ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో విదేశీ స్టార్స్ | Foreign stars in the pro-wrestling league | Sakshi
Sakshi News home page

ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో విదేశీ స్టార్స్

Published Fri, Nov 4 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో విదేశీ స్టార్స్

ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో విదేశీ స్టార్స్

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్) రెండో సీజన్‌లో ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ రెండో సీజన్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాంప్ వాక్‌లో సాక్షి మలిక్, యోగేశ్వర్ దత్, గీతా ఫోగట్, బబితా కుమారి, సోఫియా మాట్సన్ (స్వీడన్), మరియా స్టాడ్నిక్ (అజర్‌బైజాన్) డిజైనర్ దుస్తులు ధరించి పాల్గొన్నారు.

‘గతేడాది ప్రారంభ సీజన్‌లోనూ టాప్ రెజ్లర్లకు ఆహ్వానం పలికినప్పటికీ ఒలింపిక్‌కు సన్నద్ధమయ్యేందుకు చాలా మంది రాలేదు. ఈసారి అన్నిదేశాలకు ఆహ్వానం పంపించాం. ముఖ్యంగా ఇరాన్ రెజ్లర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత యువ ఆటగాళ్లకు ఈ లీగ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని సాక్షి మలిక్ అభిప్రాయపడింది. ఈనెల 15 లేక 16న పీడబ్ల్యుఎల్ ఆటగాళ్ల వేలం ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement