యూపీపై 6-1తో విజయం
లూథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో పంజాబ్ రాయల్స్ పట్టు ముందు యూపీ వారియర్స్ తేలిపోయింది. ఆదివారం జరిగిన ఈ పోరులో పంజాబ్ 6-1తో ఘనవిజయాన్ని అందుకుంది. పురుషుల 65 కేజీ విభాగంలో రజనీశ్ 8-5తో గంజోరిగ్‌పై నెగ్గి పంజాబ్‌కు శుభారంభాన్నిచ్చాడు. 97 కేజీ విభాగంలో మౌసమ్ ఖత్రి 5-0తో సత్యవ్రత్ కడియాన్‌పై గెలిచాడు. మహిళల 53 కేజీ విభాగంలో బబితా కుమారి 6-4తో ప్రియాంక ఫోగట్‌ను ఓడించి యూపీ వారియర్స్‌కు ఏకైక విజయాన్ని అందించింది.
ఆ తర్వాత ప్రవీణ్ రాణా (74 కేజీలు) 4-4తో పూరెవ్‌జావ్‌ను... గీతా ఫోగట్ (58 కేజీలు) 3-2తో సరితాను.. వసీలిసా (69 కేజీలు) 2-1తో అలీనాను.. జర్గల్ సైఖాన్ (125 కేజీలు) 10-0తో జోగిందర్ కుమార్‌ను చిత్తుగా ఓడించి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. సోమవారం జరిగే మ్యాచ్ లో ముంబై గరుడ జట్టుతో బెంగళూరు యోధాస్ జట్టు తలపడుతుంది.
పంజాబ్ పట్టు అదుర్స్
Published Mon, Dec 14 2015 2:17 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
Advertisement
Advertisement