Pro-wrestling league
-
సందీప్ తోమర్ సంచలనం
ఒలింపిక్ చాంపియన్‌పై గెలుపు హరియాణాకు అగ్రస్థానం న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో హరియాణా హ్యామర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రెజ్లర్ సందీప్ తోమర్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియో ఒలింపిక్స్ చాంపియన్ వ్లాదిమిర్ ఖించెగష్విలికి (పంజాబ్ రాయల్స్) షాకిచ్చాడు. దీంతో హరియాణా హ్యామర్స్ 5–2తో పంజాబ్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించి 10 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జైపూర్ నింజాస్‌తో హరియాణా హ్యామర్స్... బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ముంబై మహారథితో పంజాబ్ రాయల్స్ తలపడతాయి. 57 కేజీ కేటగిరీలో తలపడిన సందీప్ (హరియాణా) 3–1తో వ్లాదిమిర్ (పంజాబ్)ను కంగుతినిపించాడు. 97 కేజీల విబాగంలో గడిసోవ్ (హరియాణా) 5–0తో కృషన్ కుమార్ (పంజాబ్)పై, ఇందు చౌదరి (హరియాణా, 48 కేజీలు) 2–1తో నిర్మలాదేవి (పంజాబ్)పై గెలుపొందారు. బెబెలకోవ్ (పంజాబ్, 65 కేజీలు) 11–1తో రజనీశ్ (హరియాణా)పై, కుర్బానలీవ్ (హరియాణా, 70 కేజీలు) 16–0తో పంకజ్ రాణా (పంజాబ్)పై, మర్వా అమ్రి (హరియాణా, 58 కేజీలు) 16–0తో మంజు కుమారి (పంజాబ్)పై, ఒడునయో (పంజాబ్, 53 కేజీలు) 6–1తో సోఫియా మట్సన్ (హరియాణా)పై విజయం సాధించారు. -
సాక్షి గెలిచినా
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో సాక్షి మలిక్ సారథ్యంలోని కలర్స్ ఢిల్లీ సుల్తాన్స్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 3–4 తేడాతో జైపూర్ నింజాస్ చేతిలో పరాజయం పాలైంది. జైపూర్ జట్టుకు ఈ సీజన్లో ఇది వరుసగా రెండో విజయం. టాస్ గెలిచిన జైపూర్ నింజాస్ 65 కేజీల పురుషుల విభాగాన్ని... ఢిల్లీ 53 కేజీల మహిళల విభాగాన్ని బ్లాక్ చేశాయి. నింజాస్ జట్టులో ఎలిజ్బర్ (97 కేజీలు) 8–0తో సత్యవర్త్ కడియన్‌పై, జాకబ్ మకరష్విలి (74 కేజీలు) 10–7తో ప్రవీణ్ రాణాపై, జెన్నీ ఫ్రాన్సన్ (75 కేజీలు) 5–0తో అలీనాపై, వినోద్ కుమార్ (70 కేజీలు) 2–0తో డేవిడ్‌పై విజయం సాధించారు. ఢిల్లీ తరఫున మరియా స్టడ్నక్ (48 కేజీలు) 16–0తో రీతూ ఫోగట్‌పై, సాక్షి మలిక్ (58 కేజీలు) 16–0తో పూజ ధండపై, ఎర్డెన్బాట్ బెక్యార్ (57 కేజీలు) 2–1తో ఉత్కర్‡్ష కాలేపై గెలిచారు. శనివారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథితో యూపీ దంగల్ తలపడుతుంది. -
వచ్చే నెల 2 నుంచి ప్రొ రెజ్లింగ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వారుుదా పడిన ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్‌ను జనవరి 2 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో కలిసి ప్రొ స్పోర్టిఫై సంస్థ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 15 నుంచి ఈ సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత పరిస్థితుల దృష్ట్యా ఫ్రాంచైజీ యజమానులు వారుుదా వేయాలని కోరారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, జైపూర్‌లకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు ఇందులో తలపడనున్నారుు. సుమారు 12 మందికి పైగా ఒలింపిక్ విజేతలు ఇందులో పాల్గొంటారని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత్ నుంచి యోగేశ్వర్ దత్, సాక్షిమలిక్, సందీప్ తోమర్ బరిలోకి దిగుతున్నారు. -
ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో విదేశీ స్టార్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్) రెండో సీజన్లో ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ రెండో సీజన్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాంప్ వాక్‌లో సాక్షి మలిక్, యోగేశ్వర్ దత్, గీతా ఫోగట్, బబితా కుమారి, సోఫియా మాట్సన్ (స్వీడన్), మరియా స్టాడ్నిక్ (అజర్బైజాన్) డిజైనర్ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ‘గతేడాది ప్రారంభ సీజన్లోనూ టాప్ రెజ్లర్లకు ఆహ్వానం పలికినప్పటికీ ఒలింపిక్‌కు సన్నద్ధమయ్యేందుకు చాలా మంది రాలేదు. ఈసారి అన్నిదేశాలకు ఆహ్వానం పంపించాం. ముఖ్యంగా ఇరాన్ రెజ్లర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత యువ ఆటగాళ్లకు ఈ లీగ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని సాక్షి మలిక్ అభిప్రాయపడింది. ఈనెల 15 లేక 16న పీడబ్ల్యుఎల్ ఆటగాళ్ల వేలం ఉంటుంది. -
వాళ్లు ఎప్పుడైనా ‘రెజ్లింగ్’ చూశారా!
ఫ్రాంచైజీలపై సుశీల్ ఆగ్రహం ప్రొ లీగ్ నుంచి తప్పుకోవడంపై వివరణ న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) నుంచి చివరి నిమిషంలో తాను తప్పుకోవడంపై స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ నోరు విప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే తాను ఈ లీగ్‌లో ఆడలేదని, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి సూచన మేరకు లీగ్‌లో పాల్గొనలేదని అతను స్పష్టం చేశాడు. ‘మా కోచ్ సత్పాల్సింగ్, సమా ఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌తో మాట్లాడిన తర్వాత మ్యాచ్ ఫిట్ గా మారేందుకు జార్జియాలో 21 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను. అయితే తిరిగొచ్చిన తర్వాత నేను 100 శాతం ఫిట్‌గా లేనని అనిపించింది. నేను లీగ్‌లో పాల్గొనడంకంటే రియో ఒలింపిక్స్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉండటం ముఖ్యమని భావించారు. అం దుకే ఆడలేదు’ అని సుశీల్ కుమార్ స్పష్టం చేశాడు. నా గురించి మాట్లాడే స్థాయి లేదు... రెజ్లర్‌గా తన ప్రాధాన్యాలు మారాయని, ఇతర ఒప్పందాలతో బిజీగా ఉండటం వల్లే పాల్గొనలేదని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలు రష్మి సులేజా, నిర్వాహకులు ప్రొ స్పోర్టిఫై, ఫ్రాంచైజీ యజమానులు చేసిన విమర్శలపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నర్సింగ్ యాదవ్‌తో పోటీ పడలేకే తప్పుకున్నాడని మరొకరు చేసిన వ్యాఖ్యను కూడా సుశీల్ తిప్పి కొట్టాడు. ‘ఫ్రాంచైజీ యజమానులు నన్ను కలిసిన వారం రోజుల్లోపే నా గురించి తెలుసుకునేంత తెలివైనవారా. అసలు వారికి రెజ్లింగ్ గురించి ఏమైనా తెలుసా. ఒక్కసారైనా కనీసం మ్యాచ్ చూశారా. 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత నా జీవితంలో అన్నీ పొందాను. అసలు నా స్థాయి గురించి వారికేమీ తెలీదు. నర్సింగ్‌తో గతంలో చాలా సార్లు తలపడి గెలిచాను. ఒక రెజ్లర్ ప్రత్యర్థి గురించి భయపడటం మొదలు పెడితే అతను ఒలింపిక్స్‌లో పాల్గొనడం గురించి మర్చిపోవాలి. నర్సింగ్ స్థానం కోల్పోరాదనే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ఆడలేదు. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరికో ఒకరికే రియోకు అవకాశం లభిస్తుందనుకుంటే పోరాడి సాధిస్తా’ అని గట్టిగా బదులిచ్చిన సుశీల్ కుమార్... వచ్చే ఏడాది కూడా ఈ లీగ్ ఉంటే అప్పుడు పాల్గొనడంపై ఆలోచిస్తానని చెప్పాడు -
చాంప్ ముంబై గరుడ
♦ ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌పై 7-2తో విజయం ♦ ముగిసిన ప్రొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ఆద్యంతం అజేయంగా నిలిచిన ముంబై గరుడ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై గరుడ 7-2 బౌట్ల తేడాతో హరియాణా హ్యామర్స్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై గరుడ... సెమీఫైనల్లో, ఫైనల్లో అదే జోరును కనబరిచింది. మహిళల విభాగంలో ఒడునాయో అడుకురోయె (ముంబై గరుడ), వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్)... పురుషుల విభాగంలో నర్సింగ్ పంచమ్ యాదవ్ (బెంగళూరు యోధాస్) ‘ఉత్తమ రెజ్లర్’ పురస్కారాలు గెలుచుకున్నారు. ఫైనల్‌కు వేదికగా నిలిచిన స్థానిక కె.డి. జాదవ్ స్టేడియం హౌస్‌ఫుల్ అయ్యింది. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. సెమీఫైనల్ వరకు ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహించగా... ఫైనల్‌ను ‘బెస్ట్ ఆఫ్ నైన్’గా నిర్వహించారు. పురుషుల 65 కేజీల బౌట్లో అమిత్ ధన్కర్ (ముంబై గరుడ) మూడు నిమిషాల ఆరు సెకన్ల వ్యవధిలో 12-0తో విశాల్ రాణా (హరియాణా)పై టెక్నికల్ సుపీరియారిటీ (10 పాయింట్ల తేడా ఉండటం) పద్ధతిలో నెగ్గి ముంబైకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల 58 కేజీల బౌట్లో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్హెల్ (హరియాణా) రెండు నిమిషాల రెండు సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో సాక్షి మాలిక్ (ముంబై)ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల 74 కేజీల బౌట్లో లివాన్ లోపెజ్ (హరియాణా) 11-6తో ప్రదీప్ (ముంబై)పై నెగ్గడంతో హరియాణా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ముంబై గరుడ రెజ్లర్లు అద్భుత పోరాటం కనబరిచి తర్వాతి ఐదు బౌట్లలో విజయం సాధించి విజేతగా నిలిచారు. మహిళల 69 కేజీల బౌట్లో అడెలైన్ గ్రే (ముంబై) 10-0తో గీతిక (హరియాణా)పై... పురుషుల 125 కేజీల బౌట్లో గియోర్గి (ముంబై) ఒక నిమిషం 43 సెకన్లలో 10-0తో హితేందర్ (హరియాణా)పై... మహిళల 53 కేజీల బౌట్లో ఒడునాయో (ముంబై) 9-0తో తాతియానా కిట్ (హరియాణా)పై.. పురుషుల 97 కేజీల బౌట్లో ఎలిజ్బార్ (ముంబై) 6-4తో వలెరీ (హరియాణా)పై... మహిళల 48 కేజీల బౌట్లో నిర్మలా దేవి (హరియాణా)పై రీతూ ఫోగట్ (ముంబై)... పురుషుల 57 కేజీల బౌట్లో రాహుల్ అవారె (ముంబై) 6-3తో నితిన్ (హరియాణా)పై గెలిచారు. -
ఎదురులేని ముంబై
న్యూఢిల్లీ: పటిష్టమైన ముంబై గరుడా జట్టు... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో తొలి దశ మ్యాచ్‌లను విజయంతో ముగించింది. గురువారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 4-3తో హరియాణా హామర్స్పై నెగ్గింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 57 కేజీల్లో రాహుల్ (ముంబై) 7-2తో నితిన్ (హరియాణా)పై; 69 కేజీల్లో అడెలైన్(ముంబై) 7-1తో గీతికా (హరియాణా)పై; 125 కేజీల్లో జార్జి స్కాండెలిడ్జ్ (ముంబై) 10-0తో హితేందర్ (హరియాణా)పై; 48 కేజీల్లో రితూ పోగట్ (ముంబై) 5-4తో నిర్మలా దేవి (హరియాణా)పై గెలిచారు. ఇక 58 కేజీల్లో ఒక్సానా (హరియాణా) 4-2తో సాక్షి మాలిక్‌పై; 74 కేజీలోలోపెజ్ (హరియాణా) 11-0తో ప్రదీప్ (ముంబై)పై; 97 కేజీల్లో వాలెరి 2-1తో ఎల్జిబర్ (ముంబై)పై నెగ్గారు. -
ఢిల్లీ వీర్‌కు ఊరట
బెంగళూరు: ఆలస్యంగానైనా తేరుకున్న ఢిల్లీ వీర్ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ఎట్టకేలకు ఓ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. బెంగళూరు యోధాస్‌తో బుధవారం జరిగిన తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ వీర్ 4-3తో గెలిచి ఊరట చెందింది. నిర్ణాయక ఏడో బౌట్లో నవ్రుజోవ్ ఇఖ్తియార్ (ఢిల్లీ వీర్) 10-1 పాయింట్ల తేడాతో బజరంగ్ పూనియా (బెంగళూరు)ను ఓడించి తమ జట్టుకు ఏకైక విజయం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అంతకుముందు పురుషుల 57 కేజీల విభాగంలో బెఖ్‌బాయెర్ (ఢిల్లీ వీర్) 7-0తో సందీప్ తోమర్‌పై, 125 కేజీల విభాగంలో దావిత్ (బెంగళూరు) 10-0తో కృషన్‌పై, 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ (బెంగళూరు) 8-4తో దినేశ్ కుమార్‌పై గెలిచారు. మహిళల 53 కేజీల బౌట్లో లిలియా హోరిష్నా (ఢిల్లీ వీర్) 11-6తో లలితా షెరావత్‌పై, 58 కేజీల బౌట్లో యులియా (బెంగళూరు) 3-1తో ఎలిఫ్ జాలెపై, 48 కేజీల బౌట్లో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్) 10-0తో అలీసా లాంపెపై విజయం సాధించారు. ఆరు జట్ల మధ్య జరుగుతోన్న ఈ లీగ్‌లో ఇప్పటికే పంజాబ్ రాయల్స్, హరియాణా హ్యామర్స్, ముంబై గరుడ, బెంగళూరు యోధాస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగే చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ముంబై గరుడతో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది. 25, 26 తేదీల్లో సెమీస్ జరుగుతాయి. -
సెమీస్‌లో ముంబై
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో అజేయంగా దూసుకెళుతున్న ముంబై గరుడ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా సోమవారం ఢిల్లీ వీర్ జట్టుతో జరిగిన బౌట్లో 5-2 తేడాతో ముంబై నెగ్గింది. దీంతో సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముంబైకి ఓటమి లేకుండా పోయింది. అటు ఢిల్లీ ప్రతీ మ్యాచ్ ఓడి సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. తొలి మూడు బౌట్స్ అనంతరం ఢిల్లీ 2-1తో ఆధిక్యంలో ఉన్నా ఆ తర్వాత ముంబై వరుస విజయాలతో అదరగొట్టింది. ప్రారంభ మ్యాచ్‌లో ఒడికడ్జే (97 కేజీలు) 5-0తో గురుపాల్ సింగ్‌పై నెగ్గి ముంబైకి శుభారంభాన్నిచ్చాడు. మహిళల 48 కేజీలో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ) 8-0తో రితూ ఫోగట్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేసింది. పురుషుల 74 కేజీలో దినేశ్ కుమార్ (ఢిల్లీ) 5-3తో ప్రదీప్‌ను ఓడించి 2-1 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక ఇక్కడి నుంచి ముంబై పుంజుకుని ఒడునాయో (53 కేజీలు) 10-0తో లిలినాయోను, గియోర్గి (125 కేజీలు) 10-0తో క్రిషన్ కుమార్‌ను, అడెలిన్ గ్రే (69 కేజీలు) 10-0తో నిక్కీని, ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన ఇక్తియోర్ (65 కేజీలు)ను 9-7తో అమిత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై విజయం ఖాయమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హరియాణా హ్యామర్స్‌తో పంజాబ్ రాయల్స్ తలపడుతుంది. -
యోగేశ్వర్ ‘పట్టు’ అదిరింది
నోయిడా: నిర్ణయాత్మక బౌట్లో ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ తన ‘పట్టు’ పవర్‌ను చూపెట్టడంతో... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో హరియాణా హ్యామర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 4-3తో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. రెండు జట్లు మూడేసి బౌట్లలో విజయం సాధించడంతో స్కోరు 3-3తో సమానమైంది. ఈ దశలో నిర్ణాయక బౌట్లో హరియాణా ఐకాన్ ప్లేయర్ యోగేశ్వర్ దత్ పురుషుల 65 కేజీల బౌట్లో సంచలన ఆటతీరును చూపెట్టాడు. 9-4తో వికాస్ కుమార్ (యూపీ)ని ఓడించాడు. అద్భుతమైన టెక్నిక్‌తో ఫైనల్ విజిల్ రాకముందే ప్రత్యర్థిని చిత్తు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు పురుషుల 74 కేజీల బౌట్లో లివెన్ లోపెజ్ అజుకి (హరియాణా), 57 కేజీల బౌట్లో నితిన్ (హరియాణా), 125 కేజీల బౌట్లో హితేందర్ (హరియాణా) విజయం సాధించారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు యోధా స్తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడుతుంది. -
పంజాబ్‌ను గెలిపించిన ప్రవీణ్ రాణా
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పంజాబ్ రాయల్స్ జట్టు రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వీర్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 4-3తో గెలుపొందింది. ఇరు జట్లూ మూడేసి బౌట్లు నెగ్గి సమఉజ్జీగా ఉన్నదశలో నిర్ణాయక ఏడో బౌట్లో భారత రెజ్లర్ ప్రవీణ్ రాణా (74 కేజీలు) నెగ్గి పంజాబ్ రాయల్స్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. భారత్‌కే చెందిన దినేశ్ కుమార్‌తో జరిగిన ఈ నిర్ణాయక బౌట్లో ప్రవీణ్ రాణా 6-2 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఓవరాల్‌గా ఢిల్లీ వీర్ జట్టుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. శనివారం జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది. అంతకుముందు పురుషుల 57 కేజీల బౌట్లో వ్లాదిమిర్ ఖిన్చెగాష్విలి (పంజాబ్ రాయల్స్) 4-3తో ఎర్డెనెబ్యాట్ బెఖ్బాయెర్పై, 65 కేజీల బౌట్లో నవ్రుజోవ్ ఇఖ్తియార్ (ఢిల్లీ వీర్) 10-0తో రజనీశ్పై, 125 కేజీల బౌట్లో జర్గల్సాయిఖాన్ చులున్బ్యాట్ (పంజాబ్ రాయల్స్) 4-0తో కృషన్ కుమార్‌పై గెలిచారు. మహిళల 69 కేజీల బౌట్లో వాసిలిసా మర్జాలియుక్ (పంజాబ్ రాయల్స్) 10-0తో నిక్కీపై, 58 కేజీల బౌట్లో ఎలిఫ్ జాలె (ఢిల్లీ వీర్) 4-1తో గీతా ఫోగట్‌పై, 48 కేజీల బౌట్లో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్) 15-6తో యానా రటిగన్పై విజయం సాధించారు. -
యూపీ వారియర్స్‌కు తొలి గెలుపు
లూథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వీర్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 4-3తో గెలిచింది. బెంగళూరు యోధాస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 1-6తో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి విజయాన్ని దక్కించుకుంది. పురుషుల 57 కేజీల బౌట్లో జైదీప్ (వారియర్స్) 3-6తో బెఖ్బాయర్ చేతిలో; 125 కేజీల బౌట్లో జోగిందర్ కుమార్ (వారియర్స్) 8-8తో కృషన్ చేతిలో; మహిళల 48 కేజీల బౌట్లో కొగుట్ ఒలెక్సాండ్రా (వారియర్స్) 0-11తో వినేశ్ ఫోగట్ చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలోని 97 కేజీల బౌట్లో సత్యవ్రత్ కడియాన్ (వారియర్స్) 4-1తో గుర్పాల్ సింగ్‌పై, 74 కేజీల బౌట్లో ఉనుర్బట్ (వారియర్స్) 5-0తో దినేశ్ కుమార్‌పై, మహిళల 53 కేజీల బౌట్లో బబిత కుమారి (వారియర్స్) 13-12తో హరిష్నాపై, 58 కేజీల బౌట్లో సరిత (వారియర్స్) 1-0తో ఎలిఫ్ జాలెపై నెగ్గి యూపీ వారియర్స్‌కు 4-3తో విజయా న్ని అందించారు. ఈ లీగ్‌లో ఢిల్లీ వీర్ జట్టుకిది వరుసగా రెండో పరాజయం. బుధవారం జరిగే మ్యాచ్ లో బెంగళూరుతో హరియాణా తలపడుతుంది. -
ముంబై గరుడకు రెండో విజయం
లుధియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ముంబై గరుడ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు యోధాస్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై గరుడ 5-2 బౌట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు యోధాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ రెజ్లర్లు నర్సింగ్ యాదవ్, బజరంగ్ తమ బౌట్లలో గెలిచినా... మిగతా రెజ్లర్లు ఓటమి పాలవ్వడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది. పురుషుల 57 కేజీల బౌట్లో సందీప్ తోమర్ (బెంగళూరు) 0-5తో రాహుల్ అవారే చేతిలో... 125 కేజీల బౌట్లో దావిత్ (బెంగళూరు) 1-4తో లెవాన్ చేతిలో ఓడిపోగా... 61 కేజీల బౌట్లో బజరంగ్ (బెంగళూరు) 6-2తో అమిత్ ధన్కర్పై, 74 కేజీల బౌట్లో నర్సింగ్ యాదవ్ (బెంగళూరు) 6-0తో ప్రదీప్‌పై గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో రీతూ (ముంబై), 53 కేజీల విభాగంలో అడెకురోవ్ (ముంబై), 69 కేజీల విభాగంలో అడెలైన్ గ్రే (ముంబై) తమ ప్రత్యర్థులపై నెగ్గారు. -
పంజాబ్ పట్టు అదుర్స్
యూపీపై 6-1తో విజయం లూథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో పంజాబ్ రాయల్స్ పట్టు ముందు యూపీ వారియర్స్ తేలిపోయింది. ఆదివారం జరిగిన ఈ పోరులో పంజాబ్ 6-1తో ఘనవిజయాన్ని అందుకుంది. పురుషుల 65 కేజీ విభాగంలో రజనీశ్ 8-5తో గంజోరిగ్పై నెగ్గి పంజాబ్‌కు శుభారంభాన్నిచ్చాడు. 97 కేజీ విభాగంలో మౌసమ్ ఖత్రి 5-0తో సత్యవ్రత్ కడియాన్పై గెలిచాడు. మహిళల 53 కేజీ విభాగంలో బబితా కుమారి 6-4తో ప్రియాంక ఫోగట్‌ను ఓడించి యూపీ వారియర్స్‌కు ఏకైక విజయాన్ని అందించింది. ఆ తర్వాత ప్రవీణ్ రాణా (74 కేజీలు) 4-4తో పూరెవ్జావ్ను... గీతా ఫోగట్ (58 కేజీలు) 3-2తో సరితాను.. వసీలిసా (69 కేజీలు) 2-1తో అలీనాను.. జర్గల్ సైఖాన్ (125 కేజీలు) 10-0తో జోగిందర్ కుమార్‌ను చిత్తుగా ఓడించి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. సోమవారం జరిగే మ్యాచ్ లో ముంబై గరుడ జట్టుతో బెంగళూరు యోధాస్ జట్టు తలపడుతుంది. -
బెంగళూరు శుభారంభం
యూపీ వారియర్స్‌పై గెలుపు {పొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో బెంగళూరు యోధ శుభారంభం చేసింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్‌తో జరిగిన పోరును పూర్తి ఏకపక్షంగా మారుస్తూ 6-1తో విజయం సాధించింది. స్టార్ రెజ్లర్ సందీప్ తోమర్ పురుషుల 57 కేజీ విభాగంలో 4-2తో రటుష్ణియ్ను ఓడించి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత 65 కేజీ విభాగంలో బజరంగ్ పూనియా 10-2తో రాహుల్ మాన్‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మహిళల 48 కేజీలో అలిసా లాంపే 5-4తో కోగుట్ ఒలెగ్జాండ్రాను.. పురుషుల 97 కేజీలో ఒలినిక్ 2-1 సత్యవర్త్‌ను.. మహిళల 58 కేజీలో రట్కేవిచ్ 4-1తో రీతూ మాలిక్‌ను ఓడించి 5-0తో ఆధిక్యాన్ని అందించారు. అయితే మహిళల 53 కేజీలో బబిత 8-2తో లలితా షెరావత్‌ను ఓడించి యూపీ వారియర్స్‌కు ఏకైక విజయాన్ని అందించింది. ఇక చివరి బౌట్ 74 కేజీ విభాగంలో నర్సింగ్ యాదవ్ 9-1తో ఉనుర్బట్ను చిత్తుచేసి బెంగళూరుకు ఘనవిజయాన్ని అందించాడు. -
‘పట్టు’ పట్టండి...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ బరిలో స్టార్ రెజ్లర్లు న్యూఢిల్లీ: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమైంది. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ లీగ్‌ల సరసన తాజాగా రెజ్లింగ్ లీగ్ చేరింది. భారత్‌తోపాటు పలువురు విదేశీ స్టార్ రెజ్లర్లు బరిలో దిగుతుండగా... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు గురువారం తెర లేవనుంది. ఈనెల 27న ముగిసే ఈ లీగ్‌లో విజేత జట్టుకు రూ. 3 కోట్లు అందజేస్తారు. తొలి రోజున ఢిల్లీ వీర్‌తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లతోపాటు హరియాణా హ్యామర్స్, ఉత్తరప్రదేశ్ వారియర్స్, బెంగళూరు యోధాస్, ముంబై గరుడ జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. భారత స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ దహియా హరియాణా జట్టులో, సుశీల్ కుమార్ ఉత్తరప్రదేశ్ జట్టులో, నర్సింగ్ యాదవ్, బజరంగ్ బెంగళూరు జట్టులో ఉన్నారు. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రతి జట్టులో ఐదుగురు పురుష రెజ్లర్లు, నలుగురు మహిళా రెజ్లర్లు ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో తొమ్మిది బౌట్లు ఉంటాయి. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ వీర్ ్ఠ పంజాబ్ రాయల్స్ నేటి రాత్రి గం. 7.00 నుంచి సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
ప్రొ రెజ్లింగ్ లీగ్ జట్ల ప్రకటన
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి నిర్వహించనున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పాల్గొంటున్న ఆరు ఫ్రాంచైజీల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. ఢిల్లీ వీర్ (జీఎంఆర్ గ్రూప్), బెంగళూరు యోధ (జేఎస్‌డబ్ల్యూ గ్రూప్), సీడీఆర్ పంజాబ్ రాయల్స్ (సీడీఆర్ గ్రూప్, నటుడు ధర్మేంద్ర), యూపీ వారియర్స్ (లోటస్ గ్రీన్), హరియాణా హ్యామర్స్ (ఓలివ్ గ్లోబల్), ముంబైచీ గరుడే (మావెరిక్ ఇండస్ట్రీస్, మఫత్‌లాల్, గరడాచార్య)ల తరఫున ప్రపంచ స్థాయి రెజ్లర్లు బరిలోకి దిగనున్నారని లీగ్ నిర్వాహకులు ప్రోస్పోర్టిఫై తెలిపింది. ఈ టోర్నీ డిసెంబర్ 10 నుంచి జరుగుతుంది. -
యోగేశ్వర్‌కు రూ. 39.7 లక్షలు
సుశీల్‌కు రూ.38.2 లక్షలు హెర్‌హెల్‌కు అత్యధిక మొత్తం ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి జరగనున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో భారత రెజ్లర్లలో యోగేశ్వర్ దత్‌కు అత్యధిక ధర పలికింది. మంగళవారం జరిగిన వేలంపాటలో హర్యానా ఫ్రాంచైజీ రూ. 39 లక్షల 70 వేలు వెచ్చించి యోగేశ్వర్ దత్ (65 కేజీలు)ను కొనుగోలు చేసింది. 33 ఏళ్ల యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతోపాటు గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (74 కేజీలు)ను ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీ రూ. 38 లక్షల 20 వేలకు సొంతం చేసుకుంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన నర్సింగ్ యాదవ్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 34 లక్షల 50 వేలకు కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన మహిళా రెజ్లర్ ఒక్సానా హెర్హెల్ (60 కేజీలు)కు అందరికంటే ఎక్కువ మొత్తం లభించింది. ఆమెను హర్యానా ఫ్రాంచైజీ రూ. 41 లక్షల 30 వేలకు కైవసం చేసుకుంది. బెలారస్‌కు చెందిన మరో మహిళా రెజ్లర్ వాసిలిసా (69 కేజీలు)ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 40 లక్షల 20 వేలకు కొనుగోలు చేసింది. గీతా ఫోగట్‌ను ఢిల్లీ జట్టు రూ. 33 లక్షలకు ... బబితాను ఉత్తరప్రదేశ్ రూ. 34 లక్షల 10 వేలకు కొనుగోలు చేశాయి. మొత్తం ఆరు ఫ్రాంచైజీల (ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ముంబై, బెంగళూరు) మధ్య డిసెంబరు 10 నుంచి 27 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరుగుతుంది. -
ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం 3న
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌కు సంబంధించి రెజ్లర్ల వేలం కార్యక్రమం నవంబర్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. 25 దేశాల నుంచి 100 మంది అగ్రశ్రేణి అంతర్జాతీయ రెజ్లర్లతోపాటు భారత్ నుంచి మరో 100 మంది రెజ్లర్లు ఈ వేలంపాటలో పాల్గొంటారు. నవంబరు 8 నుంచి 29 వరకు దేశంలోని ఆరు పట్టణాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. ఒలింపిక్, ప్రపంచ చాంపియన్లకు కనీస ధరగా 50 వేల డాలర్లను నిర్ణయించారు. రెజ్లర్లను కొనుగోలు చేసేందుకు ప్రతి జట్టుకు రూ. 2 కోట్లు కేటాయించారు.