ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌ | IRCTC free travel insurance for aviation travelers | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌

Jan 10 2019 1:00 AM | Updated on Jan 10 2019 11:14 AM

IRCTC free travel insurance for aviation travelers - Sakshi

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులు ఇకపై రూ. 50 లక్షల దాకా ప్రమాద బీమా సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. దేశ, విదేశీ ఫ్లయిట్స్‌లో ఏ తరగతికి చెందిన టికెట్లు బుక్‌ చేసుకున్న వారైనా దీన్ని పొందవచ్చని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం, మరణం సంభవించిన పక్షంలో ఈ బీమా కవరేజీ వర్తిస్తుందని పేర్కొంది. ఇన్సూరెన్స్‌ సేవల కోసం భారతి ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. పాలసీ ప్రీమియంను ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement