సహకార సంఘాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
Published Wed, Jul 20 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
హన్మకొండ: సహకార సంఘాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గాల ఎస్సీ, ఎస్టీ డైరక్టర్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జీడి సదయ్య కోరారు. మంగళవారం హన్మకొండలో ఫోరం జిల్లా ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ డైరక్టర్‌ల ఫోరం సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించి ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో డైరక్టర్‌లు పోలెపాక శ్రీనివాస్, బిక్యూనాయక్, మంకిడి వెంకటేష్, ఎర్రా జానకి పాల్గొన్నారు.
Advertisement