న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వారుుదా పడిన ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్‌ను జనవరి 2 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)తో కలిసి ప్రొ స్పోర్టిఫై సంస్థ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 15 నుంచి ఈ సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత పరిస్థితుల దృష్ట్యా ఫ్రాంచైజీ యజమానులు వారుుదా వేయాలని కోరారు.
ఢిల్లీ, ముంబై, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, జైపూర్‌లకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు ఇందులో తలపడనున్నారుు. సుమారు 12 మందికి పైగా ఒలింపిక్ విజేతలు ఇందులో పాల్గొంటారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత్ నుంచి యోగేశ్వర్ దత్, సాక్షిమలిక్, సందీప్ తోమర్ బరిలోకి దిగుతున్నారు.