వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్! | Vehicle sales down 50 per cent ..! | Sakshi
Sakshi News home page

వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్!

Published Sat, Nov 19 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్!

వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్!

ఆటోమొబైల్ డీలర్లకు కరెన్సీ షాక్
పెద్ద నోట్ల రద్దుతో సగానికి పడిపోరుున అమ్మకాలు
ద్విచక్రవాహనాలు, కార్లపై  తీవ్ర ప్రభావం
దాదాపు రూ.350 కోట్ల మేర స్తంభించిన లావాదేవీలు

సిటీబ్యూరో : పెద్ద నోట్ల రద్దు కొత్త వాహన విక్రయాలకు కళ్లెం వేసింది. గత  వారం, పది రోజులు గా గ్రేటర్‌లో వాహనాల అమ్మకాలు సగానికి సగం పడిపోయారుు. వ్యక్తిగత వాహనాలపై నోట్ల రద్దు  ప్రభావం తీవ్రంగా ఉంది. పెద్ద మొత్తంలో డ్రా చేసేందుకు అవకాశం లేకపోవడం, పాత నోట్లను తీసుకొనేందుకు ఆటోమొబైల్ డీలర్లు నిరాకరిస్తుండడంతో వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో  గ్రేటర్  హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, ఉప్పల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, మెహదీపట్నం  ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు తగ్గుముఖం పట్టారుు. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు నవంబర్, డిసెంబర్ ఏడాది చివరి నెలలు కావడంతో ఆటోమొబైల్ రంగంలో స్తబ్ధత నెలకొంది. నోట్ల రద్దు ప్రభావమే ఎక్కువగా ఉందని, ఏడాది చివరి ప్రభావం డిసెంబర్‌లో మాత్రమే కనిపిస్తుందని  పలువురు ఆటోమొబైల్ డీలర్లు  పేర్కొంటున్నారు. మొత్తంగా  ఈ నెలలో నోట్ల  రద్దు  కారణంగా  సుమారు రూ.350 కోట్లకు పైగా  ఆటోమొబైల్ వ్యాపారం స్తంభించినట్లు  డీలర్లు  చెబుతున్నారు.

50 శాతం తగ్గిన అమ్మకాలు...
గ్రేటర్ హైదరాబాద్‌లో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తదితర రవాణా రంగానికి చెందిన వాహనాలను విక్రరుుంచే  ప్రధాన  ఆటోమొబైల్ డీలర్లు సుమారు 150 మంది ఉంటారు. సబ్‌డీలర్లు, షోరూమ్‌లు అన్నీ కలిపి  500 లకు పైగా వాహన విక్రయ కేంద్రాలు ఉన్నారుు.  ప్రతి  ఆర్టీఏ  పరిధిలో  రోజుకు 150 నుంచి  250 వరకు  కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఖైరతాబాద్  ఆర్టీఏలో సగటున 250 నుంచి 300 వాహనాలు నమోదవుతుండగా నగర శివార్లలోని  ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి  ఆర్టీఏల్లో సగటున  150 నుంచి  170 వరకు కొత్త వాహనాలు నమోదవుతున్నారుు. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో  మొత్తంగా   ప్రతి రోజు  1500 నుంచి  2000 వరకు కొత్త వాహనాలు  రిజిస్ట్రేషన్ అవుతారుు. ఆటోమొబైల్  డీలర్లు, రవాణా అధికారుల  అంచనాల  మేరకు  ప్రతి నెలా  సుమారు 25000 ద్విచక్ర వాహనాలు, 70ఁఊ00 వరకు కార్ల విక్రయాలు జరుగుతారుు. కానీ ఈ నెలలో  ఇప్పటి వరకు  కేవలం 6 వేల ద్విచక్ర వాహనాలు, మరో  1500 కార్లు మాత్రమే విక్రరుుంచినట్లు  ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన ఏకంగా  407 వాహనాలు నమోదు కాగా,  ఈ నెల  15వ తేదీన 209 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. సికింద్రాబాద్ ఆర్టీఓలో ఈ నెల 10వ తేదీన  కేవలం 75 వాహనాలు నమోదయ్యారుు. బహదూర్‌పురా ఆర్టీఏలో ఈ నెల 11న 47 వాహనాలు మాత్రమే  రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. అలాగే నగర శివార్లలోని  మేడ్చల్ ఆర్టీఏలో ఈ నెల  6న 354  వాహనాలు నమోదు కాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం 11వ తేదీన 145 వాహనాలు మాత్రమే  నమోదయ్యారుు.

నగదు చెల్లింపులకు అవకాశం లేకపోవడమే..
కార్లు, ఇతర  మోటారు వాహనాల కంటే  ద్విచక్ర వాహనాల అమ్మకాలే  ఎక్కువగా ఉంటారుు. 80 శాతం వినియోగదారులు బ్యాంకు రుణాలపైనే వాహనాలను కొనుగోలు చేస్తారు. రూ.10 వేల నుంచి  రూ.20 వేల వరకు నగదు  రూపంలో డౌన్‌పేమెంట్  చెల్లించి మిగతా  మొత్తానికి  బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. కానీ  పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకు లావాదేవీల్లో  స్తబ్దత నెలకొనడం, పాతనోట్లు చెల్లకపోవడం, పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లభించకపోవడంతో వాహనాల కొనుగోళ్లు మందగించారుు. అలాగే కార్ల కొనుగోళ్లపైన కూడా ఇదేవిధమైన  ప్రభావం కనిపిస్తుంది.

పాతనోట్లతో పన్ను చెల్లింపులతో ఊరట...
ఇలా ఉండగా, ఈ  నెల 24వ తేదీ వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో జీవితకాల పన్నులు, త్రైమాసిక పన్నులు చెల్లించేందుకు రవాణాశాఖ అవకాశం కల్పించడంతో కొంత మేరకు ఊరట లభించిందని డీలర్లు  అభిప్రాయపడుతున్నారు. వాహనదారులు ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ  పన్నులు చెల్లించవచ్చు. అలాగే  షోరూమ్‌ల నుంచి కూడా జీవితకాల పన్ను చెల్లింపునకు  అనుమతి లభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement