ఎదురులేని ముంబై | Mumbai Garuda on a roll with 4-3 win over Haryana Hammers | Sakshi
Sakshi News home page

ఎదురులేని ముంబై

Published Fri, Dec 25 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

Mumbai Garuda on a roll with 4-3 win over Haryana Hammers

న్యూఢిల్లీ: పటిష్టమైన ముంబై గరుడా జట్టు...  ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో తొలి దశ మ్యాచ్‌లను విజయంతో ముగించింది. గురువారం  ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 4-3తో హరియాణా హామర్స్‌పై నెగ్గింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో  అగ్రస్థానంలో నిలిచింది. 57 కేజీల్లో రాహుల్ (ముంబై) 7-2తో నితిన్ (హరియాణా)పై; 69 కేజీల్లో అడెలైన్(ముంబై) 7-1తో గీతికా  (హరియాణా)పై; 125 కేజీల్లో జార్జి స్కాండెలిడ్జ్ (ముంబై) 10-0తో హితేందర్ (హరియాణా)పై; 48 కేజీల్లో రితూ పోగట్ (ముంబై) 5-4తో నిర్మలా దేవి (హరియాణా)పై గెలిచారు. ఇక 58 కేజీల్లో ఒక్సానా (హరియాణా) 4-2తో సాక్షి మాలిక్‌పై; 74 కేజీలోలోపెజ్ (హరియాణా) 11-0తో ప్రదీప్ (ముంబై)పై; 97 కేజీల్లో వాలెరి 2-1తో ఎల్జిబర్ (ముంబై)పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement