యూపీ వారియర్స్‌కు తొలి గెలుపు
లూథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వీర్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 4-3తో గెలిచింది. బెంగళూరు యోధాస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 1-6తో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి విజయాన్ని దక్కించుకుంది. పురుషుల 57 కేజీల బౌట్‌లో జైదీప్ (వారియర్స్) 3-6తో బెఖ్‌బాయర్ చేతిలో; 125 కేజీల బౌట్‌లో జోగిందర్ కుమార్ (వారియర్స్) 8-8తో కృషన్ చేతిలో; మహిళల 48 కేజీల బౌట్‌లో కొగుట్ ఒలెక్సాండ్రా (వారియర్స్) 0-11తో వినేశ్ ఫోగట్ చేతిలో ఓడిపోయారు.
పురుషుల విభాగంలోని 97 కేజీల బౌట్‌లో సత్యవ్రత్ కడియాన్ (వారియర్స్) 4-1తో గుర్‌పాల్ సింగ్‌పై, 74 కేజీల బౌట్‌లో ఉనుర్‌బట్ (వారియర్స్) 5-0తో దినేశ్ కుమార్‌పై, మహిళల 53 కేజీల బౌట్‌లో బబిత కుమారి (వారియర్స్) 13-12తో హరిష్నాపై, 58 కేజీల బౌట్‌లో సరిత (వారియర్స్) 1-0తో ఎలిఫ్ జాలెపై నెగ్గి యూపీ వారియర్స్‌కు 4-3తో విజయా న్ని అందించారు. ఈ లీగ్‌లో ఢిల్లీ వీర్ జట్టుకిది వరుసగా రెండో పరాజయం. బుధవారం జరిగే మ్యాచ్ లో బెంగళూరుతో హరియాణా తలపడుతుంది.