సందీప్‌ తోమర్‌ సంచలనం | Sandeep Tomar sensation | Sakshi
Sakshi News home page

సందీప్‌ తోమర్‌ సంచలనం

Published Mon, Jan 16 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

సందీప్‌ తోమర్‌ సంచలనం

సందీప్‌ తోమర్‌ సంచలనం

ఒలింపిక్‌ చాంపియన్‌పై గెలుపు
హరియాణాకు అగ్రస్థానం  


న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌)లో హరియాణా హ్యామర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రెజ్లర్‌ సందీప్‌ తోమర్‌ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ వ్లాదిమిర్‌ ఖించెగష్విలికి (పంజాబ్‌ రాయల్స్‌) షాకిచ్చాడు. దీంతో హరియాణా హ్యామర్స్‌ 5–2తో పంజాబ్‌ రాయల్స్‌పై ఘనవిజయం సాధించి 10 పాయింట్లతో లీగ్‌ దశలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జైపూర్‌ నింజాస్‌తో హరియాణా హ్యామర్స్‌... బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ముంబై మహారథితో పంజాబ్‌ రాయల్స్‌ తలపడతాయి.

57 కేజీ కేటగిరీలో తలపడిన సందీప్‌ (హరియాణా) 3–1తో వ్లాదిమిర్‌ (పంజాబ్‌)ను కంగుతినిపించాడు.  97 కేజీల విబాగంలో గడిసోవ్‌ (హరియాణా) 5–0తో కృషన్‌ కుమార్‌ (పంజాబ్‌)పై, ఇందు చౌదరి (హరియాణా, 48 కేజీలు) 2–1తో నిర్మలాదేవి (పంజాబ్‌)పై గెలుపొందారు. బెబెలకోవ్‌ (పంజాబ్, 65 కేజీలు) 11–1తో రజనీశ్‌ (హరియాణా)పై, కుర్బానలీవ్‌ (హరియాణా, 70 కేజీలు) 16–0తో పంకజ్‌ రాణా (పంజాబ్‌)పై, మర్వా అమ్రి (హరియాణా, 58 కేజీలు) 16–0తో మంజు కుమారి (పంజాబ్‌)పై, ఒడునయో (పంజాబ్, 53 కేజీలు) 6–1తో సోఫియా మట్‌సన్‌ (హరియాణా)పై విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement