రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం | IRCTC ready to introduce insurance cover for mobiles, laptops | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం

Published Thu, Nov 3 2016 5:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం

రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు 92 పైసలకే ప్రమాద బీమా అందిస్తున్న ఐఆర్‌సీటీసీ ఇప్పుడు మరో బీమా పథకం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రైలు ప్రయాణికుల వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్స్‌కు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ అధికారులు, బీమా అధికారులకు మధ్య తొలి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తప్పుడు దావాలపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయని, తాము వారితో తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నామని ఐఆర్‌సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా గురువారమిక్కడ తెలిపారు. తొలి దశలో ఈ బీమా సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement