పంజాబ్‌ను గెలిపించిన ప్రవీణ్ రాణా | Punjab Royals prevail 4-3 over Dilli Veer in Pro Wrestling League | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ను గెలిపించిన ప్రవీణ్ రాణా

Published Sat, Dec 19 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

పంజాబ్‌ను గెలిపించిన ప్రవీణ్ రాణా

పంజాబ్‌ను గెలిపించిన ప్రవీణ్ రాణా

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పంజాబ్ రాయల్స్ జట్టు రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వీర్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 4-3తో గెలుపొందింది. ఇరు జట్లూ మూడేసి బౌట్‌లు నెగ్గి సమఉజ్జీగా ఉన్నదశలో నిర్ణాయక ఏడో బౌట్‌లో భారత రెజ్లర్ ప్రవీణ్ రాణా (74 కేజీలు) నెగ్గి పంజాబ్ రాయల్స్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. భారత్‌కే చెందిన దినేశ్ కుమార్‌తో జరిగిన ఈ నిర్ణాయక బౌట్‌లో ప్రవీణ్ రాణా 6-2 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఓవరాల్‌గా ఢిల్లీ వీర్ జట్టుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం.

శనివారం జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది. అంతకుముందు పురుషుల 57 కేజీల బౌట్‌లో వ్లాదిమిర్ ఖిన్‌చెగాష్‌విలి (పంజాబ్ రాయల్స్) 4-3తో ఎర్డెనెబ్యాట్ బెఖ్‌బాయెర్‌పై, 65 కేజీల బౌట్‌లో నవ్‌రుజోవ్ ఇఖ్తియార్ (ఢిల్లీ వీర్) 10-0తో రజనీశ్‌పై, 125 కేజీల బౌట్‌లో జర్‌గల్‌సాయిఖాన్ చులున్‌బ్యాట్ (పంజాబ్ రాయల్స్) 4-0తో కృషన్ కుమార్‌పై గెలిచారు.

మహిళల 69 కేజీల బౌట్‌లో వాసిలిసా మర్జాలియుక్ (పంజాబ్ రాయల్స్) 10-0తో నిక్కీపై, 58 కేజీల బౌట్‌లో ఎలిఫ్ జాలె (ఢిల్లీ వీర్) 4-1తో గీతా ఫోగట్‌పై, 48 కేజీల బౌట్‌లో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్) 15-6తో యానా రటిగన్‌పై విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement