి జవాబులు ఇవ్వక పోవడం, సీఐసీ ఆదేశాలు పాటించకపోవడం, కమిషన్ విచారణకు హాజరు కాకపోవడంవంటి తప్పులకు పాల్పడ్డారు. ఆఫీసులో ఫైలు ఉన్నప్పటికీ దొరకడం లేదని బుకాయిస్తున్నారని, కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని, మొత్తానికి ఆర్సీఎస్ కార్యాలయంలో కొందరికి సమాచారం ఇవ్వాలనే లేదని బెహల్ వాదించారు. దాదాపు రెండేళ్ల నుంచి తిరుగుతున్నా, వినతిపత్రాలు ఇస్తున్నా ఎవరూ చర్య తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సంఘానికి కార్యదర్శి అయి ఉండి కూడా నివాస గృహాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి నుంచి పరిహారం వసూలు చేయలేకపోవడం పట్ల బెహల్ కలత చెందారు. తనకు సర్కారు శాఖ ఏ మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. తన తప్పు ఏమీ లేదని, కేవలం రిజిస్ట్రార్ విభాగం వారు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు. పీఐఓ కృష్ణకుమార్ అసలు పట్టించుకోని అంశాలు, పాటించని ఆదేశాలు ఇవి. 1. ఆర్‌సీఎస్‌కు బెహల్ చేసిన ఫిర్యాదు, 2. ఆర్టీఐ దరఖాస్తు, 3. మొదటి అప్పీలు అధికారి ఆదేశాలు, 4. కేంద్ర సమాచార కమిషన్ కేసు విచారణ నోటీసు, 5. కమిషన్ షోకాజ్ నోటీసు, 6. సమాచారం ఇవ్వాలని కమిషన్ జారీ చేసిన ఆదేశాలు. ఇందువల్ల బెహల్ అనవసరంగా వేధింపులకు గురైనాడు. ఆయనకు పదివేల రూపాయల నష్టపరి హారం చెల్లించాలని కమిషన్ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. మరొక రెండు సార్లు పెంచిన గడువులో కూడా సమాధానం చెప్పనం దుకు పీఐఓ కృష్ణమూర్తికి రూ. 25 వేలు జరిమా నాను కమిషన్ విధించింది. పిడుగులు పడినా పనిచేయని అధికారుల చేత పని చేయించే కొరడా సమాచార హక్కు. కొందరు అధికారులు జరిమానా విధించినా చలించరు. వారిపైన చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ సంస్థల పైన ఉంటుంది. లేకపోతే వారు బాధితుడికి నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఈ కేసులో పనిచేయని అధికారి పాతిక వేలు జరిమానా కమి షన్‌కు చెల్లిస్తే, అటువంటి అధికారులపైన ఏ చర్యా తీసుకోనందుకు ఆర్సీఎస్ వారు బెహల్‌కు పదివేలు పరిహారం చెల్లించాలి. జరిమానాలు, పరిహారాల ద్వారా సహ చట్టం పనిచేయిస్తుంది. (ఆర్ ఎల్ బెహల్ వర్సెస్ ఆర్సీఎస్, ఇఐఇఅఅ 2015000224 కేసులో ఫిబ్రవరి 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
మాఫికర్!
అయోమయం ముంచుకొస్తున్న గడువు రైతుల్లో ఆందోళన రుణమాఫీ.. ఎన్నికల ఫలితాల వచ్చేవరకూ రైతులను ఆనందడోలికల్లో తేలియాడించిన పథకం. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో సునాయాసంగా ఇచ్చేసిన హామీ. తీరా సవాలక్ష కొర్రీల కారణంగా అమలు విషయం అయోమయంగా మారింది. ఇందుకు నిర్ణయించిన గడువుతో ముంచుకొస్తుండడంతో రైతన్నలకు భయం పట్టుకుంది. విశాఖ రూరల్ : రుణమాఫీ వ్యవహారం అయోమయంగా మారింది. అమల విషయంలో రైతుల్లో భయం పట్టుకుంది. ప్రభుత్వం చెబుతున్నది ఒక రకంగా ఉంటే బ్యాంకుల తీరు మరో విధంగా ఉంటోంది. అసలు బ్యాంకులు, సహకార సంఘాలు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తుండడమే ఈ గందరగోళానికి కారణమవుతోంది. మరోవైపు అర్హుల జాబితా తయారీకి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఆధార్ సీడింగ్‌కు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. పాస్ పుస్తకంలో ఉన్న పేరు 1బీ అడంగల్‌లో ఉంటేనే కంప్యూటర్ స్వీకరిస్తుంది. లేనివి పక్కనపెడుతున్నారు. గతంలో అధికారులు నిర్లక్ష్య ధోరణితో రికార్డుల్లో సవరణలు చేయని కారణంగా ప్రస్తుతం తాము నష్టపోవాల్సి వ స్తోందని రైతులు వాపోతున్నారు. ఆధార్ వివరాల సమర్పణకు ఈ నెల 15 ఆఖరు తేదీగా ప్రకటించడంతో కార్డులు లేని వారు కలవరానికి గురవుతున్నారు. అనేక ఇబ్బందులు జిల్లాలో రైతులకు సంబంధించి భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్) రెవెన్యూ అధికారులు చాలా వరకు అందజేశారు. అయితే ఆ తర్వా యజమాని మరణం, భాగం పంపిణీ తదితరాలకు సంబంధించి వెంటనే క్లయిమ్ చేసుకుని తదుపరి హక్కు పొందాల్సి ఉంటుంది. దీనిపై సరైన అవగాహన లేక కొత్త పాస్‌పుస్తకాలు పొందని వారు అనేక మంది ఉన్నారు. అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో యజమాని పేరు మార్చేటప్పుడు వీఆర్వోలు, ఆర్ఐలు, తహశీల్దార్లు, ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో అందరి సంతకాలు అవసరమవుతాయి. అయితే కొన్ని చోట్ల యజమాని ఫొటోపై కొత్తగా ఎవరికి కేటాయిస్తున్నారో వారి ఫొటో అంటించి పేరు మార్చి వదిలేశారు. అడంగల్, 1బీలలో పేరు మార్పు జరగలేదు. అలాంటివి ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్నాయి. ఆధార్ సీడింగ్‌లో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పటికీ 1బీ, అడంగల్‌లో పేరు మార్పు జరగని కారణంగా సీడింగ్ జరగడం లేదు. దీంతో తాము రుణమాఫీకి అర్హులంకామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీల నేపథ్యంలో నిశిత పరిశీలన : గతంలో అనేక చోట్ల నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపి బ్యాంకులకు టోకరా వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా నిబంధనల మేరకు పుస్తకాలుంటేనే వాటిని పరిగణలోకి తీసుకోవాలని బాంకర్లు నిర్ణయించడంతో, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవానికి ఆధార్ అనుసంధానం అయితే సదరు పట్టాదారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు పొందితే ఆ విషయం బయటపడుతుంది. కానీ సాంకేతికపరమైన అంశాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ అవస్థలు : గడువు ముగుస్తున్నా అనేక మంది రైతులకు నేటికీ ఆధార్‌కార్డులు లేవు. దీంతో మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పథకం, సంక్షేమ కార్యక్రమానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్ద జనాలు క్యూలు కడుతున్నారు. అందుకు అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద ఏర్పాట్లు లేవు. గడువులోగా కనీసం ఆధార్ రసీదు నంబర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కొన్ని చోట్ల నెలకొన్నాయి. నిర్ణీత వ్యవధిలోపు రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే రుణమాఫీ ప్రకటనలో అనేక మంది రైతులు రుణాలు చెల్లించలేదు. రుణమాఫీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే రైతులపై వడ్డీ భారం పడింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.