Implemented
-
రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చలికాలం ప్రారంభానికి ముందే రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగింది. రాజధానిలో గాలి నాణ్యత వరుసగా రెండో రోజు ‘పూర్’ కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీపీబీ) తెలిపిన వివరాల ప్రకారం దసరా తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224 కు చేరుకుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఈ ఏడాది కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రాప్-1ని నేటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవి నేటి నుంచి(మంగళవారం) నుంచి అమలు కానున్నాయి. గ్రాప్-1 దశలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని పరిమితం చేయడం, రెస్టారెంట్లలో బొగ్గు లేదా కట్టెల వినియోగాన్ని నిషేధించడం వంటివి ఉంటాయి. నగరంలో ఏక్యూఐ 200 దాటినప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గాలి నాణ్యత క్షీణతను నిరోధించడానికి అమలు చేసే విధానం. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత ఆధారంగా గ్రాప్ విధానాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీకి 300 కి.మీ. పరిధిలో కాలుష్యం కలిగించే పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటారు. రెండవ దశలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో సీఎన్జీ/ఎలక్ట్రిక్ బస్సు మెట్రో సేవలను ప్రోత్సహిస్తారు.మూడవ దశలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లలో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఫోర్-వీలర్లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 ఫోర్-వీలర్ల వినియోగాన్ని నిషేధించనున్నారు. నాల్గవ దశలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధిస్తారు. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.ఇది కూడా చదవండి: రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు -
నూతన ఇసుక పాలసీ
సాక్షి, కరీంనగర్: జిల్లాలో త్వరలో నూతన ఇసుక టాక్స్ పాలసీ అమలు చేస్తామని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మంగళవారం నూతన ఇసుక టాక్స్ పాలసీపై మైనింగ్ అధికారులు, ఇసుక ట్రాక్టర్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూతన ఇసుక పాలసీని రూపొందించిందని, దానిని అమలు చేస్తే ట్రాక్టర్ల ఓనర్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తెలిపారు. ట్రాక్టర్ ఓనర్లకు సరైన రేటు లభిస్తుందని, ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దొరకుతుందని తెలిపారు. ట్రాక్టర్ల ఓనర్లు వెంటనే ఏడీ మైనింగ్ ఆఫీస్‌లో ప్రతీ ట్రాక్టర్‌కు రూ.5 వేలు డిపాజిట్ చేసి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇసుక కావాలనుకునే వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వారికి వరుస క్రమంలో కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో ఇసుక రీచ్‌లను గురించి రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని, ట్రాక్టర్ ఓనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఇసుక నిత్యావసరంగా మారిందని, అక్రమ రవాణా ద్వారా జరిమానాలు కట్టలేక ట్రాక్టర్ ఓనర్లు, అధిక ధరలుచెల్లించలేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు నూతన ఇసుక పాలసీని అమలు చేస్తోందని చెప్పారు. ఈ నూతన ఇసుక పాలసీలో అక్రమ ఇసుకను తీసుకున్న వినియోగదారునిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున ఇకముందు జిల్లాలో ఎవరూ అక్రమ ఇసుకను తీసుకోరని ట్రాక్టర్ యజమానులకు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీలో తమ ట్రాక్టర్లును నమోదు చేయించుకోవాలని సూచించారు. వారానికి ఒకసారి ఇసుక ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇసుక ట్రాక్టర్ ఓనర్ల సందేహాలను ఎమ్మెల్యే నివృత్తి చేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మైనింగ్ ఏడీ వెంకటేశం, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ జియాలో సిస్ట్ ఎం.రఘుబాబు, ప్రాజెక్టు ఆఫీసర్ తారక్ నాథ్‌రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులు, ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ పాలసీపై ఆశావహుల్లో చర్చ
సాక్షి, వరంగల్: ‘ఎక్సైజ్ పాలసీ 2019–21 కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రానున్నాయా.. లేదంటే పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహిస్తారా.. అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏ మేరకు మార్పులు ఉంటాయి?’ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే చర్చ. సెప్టెంబర్ 30తో మద్యం దుకాణాల గడువు ముగియనుండడంతో కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారు.. యధాతథంగా కొనసాగాలనుకునే వ్యాపారులు, ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. 2017లో జరిగిన టెండర్ల సందర్భంగా ఆగస్టు మొదటి వారంలోనే ప్రభుత్వం కొత్త పాలసీ, టెండర్లపై విధి విధానాలను ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు. ఒక్కో దుకాణానికి మూడు నుంచి 85 వరకు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 మద్యం దుకాణాలపై కేవలం దరఖాస్తుల రూపేణా మద్యనిషేధం, అబ్కారీశాఖకు రూ.75.27 కోట్ల ఆదాయం లభించింది. 2015–17 కోసం ఆరు స్లాబ్‌లు, ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించిన ప్రభుత్వం.. 2017–19కి వచ్చే సరికి నాలుగు స్లాబ్‌లు, దరఖాస్తు ధర రూ.లక్షకు పెంచింది. దీంతో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రభుత్వం పాలసీలో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తుందా.. లేక పాత పద్ధతినే అమలు చేస్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గత శ్లాబ్‌లు ఇలా.. ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా రెండు పర్యాయాలు వేర్వేరు విధానాలను పాటించింది. 2015–17 ఎక్సైజ్ పాలసీలో ఆరు స్లాబులు విధించింది. మేజర్ గ్రామపంచాయతీలకు సంబంధించి మొదటి స్లాబ్‌గా రూ.39.50 లక్షలు, మండల కేంద్రాలోరెండో స్లాబ్‌గా రూ.40.8 లక్షలు ఎక్సైజ్ టాక్స్ విధించారు. అదే విధంగా లక్ష నుంచి 2 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 3 లక్షల జనాభా పైబడి ఉంటే రూ.81.6 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1.08 కోట్లుగా నిర్ణయించారు. 2017–19 పాలసీకి వచ్చే సరికి ఆరు శ్లాబ్‌లను నాలుగుకు తగ్గించారు. 50 వేల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.45 లక్షలు కాగా, 50,001 నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.55 లక్షలు, 5,00,001 నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.85 లక్షలు, 20 లక్షలపై జనాభా ఉండే చోట రూ.1.10 కోట్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఈ పాలసీ వచ్చే నెల 30తో ముగియనుండగా.. కొత్త విదివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో 2019–21 ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ, ఆసక్తి ఆశావహుల్లో మొదలైంది. బార్ లైసెన్సుల రెన్యూవల్ యధాతథం వైన్స్‌షాపుల టెండర్ల విషయంలో కొంత సస్పెన్స్ నెలకొనగా... బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులను మాత్రం యధాతథంగా రెన్యూవల్ చేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 వైన్స్ (ఏ–4) ఉండగా 100 బార్ అండ్ రెస్టారెంట్లు, 17 ఎలైట్ బార్లు ఉన్నాయి. ఇందులో వరంగల్ అర్బన్ జిల్లాలో 59 వైన్స్, 88 బార్లు, 11 ఎలైట్ బార్లు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 58 వైన్స్, 3 బార్లు, 4 ఎలైట్ బార్లు, జనగామలో 42 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్, మహబూబాబాద్‌లో 51 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్ బార్లు ఉన్నా యి. ఇక జయశంకర్ భూ పాలపల్లి, ములుగు జిల్లాల్లో 55 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. ఇందులో 100 బా ర్లు, 17 ఎలైట్ బార్లకు సె ప్టెంబర్ నెలా ఖరులోగా రెన్యూవల్ చేయనున్నారు. వైన్స్‌కు మాత్రం ఇంకా మా ర్గదర్శకాలు రావాల్సి ఉండగా ఈ సా రి వైన్స్‌షాపు ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా దరఖాస్తులు కూడా పోటెత్తుతాయని భావిస్తున్నారు. గత టెండర్లలో 265 దుకాణాలకు గాను 7,527 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే అవకాశం 2019–21 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీ వెలువడే అవకాశముంది. వచ్చే నెల 30వ తేదీతో వైన్స్ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము. – సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్, మద్యనిషేధం, అబ్కారీ శాఖ, వరంగల్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
♦ ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌కుమార్ మక్కడ్ సత్తుపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప.. వాటిని అమలుపరిచే పరిస్థితి లేదని ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌కుమార్ మక్కడ్ అన్నారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రధాన వక్తగా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ఆయన సీపీఎం శ్రేణులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం మినహా వాటిని అమలు చేసేందుకు శ్రద్ధ చూప డం లేదని విమర్శించారు. పెట్టుబడిదారులు లాభాలు ఆర్జించడం తప్ప ప్రజా ప్రయోజనాలు వారికి పట్టవన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల నేపథ్యం, తెలంగాణ సాధించుకున్న తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఆయన వివరించారు. ఇటీవల కొందరు పోలీసులు ఆత్మహత్యలకు ఎందుకు పాల్ప డాల్సి వచ్చింది.. పై స్థాయి అధికారులు పెడుతున్న ఒత్తిడి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా కమిటీ సభ్యులు వి.మల్సూరు సామాజిక సమస్యలు–పార్టీ వైఖరి అంశంపై బోధించారు. సత్తుపల్లి పట్టణ, రూరల్, వేంసూరు మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌గా సీపీఎం మండల కార్యదర్శి రావుల రాజబాబు వ్యవహరించారు. పట్టణ కార్యదర్శి మోరంపూడి పాండురంగారావు, వేం సూరు మండల కార్యదర్శి అర్వపల్లి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జాజిరి శ్రీనివాసరావు, కొత్తా సత్యనారాయణ, పాకలపాటి ఝాన్సీ, సీఐటీయూ మండల కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, భాస్కర్‌రావు పాల్గొన్నారు. -
డీమానిటైజేషన్ కార్ల్‌మార్క్స్ ఐడియా అట
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయంపై బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ మార్క్సిస్టు ఎజెండాను అవలంబించారని పేర్కొన్నారు. తద్వారా భారత ప్రధాని మార్క్సిస్టు మహానాయకుడు కారల్ మార్క్స్ చెప్పిన సమాసమాజంకోసం పాటుపడుతున్నారన్నారు. నిజానికి ఇది మార్క్సిస్ట్ ఎజెండా. ఒకపుడు లోహియా, కాన్షీరామ్ చెప్పిన వాటిని ఇపుడు మన ప్రధానమంత్రి అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా మోదీ యోగి టర్న్డ్ సూపర్ హీరో అని ఉమ భారతి అభివర్ణించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. మార్క్స్ అసమానతలు లేని సమసమాజం కోరుకున్నారన్నారు. ఒకవైపు ఒక మనిషి 12 గదుల ఇంట్లో ఉంటే, మరొక వైపు 12 మంది ఒకే గదిలోఉండడం ఆమోదయోగ్యం కాదన్నారు. కానీ 12గదులను బలవంతంగా ఆక్రమించు కోకూడదన్నారు. అందుకే పేద, ధనిక మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారన్నారు. నల్లధనాన్ని నిరోధించి, ఆ నగుదును జనధన్ ఖాతాల్లో, ముద్రా యోజన ఖాతాల్లో జమ అయ్యేలా మోదీ చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందుకు వామపక్షవాదులు మోదీని అభినందించాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత రాజకీయాల్లో అభివృద్ధి ఎజెండా తీసుకురావడం, పేదల సంక్షేమం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగం లాంటి మార్పులతోపాటూ యోగి నుంచి మహానాయకుడిగా అవతరించాన్నారు. దేశానికి మోదీలాంటి సూపర్ హీరో అవసరం చాలా వుందని ఉమా భారతి ప్రశంసల జల్లు కురిపించారు. -
హామీలను అమలు చేయాలి
మోత్కూరు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపెల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ డిమాండ్ చేశారు. మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం మోత్కూరు మండల కేంద్రానికి చేరుకుంది. హైస్కూల్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలువేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా టీఎమ్మార్పీఎస్ జెండాను యాతాకుల భాస్కర్ మాదిగ ఎగరవేశారు. అనంతరం దళితులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నవంబర్ 19వ తేదీలోపు దళితులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్యమాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు కూరెళ్ల ఎల్లయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జీ దాసరి ప్రవీణ్, మండల అధ్యక్షుడు బాలెంల పరుశరాములు, నాయకులు దళిత యువసేన రాష్ట్ర కార్యదర్శి అలెగ్జండర్, నాయకులు కుప్పల రమేష్, దాసు,నరేష్,నవీన్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
హన్మకొండ అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2004 నుంచి అమలు చేస్తున్న కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంట్రీబ్యూటరీ ఉద్యోగుల సంఘం (టీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిరసన ప్రదర్శన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి కొనసాగే సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సీపీఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయితే వందల్లో కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 30 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి భద్రత లేని విధంగా ప్రస్తుత సీపీఎస్ పెన్షన్ విధానం ఉందన్నారు. గ్రాట్యూటీ లేకుండా చేసిన జీఓలు 653, 654, 655ను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, జిల్లా సహ అధ్యక్షుడు వి.రాంబాబు, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కె.శ్రీనివాస్‌రాజు, ఉదయ్‌భాస్కర్, జాయింట్ సెక్రటరీ కె.రమేష్, వినోద్, లింగస్వామి, సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఈ–నామ్‌ను సమర్థంగా నిర్వహించాలి
వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు ఖమ్మం వ్యవసాయం: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ–నామ్(ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్)ను ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేశామని, దానిని సమర్థంగా నిర్వహించాలని వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం మార్కెట్ కార్యాలయంలో వర్తక సంఘం ప్రతినిధులతో ఈ–నామ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానం వల్ల పంట ఉత్పత్తులకు పోటీ ధర లభిస్తుందన్నారు. మన రాష్ట్రంలో 44 రెగ్యులేటెడ్ మార్కెట్లలో ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన సరకును ఏ ప్రాంతం నుంచైనా కొనుగోలు చేసుకునే వీలుంటుందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈ–నామ్ నిర్వహణకు ప్రస్తుత మార్కెట్ స్థాయి సరిపోదని, 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగి ఉండాలని అన్నారు. దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావు మాట్లాడుతూ ఈ–నామ్ వ్యవస్థతో కమీషన్ వ్యాపారుల వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
కోదాడఅర్బన్: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడిని అరికట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వామపక్ష విద్యార్ధి సంఘాలైన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా కార్పొరేట్ విద్యాసంస్థలను బహిష్కరించాలని కోరుతూ ఈనెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. బుధవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వారు దీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకై రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 42ను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రా కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చేపూరి కొండలు, పి.శ్రీనివాస్, ఎస్.బిక్షం, నరేష్, చందర్రావు, రాజు, వీరనాయక్, శ్రీకాంత్, శ్రీనునాయక్, వీరబాబు, నవీన్, సాయి, పవన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
సహకార సంఘాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
హన్మకొండ: సహకార సంఘాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గాల ఎస్సీ, ఎస్టీ డైరక్టర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జీడి సదయ్య కోరారు. మంగళవారం హన్మకొండలో ఫోరం జిల్లా ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ డైరక్టర్ల ఫోరం సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించి ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో డైరక్టర్లు పోలెపాక శ్రీనివాస్, బిక్యూనాయక్, మంకిడి వెంకటేష్, ఎర్రా జానకి పాల్గొన్నారు. -
రేషన్‌కు వేలిముద్రలు
రాష్ట్రంలోనే తొలిసారిగా జవహర్‌నగర్‌లో అమలు - నేటినుంచి బయోమెట్రిక్ విధానం ప్రారంభం - ఇంటింటికీ తిరిగి వేలిముద్రల సేకరణ - పది రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియ జవహర్‌నగర్: పౌరసరఫరాల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా జవహర్‌నగర్‌లో దీన్ని ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా కలిగి 16 రేషన్ దుకాణాలతో ఉన్న జవహర్‌నగర్ గ్రామాన్ని బయోమెట్రిక్ విధానం అమలు కోసం ఎంచుకున్నారు. గ్రామంలో గురువారం నుంచి 16 రేషన్ దుకాణాల పరిధిలోని 15,869 రేషన్‌కార్డుదారుల నుంచి వేలిముద్రలు తీసుకోనున్నారు. 34 బయోమెట్రిక్ మిషన్లను ఉపయోగించి 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడి వేలిముద్రలను తీసుకుంటారు. దీని కోసం దాదాపు 60 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈ విషయమై తహసీల్దార్ దేవుజా మాట్లాడుతూ.. రేషన్‌కార్డు లబ్ధిదారులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా బయోమెట్రిక్‌లో వేలిముద్రలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను కళ్లెం వేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ బయోమెట్రిక్ ఆన్లైన్ విధానాన్ని జవహర్‌నగర్‌లో అమలు చేయనున్నామని, ఇక్కడ విజయవంతమైతే జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు.